కరోనాపై పోరులో భారత్‌కు ఆర్థికంగా బ్రిక్స్ న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్(ఎన్‌డీబీ) అండగా నిలిచింది.
ఎమర్జెన్సీ అసిస్టెంట్ ప్రొగ్రామ్ ద్వారా భారత్‌కు 1 బిలియన్ డాలర్ల(సుమారు రూ.7,500 కోట్లు)రుణ సహాయం అందించినట్లు ఎన్‌డీబీ మే 13న వెల్లడించింది. వైరస్ విజృంభణ వల్ల కలిగిన సామాజిక, ఆర్థిక నష్టాలను తగ్గించడానికి ఈ రుణం దోహదపడనుంది. కరోనా కారణంగా బ్రిక్స్ దేశాలైన బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికాలు ఆర్థికంగా ప్రభావితమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయా దేశాలకు ఆర్థిక సహాయం అందించాలని ఎన్‌డీబీ నిర్ణయించింది. ఇందులో భాగంగా భారత్‌కు తక్షణ సహాయంగా బిలియన్ డాలర్లు ఇచ్చేందుకు 2020, ఏప్రిల్ 30న ఎన్‌డీబీ డైరెక్టర్లు అంగీకరించారు.
బ్రిక్స్ డెవలప్‌మెంట్ బ్యాంక్ అయిన ఎన్‌డీబీని బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా దేశాలు కలిసి ఏర్పాటు చేశాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం, స్థిరమైన అభివృద్ధి ప్రాజెక్టుల కోసం నిధులు సమీకరించడం వంటి లక్ష్యాలతో ఇది ఏర్పాటైంది.
No comments:
Post a Comment