Physics Questions in Telugu Part-6



1. పాలు ఏ విధమైన కొల్లాయిడ్ ద్రావణం?
1) కొవ్వులో నీరు విక్షేపణ చెందడం వల్ల ఏర్పడిన ద్రావణం
2) నీటిలో కొవ్వు విశ్లేషణ చెందడం వల్ల ఏర్పడిన ద్రావణం
3) కొవ్వులో మాంసకృత్తులు విక్షేపణ చెందడం వల్ల ఏర్పడిన ద్రావణం
4) మాంసకృత్తుల్లో కొవ్వు విక్షేపణ చెందడం వల్ల ఏర్పడిన ద్రావణం

2. పాలు కింది వాటిలో దేనికి ఉదాహరణ?
1) విలంబనం
2) జెల్
3) రసాయనం
4) నురుగు

3. ఆవు పాలు కొద్దిగా పసుపు రంగులో ఉండటానికి కింది వాటిలో కారణం ఏది?
1) జాంథోఫిల్
2) రైబోఫ్లేవిన్
3) రెటినాల్
4) కెరోటిన్

4. రక్తం అనేది ఒక..?
1) ద్రావణం
2) కొల్లాయిడ్
3) సరళ పదార్థం
4) జెల్

5. పొగమంచును దేనికి ఉదాహరణగా పేర్కొనవచ్చు?
1) వాయువులో ద్రవం
2) ద్రవంలో వాయువు
3) వాయువులో ఘనం
4) ద్రవంలో ద్రవం

6. కింది వాటిలో అత్యంత స్వచ్ఛమైన మంచి నీటి రూపం ఏది?
1) కుళాయి నీళ్లు
2) స్వేదన జలం
3) వర్షపు నీరు
4) భారజలం

7. శాస్త్రీయంగా ‘నీరు’ ఒక..?
1) హైడ్రైడ్
2) ఆక్సైడ్
3) హైడ్రాక్సైడ్
4) పెరాక్సైడ్

8.కఠిన జలంలో ఏయే మూలకాల అయాన్లు ఉంటాయి?
1) కాల్షియం, మెగ్నీషియం
2) సోడియం, పొటాషియం
3) కాల్షియం, బేరియం
4) సోడియం, జింక్

9. ‘భార జలం’గా దేన్ని పేర్కొంటారు?
1) H2O
2) D2O
3) శుద్ధ నీరు
4) స్వేదన క్రియ వల్ల లభించిన నీరు

10. కఠిన జలం కింది వాటిలో వేటికి పనికిరాదు?
ఎ) తాగడానికి
బి) బట్టలు ఉతకడానికి (సబ్బుతో)
సి) పంటలు సాగు చేయడానికి
డి) బాయిలర్లలో వినియోగించడానికి
1) ఎ, సి
2) బి, సి
3) బి, సి, డి
4) ఎ, బి, సి, డి

11. నీటికి ఉండే ఏ లక్షణం వల్ల అది అయానిక పదార్థాలకు మంచి ద్రావణిగా ఉంది?
1) మరిగే ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండటం
2) ద్విధ్రువ భ్రామకం ఎక్కువగా ఉండటం
3) విశిష్ట ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండటం
4) రంగు లేకపోవడం

12. సాధారణ నీటి ఉష్ణోగ్రతను 0°C కంటే తక్కువ చేయడానికి ఏ రసాయనాన్ని కలుపుతారు?
1) సోడియం కార్బొనేట్
2) సోడియం బైకార్బొనేట్
3) సోడియం క్లోరైడ్
4) పైవేవీ కాదు

13. కోబాల్ట్-60 ఏ కిరణాలను వెలువరించడం వల్ల రేడియేషన్ థెరపీలో వినియోగిస్తారు?
1) ఆల్ఫా
2) బీటా
3) గామా
4) ఎక్స్

14. కేన్సర్ చికిత్సలో ఉపయోగించే రేడియోధార్మిక పదార్థం ఏది?
1) కోబాల్ట్-60
2) అయోడిన్-127
3) ఫాస్ఫరస్-31
4) మెగ్నీషియం-24

15. రేడియోధార్మిక పదార్థం నుంచి ఉద్గారమైన ఆల్ఫా కిరణాలు అనేవి..?
1) రెండింతల అయానీకృత హీలియం పరమాణువులు
2) రుణావేశిత కణాలు
3) అయానీకృత హైడ్రోజన్ న్యూక్లియన్
4) అనావేశిత కణాలు

16.కింది వాటిలో శ్రేష్టమైన అణు ఇంధనం ఏది?
1) యురేనియం-238
2) ప్లూటోనియం-239
3) నెప్ట్యూనియం
4) థోరియం-236

17. వాతావరణంలోని ఓజోన్ పొర క్షీణించడానికి కింది వాటిలో కారణం ఏది?
1) SO2
2) CO2
3) పెరాక్సీ ఎసిటైల్ నైట్రేట్
4) ఫ్లోరో కార్బన్‌లు

18. రేడియోధార్మికతను కొలవడానికి ఏ పరికరాన్ని ఉపయోగిస్తారు?
1) గీగర్-ముల్లర్ కౌంటర్
2) సైక్రోట్రాన్
3) మాస్‌స్పెక్ట్రోస్కోప్
4) న్యూక్లియర్ రియాక్టర్

19. కింది వాటిలో రేడియోధార్మిక మూలకం కానిది ఏది?
1) ఆస్టటైన్
2) ఫ్రాన్సియం
3) ట్రీటియం
4) జిర్కోనియం

20. థోరియం పెద్ద మొత్తంలో ఏ ఖనిజం నుంచి లభిస్తుంది?
1) బాక్సైట్
2) హెమటైట్
3) డోలమైట్
4) మోనజైట్

21.‘వెనిగర్’ దేని సజల ద్రావణం?
1) ఆగ్జాలిక్ ఆమ్లం
2) సిట్రిక్ ఆమ్లం
3) ఎసిటిక్ ఆమ్లం
4) హైడ్రోక్లోరిక్ ఆమ్లం

22.‘వెనిగర్’ అని దేన్ని పేర్కొంటారు?
1) పిక్రిక్ ఆసిడ్
2) ఆగ్జాలిక్ ఆసిడ్
3) ఎసిటిక్ ఆసిడ్
4) కార్బోలిక్ ఆసిడ్

23. నిల్వ బ్యాటరీల్లో ఉండే ఆమ్లం ఏది?
1) సల్ఫ్యూరిక్ ఆమ్లం
2) నత్రికామ్లం
3) హైడ్రోక్లోరికామ్లం
4) ఎసిటిక్ ఆమ్లం

24. వెనిగర్‌ను ఏ విధంగా తయారు చేస్తారు?
1) ఖర్జూరం కాయలను పొగలో కాల్చడం ద్వారా
2) కుళ్లిపోయిన ద్రాక్షను పులియబెట్టడం ద్వారా
3) ఆపిల్ రస సారాయిని గాలి తగిలేటట్లు పులియబెట్టడం ద్వారా
4) ద్రాక్ష సారాయిని నిర్జలీకరణం చేయడం ద్వారా

25. కింది వాటిలో దేన్ని ఆమ్లత్వానికి విరుగుడు (యాంటాసిడ్)గా ఉపయోగిస్తారు?
1) మెగ్నీషియం ఎసిటేట్
2) మెగ్నీషియం హైడ్రాక్సైడ్
3) మెగ్నీషియం క్లోరైడ్

26. కోలా రకాలైన సులభ పానీయాల్లో ఉండే ఆమ్లం ఏది?
1) ఫాస్ఫారిక్ ఆమ్లం
2) ఫార్మిక్ ఆమ్లం
3) లాక్టిక్ ఆమ్లం
4) ఎసిటిక్ ఆమ్లం

27. కింద పేర్కొన్న హాలోజన్ ఆమ్లాల్లో అతి బలమైన క్షయకరణి ఏది?
1) HI
2) HCl
3) HF
4) HBr

28. పాలు పెరుగుగా మారినప్పుడు పుల్లటి రుచి రావడానికి కారణమైన ఆమ్లం ఏది?
1) ఎసిటిక్ ఆమ్లం
2) సిట్రిక్ ఆమ్లం
3) లాక్టిక్ ఆమ్లం
4) ఆగ్జాలిక్ ఆమ్లం

29. వర్షపు నీటి pH విలువ ఎంత?
1) 7
2) 8
3) 5.7
4) 4

30.ఆమ్లాలన్నింటిలో సాధారణంగా ఉండే మూలకం ఏది?
1) హైడ్రోజన్
2) సల్ఫర్
3) ఆక్సిజన్
4) క్లోరిన్

31. థోరియంను న్యూట్రాన్లతో తాడనం చేస్తే ఏది ఉత్పత్తి అవుతుంది?
1) కఠిన జలం
2) హైడ్రోజన్ సల్ఫైడ్
3) యురేనియం-233
4) పైవేవీ కాదు

32. భారతదేశంలో మొదటిసారిగా అణు పరీక్షలను ఏ సంవత్సరంలో నిర్వహించారు?
1) 1951
2) 1961
3) 1974
4) 1984

33. న్యూక్లియర్ రియాక్టర్‌ను విస్ఫోటక దశ నుంచి కాపాడటానికి వేటిని వాడతారు?
1) కాడ్మియం కడ్డీలు
2) కార్బన్ కడ్డీలు
3) భారజలం
4) అల్యూమినియం కడ్డీలు

34.అణు రియాక్టర్‌లో శక్తిని విడుదల చేసే ముఖ్యమైన మూలపదార్థం ఏది?
1) యురేనియం-235
2) యురేనియం-238
3) యురేనియం-233
4) ప్లూటోనియం-239

35. కింది వాటిలో రేడియోధార్మిక మూలకం కానిది ఏది?
1) హీలియం
2) రేడియం
3) థోరియం
4) యురేనియం

36. రేడియోధార్మికత అనేది కింది వాటిలో దేనికి సంబంధించింది?
1) అమెచ్యూర్ రేడియో
2) రేడియో ఖగోళం
3) మూలక కేంద్రకం
4) పైవేవీ కాదు

37. కేంద్రక అణు రియాక్టర్‌లో స్వయం నియంత్రిత శృంఖల చర్య జరగడానికి సంబంధించి కింది వాటిలో సరైన అంశం ఏది?
ఎ) కేంద్రక విచ్ఛిత్తిలో ఎక్కువ న్యూట్రాన్లు విడుదలవుతాయి
బి) కేంద్రక విచ్ఛిత్తిలో న్యూట్రాన్లు పాలుపంచుకుంటాయి
సి) గ్రాఫైట్.. న్యూట్రాన్ వేగాన్ని తగ్గిస్తుంది
డి) కేంద్రక విచ్ఛిత్తిలో విడుదలైన న్యూట్రాన్ విచ్ఛిత్తి చర్యను ప్రారంభిస్తుంది
1) ఎ, బి, సి
2) ఎ, సి
3) బి, సి
4) ఎ, బి, డి

38. కేంద్రక రియాక్టర్లను నిర్మించడానికి తప్పనిసరిగా వాడాల్సిన మూలకం ఏది?
1) కోబాల్ట్
2) నికెల్
3) జిర్కోనియం
4) టంగ్‌స్టన్

39. సరిహద్దు ప్రాంతాల్లో రవాణా అయ్యే ‘ఎల్లోకేక్’ అనేది ఒక..?
1) ముడి హెరాయిన్
2) ముడి కొకైన్
3) యురేనియం ఆక్సైడ్
4) శుద్ధి చేయని బంగారం

40.కేంద్రక రియాక్టర్, అణుబాంబుకు మధ్య ప్రధాన తేడా ఏమిటి?
1) కేంద్రక రియాక్టర్‌లో శృంఖల చర్య జరగదు, అణుబాంబులో శృంఖల చర్య జరుగుతుంది
2) కేంద్రక రియాక్టర్‌లో నియంత్రిత శృంఖల చర్య జరుగుతుంది, అణుబాంబులో అనియంత్రిత శృంఖల చర్య జరుగుతుంది
3) కేంద్రక రియాక్టర్‌లో అనియంత్రిత శృంఖల చర్య జరుగుతుంది, అణుబాంబులో నియంత్రిత శృంఖల చర్య జరుగుతుంది
4) ఆణుబాంబులో శృంఖల చర్య జరగదు, కేంద్రక రియాక్టర్లలో శృంఖల చర్య జరుగుతుంది

41. మోనజైట్ అనేది ఏ లోహ ఖనిజం?
1) జిర్కోనియం
2) థోరియం
3) టైటానియం
4) ఇనుము

42. ‘మినిమేటా’ వ్యాధికి కారణమైన మూలకం ఏది?
1) పాదరసం
2) సీసం
3) కాడ్మియం
4) రాగి

43. వజ్రం అనేది రసాయనికంగా..?
1) లోహ కార్బొనేట్ల మిశ్రమం
2) స్వచ్ఛమైన కర్బనం
3) స్వచ్ఛమైన ఇసుక రకం
4) కాల్షియం, మెగ్నీషియం మిశ్రమం

44. కింది వాటిలో లోహం కానప్పటికీ మంచి విద్యుత్ వాహకంగా పని చేసేది ఏది?
1) గ్రాఫైట్
2) ఫాస్ఫరస్
3) సల్ఫర్
4) హైడ్రోజన్

45. అత్యంత గట్టి పదార్థం ఏది?
1) ఉక్కు
2) వజ్రం
3) బొగ్గు
4) రాయి

46. వజ్రం దేని రూపాంతరం (అల్లోట్రోప్)?
1) సిలికాన్
2) కార్బన్
3) హైడ్రోజన్
4) సోడియం

47. ఆంధ్రప్రదేశ్‌లోని ఏ జిల్లాలో బెరైటీస్ తవ్వకం ఎక్కువగా ఉంది?
1) కడప
2) కర్నూలు
3) విశాఖపట్నం
4) శ్రీకాకుళం

48. ఆంధ్రప్రదేశ్‌లోని ఏ జిల్లాలో మైకా గనులు ఉన్నాయి?
1) నెల్లూరు
2) తూర్పుగోదావరి
3) చిత్తూరు
4) కర్నూలు

49. థోరియం ఏ రాష్ట్రంలో లభిస్తుంది?
1) ఆంధ్రప్రదేశ్
2) కేరళ
3) కర్ణాటక
4) తమిళనాడు

50. జిప్సం నిల్వలు అత్యధికంగా ఏ రాష్ట్రంలో ఉన్నాయి?
1) బిహార్
2) ఒడిశా
3) ఆంధ్రప్రదేశ్
4) రాజస్థాన్

51. క్వార్ట్జ్ దేని నుంచి ఏర్పడుతుంది?
1) లైమ్ స్టోన్
2) ఓబ్సిడియన్
3) సాండ్ స్టోన్
4) షేల్

52. తొలిసారిగా కృత్రిమంగా రూపొందించిన జీవ సమ్మేళనం ఏది?
1) మీథేన్
2) బెంజీన్
3) గ్లూకోజ్
4) యూరియా

53. ‘అమ్మోనియా’ వేటి మిశ్రమం?
1) నత్రజని, ఉదజని
2) ఉదజని, ఆక్సిజన్
3) నత్రజని, ఆక్సిజన్
4) నత్రజని, సోడియం హైడ్రాక్సైడ్

54. కింది వాటిలో ఎరువుగా ఉపయోగించే ఒక అమ్మోనియా మిశ్రమం ఏది?
1) అమ్మోనియం కార్బొనేట్
2) అమ్మోనియం ఫాస్ఫేట్
3) అమ్మోనియం సల్ఫేట్
4) అమ్మోనియం క్లోరైడ్

55.ఎరువుల ద్వారా మొక్కలకు అవసరమైన ఏ మూలకాలను అందజేస్తారు?
1) జింక్, పొటాషియం, ఫాస్ఫరస్
2) పొటాషియం, నైట్రోజన్, ఫాస్ఫరస్
3) నైట్రోజన్, కాపర్, పొటాషియం
4) పొటాషియం, ఫాస్ఫరస్, కార్బన్

56.కింద పేర్కొన్న వాటిలో ఏది ఎరువు?
1) సోడియం పెరాక్సైడ్
2) సోడియం కార్బొనేట్
3) సోడియం సల్ఫేట్
4) సోడియం థయోసల్ఫేట్

57.కింది వాటిలో మిశ్రమ ఎరువుకు ఉదాహరణ ఏది?
1) యూరియా
2) CAM
3) అమ్మోనియా సల్ఫేట్
4) NPK

58. ఏ ధాతువును ‘రాతి నార’ అని కూడా పిలుస్తారు?
1) బొగ్గు
2) జనపనార
3) ఇనుము
4) ఆస్‌బెస్టాస్

ANSWERS:
1)2 2)3 3)2 4)2 5)1 6)3 7)3 8)1 9)2 10)4 11)2 12)3 13)3 14)1 15)1 16)1 17)4 18)1 19)4 20)4 21)3 22)3 23)1 24)4 25)2 26)3 27)3 28)3 29)3 30)1 31)3 32)3 33)1 34)1 35)1 36)3 37)1 38)3 39)3 40)2 41)2 42)1 43)2 44)1 45)2 46)2 47)1 48)1 49)2 50)4 51)3 52)4 53)1 54)2 55)2 56)1 57)4 58)4

No comments:

Post a Comment