Geography Questions in Telugu Part-3

Geography Questions in Telugu Part-3


1. భారత దేశంలో మొదటి నూలు మిల్లును 1854లో ఎక్కడ స్థాపించారు? 
1) కోల్‌కతా
2) రిష్రా
3) ముంబై
4) చెన్నై


2. దేశంలో మొదటి జనపనార మిల్లును 1859లో ఎక్కడ స్థాపించారు?
1) రిష్రా
2) కాన్పూర్
3) సూరత్
4) ముంబై


3.కింది వాటిలో సరైన వాటిని గుర్తించండి?
ఎ. ఇండస్ గార్జ్ కశ్మీర్‌లో ఉంది
బి. బైసన్ గార్జ్ పాపికొండల్లో ఉంది
సి. బైసన్ గార్జ్ కృష్ణా నదిపై ఉంది
1) ఎ, బి
2) బి, సి
3) ఎ, సి
4) ఎ, బి, సి


4. మన దేశంలో ఎత్తైన జలపాతం ఏది?
1) ఎంజెల్ జలపాతం
2) టుగెలా జలపాతం
3) జోగ్ జలపాతం
4) కుంచికల్ జలపాతం



5. కింది వాటిలో సరైన వాటిని గుర్తించండి?
ఎ. కుంచికల్ జలపాతం ఎత్తు 445 మీటర్లు
బి. ఇది మహారాష్ర్టలో ఉంది
సి. ఇది ‘వారాహి’ నదిపై ఉంది
1) ఎ, బి
2) బి, సి
3) ఎ, సి
4) ఎ, బి, సి


6. ప్రపంచంలో అతిపెద్ద డెల్టా అయిన సుందర్‌బన్ డెల్టా ఏ నదుల కలయిక వల్ల ఏర్పడింది?
1) గంగా, యమున
2) సింధూ, గంగా
3) బ్రహ్మపుత్ర, గంగా
4) బ్రహ్మపుత్ర, సింధూ


7. ‘లూ’ అంటే ఏమిటి?
1) అసోంలోని పోడు వ్యవసాయం
2) జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో వీచే పవనాలు
3) అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు వీచే పవనాలు
4) ఉత్తర భారతదేశంలో మే, జూన్ మాసాల్లో వీచే వేడి, పొడి పవనాలు


8. సాంద్ర జీవనాధార వ్యవసాయానికి సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది?
1) ఇది అధిక జనసాంద్రత ఉన్న ప్రాంతాల్లో అమల్లో ఉంది
2) ఈ సాగులో తక్కువ శ్రామికులు అవసరం
3) ఈ పద్దతిలో అత్యధిక జీవ రసాయనిక ఎరువులను, నీటిపారుదల సౌకర్యాలను ఉపయోగిస్తారు
4) ఇది కూడా అధిక దిగుబడి సాధించే వ్యవసాయ విధానం


9. జతపరచండి.
పంటలు రాష్ట్రాలు
1. వరి ఎ. రాజస్థాన్
2. పత్తి బి. ఉత్తరప్రదేశ్
3. చిరుధాన్యాలు సి. పశ్చిమబెంగాల్
4. చెరకు డి. గుజరాత్
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
3) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
4) 1-డి, 2-ఎ, 3-బి, 4-సి



10. రాగి పంటకు ప్రసిద్ధి చెందిన రాష్ర్టం ఏది?
1) హిమాచల్ ప్రదేశ్
2) అసోం
3) కర్ణాటక
4) కేరళ



11.‘బంగారు పీచు’గా ప్రసిద్ధి చెందిన పంట ఏది?
1) పసుపు
2) కొబ్బరి
3) పత్తి
4) జనుము


12. చిన్న కమతాల్లో పురాతన పనిముట్లను ఉపయోగించి చేసే వ్యవసాయ పద్దతి ఏది?
1) సాంద్ర జీవనాధార వ్యవసాయం
2) సాధారణ జీవనాధార వ్యవసాయం
3) విస్తృత వ్యవసాయం
4) వాణిజ్య వ్యవసాయం



13. కింది వాటిలో సరికానిది ఏది?
1) పోడు వ్యవసాయాన్ని ‘నరుకు, కాల్చు’ వ్యవసాయం అని పిలుస్తారు
2) వరిని ఒడిశాలో జీవనాధార పంటగా పండిస్తున్నారు
3) వరిని పశ్చిమ బెంగాల్, గుజరాత్‌లలో వాణిజ్య పంటగా పండిస్తున్నారు
4) వాణిజ్య వ్యవసాయంలో ఆధునిక ఉత్పాదకాలను విరివిగా ఉపయోగిస్తారు.


14. కింది వాటిలో తోట పంట కానిది ఏది?
1) రబ్బరు
2) కాఫీ
3) తేయాకు
4) సజ్జ


15. కింది వాటిలో సరికానిది ఏది?
 1) మొక్కజొన్న పంటకు 21°c. నుంచి 27°c ఉష్ణోగ్రత అవసరం
2) గోధుమ పంటకు 150 - 200 సెం.మీ. వర్షపాతం అవసరం
3) హరిత విప్లవంలో భాగంగా వరిని ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో సాగుచేశారు
4) పైవన్నీ సరైనవే


16. భారతదేశంలో ఎన్ని పంట కాలాలు ఉన్నాయి?
1) 3
2) 6
3) 4
4) 2


17. కింది వాటిలో భారతదేశ పంట కాలం కానిది ఏది?
1) రబీ
2) బేరి
3) జయాద్
4) ఖరీఫ్


18. కింది వటిలో సరికానిది ఏది?
1) పశ్చిమ విక్షోభాల వల్ల జయాద్ పంటకు అత్యంత ఉపయోగకరం
2) హరిత విప్లవం రబీ కాలపు పంటల అభివృద్ధికి దోహదపడింది
3) రబీ పంట కాలంలో అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో విత్తనాలను విత్తుతారు
4) ఖరీఫ్, రబీ పంట కాలాల మధ్య కాలాన్ని ‘జయాద్’ కాలం అంటారు.


19. కింది వాటిలో రబీ పంట కాలానికి చెందనిది ఏది?
1) బార్లీ
2) శనగలు
3) కందులు
4) గోధుమ


20. కింది వాటిలో ఖరీఫ్ పంట కానిది ఏది?
1) వరి
2) సజ్జ
3) బఠాణి
4) మొక్కజొన్న


21. జయాద్ కాలంలో పండించే పంటలు ఏవి?
ఎ. పుచ్చకాయలు, దోసకాయలు
బి. కర్బూజ, కూరగాయలు
సి. పశువుల మేత
1) ఎ, బి
2) బి, సి
3) ఎ, సి
4) ఎ, బి, సి


22.కింది వాటిలో సరైంది ఏది?
ఎ. ఖరీప్ కాలం నైరుతి రుతుపవనాల రాకతో ప్రారంభం అవుతుంది
బి. ఖరీఫ్ కాలంలోని పంటల కోతలు సెప్టెంబర్ నుంచి అక్టోబర్ మధ్య కాలంలో ప్రారంభం అవుతాయి
1) ఎ
2) బి
3) ఎ, బి
4) పైవేవీ కావు



23. ఖరీఫ్ కాలానికి చెందిన పంటలు ఏవి?
ఎ. జొన్న, పెసలు
బి. మినుములు, పత్తి
సి. జనుము, వేరుశనగ, సోయాబీన్
1) ఎ, బి
2) బి, సి
3) ఎ, సి
4) ఎ, బి, సి


24. జతపరచండి.
1. గోధుమ ఎ. తెలంగాణ
2. పప్పు ధాన్యాలు బి. గుజరాత్
3. నూనె గింజలు సి. మధ్యప్రదేశ్
4. మొక్కజొన్న డి. ఉత్తర ప్రదేశ్
1) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
2) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
3) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి
4) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి


25. కింది వాటిలో సరికానిది ఏది?
1) రబ్బరు పంట భూమధ్య రేఖా ప్రాంతపు పంట
2) దీనికి కావలసిన వర్షపాతం 50 - 100 సెం.మీ.లు
3) దీన్ని అత్యధికంగా కేరళ రాష్ర్టం ఉత్పత్తి చేస్తుంది
4) దీనికి కావలసిన ఉష్ణోగ్రత 25నిఛి కంటే ఎక్కువ అవసరం


26. కింది వాటిలో నారపంట కానిది ఏది?
1) జనుము
2) పత్తి
3) సహజ పట్టు
4) రబ్బరు


27. మృత్తికల్లో పెరగనిది ఏది?
1) బార్లీ
2) జనుము
3) పట్టు
4) పత్తి


28. ‘సెరికల్చర్’ అంటే ఏమిటి?
1) మల్బరీ మొక్కలను పెంచడం
2) పట్టు పురుగులను పెంచడం
3) పుట్ట గొడుగులను పెంచడం
4) తేనెటీగలను పెంచడం


29. కింది వాటిలో సరికానిది ఏది?
ఎ. పత్తి పంటకు నల్లరేగడి నేలలు ప్రసిద్ధి చెందినవి
బి. దీనికి అధిక ఉష్ణోగ్రతలు, అధిక వర్షపాతం అవసరం
సి. దీన్ని ప్రపంచంలో మొదటిసారిగా భారతదేశంలో సాగుచేశారు
1) ఎ, బి
2) బి, సి
3) ఎ, సి
4) ఎ, బి, సి


30. మనదేశంలో పత్తిని అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రాలు ఏవి?
1) పంజాబ్, ఉత్తరప్రదేశ్
2) పంజాబ్, పశ్చిమ బెంగాల్
3) క ర్ణాటక, తమిళనాడు
4) గుజరాత్, మహారాష్ర్ట



31. భారత దేశంలో పత్తి ఉత్పత్తికి ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఏది?
1) ఛోటా నాగ్‌పూర్ పీఠభూమి
2) శుష్క వాతావరణం ఉండే దక్కన్ పీఠభూమి
3) శుష్క వాతావరణం ఉండే రాజస్థాన్ ఎడారి ప్రాంతం
4) ఈశాన్య రాష్ట్రాల ప్రాంతం


32. కింది వాటిలో సరైనవి ఏవి?
ఎ. చెరకు పంట భూమధ్య రేఖ ప్రాంతపు పంట
బి. చెరకు పంటకు 21°c నుంచి 27°c ల అధిక ఉష్ణోగ్రతలు అనుకూలం
సి. దీనికి 75 నుంచి 100 సెం.మీ.ల సాంవత్సరిక వర్షపాతం అనుకూలం
1) ఎ, బి
2) బి, సి
3) ఎ, సి
4) ఎ, బి, సి


33. కింది వాటిలో సరికానిది ఏది?
1) ప్రపంచ చెరకు ఉత్పత్తిలో బ్రెజిల్ తర్వాత స్థానం భారత్‌దే
2) మొలాసిస్ అనేది చెరకు నుంచి ఉత్పత్తి అవుతుంది
3) దేశంలోని మొత్తం నూనె గింజల్లో సగభాగం ఆముదాలది
4) అవిశలు, ఆవాలు ప్రధానంగా రబీ కాలంలో పండిస్తారు


34. ఏ పంటను ఉత్తర భారతదేశంలో ఖరీఫ్ పంట గానూ, దక్షిణ భారత దేశంలో రబీ పంటగా పండిస్తారు?
1) వేరుశనగ
2) ఆముదాలు
3) ఆవాలు
4) నువ్వులు


35. కింది వాటిలో సరైంది ఏది?
ఎ. తేయాకు పంట భారతదేశంలో బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన పానీయపు పంట
బి. ఇది ఆయన, ఉప ఆయన రేఖా ప్రాంతపు పంట
సి. తేయాకు ఉత్పత్తికి చాలా తక్కువ శ్రామికులు అవసరం
1) ఎ, బి
2) బి, సి
3) ఎ, సి
4) ఎ, బి, సి


36. కింది వాటిలో సరికానిది ఏది?
1) తేయాకును అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ర్టం అసోం
2) తేయాకు పంటకు హ్యూమస్, సేంద్రీయ పదార్థం తక్కువగా ఉన్న మృత్తికలు అత్యంత అనుకూలం
3) దీని పెరుగుదలకు వెచ్చని, ఆర్ధ్ర శీతోష్ణస్థితితోపాటు హిమరహిత వాతావరణం సంవత్సరం పొడవునా ఉండాలి
4) ఏదీ కాదు



37. కాఫీని మొదటిసారి ఏ కొండల్లో సాగుచేశారు?
1) అన్నామలై కొండలు
2) బాబు బుడాన్ కొండలు
3) నీలగిరి పర్వతాలు
4) హిమాలయ పర్వతాలు


38. కాఫీ ప్రస్తుతం ఏ రాష్ట్రాల్లో అత్యధికంగా పండిస్తున్నారు?
1) అసోం, పశ్చిమ బెంగాల్, బిహార్
2) పంజాబ్, హరియాణా, అసోం
3) కర్ణాటక, కేరళ, తమిళనాడు
4) ఉత్తరప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్


39. భారతదేశంలో మొదటిసారి సాగుచేసిన కాఫీ మొక్కను ఎక్కడి నుంచి తీసుకువచ్చారు?
1) పోర్చుగీస్
2) చైనా
3) ఇంగ్లండ్
4) యెమెన్


40. కింది వాటిలో చిరుధాన్యాలు కానివి ఏవి?
1) జొన్న
2) మొక్కజొన్న
3) రాగులు
4) సజ్జ


41.కింది వాటిలో సరికానిది ఏది?
1) జొన్న పంట ప్రధానంగా వర్షాధారపు పంట
2) మన దేశంలో జొన్న పంటను అత్యధికంగా గుజరాత్ రాష్ర్టం పండిస్తుంది
3) చిరుధాన్యాలను ముతక ధాన్యాలు అని పిలుస్తారు
4) సజ్జ అత్యధికంగా రాజస్థాన్ రాష్ర్టంలో ఉత్పత్తి అవుతుంది


42. ప్రపంచంలో పప్పుధాన్యాల ఉత్పత్తిలోనూ, వినియోగంలోనూ భారత దేశం ఎన్నో స్థానంలో ఉంది?
1) 4
2) 3
3) 2
4) 1

ANSWERS:
1)3 2)1 3)1 4)4 5)3 6)3 7)4 8)2 9)3 10)3 11)4 12)2 13)3 14)4 15)2 16)1 17)2 18)1 19)3 20)3 21)4 22)3 23)4 24)2 25)2 26)4 27)3 28)2 29)3 30)4 31)2 32)2 33)3 34)4 35)1 36)2 37)2 38)3 39)4 40)2 41)2 42)4

Geography Questions in Telugu Part-2

No comments:

Post a Comment