2021, ఫిబ్రవరిలో మహిళల ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌



భారత్‌ వేదికగా 2020, నవంబర్‌లో జరగాల్సిన అండర్‌–17 మహిళల ప్రపంచకప్‌ ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌ కరోనా వైరస్‌ నేపథ్యంలో వాయిదా పడింది.


Current Affairs
ఈ మెగా ఈవెంట్‌కు సంబంధించి కొత్త షెడ్యూల్‌ను అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఫిఫా) మే 12న విడుదల చేసింది. తాజా షెడ్యూల్‌ ప్రకారం 2021, ఫిబ్రవరి 17 నుంచి మార్చి 7 వరకు ప్రపంచకప్‌ జరుగుతుందని ఫిఫా ప్రకటించింది. మొత్తం ఐదు వేదికల్లో (కోల్‌కతా, గువాహటి, భువనేశ్వర్, నవీ ముంబై, అహ్మదాబాద్‌) ఈ టోర్నీని నిర్వహించనుండగా... మొత్తం 16 జట్లు పాల్గొంటున్నాయి. ఆతిథ్య హోదాలో భారత మహిళల జట్టు నేరుగా ప్రపంచకప్‌కు అర్హత సాధించింది



No comments:

Post a Comment