Geography Questions in Telugu Part-5

Geography Questions in Telugu Part-5


1. ‘కైమూర్’ పర్వత శ్రేణి ఏ పర్వతాల్లో భాగంగా విస్తరించింది?
1) ట్రాన్స్ హిమాలయాలు
2) హిందూకుష్ పర్వత శ్రేణులు
3) సాత్పురా పర్వతాలు
4) వింధ్య పర్వతాలు


2. జతపరచండి. 
పర్వత శ్రేణులు రాష్ట్రాలు
1. బాబు బుడాన్ ఎ. తమిళనాడు
2. ఫళని కొండలు బి. మహారాష్ర్ట
3. ఇలైమలై పర్వతాలు సి. కర్ణాటక
4. సహ్యాద్రి డి. కేరళ
1) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
2) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి
3) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి
4) 1-డి, 2-ఎ, 3-బి, 4-సి


3. సింధూ నది ఏ పర్వత శ్రేణుల మధ్య గుండా ప్రవహిస్తుంది?
1) కారకోరం, హిందూకుష్
2) కైలాస, లద్దాఖ్
3) లద్దాఖ్, జస్కర్
4) జస్కర్, కైలాస


4.పూగాలోయ ఏ రాష్ర్టంలో ఉంది?
1) కశ్మీర్
2) హిమాచల్‌ప్రదేశ్
3) పశ్చిమ బంగా
4) కేరళ



5. 9° ఛానల్ ఏయే దీవులను వేరుచేస్తుంది?
 1) మినికాయ్ దీవి, మాల్దీవులు
2) మాల్దీవులు, సుహేలి దీవి
3) సుహేలి దీవి, మినికాయ్ దీవి
4) లిటిల్ అండమాన్, కార్‌నికోబార్


6. కింది వాటిలో కర్కటరేఖ పోని రాష్ర్టం ఏది?
1) త్రిపుర
2) రాజస్థాన్
3) పశ్చిమ బంగా
4) మణిపూర్


7. లండన్ పట్టణంలో ఉదయం 7 గంటలకు జరిగిన బాంబు పేలుడు సంఘటనను కోల్‌కతాలోని ప్రజలు ఎన్ని గంటలకు చూస్తారు?
 1) రాత్రి 1.30 గంటలకు
2) రాత్రి 12.30 గంటలకు
3) ఉదయం 11.30 గంటలకు
4) మధ్యాహ్నం 12.30 గంటలకు


8. వాస్తవాధీన రేఖ ఏ రెండు దేశాల మధ్య ఉంది?
 1) భారత్ - పాకిస్తాన్
2) భారత్ - చైనా
3) భారత్- ఆప్ఘనిస్థాన్
4) భారత్ - బంగ్లాదేశ్



9. మాండవి నది ఏ రాష్ర్టంలో ప్రవహిస్తుంది?
 1) గోవా
2) ఉత్తరాఖండ్
3) మధ్యప్రదేశ్
4) గుజరాత్


10. కింది నదులను ఉత్తరం నుంచి దక్షిణానికి వరుస క్రమంలో అమర్చండి.
1) నర్మదా, కృష్ణా, కావేరి, పెన్నా నది
2) కృష్ణా, నర్మదా, కావేరి, పెన్నా నది
3) నర్మదా, కృష్ణా, పెన్నా, కావేరి నది
4) కృష్ణా, కావేరి, నర్మదా, పెన్నా నది

11. కింది వాటిలో యమున నది ఉపనది కానిది ఏది?
 1) బెట్వా
2) సోన్
3) కెన్
4) చంబల్


12. కింది వాటిలో సరికానిది ఏది? 
1) చాజ్ దోఆబ్ - చీనాబ్, జీలం
2) బిస్త్ దోఆబ్ - బియాస్, సట్లేజ్
3) బారి దోఆబ్ - రావి, చీనాబ్
4) సింధు సాగర్ - సింధు, జీలం


13. జతపరచండి.
సరస్సులు రాష్ట్రాలు
1. లోక్‌తక్ ఎ. గుజరాత్
2. లోనార్ బి. మణిపూర్
3. నాల్ సి. జమ్మూకశ్మీర్
4. ధాల్ డి. మహారాష్ర్ట
1) 1-డి, 2-ఎ, 3-సి, 4-బి
2) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
3) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి
4) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి


14. మహానది డెల్టా ఉన్న తీరం ఏది?
 1) వంగ తీరం
2) కోరమండల్ తీరం
3) ఉత్కల్ తీరం
4) సర్కార్ తీరం


15. బంగ్లాదేశ్‌తో భూ సరిహద్దు లేని భారత రాష్ర్టం ఏది?
1) మేఘాలయ
2) త్రిపుర
3) మణిపూర్
4) మిజోరం


16. మహాభారత్ పర్వతాలు ఎక్కడ విస్తరించి ఉన్నాయి?
 1) కశ్మీర్
2) ఉత్తరాఖండ్
3) హిమాచల్‌ప్రదేశ్
4) నేపాల్


17. నేపాల్ హిమాలయాలు ఏ నదుల మధ్య విస్తరించి ఉన్నాయి?
1) తీస్తా-బ్రహ్మపుత్ర
2) తీస్తా-కాళీ
3) కాళీ-బ్రహ్మపుత్ర
4) కాళీ-సట్లేజ్


18. సాడిల్ పీక్ శిఖరం ఎక్కడ ఉంది?
1) గ్రేట్ అండమాన్
2) లిటిల్ అండమాన్
3) సిక్కిం
4) ఉత్తరాఖండ్



19. కచ్ఛతివు దీవులు ఏ రెండు దేశాల మధ్య వివాదస్పదమైంది?
 1) భారత్, బంగ్లాదేశ్
2) భారత్, మాల్దీవులు
3) భారత్, శ్రీలంక
4) భారత్, పాకిస్తాన్


20.‘సియాచిన్’ హిమనీనదం ఏ పర్వత శ్రేణుల్లో ఉంది?
 1) హిమాద్రి
2) హిమాచల్
3) శివాలిక్
4) ట్రాన్స్ హిమాలయాలు


21.దేశంలో అత్యధికంగా లాగూన్‌లకు ప్రసిద్ధి చెందిన తీరం ఏది?
1) వంగ తీరం
2) ఉత్కల్ తీరం
3) మలబార్ తీరం
4) కోస్తా తీరం


22. ఆరావళి పర్వతాల చుట్టూ విస్తరించి ఉన్న పీఠభూమి ఏది?
1) భాగల్ ఖండ్
2) బోరట్ పీఠభూమి
3) బుందేల్ ఖండ్ పీఠభూమి
4) కతియవార్ పీఠభూమి


23. బ్రహ్మగిరి కొండల్లో జన్మించే నది ఏది?
1) పెన్నా నది
2) కావేరి నది
3) మంజీర
4) తుంగభద్ర


24. కింది వాటిలో తపతి నదికి ఉపనది కానిది ఏది?
 1) గిర్నా
2) పాట్కి
3) కాప్రా
4) తావా


25. కింది నదులు, వాటి జన్మస్థానాలకు సంబంధించి సరికానిది ఏది?
1) సట్లేజ్ నది- రాకాసి సరస్సు
2) రావి- రోహ్‌తంగ్
3) చంబల్- అమర్ కంటక్
4) చీనాబ్- బారాలాప్చాలా



26. ఏ పవనాలు మార్పు చెంది నైరుతి రుతుపవనాలుగా భారతదేశం మీదుగా వీస్తాయి?
1) ఆగ్నేయ వ్యాపార పవనాలు
2) వాయువ్య పశ్చిమ పవనాలు
3) నైరుతి పశ్చిమ పవనాలు
4) ఈశాన్య వ్యాపార పవనాలు


27. మన దేశంలో శీతాకాలాన్ని ప్రభావితం చేసే సముద్రం ఏది?
 1) పసిఫిక్ మహాసముద్రం
2) అట్లాంటిక్ మహాసముద్రం
3) హిందూ మహాసముద్రం
4) మధ్యధరా సముద్రం



28. ఎల్‌నినో ఏ దేశ తీర ప్రాంతంలో ఏర్పడుతుంది?
 1) సుడాన్
2) గ్రీక్
3) పెరూ
4) సోమాలియా


29.ఈశాన్య రుతుపవనాల వల్ల తమిళనాడులో అత్యధిక వర్షపాతం పొందడానికి సహకరించే కొండలు ఏవి?
 1) ఫళని కొండలు
2) యాలకుల
3) జంజి
4) షెవరాయ్


30. ‘భిత్తర్‌కానిగ’ మడ అడవులు ఏ రాష్ర్టంలో విస్తరించి ఉన్నాయి?
 1) తమిళనాడు
2) ఒడిశా
3) పశ్చిమ బంగా
4) మహారాష్ర్ట


31. ‘షోలాస్’ సమశీతల సతతహరిత అరణ్యాలు ఎక్కడ విస్తరించి ఉన్నాయి?
1) నీలగిరి పర్వతాలు
2) ఆరావళి పర్వతాలు
3) సాత్పూరా పర్వతాలు
4) పశ్చిమ కనుమలు


32. ‘బిర్చ్’ వృక్షాలు ఏ అరణ్యాలకు చెందినవి?
1) ఆకురాల్చు అరణ్యాలు
2) సమశీతల సతతహరిత అరణ్యాలు
3) ఆల్ఫైన్ అడవులు
4) టైడల్ అరణ్యాలు

33. ‘రావెన్స్’ అత్యధికంగా ఎక్కడ విస్తరించి ఉన్నాయి?
1) మహానది పరివాహక ప్రాంతం
2) చంబల్ నదీలోయ ప్రాంతం
3) నర్మదా నదీలోయ ప్రాంతం
4) శివాలిక్ కొండలు


34. శివాలిక్ పర్వత పాదాల వద్ద ఉన్న చిత్తడి నేలలను ఏమని పిలుస్తారు?
1) భంగర్
2) బాబర్
3) టెరాయి
4) ఖాదర్

35. బసాల్ట్, గ్రానైట్ లాంటి శిలలు ఏ మృత్తికల్లో విస్తరించి ఉంటాయి?
1) ఒండ్రు మృత్తికలు
2) లాటరైట్ మృత్తికలు
3) నల్లరేగడి మృత్తికలు
4) అటవీ మృత్తికలు


36. గాలి పారాడేటట్లుగా ఉండే మృత్తికలు ఏవి?
1) ఎర్ర మృత్తికలు
2) పీఠ్ నేలలు
3) అటవీ మృత్తికలు
4) జేగురు మృత్తికలు



37. అధిక ఉష్ణోగ్రత, అధిక వర్షపాతం ఒకదాని తర్వాత ఒకటి ఉన్న ప్రాంతాల్లో విస్తరించి ఉన్న నేలలు ఏవి?
1) పర్వతీయ నేలలు
2) జేగురు నేలలు
3) ఎర్ర నేలలు
4) క్షార నేలలు



38. కింది వాటిలో అత్యంత సారవంతమైన మృత్తికలు ఏవి?
1) నల్లరేగడి మృత్తికలు
2) లాటరైట్ మృత్తికలు
3) ఒండ్రు మృత్తికలు
4) ఎర్ర మృత్తికలు




39.కింది వాటిలో పోడ్జాల్ రకానికి చెందిన మృత్తికలు ఏవి?
 1) ఎడారి మృత్తికలు
2) లాటరైట్ మృత్తికలు
3) ఎర్ర మృత్తికలు
4) పర్వతీయ మృత్తికలు



40. ఎర్ర మృత్తికల్లో అత్యధికంగా ఉండే మూలకం ఏది?
1) మెగ్నీషియం ఆక్సైడ్
2) ఫై ఆక్సైడ్
3) నైట్రస్ ఆక్సైడ్
4) కాల్షియం ఆక్సైడ్


41. మహంకాళి ఒప్పందం ఏ రెండు దేశాల మధ్య జరిగింది?
1) భారత్ - పాకిస్తాన్
2) భారత్ - భూటాన్
3) భారత్ - నేపాల్
4) భారత్ - బంగ్లాదేశ్


42. ‘తుల్‌బుల్’ ప్రాజెకున్టు ఏ నదిపై నిర్మించారు?
1) జీలం
2) రావి
3) చీనాబ్
4) బియాస్


43. కిషన్ గంగా ప్రాజెక్టు ఏ రాష్ర్టంలో ఉంది?

 1) ఉత్తరప్రదేశ్
2) బిహార్
3) ఉత్తరాఖండ్
4) కశ్మీర్


44. బలిమెల ప్రాజెక్టు ఏ నదిపై ఉంది?
1) మహానది
2) నర్మద
3) తపతి
4) సీలేరు


45. ప్రాజెక్టు, అవి ఉన్న నదులకు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది?
 1) పంచట్ ప్రాజెక్టు - దామోదర్ నది
2) తిలయా ప్రాజెక్టు - బారకార్
3) కాక్రపార్ ప్రాజెక్టు - నర్మద నది
4) మాతతిలా ప్రాజెక్టు - బెట్వా


46. జతపరచండి.
 ప్రాజెక్టులు నెలకొన్న రాష్ట్రాలు
1. రిహాండ్ ఎ. పంజాబ్
2. థెయిన్ బి. ఉత్తరప్రదేశ్
3. సలాల్ సి. మహారాష్ర్ట
4. జయక్‌వాడీ డి. జమ్మూకశ్మీర్
1) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి
2) 1-డి, 2-ఎ, 3-బి, 4-సి
3) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
4) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి


47. గోదావరి నదిపై లేని ప్రాజెక్టు ఏది?
1) ఎల్లంపల్లి ప్రాజెక్టు
2) గాంధీ సాగర్
3) ఇచ్చంపల్లి ప్రాజెక్టు
4) పోలవరం ప్రాజెక్టు


48. ముల్లపెరియార్ ప్రాజెక్టు ఏ రెండు రాష్ట్రాల మధ్య వివాదస్పదమైంది?
1) కేరళ, తమిళనాడు
2) కేరళ, కర్ణాటక
3) తమిళనాడు, కర్ణాటక
4) కర్ణాటక, గోవా


49. సర్దార్ సరోవర్ డ్యామ్ ఏయే రాష్ట్రాల ఉమ్మడి పథకం?
1) గుజరాత్, మహారాష్ర్ట, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్
2) మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ర్ట
3) గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ర్ట
4) రాజస్థాన్, మధ్యప్రదేశ్, పంజాబ్, హర్యానా


50. కింది వాటిలో అంతర్జాతీయ ప్రాజెక్టు కానిది ఏది?
 1) సంకోష్ ప్రాజెకు
2) కోసి ప్రాజెక్టు
3) తనక్‌పూర్ ప్రాజెక్టు
4) ఒరయు ప్రాజెక్టు


51. ‘సిటీ ఆఫ్ సెవెన్ ఐలాండ్స్’ అని ఏ నగరాన్ని పిలుస్తారు?
1) బెంగళూరు
2) ముంబై
3) చెన్నై
4) కోల్‌కతా


52. సిక్కిం రాష్ర్టం ఏయే దేశాలతో భూ సరిహద్దును కలిగి ఉంది?
 1) బంగ్లాదేశ్, భూటాన్, మయన్మార్
2) భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్
3) నేపాల్, చైనా, భూటాన్
4) నేపాల్, చైనా, బంగ్లాదేశ్


53.నామ్చాబార్వా శిఖరం ఏ రాష్ర్టంలో ఉంది?
 1) హిమాచల్‌ప్రదేశ్
2) జమ్మూకశ్మీర్
3) అరుణాచల్‌ప్రదేశ్
4) సిక్కిం


54. అజంతా శ్రేణి ఏ రాష్ర్టంలో విస్తరించి ఉంది?
 1) మహారాష్ర్ట
2) మధ్యప్రదేశ్
3) గుజరాత్
4) రాజస్థాన్


55. ఎడారి ప్రాంతంలో పెరిగే వృక్షాలను ఏమని పిలుస్తారు?
1) హాలోఫైట్స్
2) గ్జీరోఫైట్స్
3) లిథోఫైట్స్
4) హైడ్రోఫైట్స్

ANSWERS:

 1)4 2)3 3)3 4)1 5)3 6)4 7)4 8)2 9)1 10)3 11)2 12)3 13)2 14)3 15)3 16)4 17)2 18)1 19)3 20)4 21)3 22)2 23)2 24)4 25)3 26)1 27)4 28)3 29)4 30)2 31)1 32)3 33)2 34)3 35)3 36)1 37)2 38)3 39)4 40)2 41)3 42)1 43)4 44)4 45)3 46)3 47)2 48)1 49)3 50)4 51)2 52)3 53)3 54)1 55)2

No comments:

Post a Comment