Physics Questions in Telugu Part-9



1. కింది వాటిలో ద్రవ పదార్థానికి సంబంధించిన ధర్మం ఏది?
1. తలతన్యత
2. స్నిగ్ధత
3. కేశనాళికీయత
4. ద్రవ పీడనం
ఎ) 1, 3
బి) 1 మాత్రమే
సి) 1, 2, 3
డి) 1, 2, 3, 4

2. కింది వాటిలో గరిష్ట స్నిగ్ధతను కలిగి ఉండే పదార్థం ఏది? 
1. నీరు
2. తేనె
3. పాదరసం
4. గ్రీజ్
ఎ) 2 మాత్రమే
బి) 3 మాత్రమే
సి) 2, 4
డి) 1, 3

3. జతపరచండి.
గ్రూప్ - ఎ
గ్రూప్- బి
i. బలం
1. పాయిజ్
ii. ప్రచోదనం
2. పాస్కల్
iii. స్నిగ్ధత
3. న్యూటన్
iv. పీడనం
4. న్యూటన్-సెకన్
ఎ) i-1; ii-2; iii-3; iv-4
బి) i-3 ; ii-4; iii-1; iv-2
సి) i-2 ; ii-1; iii-4; iv-3
డి) i- 4; ii-3; iii-2; iv-1

4. కింది వాటిలో దేనిపై తలతన్యత ఆధారపడి ఉండదు?
ఎ) ఉపరితల వైశాల్యం
బి) ద్రవాల స్వభావం
సి) ఉష్ణోగ్రత
డి) మాలిన్యాలు

5. నీటికి డిటర్జెంట్లను కలిపినప్పుడు కిందివాటిలో ఏది తగ్గుతుంది?
1. తలతన్యత
2. సంసంజన బలాలు
3. స్పర్శ కోణం
4. కేశనాళికీయత
ఎ) 1 మాత్రమే
బి) 1, 3
సి) 1, 2, 3
డి) 1, 2, 3, 4

6. కింది వాటిలో స్నిగ్ధతకు సంబంధించి సరికాని వాక్యం ఏది?
ఎ) ఇది అసంజన బలాలపై ఆధారపడుతుంది
బి) దీనివల్ల ప్రవాహిణుల ఫలిత వేగం తగ్గుతుంది
సి) ఉష్ణోగ్రత పెరిగితే వాయువుల స్నిగ్ధత పెరుగుతుంది
డి) ఉష్ణోగ్రత పెరిగితే ద్రవాల స్నిగ్ధత తగ్గుతుంది

7. కింది వాటిలో తలతన్యత అనువర్తనం ఏది? 
1. వేడి ఆహారాన్ని నమిలేటప్పుడు చల్లటి ఆహారం కంటే రుచిగా అనిపించడం
2. వర్షం చినుకులు, సబ్బు బుడగ, పాదరస బిందువులు గోళాకారంలో ఉండటం
3. రంగులు, ల్యూబ్రికెంట్లు సులభంగా విస్తరించడానికి తోడ్పడుతుంది
4. నిలకడగా ఉన్న నీటిపై దోమలు స్వేచ్ఛగా చలించడం
ఎ) 2, 4
బి) 2 మాత్రమే
సి) 2, 3, 4
డి) 1, 2, 3, 4

8. సమాన ద్రవ్యరాశి ఉన్న ఒక ఆస్ట్రిచ్ పక్షి ఈకను, 100 గ్రా. రాయిని భూమికి 200 మీ. ఎత్తు నుంచి ఒకేసారి జారవిడిచినప్పుడు వాతావరణ పొరల్లోని స్నిగ్ధతా బలాల వల్ల అవి..?
ఎ) రెండూ ఒకేసారి భూమిని చేరుతాయి
బి) రాయి ముందుగా భూమిని చేరుతుంది
సి) ఈక ముందుగా భూమిని చేరుతుంది
డి) రెండూ భూమిని చేరవు

9. బెలూన్‌ను కనుగొన్న శాస్త్రవేత్త?
ఎ) మాంటిగోల్ ఫియర్
బి) టి. హోమ్స్
సి) రైట్ బ్రదర్‌‌స
డి) అర్కిమెడిస్

10. కింది వాటిలో సరైన వ్యాఖ్య ఏది?
1. ద్రవాల తలతన్యత ఉష్ణోగ్రతకు విలోమానుపాతంలో ఉంటుంది
2. సందిగ్ధ ఉష్ణోగ్రత వద్ద ప్రతి ద్రవం తలతన్యత శూన్యం
ఎ) 1 సరైంది, 2 తప్పు
బి) 1 తప్పు, 2 సరైంది
సి) రెండూ తప్పు
డి) రెండూ సరైనవే

11. నిలకడగా ఉన్న నీటిపై కిరోసిన్‌ను వెదజల్లినప్పుడు దోమల గుడ్లు, లార్వాలు మునిగిపోవడానికి కారణం?
ఎ) నీటి తలతన్యత తగ్గడం
బి) నీటి తలతన్యత పెరగడం
సి) నీటి స్నిగ్ధత పెరగడం
డి) నీటి స్నిగ్ధత తగ్గడం

12. కింది వాటిలో కేశనాళికీయత అనువర్తనం కానిది ఏది?
ఎ) కిరోసిన్ స్టవ్, దీపం, మైనం క్యాండిల్ పనిచేయడం
బి) ఇసుక నేలలు తేమగా ఉండటం
సి) ఎడారుల్లో ఒయాసిస్‌లు ఏర్పడటం
డి) మొక్కల దారువు ద్వారా పీల్చుకున్న నీరు పైకి ఎగబాకడం


13. జతపరచండి. 
పదార్థం
స్పర్శ కోణం
i. పాదరసం 1. 0°
ii. స్వచ్ఛమైన నీరు 2. 8 - 9°
iii. వెండితో నీరు 3. 90°
iv. సాధారణ నీరు 4. 135° - 140°
i ii iii iv
ఎ) 2 3 4 1
బి) 4 1 3 2
సి) 1 4 2 3
డి) 3 2 1 4

14. కింది వాటిలో స్నిగ్ధత అనువర్తనం ఏది?
1. వర్షం చినుకులు, పారాచూట్ వేగం తగ్గడం
2. సముద్రం ఆటుపోటులు క్రమంగా క్షీణించడం
3. మట్టి రేణువుల నుంచి బంగారు కణాలను వేరుచేయడం
4. రసాయనశాస్త్రంలో ప్రోటీన్లు, సెల్యులోజ్ అణుభారాన్ని నిర్ధారించడం
ఎ) 1 మాత్రమే
బి) 2 మాత్రమే
సి) 1, 3
డి) 1, 2, 3, 4

15.కింది వాటిలో సరైన వ్యాఖ్య ఏది?
1. ఒక ప్రదేశంలో భారమితిలోని పాదరస స్తంభం పొడవు అకస్మాత్తుగా తగ్గితే అది తుపాను రాకను సూచిస్తుంది
2. పాదరస మట్టం క్రమంగా తగ్గితే రాబోయే వర్ష సూచనను తెలుపుతుంది.
ఎ) రెండూ సరైనవే
బి) రెండూ తప్పు
సి) 1 సరైంది, 2 తప్పు
డి) 1 తప్పు, 2 సరైంది

16. జలాంతర్గామి ఏ నియమం ఆధారంగా పనిచేస్తుంది?
ఎ) బాయిల్ నియమం
బి) పాస్కల్ నియమం
సి) బెర్నౌలీ నియమం
డి) అర్కిమెడిస్ ప్లవన సూత్రం

17. నదిలో ప్రయాణిస్తున్న ఒక ఓడ సముద్ర జలాల్లోకి ప్రవేశించినప్పుడు ఓడ మట్టం పెరుగుతుంది. దీనికి కారణం..
ఎ) సముద్ర నీటి సాంద్రత ఎక్కువగా ఉండటం
బి) నది నీటి సాంద్రత ఎక్కువగా ఉండటం
సి) నది నీటి సాంద్రత తక్కువగా ఉండటం
డి) సముద్ర నీటి సాంద్రత తక్కువగా ఉండటం

18. ‘భారమితి’ని దేన్ని కొలవడానికి ఉపయోగిస్తారు?
ఎ) సాంద్రత
బి) వాతావరణ పీడనం
సి) స్నిగ్ధత
డి) నీటి అసంగత వ్యాకోచం

19. నీటిలో తేలే మంచు కరిగితే నీటి మట్టం.. 
ఎ) పెరుగుతుంది
బి) తగ్గుతుంది
సి) పెరిగి, తగ్గుతుంది
డి) మారదు

20. ప్రెషర్ కుక్కర్‌లో పదార్థాలు త్వరగా ఉడకడానికి కారణం?
ఎ) ఉష్ణాన్ని బంధించడం
బి) ఉష్ణోగ్రత పెరగడం
సి) నీటి బాష్పీభవన స్థానం పెరగడం
డి) నీటి బాష్పీభవన స్థానం తగ్గడం

21. బారోమీటర్‌లో పాదరస మట్టం క్రమంగా పెరగడం దేన్ని సూచిస్తుంది?
ఎ) అనుకూల వాతావరణ ఏర్పాటు
బి) ఆకస్మిక తుపాను రాక
సి) వర్షం వచ్చే సూచన
డి) ఎలాంటి మార్పు ఉండదు

22. మట్టి పాత్రలో నీరు చల్లగా ఉండటానికి కారణం..
ఎ) మట్టిపాత్రలకు ఎక్కువ వేడిని తట్టుకునే శక్తి ఉంటుంది
బి) మట్టిపాత్రలు మంచి ఉష్ణవాహకాలు
సి) మట్టిపాత్రల రంధ్రాల ద్వారా వెలువడే నీరు ఆవిరవుతూ ఉండటం
డి) మట్టిపాత్రలు నీటిలోని వేడిని పీల్చివేస్తాయి

23. చంద్రుడిపై బెలూన్ ఎగరగలిగే ఎత్తు ఎంత?
ఎ) 9.8 మీ.
బి) 9.8/6 మీ.
సి) 9.8 ప 6 మీ.
డి) పైకి ఎగరలేదు

24.కింది వాటిలో ద్రవ పదార్థాలు ఏ ధర్మాన్ని ప్రదర్శిస్తాయి?
ఎ) తలతన్యత
బి) కేశనాళికీయత
సి) స్నిగ్ధత
డి) పైవన్నీ

25. వర్షం చినుకులు గోళాకారంలో ఉండటానికి కారణం?
ఎ) పీడనం
బి) కేశనాళికీయత
సి) తలతన్యత
డి) స్నిగ్ధత

26. కింది వాటిలో దేనిలో ఒక వస్తువు భారం గరిష్టంగా ఉంటుంది?
ఎ) నీరు
బి) గాలి
సి) ఉప్పు నీరు
డి) శూన్యం

27. మొక్కల వేర్ల ద్వారా నీరు పైకి ఎగబాకడానికి కారణమయ్యే ధర్మం ఏది?
ఎ) కేశనాళికీయత
బి) స్నిగ్ధత
సి) నీటి పీడనం
డి) తలతన్యత

28. తలతన్యతను ఏ ప్రమాణాల్లో కొలుస్తారు?
ఎ) డైన్/ సెం.మీ.
బి) న్యూటన్/ మీ.
సి) న్యూటన్/ మైళ్లు2
డి) ఎ, బి

29. తల వెంట్రుకలకు నూనె రాసినప్పుడు అవి పరస్పరం దగ్గరగా రావడానికి కారణం?
ఎ) తలతన్యత
బి) కేశనాళికీయత
సి) ద్రవ పీడనం
డి) గాలి పీడనం

30. ద్రవాలకు సంబంధించి కింది ఏ స్వభావంపై తలతన్యత ఆధారపడి ఉంటుంది?
ఎ) ద్రవ స్వభావం
బి) ద్రవ ఉష్ణోగ్రత
సి) ద్రవ స్వచ్ఛత
డి) పైవన్నీ

31.నీటిలో డిటర్జెంట్ పౌడర్‌ను కలిపినప్పుడు దాని తలతన్యత..?
ఎ) పెరుగుతుంది
బి) తగ్గుతుంది
సి) మారదు
డి) శూన్యమవుతుంది

32. గాజు పలకపై ఉన్న పాదరసం స్పష్టమైన ద్రవ బిందువుల్లా కనిపించడానికి కారణం
ఎ) పాదరసంలో సంసంజన బలాలు గరిష్టంగా ఉండటం
బి) పాదరసంలో అసంజన బలాలు గరిష్టంగా ఉండటం
సి) పాదరసంలో సంసంజన, అసంజన బలాలు సమానంగా ఉండటం
డి) ఏదీకాదు

33. సబ్బు నీటి బుడగలు గోళాకారంలో ఉండటానికి కారణం? 
ఎ) కేశనాళికీయత
బి) స్నిగ్ధత
సి) తలతన్యత
డి) ద్రవ పీడనం

34. వాతావరణ పీడనాన్ని దేనితో కొలుస్తారు?
ఎ) భారమితి
బి) బోలోమీటర్
సి) థర్మామీటర్
డి) పైరోమీటర్

35. కింది వాటిలో ఎత్తు ఎక్కువగా ఉండే భారమితి ఏది?
ఎ) పాదరస భారమితి
బి) అనార్ధ్ర భారమితి
సి) నీటితో పనిచేసే భారమితి
డి) ఆల్కహాల్ భారమితి

36. నీటి అడుగు భాగంలో ఉన్న గాలి బుడగ పైకి వచ్చినప్పుడు దాని పరిమాణం..
ఎ) పెరుగుతుంది
బి) తగ్గుతుంది
సి) మారదు
డి) సగమవుతుంది

37.కింది వాటిలో ఏ రకమైన నీటిపై ఈదడం సులభం?
ఎ) శుద్ధమైన నీరు
బి) సాధారణ నీరు
సి) సముద్రం నీరు
డి) నూనె కలిపిన నీరు

38. కొవ్వొత్తి, పెన్ను పాళి పనిచేయడంలో ఇమిడి ఉన్న ధర్మం ఏది?
ఎ) తలతన్యత
బి) కేశనాళికీయత
సి) స్నిగ్ధత
డి) పీడనం

39. జలాంతర్గామిని కనుగొన్న శాస్త్రవేత్త
ఎ) ఓటీస్
బి) బుష్నెల్
సి) స్పెన్సర్
డి) ఆర్కిమెడిస్

40. కేశనాళిక గొట్టాన్ని ఏ ప్రాంతంలోకి తీసుకెళ్లినప్పుడు దానిలో నీటి మట్టం ఎక్కువగా ఉంటుంది?
ఎ) భూమధ్యరేఖ
బి) ధ్రువ ప్రాంతాలు
సి) భూకేంద్రం
డి) సముద్ర గర్భం

41. బ్రామా ప్రెస్, హైడ్రాలిక్ బ్రేకులు ఏ నియమం ఆధారంగా పనిచేస్తాయి?
ఎ) పాస్కల్ నియమం
బి) ఆర్కిమెడిస్ నియమం
సి) బాయిల్ నియమం
డి) బెర్నౌలీ నియమం

42. భూ ఉపరితలం నుంచి పైకి వెళ్లే కొద్దీ బెలూన్ పరిమాణం..
ఎ) పెరుగుతుంది
బి) తగ్గుతుంది
సి) మారదు
డి) పైకి ఎగరలేదు

43.కింది వాటిలో గరిష్ట సాంద్రత ఉండే పదార్థం ఏది?
ఎ) తేనె
బి) పాలు
సి) పెట్రోల్
డి) గ్రీజు

44. ఆర్కిమెడిస్ సిద్ధాంతాన్ని ఉపయోగించి పదార్థ ఏ భౌతికరాశిని కనుగొనవచ్చు?
ఎ) ఘనపరిమాణం
బి) రంగు
సి) స్వచ్ఛత
డి) పైవన్నీ

45. ఎర్ర రక్తకణాలు, తెల్ల రక్తకణాలను వేరు చేయడానికి ఉపయోగించే ధర్మం?
ఎ) తలతన్యత
బి) స్నిగ్ధత
సి) పీడనం
డి) పైవన్నీ

46. నీటి అడుగు భాగంలో ఉన్న గుడ్డు పైకి రావాలంటే ఆ నీటిలో ఏ పదార్థాన్ని కలపాలి?
ఎ) ఇసుక
బి) చక్కెర
సి) ఉప్పు
డి) కిరోసిన్

47. ‘భారమితి’ని కనుగొన్న శాస్త్రవేత్త? 
ఎ) పాస్కల్
బి) టారిసెల్లీ
సి) గెలీలియో
డి) స్టార్క్‌

48. సముద్రంలో అల్పపీడనం ఏర్పడే విధానాన్ని వివరించే నియమం ఏది?
ఎ) బెర్నౌలీ నియమం
బి) ఎల్నినో ప్రభావం
సి) డాప్లర్ ఫలితం
డి) స్టార్క్‌ ఫలితం

49. ప్లవన సూత్రాలను ప్రతిపాదించింది ఎవరు?
ఎ) ఆర్కిమెడిస్
బి) బెర్నౌలీ
సి) పాస్కల్
డి) న్యూటన్

50. కేశనాళిక గొట్టంలో నీటి చంద్రరేఖ ఏ విధంగా ఉంటుంది?
ఎ) కుంభాకారం
బి) పుటాకారం
సి) సమతలం
డి) త్రికోణం

51.స్వచ్ఛమైన నీటిలో డిటర్జెంట్ పౌడర్‌ను కలిపినప్పుడు దాని స్పర్శ కోణం..
ఎ) పెరుగుతుంది
బి) తగ్గుతుంది
సి) మారదు
డి) ఎంతైనా ఉండవచ్చు

52. సందిగ్ధ ఉష్ణోగ్రత వద్ద ద్రవాల తలతన్యత
ఎ) శూన్యం
బి) అనంతం
సి) 10 రెట్లు పెరుగుతుంది
డి) 10 రెట్లు తగ్గుతుంది

53. కొంత ఎత్తు నుంచి కిందకు వస్తున్న ప్యారాచూట్ వేగం తగ్గడానికి కారణం
ఎ) తలతన్యత
బి) గాలిపీడనం
సి) స్నిగ్ధత
డి) పైవన్నీ

54. పదార్థాల స్నిగ్ధతా గుణకానికి ప్రమాణం
ఎ) పాయిజ్
బి) పాస్కల్-సెకన్
సి) ఎ, బి
డి) కెలోరీ

55. సముద్ర అలలు క్షీణించడంలో ఉన్న ధర్మం
ఎ) తలతన్యత
బి) కేశనాళికీయత
సి) పీడనం
డి) స్నిగ్ధత

56. ద్రవాల గురించి అధ్యయనం చేసే శాస్త్రం
ఎ) జియాలజీ
బి) హైడ్రాలజీ
సి) బయాలజీ
డి) జాగ్రఫీ

57. సూది, తుపాకి, గుండు, కత్తి, గునపం మొదలైన వాటిలో ముందు భాగాలు మొన తేలుతున్నట్లు చేయడం వల్ల ..
ఎ) వాటి ఘనపరిమాణం తగ్గుతుంది
బి) వాటి భారం తగ్గుతుంది
సి) వాటి పీడనం పెరుగుతుంది
డి) పైవన్నీ సరైనవే

58. టారిసెల్లీ ఆవిష్కరించిన భారమితి ఎత్తు
ఎ) 1 సెం.మీ.
బి) 1 మీ.
సి) 10 మీ.
డి) 12 మీ.

59. కింది వాటిలో ఏ ప్రదేశం వద్ద వంట చేయడానికి ఎక్కువ సమయం అవసరం?
ఎ) భోపాల్
బి) అలహాబాద్
సి) న్యూఢిల్లీ
డి) సిమ్లా

60. వాయువులను వేడిచేసినప్పుడు వాటి స్నిగ్ధత..
ఎ) పెరుగుతుంది
బి) తగ్గుతుంది
సి) మారదు
డి) శూన్యం అవుతుంది

61. చెరువులో పడవ మునిగినప్పుడు దాని నీటి మట్టం
ఎ) పెరుగుతుంది
బి) తగ్గుతుంది
సి) మారదు
డి) ఏదీకాదు

62. కేశనాళిక గొట్టంలో అసలు మట్టం కంటే తక్కువ మట్టానికి చేరే ద్రవం ఏది?
ఎ) నీరు
బి) ఆల్కహాల్
సి) పాదరసం
డి) ఉప్పు నీరు

63. విమానం రెక్కలను ఏ నియమం ఆధారంగా రూపొందించారు?
ఎ) ఆర్కిమెడిస్
బి) బెర్నౌలీ
సి) పాస్కల్
డి) పైవన్నీ

64.ప్రయోగశాలలో వాతావరణ పీడనాన్ని కనుగొనడానికి ఉపయోగించే భారమితి
ఎ) టారిసెల్లీ
బి) అనార్ద్ర
సి) ఆల్కహాల్
డి) ఫోర్డిన్

65. పీడనాన్ని కొలవడానికి ఉపయోగించే అతి చిన్న ప్రమాణం ఏది? 
ఎ) పాస్కల్
బి) బార్
సి) టార్
డి) న్యూటన్/మీ.2

66. బెర్నౌలీ సిద్ధాంతాన్ని ఏ నిత్యత్వ నియమం ఆధారంగా ప్రతిపాదించారు?
ఎ) ద్రవ్యవేగ
బి) శక్తి
సి) ద్రవ్యరాశి
డి) పైవన్నీ

ANSWERS:
1)డి 2)సి 3)బి 4)ఎ 5)సి 6)ఎ 7)డి 8)బి 9)ఎ 10)డి 11)ఎ 12)బి 13)బి 14)డి 15)ఎ 16)డి 17)డి 18)బి 19)బి 20)సి 21)ఎ 22)సి 23)డి 24)డి 25)సి 26)డి 27)ఎ 28)డి 29)ఎ 30)డి 31)బి 32)ఎ 33)సి 34)ఎ 35)డి 36)ఎ 37)సి 38)బి 39)బి 40)ఎ 41)ఎ 42)ఎ 43)డి 44)సి 45)బి 46)సి 47)బి 48)ఎ 49)ఎ 50)బి 51)బి 52)ఎ 53)సి 54)సి 55)డి 56)బి 57)సి 58)బి 59)డి 60)ఎ 61)సి 62)సి 63)బి 64)డి 65)సి 66)బి

No comments:

Post a Comment