Physics Questions in Telugu Part-3



1. జతపరచండి.
జాబితా - 1 జాబితా - 2
1) అతిధ్వనులు i) మానవుడు
2) పరశ్రావ్యాలు ii) తేనెటీగలు
3) సాధారణధ్వనులు iii) గబ్బిలాలు
4) అతినీలలోహిత కిరణాలు iv) పాములు
ఎ) 1 - i, 2 - ii, 3 - iii, 4 - iv
బి) 1 - iii, 2 - iv, 3 - i, 4 - ii
సి) 1 - ii, 2 - i, 3 - iv, 4 - iii
డి) 1 - iv, 2 - i, 3 - iii, 4 - ii

2.జతపరచండి.
సాధనాలు ఉపయోగించే తరంగాలు
1) సోనార్ i) లేజర్ కిరణాలు
2) రాడార్ ii) అతిధ్వనులు
3) లిడార్ iii) రేడియో తరంగాలు
4) నైట్ విజన్ కెమెరా iv) పరారుణ కిరణాలు
ఎ) 1 - iv, 2 - ii, 3 - i, 4 - iii
బి) 1 - i, 2 - ii, 3 - iii, 4 - iv
సి) 1 - ii, 2 - iii, 3 - i, 4 - iv
డి) 1 - iii, 2 - i, 3 - iv, 4 - iii

3. జతపరచండి.
జాబితా - 1
1) యాంత్రిక తరంగాలు
2) విద్యుత్ అయస్కాంత తరంగాలు
3) కాస్మిక్ కిరణాలు
4) కాథోడ్ కిరణాలు
జాబితా - 2
i) ధ్వని
ii) కాంతి
iii) ప్రాథమిక కణాలు
iv) ఎలక్ట్రాన్‌లు
ఎ) 1 - i, 2 - ii, 3 - iii, 4 - iv
బి) 1 - ii, 2 - i, 3 - iii, 4 - iv
సి) 1 - iv, 2 - iii, 3 - i, 4 - ii
డి) 1 - iii, 2 - i, 3 - ii, 4 - iv

4. కింది వాటిలో సరికాని వాక్యాలు ఏవి?
1) అతిధ్వనుల పౌనఃపున్యం 20,000 హెర్‌‌టజ్‌ల కంటే ఎక్కువగా ఉంటుంది
2) కుక్కల్లో శృతిగ్రాహ్యత ఎక్కువగా ఉండటం వల్ల అవి అతిధ్వనులను వినగలుగుతాయి
3) అతిధ్వనులను రాడార్‌లో ఉపయోగిస్తారు
4) అతిధ్వనుల తీవ్రత ఎక్కువగా ఉంటుంది
ఎ) 1, 2
బి) 2, 3
సి) 3, 4
డి) 4 మాత్రమే

5. కిందివాటిలో సరైన వాక్యాలు ఏవి?
1) ధ్వని తీవ్రత ‘కంపన పరిమితి’పై ఆధారపడి ఉంటుంది
2) ధ్వని స్థాయిత్వం ‘పౌనఃపున్యం’పై ఆధారపడి ఉంటుంది
3) ధ్వని వేగం ‘యానక స్వభావం’పై ఆధారపడి ఉంటుంది
4) కంపన కణాల్లో మాత్రమే ధ్వని జనిస్తుంది
ఎ) 1, 2, 3
బి) 2, 3, 4
సి) 1, 3, 4
డి) 1, 2, 3, 4

6. కింది వాటిలో ధ్వని తరంగాలు ప్రదర్శించని ఏ ధర్మాన్ని కాంతి ప్రదర్శిస్తుంది?
ఎ) రుజువర్తనం
బి) వివర్తనం
సి) ధ్రువణం
డి) పరావర్తనం

7. రెండు నక్షత్రాల మధ్య దూరాన్ని కొలవడానికి ఉపయోగించే ప్రమాణం?
ఎ) కాంతి సంవత్సరం
బి) పార్‌లాస్టిక్ సెకండ్
సి) ఖగోళ ప్రమాణం
డి) కిలోమీటర్

8. కాంతిని కొలిచే శాస్త్రాన్ని ఏమంటారు?
ఎ) ఆప్తమాలజీ
బి) ఆప్టోమెట్రి
సి) ఫొటోమెట్రి
డి) సోలార్ సైన్స్

9. అతినీలలోహిత కిరణాలను గుర్తించడానికి ఏ గాజుతో తయారు చేసిన పట్టకాలను ఉపయోగిస్తారు?
ఎ) క్వార్‌‌ట్జ
బి) ప్లింట్
సి) సోడా
డి) పెరైక్స్

10. భూమి మీద ఉన్న వాతావరణం అదృశ్యమైతే, ఒక రోజు కాలవ్యవధి..?
ఎ) పెరుగుతుంది
బి) తగ్గుతుంది
సి) మారదు
డి) ఏదీకాదు

11. పసుపుపచ్చ గాజు పలక నుంచి పంట పొలాలను చూసినప్పుడు అవి ఏ రంగులో కనిపిస్తాయి?
ఎ) తెలుపు
బి) నలుపు
సి) ఆకుపచ్చ
డి) ఎరుపు

12. అయస్కాంత కవచంగా ఏ పదార్థాన్ని ఉపయోగిస్తారు?
ఎ) ఆల్నికో
బి) ఉక్కు
సి) నికెల్
డి) మృదు ఇనుము

13. కింద పేర్కొన్న ఏ పరికరంలో అయస్కాంత పదార్థాలు ఉండవు?
ఎ) సైకిల్ డైనమో
బి) ట్రాన్స్ ఫార్మర్
సి) రేడియో
డి) ట్యూబ్‌లైట్

14. ఏ ఖగోళ వస్తువు వల్ల భౌమ్య అయస్కాంత క్షేత్రంలో అలజడి ఏర్పడుతుంది?
ఎ) చంద్రుడు
బి) సూర్యుడు
సి) అంగారకుడు
డి) బృహస్పతి

15. ‘భూమి పెద్ద అయస్కాంత గోళం’ అని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు?
ఎ) కూలుంబ్
బి) మైకెల్ ఫారడే
సి) విలియం గిల్‌బర్డ్
డి) మేడం క్యూరీ

16. ఏ పదార్థం వల్ల భౌమ్య అయస్కాంతత్వం కలుగుతుంది?
ఎ) మరుగుతున్న నికెల్ - ఇనుము
బి) మరుగుతున్న ఇనుము - సిలికాన్
సి) ఘనస్థితిలోని ఇనుము
డి) ఘనస్థితిలోని అల్యూమినియం- నికెల్

17. ప్రపంచంలో అత్యధిక పరిమాణంలో అయస్కాంత నిల్వలు ఉన్న ప్రదేశం ఏది?
ఎ) ఆస్ట్రేలియా
బి) టర్కీ
సి) ఉత్తర స్వీడన్
డి) చైనా

18. కంప్యూటర్‌లోని ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ (IC) చిప్స్‌ను దేనితో తయారు చేస్తారు?
ఎ) వెండి
బి) సిలికాన్
సి) జెర్మేనియం
డి) సిలికా

19.రిఫ్రిజిరేటర్లు, ఎ.సి. గదుల్లో పనిచేసే సూత్రం ఏది?
ఎ) పెల్టియర్ ఫలితం
బి) సీబెక్ ఫలితం
సి) థామ్సన్ ఫలితం
డి) కాంతి విద్యుత్ ఫలితం

20. ట్రాన్సిస్టర్‌లో ఏ మూలకాన్ని వాడతారు?
ఎ) సిలికాన్
బి) కాపర్ (Cu)
సి) సిల్వర్
డి) బంగారం

21. ఎలక్ట్రోప్లేటింగ్‌లో రాగిని ఉపయోగించడానికి కారణం?
ఎ) రాగి ద్రవీభవన స్థానం ఎక్కువ
బి) చవకగా లభిస్తుంది
సి) మన్నిక ఎక్కువ
డి) విద్యుత్ నిరోధం తక్కువ

22. పిడుగులను ఆకర్షించే కడ్డీలను దేనితో తయారు చేస్తారు?
ఎ) రాగి
బి) ఇనుము
సి) ఇనుము మిశ్రమ లోహం
డి) అల్యూమినియం

23. క్రిమి కీటకాల ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగించే ఉష్ణోగ్రతా మాపకం ఏది?
ఎ) సిక్స్ - గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రత మాపకం
బి) పైరోమీటర్
సి) సీబెక్ ఉష్ణవిద్యుత్ ఉష్ణోగ్రత మాపకం
డి) అయస్కాంత ఉష్ణోగ్రత మాపకం

24. కింది వాటిలో దేనిలో ఉష్ణశక్తి యాంత్రికశక్తిగా మారుతుంది?
ఎ) వాహనం
బి) ఫ్యాన్
సి) ఇస్త్రీ పెట్టే
డి) విద్యుత్ హీటర్

25. 80°C వద్ద ఉన్న ‘టీ’ 70°C కు చల్లారడానికి 5 నిమిషాలు పడుతుంది. ఆ ‘టీ’ తిరిగి 70°C నుంచి 60°C కు చల్లారడానికి ఎంత సమయం పడుతుంది?
ఎ) 5 నిమిషాలు
బి) 5 నిమిషాల కంటే ఎక్కువ
సి) 5 నిమిషాల కంటే తక్కువ
డి) ఏదీకాదు

26. ఒక ఇంధనం నుంచి వెలువడే ఉష్ణరాశిని దేనితో కొలుస్తారు?
ఎ) ఉష్ణోగ్రతా మాపకం
బి) సాధారణ కెలోరీమీటర్
సి) బోలోమీటర్
డి) బాంబు కెలోరీమీటర్

27. రాగి పాత్రలో వేడి ద్రవాన్ని నింపి ఇనుపబల్లపై ఉంచితే, అది ఏ పద్ధతి వల్ల చల్లారుతుంది? ఎ) ఉష్ణవహనం
బి) ఉష్ణసంవహనం
సి) ఉష్ణవికిరణం
డి) ఎ, బి

28.గమనంలో ఉన్న వాహన చక్రాల చలనం..?
ఎ) సరళ హరాత్మక చలనం
బి) రేఖీయ చలనం
సి) భ్రమణ చలనం
డి) బి, సి

29. పుటాకారంలో ఉన్న రోడ్డుపై ఒక బంతి చేసే చలనం..?
ఎ) రేఖీయ చలనం
బి) కోణీయ చలనం
సి) సరళ హరాత్మక చలనం
డి) పైవన్నీ

30. ఉపగ్రహం తక్కువ వ్యాసార్ధం ఉన్న కక్ష్యలో నుంచి ఎక్కువ వ్యాసార్ధం ఉన్న కక్ష్యలోకి ప్రవేశించినప్పుడు దాని రేఖీయ వేగం..?
ఎ) పెరుగుతుంది
బి) తగ్గుతుంది
సి) మారదు
డి) శూన్యం

31. కింది వాటిలో ‘శక్తి’కి ప్రమాణం ఏది?
ఎ) ఎర్గ్
బి) జౌల్
సి) ఎలక్ట్రాన్ - ఓల్ట్
డి) పైవన్నీ

32. కదులుతున్న రైలులో ఉన్న ప్రయాణికుడికి ఏ శక్తి ఉంటుంది?
ఎ) గతిజశక్తి
బి) స్థితిజశక్తి
సి) యాంత్రికశక్తి
డి) ఉష్ణశక్తి

33. బ్రామా ప్రెస్, హైడ్రాలిక్ బ్రేకులు ఏ నియమంపై ఆధారపడి పనిచేస్తాయి?
ఎ) పాస్కల్ నియమం
బి) ఆర్కిమెడిస్ నియమం
సి) బాయిల్ నియమం
డి) బెర్నౌలీ నియమం

34. నీటిపై తేలిన మంచు పూర్తిగా కరిగినప్పుడు, ఆ నీటి మట్టం..?
ఎ) పెరుగుతుంది
బి) తగ్గుతుంది
సి) మారదు
డి) రెండింతలు అవుతుంది

35.స్వచ్ఛమైన నీటి స్పర్శకోణం ఎంత?
ఎ) 0°
బి) 45°
సి) 90°
డి) 180°


36. కింది వాటిలో ఏ పదార్థానికి గరిష్ట స్నిగ్ధత ఉంటుంది?
ఎ) తేనె
బి) పాలు
సి) పెట్రోల్
డి) గ్రీజు

37. కొవ్వొత్తి, పెన్ను పాళీ పనిచేయడంలో ఏ ధర్మం ఇమిడి ఉంది?
ఎ) తలతన్యత
బి) కేశనాళికీయత
సి) స్నిగ్ధతా
డి) పీడనం

38. ఏ గ్రహాన్ని ‘ఉదయ తార’, ‘సాయంత్రం తార’గా పిలుస్తారు?
ఎ) అంగారకుడు
బి) శుక్రుడు
సి) శని
డి) యురేనస్

39. అరుణ గ్రహం (Red Plannet)గా ఏ గ్రహాన్ని పిలుస్తారు?
ఎ) శని
బి) భూమి
సి)అంగారకుడు
డి) బృహస్పతి

40.భూమి చుట్టూ పరిభ్రమిస్తున్న కృతిమ ఉపగ్రహం స్థానాన్ని కింది కక్ష్య నుంచి పై కక్ష్యకు పెంచినప్పుడు దాని కక్ష్యా వేగం..?
ఎ) పెరుగుతుంది
బి) తగ్గుతుంది
సి) మారదు
డి) రెండు రెట్లు పెరుగుతుంది

41.కింది వాటిలో బృహస్పతి ఉపగ్రహం ఏది?
ఎ) గనిమెడ
బి) యూరోపా
సి) కెలిస్టో
డి) పైవన్నీ

42. సౌరకుటుంబంలో గరిష్ట సాంద్రత ఉన్న గ్రహం ఏది?
ఎ) భూమి
బి) శని
సి) బృహస్పతి
డి) బుధుడు

43.అణు రియాక్టర్‌లో గొలుసు చర్య జరగడా నికి ఎన్ని సెకన్‌ల కాలం పడుతుంది?
ఎ) 103
బి) 106
సి) 108
డి) 1012

44. మ్యూమెజాన్‌ల ద్రవ్యరాశి కంటే ఎలక్ట్రాన్‌ల ద్రవ్యరాశి..?
ఎ) ఎక్కువ
బి) తక్కువ
సి) సమానం
డి) సగం


45. కింది వాటిలో అర్ధ జీవిత కాలం తక్కువగా ఉన్న కణం ఏది?
ఎ) రేడియం
బి) యురేనియం
సి) ప్రొటెక్టేనియం
డి) ప్లుటోనియం

46.కృత్రిమ రేడియోధార్మికతను కనుగొన్న శాస్త్రవేత్త?
ఎ) రూథర్‌ఫర్డ్
బి) మేడమ్ క్యూరీ
సి) ఐరీన్ క్యూరీ, ఫ్రెడ్రిక్ జోలాయిట్ క్యూరీ
డి) ఐన్‌స్టీన్

47. కింది వాటిలో కృత్రిమ రేడియోధార్మిక మూలకం కానిది ఏది?
ఎ) యురేనియం
బి) ప్లుటోనియం
సి) క్యూరియం
డి) లారెన్షియం

48. ‘కృత్రిమ సూర్యుడు’(Artificial sun) లో ఏ చర్య జరుగుతుంది?
ఎ) కేంద్రక సంలీనం
బి) కేంద్రక విచ్ఛిత్తి
సి) ఎ, బి
డి) రసాయన చర్య

49. విద్యుత్, అయస్కాంత క్షేత్రాల్లో రుజు మార్గంలో ప్రయాణించే కిరణాలు ఏవి?
ఎ) కాంతి కిరణాలు
బి) ఎక్స్ - కిరణాలు
సి) గామా కిరణాలు
డి) పైవన్నీ

50. మొదటి న్యూక్లియర్ రియాక్టర్‌ను నిర్మించినవారు?
ఎ) హెచ్.జి. బాబా
బి) ఫెర్మి
సి) ఐన్‌స్టీన్
డి) రూథర్‌ఫర్డ్

51.‘అణుబాంబు పితామహుడు’గా ఎవరిని పేర్కొంటారు?
ఎ) ఐన్‌స్టీన్
బి) ఫెర్మి
సి) ఒపెన్‌హైమర్
డి) ఎడ్వర్‌‌డ టెల్లర్

ANSWERS:
1)బి 2)సి 3)ఎ 4)సి 5)డి 6)సి 7)బి 8)సి 9)ఎ 10)బి 11)బి 12)డి 13)డి 14)బి 15)సి 16)ఎ 17)సి 18)బి 19)ఎ 20)ఎ 21)డి 22)ఎ 23)సి 24)ఎ 25)బి 26)డి 27)డి 28)డి 29)సి 30)బి 31)డి 32)సి 33)ఎ 34)సి 35)ఎ 36)డి 37)బి 38)బి 39)సి 40)బి 41)డి 42)ఎ 43)సి 44)ఎ 45)సి 46)సి 47)ఎ 48)ఎ 49)డి 50)బి 51)సి

Physics Questions in Telugu Part-2

No comments:

Post a Comment