Physics Questions in Telugu Part-8



1. కింది వాటిలో అతిధ్వని తరంగాలుగా వేటిని పిలుస్తారు?
1) ధ్వని తరంగాల పౌనఃపున్యం కంటే తక్కువ పౌనఃపున్యం ఉన్న తరంగాలు
2) శూన్యంలో ఉత్పత్తి చేసిన ధ్వని తరంగాలు
3) ధ్వని తరంగాల పౌనఃపున్యం కంటే ఎక్కువ పౌనఃపున్యం ఉన్న తరంగాలు
4) 20Hz - 20,000Hz పౌనఃపున్యం ఉన్న ధ్వనులు

2. రిక్టర్ స్కేలును ఏ తీవ్రతలను నమోదు చేయడానికి ఉపయోగిస్తారు?
1) సముద్రంలో ఏర్పడే అలలు
2) భూకంపాలు
3) భూభ్రమణం, భూ పరిభ్రమణాలు
4) పైవన్నీ

3. శబ్ద తీవ్రతను కొలవడానికి ఉపయోగించే పరికరం ‘డెసిబెల్ స్కేల్’ ప్రకారం 20 dB ధ్వని తీవ్రత అనేది 10 dB ధ్వని తీవ్రత కంటే ఎన్ని రెట్లు అధికం?
1) 2 రెట్లు
2) 10 రెట్లు
3) 1000 రెట్లు
4) దత్తాంశం సరిపోదు

4. ధ్వని వేగం కింది వాటిలో దేనిలో అధికంగా ఉంటుంది?
1) చెక్క
2) ఇటుక
3) నీరు
4) గాలి

5. కింది వాటిలో ధ్వనిని అధికంగా ఉత్పత్తి చేసే జీవి ఏది?
1) చింపాంజీ
2) కోతి
3) గొరిల్లా
4) పులి

6. గబ్బిలాలు రాత్రివేళలో సంచరించడానికి కారణం?
1) రాత్రివేళల్లో అవి స్పష్టంగా చూడగలవు
2) అతిధ్వనులను ఉద్గారిస్తాయి
3) కంటి నుంచి కాంతి పరావర్తనం చెందుతుంది
4) పైవన్నీ

7. భూకంపాల తీవ్రతను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
1) జియాలజీ
2) సిస్మోగ్రాఫ్
3) సెస్మిక్‌జోన్
4) సిస్మాలజీ

8. ప్రతిధ్వనిని కింది వాటిలో వేటి ద్వారా వినగలుతాము?
1) పరావర్తన ధ్వని తరంగాలు
2) వక్రీభవన ధ్వని తరంగాలు
3) వ్యతికరణ ధ్వని తరంగాలు
4) పైవన్నీ

9. ధ్వని వేగం కింది వాటిలో ఏ అంశాలపై ఆధారపడి ఉంటుంది?
i) ఉష్ణోగ్రత
ii) యానకం
iii) పీడనం
iv) ఆర్ద్రత
1) i, ii
2) ii, iii
3) ii, iii, iv
4) i, ii, iv

10. శాస్త్రవేత్తలు-ఆవిష్కరణలకు సంబంధించి కింది వాటిని జతపరచండి.
జాబితా - I జాబితా - II
a) జి. మార్కొని i) గ్రామ్‌ఫోన్
b) జె.ఎల్. బయర్‌‌డ ii) రేడియో
c) అలెగ్జాండర్ గ్రాహంబెల్ iii) టెలివిజన్
d) థామస్ ఆల్వా ఎడిసన్ iv) టెలిఫోన్
1) a-i, b-ii, c-iii, d-iv
2) a-iv, b-iii, c-ii, d-i
3) a-ii, b-i, c-iv, d-iii
4) a-ii, b-iii, c-iv, d-i

11. ధ్వని అనేది ఒక..
1) బలం
2) కిరణం
3) శక్తి
4) ఉష్ణం, అయస్కాంత స్వరూపం

12. ప్రతిధ్వనిని వినాలంటే పరావర్తన తలానికి కింది వాటిలో ఏ లక్షణం ఉండాలి?
1) స్వల్ప ఘనపరిమాణం ఉండాలి
2) అధిక వైశాల్యం ఉండాలి
3) అధిక ఘనపరిమాణం ఉండాలి
4) స్వల్ప వైశాల్యం ఉండాలి

13. టేప్ రికార్డర్‌లోని ప్లాస్టిక్ టేప్‌లపై పూతపూయడానికి వాడే పదార్థం ఏది?
1) జింక్ ఆక్సైడ్
2) మెగ్నీషియం ఆక్సైడ్
3) ఐరన్ సల్ఫేట్
4) ఐరన్ ఆక్సైడ్

14. కింది వాటిలో స్త్రీ స్వరం పురుషుడి స్వరం కంటే మృదువుగా ఉండటానికి కారణమైన అంశం ఏది?
i) స్త్రీ స్వరస్థాయి అధికంగా ఉండటం
ii) స్త్రీ స్వరస్థాయి స్వల్పంగా ఉండటం
iii) పురుషుడి స్వరస్థాయి అధికంగా ఉండటం
iv) పురుషుడి స్వరస్థాయి స్వల్పంగా ఉండటం
1) ii, iv
2) ii, iii
3) i, iii
4) i, iv

15. ధ్వని ప్రతినాదం చెందడంలో ఇమిడి ఉన్న ధర్మం ఏది?
1) పరావర్తనం
2) వ్యతికరణం
3) వివర్తనం
4) శోషణం

16.ఆవిరి యంత్రాన్ని కనుగొన్న శాస్త్రవేత్త?
1) జేమ్స్‌వాట్
2) జోసెఫ్
3) న్యూటన్
4) విలియమ్స్

17. మంచి గుడ్లను, కుళ్లిన గుడ్లను వేరుచేయడానికి దోహదపడే కిరణాలేవి?
1) X- కిరణాలు
2) అతినీలలోహిత కిరణాలు
3) పరారుణ కిరణాలు
4) పైవన్నీ

18. అయస్కాంత ఉత్తర-దక్షిణ ధ్రువాలను కలిపే రేఖను ఏమని పిలుస్తారు?
1) అయస్కాంత అక్షం
2) అయస్కాంత యామ్యోత్తర రేఖ
3) అయస్కాంత క్షేత్ర రేఖ
4) పైవేవీ కావు

19. ఒక డయా అయస్కాంత పదార్థాన్ని అయస్కాంత ఉత్తర లేదా దక్షిణ ధ్రువం వద్దకు తీసుకువస్తే.. అది?
1) ధ్రువాలతో ఆకర్షితమవుతుంది
2) ధ్రువాలతో వికర్షితమవుతుంది
3) ఉత్తర ధ్రువంతో ఆకర్షితమై, దక్షిణ ధ్రువంతో వికర్షితమవుతుంది
4) ఉత్తర ధ్రువంతో వికర్షితమై, దక్షిణ ధ్రువంతో ఆకర్షితమవుతుంది

20. కింది వాటిలో అనయస్కాంత పదార్థం ఏది?
1) ఐరన్
2) సల్ఫర్
3) నికెల్
4) కోబాల్ట్

21. కేరళ రాష్ట్రంలోని ‘తుంబా’ అనే ప్రాంతం దేనికి ప్రసిద్ధి చెందింది?
1) అక్కడ అనేక పరిశ్రమలు ఉన్నాయి
2) రాకెట్ లాంఛింగ్ స్టేషన్ ఉంది
3) ప్రఖ్యాతిగాంచిన ఓడరేవు ఉంది
4) అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది

22. అత్యధిక తరంగదైర్ఘ్యం ఉన్న రంగు ఏది?
1) పసుపు
2) నీలం
3) ఎరుపు
4) ఆకుపచ్చ

23. VIBGYORలో మాధ్యమిక రంగు ఏది?
1) ఆకుపచ్చ
2) నీలం
3) ఇండిగో
4) పసుపు

24. అతినీలలోహిత కిరణాలను మొదటిసారిగా పరిశీలించింది ఎవరు?
1) హెర్షల్
2) జాన్ విలియం రిట్టర్
3) రూథర్‌ఫర్‌‌డ
4) అగస్ట్ కామ్టే

25. వాతావరణంలోని ఊర్థ్వ పొర ‘ఓజోన్’ మనల్ని ఏ కిరణాల నుంచి రక్షిస్తోంది?
1) కాస్మిక్ కిరణాలు
2) అతిధ్వని తరంగాలు
3) పరారుణ కిరణాలు
4) అతినీలలోహిత కిరణాలు

26. కింది వాటిలో అత్యధిక పౌనఃపున్యం ఉన్న విద్యుదయస్కాంత తరంగం ఏది?
1) X - కిరణాలు
2) γ - కిరణాలు
3) అతినీలలోహిత కిరణాలు
4) పరారుణ కిరణాలు

27. X -కిరణాలు అనేవి..
1) నెమ్మదిగా కదిలే ఎలక్ట్రాన్లు
2) విద్యుదయస్కాంత తరంగాలు
3) వేగంగా కదిలే ఎలక్ట్రాన్లు
4) నెమ్మదిగా కదిలే న్యూట్రాన్లు

28. X - కిరణాలను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు?
1) రాంట్‌జెన్
2) రాబర్ట్ పియరీ
3) థామ్సన్
4) గోల్డ్ స్టెయిన్

29. చీకట్లో ఫొటోలు తీయడానికి ఉపయోగపడే కిరణాలేవి?
1) అతినీలలోహిత కిరణాలు
2) సోడియం దీపం
3) దృగ్గోచర కిరణాలు
4) పరారుణ కిరణాలు

30. రేడియో తరంగాలు ఏ ఆవరణం నుంచి పరావర్తనం చెంది భూ ఉపరితలాన్ని చేరుతాయి?
1) స్ట్రాటో ఆవరణం
2) ఐనో ఆవరణం
3) మీసో ఆవరణం
4) ఎక్సో అవరణం

31. టెలివిజన్‌లోని ఆడియో సంకేతాలు ఏ మాడ్యులేషన్‌కు చెందినవి?
1) కంపనపరిమితి
2) పౌనఃపున్యం
3) వేగం
4) పైవేవీ కావు

32.నీటి మరుగు ఉష్ణోగ్రత సెల్సియస్, ఫారన్‌హీట్, కెల్విన్ స్కేళ్లలో వరసగా -
1) 212°C, 100°F, 373K
2) 100°C, 373°F, 212K
3) 373°C, 212°F, 100K
4) 100°C, 212°F, 373K

33. ఫారన్‌హీట్ స్కేలులో 98.6°F అనేది సెల్సియస్ స్కేలులో ఎంత విలువకు సమానం?
1) 37°C
2) 54.7°C
3) 62°C
4) 65°C

34. ఒక ఉష్ణయంత్రం దక్షత 40%. 10,000J ఉష్ణశక్తిని ఉద్గారం చేయడానికి యంత్రం చేయాల్సిన పని ఎంత?
1) 40,000 J
2) 10,000 J
3) 25,000 J
4) 4,000 J

35. స్థిర ఉష్ణోగ్రత వద్ద ఒక వాయువు 100ml ఘ.ప. నుంచి 300ml ఘ.ప.కు వ్యాకోచం చెందింది. వ్యాకోచించినప్పుడు పీడనం 1 అట్మాస్పియర్ అయితే మొదటగా ఉన్న పీడనం ఎంత?
1) 9 అట్మాస్పియర్
2) 1 అట్మాస్పియర్
3) 3 అట్మాస్పియర్
4) 1/3 అట్మాస్పియర్

36. ఒక కుటుంబం 14.5 kg LPGని 29 రోజులపాటు వినియోగించుకుంటుంది. LPG కెలోరిఫిక్ విలువ 55 KJ/gr అయితే ఒక రోజులో వినియోగించే శక్తి విలువ ఎంత?
1) 275 KJ
2) 27.5 KJ
3) 27500 KJ
4) 0.275 KJ

37. సెల్సియస్ స్కేలు, ఫారన్‌హీట్ స్కేళ్లు ఏ ఉష్ణోగ్రత వద్ద ఒకే రీడింగ్‌ను సూచిస్తాయి?
1) 0°
2) 40°
3) – 40°
4) 4°

38. కింది వాటిలో కణాల కదలిక వల్ల జరిగే ఉష్ణప్రసారం ఏది?
1) ఉష్ణ సంవహనం
2) ఉష్ణ వహనం
3) ఉష్ణ వికిరణం
4) పైవన్నీ

39. కణాల కదలిక లేకుండా జరిగే ఉష్ణప్రసారం?
1) ఉష్ణ సంవహనం
2) ఉష్ణ వహనం
3) ఉష్ణ వికిరణం
4) పైవన్నీ

40. భూమి వేడెక్కడం అనేది ఏ రకమైన ఉష్ణప్రసారానికి సంబంధించింది?
1) ఉష్ణ సంవహనం
2) ఉష్ణ వహనం
3) ఉష్ణ వికిరణం
4) పైవన్నీ

41. ఆరోగ్యవంతుడైన మానవుడి శరీర ఉష్ణోగ్రత సెల్సియస్, ఫారన్‌హీట్, కెల్విన్ స్కేళ్లలో వరసగా?
1) 98.4°C, 36.9°F, 310K
2) 37°C, 310°F, 98.4K
3) 36.9°C, 98.4°F, 310K
4) 310°C, 98.4°F, 36.9K

42. రిఫ్రిజిరేటర్ తలుపును తెరచి ఉంచితే మూసి ఉన్న గది ఉష్ణోగ్రత ఏమవుతుంది?
1) గది చల్లగా అవుతుంది
2) గది ఉష్ణోగ్రత క్రమంగా తగ్గుతుంది
3) గది ఉష్ణోగ్రతలో మార్పు ఉండదు
4) గది క్రమంగా వేడెక్కుతుంది

43. నీటి ఉష్ణోగ్రతను 8°C నుంచి 0°C వరకు చల్లార్చితే నీటి ఘనపరిమాణంలో మార్పు ఏవిధంగా ఉంటుంది?
1) ఘనపరిమాణం క్రమంగా తగ్గుతుంది
2) సాంద్రత క్రమంగా పెరుగుతుంది
3) ఘనపరిమాణం మొదట తగ్గి, తర్వాత పెరుగుతుంది
4) ఘనపరిమాణం మొదట పెరిగి తర్వాత తగ్గుతుంది

44. ఒక గ్రాము ద్రవ్యరాశి ఉన్న ఒక పదార్థం ఉష్ణోగ్రతను 1°C పెంచడానికి అవసరమయ్యే ఉష్ణరాశిని ఏమంటారు?
1) విశిష్టోష్ణం
2) మొత్తం శక్తి
3) గుప్తోష్ణం
4) పైవేవీ కావు

45.ఒక ఎలక్ట్రిక్ హీటర్‌పై 2.2 kilo watt, 220 volt అని ముద్రించి ఉంది. అయితే ఆ హీటర్ నిరోధం ఎంత?
1) 220 Ω
2) 22 Ω
3) 484 Ω
4) 20 Ω

46. 300K విలువ సెల్సియస్స్కేలులో  ఏ విలువకు సమానం?
1) 30°C
2) 27°C
3) 300°C
4) 37°C

47. కింది వాటిలో అథమ ఉష్ణవాహకం ఏది?
1) చెక్క
2) బంగారం
3) రాగి
4) ఇనుము

ANSWERS:
1)3 2)2 3)2 4)3 5)3 6)2 7)4 8)1 9)4 10)4 11)3 12)2 13)4 14)4 15)1 16)1 17)2 18)1 19)2 20)2 21)2 22)3 23)4 24)2 25)4 26)4 27)2 28)1 29)4 30)2 31)2 32)4 33)1 34)4 35)3 36)3 37)3 38)1 39)2 40)4 41)3 42)4 43)3 44)1 45)2 46)2 47)1

No comments:

Post a Comment