Chemistry Questions in Telugu Part-9



1. ఒక మూలకం ఒకటి కంటే ఎక్కువ భౌతిక రూపాల్లో ఉండటాన్ని ఏమంటారు?
1) రూపాంతరత
2) విద్రావణీయత
3) స్ఫటికీకరణం
4) అంశికీకరణం

2. కిందివాటిలో ఫాస్ఫరస్ రూపాంతరం కానిది ఏది?
1) తెల్ల ఫాస్ఫరస్
2) ఎర్ర ఫాస్ఫరస్
3) నల్ల ఫాస్ఫరస్
4) ఫాస్ఫీన్

3. అగ్గిపుల్లల తయారీలో ఉపయోగించే ఫాస్ఫరస్ ఏది?
1) తెల్ల ఫాస్ఫరస్
2) నల్ల ఫాస్ఫరస్
3) ఎర్ర ఫాస్ఫరస్
4) పచ్చ ఫాస్ఫరస్

4. ఎలుకలను చంపడానికి ఉపయోగించే పదార్థం ఏది?
1) ఎర్ర భాస్వరం
2) తెల్ల భాస్వరం
3) నల్ల భాస్వరం
4) పచ్చ భాస్వరం

5.చీకట్లో భాస్వరం (ఫాస్ఫరస్)ను ఉంచితే నెమ్మదిగా గాలిలో మండి మెరుస్తుంది. ఈ ప్రక్రియను ఏమంటారు?
1) ఫ్లోరోసెన్స్
2) ఫాస్ఫారిసెన్స్
3) ఫ్లాస్టిసెన్స్
4) ఉత్పతనం

6. భాస్వరాన్ని ఎందులో నిల్వ ఉంచుతారు?
1) గాలి
2) కిరోసిన్
3) నీరు
4) క్లోరోఫాం

7. కిందివాటిలో చీకట్లో మెరిసే పదార్థం ఏది?
1) నైట్రోజన్
2) ఫాస్ఫరస్
3) సిలికాన్
4) కార్బన్

8. కింది వాటిలో బాహ్యణుక స్వభావం కలిగినది?
1) పచ్చ భాస్వరం
2) ఎర్ర భాస్వరం
3) స్కార్లెట్ భాస్వరం
4) నైట్రోజన్

9. వెల్లుల్లి వాసన కలిగిన మూలకం ఏది?
1) కార్బన్
2) సల్ఫర్
3) సోడియం
4) ఫాస్ఫరస్

10. ఫాస్ఫరస్ సంబంధ పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల దవడ ఎముకలు నశిస్తాయి. ఈ వ్యాధిని ఏమంటారు?
1) ఫాసీజా
2) ఫ్లోరోసెస్
3) ఫాస్ఫారిసెన్స్
4) కీలోసిస్

11. పొగల తెరల (Smoke Screen)లో ఉపయోగించే సమ్మేళనం ఏది?
1) ఫాస్ఫారికామ్లం
2) సల్ఫ్యూరికామ్లం
3) ఫాస్ఫీన్
4) అమ్మోనియా

12. శీతల పానీయాల్లో వాడే ఆమ్లం ఏది?
1) హైడ్రోక్లోరికామ్లం
2) ఫాస్ఫారికామ్లం
3) నైట్రికామ్లం
4) సల్ఫ్యూరికామ్లం

13. నావికులు సముద్రంలో వారి ఉనికిని తెలపడానికి ఉపయోగించే ‘హోల్మె సంకేతాల్లో’ వాడే సమ్మేళనం ఏది?
1) కాల్షియం సల్ఫేట్
2) కాల్షియం ఫాస్ఫేట్
3) కాల్షియం ఫాస్ఫైడ్
4) ఫాస్ఫరస్ పెంటాక్సైడ్

14. కిందివాటిలో అగ్గిపెట్టె పక్క భాగంలో ఉండని పదార్థం ఏది?
1) ఎర్ర భాస్వరం
2) ఆంటిమొని సల్ఫైడ్
3) గాజుపొడి
4) పొటాషియం క్లోరేట్

15. కిందివాటిలో ఫాస్ఫరస్ లభించే పదార్థం?
1) గుడ్డు సొన
2) ఎముక మజ్జ
3) మొదడు
4) పైవన్నీ

16. అగ్గిపెట్టెల పరిశ్రమల్లో ప్రధానంగా వాడే మూలకం ఏది?
1) తెల్ల భాస్వరం
2) ఎర్ర భాస్వరం
3) నల్ల భాస్వరం
4) స్కార్లెట్ భాస్వరం

17. అగ్గిపుల్లను గీసినప్పుడు జరిగే ప్రక్రియ?
1) పెట్టె పక్క భాగంలోని ఎర్ర భాస్వరం మండుతుంది
2) అగ్గిపుల్ల చివరలోని ఆంటిమొనీ సల్ఫైడ్‌ను మండిస్తుంది
3) కావలసిన ఆక్సిజన్‌ను పొటాషియం క్లోరేట్ అందిస్తుంది
4) పైవన్నీ

18. అగ్గిపుల్ల తలభాగంలో పొటాషియం క్లోరేట్‌తో పాటు ఏముంటుంది?
1) అల్యూమినియం ట్రై క్లోరైడ్
2) ఆంటిమొనీ ట్రై సల్ఫైడ్
3) బిస్మత్ నైట్రేడ్
4) అల్యూమినియం ఫాస్ఫేట్

19. ఫాస్ఫరస్ పెంటాక్సైడ్ (P2O5) నీటిలో కరిగి ఏర్పరిచే ఆమ్లం ఏది?
1) ఫాస్ఫారికామ్లం
2) పైరో ఫాస్ఫారికామ్లం
3) ఫాస్ఫరస్ ఆమ్లం
4) మెటా ఫాస్ఫారికామ్లం

20. ఎలుకలను చంపడానికి ఉపయోగించే విష పదార్థం ఏది?
1) జింక్ ఫాస్ఫేట్
2) కాల్షియం ఫాస్ఫేట్
3) జింక్ ఫాస్ఫైడ్
4) కాల్షియం ఫాస్ఫైడ్

21. వ్యవసాయంలో ఉపయోగించే ఏ రసాయనాల్లో నైట్రోజన్, భాస్వరం, పొటాషియం ఎక్కువగా ఉంటాయి?
1) ఎరువులు
2) పురుగు మందులు
3) హెర్బిసైడ్‌లు
4) ఏదీకాదు

22. సూపర్ ఫాస్ఫేట్ ఆఫ్ లైమ్ అనేది ఒక..?
1) నత్రజని ఎరువు
2) ఫాస్ఫాటిక్ ఎరువు
3) పొటాషియం ఎరువు
4) కాల్షియం ఎరువు

23. ఎముకల్లో ఫాస్ఫరస్ ఏ రూపంలో ఉంటుంది?
1) కాల్షియం ఫాస్ఫైడ్
2) కాల్షియం ఫాస్ఫేట్
3) కాల్షియం ఫాస్పైట్
4) సోడియం ఫాస్ఫైట్

24. కిందివాటిలో రసాయన ఎరువుల్లో ఉండని మూలకం ఏది? 
1) నైట్రోజన్ (N)
2) ఫాస్ఫరస్ (P)
3) పొటాషియం (K)
4) క్లోరిన్ (C)

25. బేకింగ్ పరిశ్రమల్లో బేకింగ్ పౌడర్‌తోపాటు, పిండిని గుల్లగా చేయడానికి ఉపయోగించే పదార్థం ఏది?
1) ఫాస్ఫారికామ్లం
2) కాల్షియం డై హైడ్రోజన్ ఫాస్ఫేట్
3) కాల్షియం ఫాస్ఫేట్
4) కాల్షియం ఫాస్ఫైడ్

26. పంటి ‘ఎనామిల్’లో ఉండే పదార్థం ఏది?
1) కాల్షియం హైడ్రాక్సీ ఎపటైట్
2) కాల్షియం డై హైడ్రోజన్ ఫాస్ఫేట్
3) కాల్షియం ఫ్లోరైడ్
4) ఏదీకాదు

27. మానవ శరీరంలో కాల్షియం తర్వాత అత్యధికంగా ఉండే ఖనిజం ఏది?
1) సల్ఫర్
2) ఫాస్ఫరస్
3) సిలికాన్
4) సెలినియం

28. మానవ శరీరంలో ఫాస్ఫరస్ ఏ భాగంలో ఉంటుంది?
1) ఎముకలు
2) దంతాలు
3) కణజాలం
4) పైవన్నీ

29. శరీరంలో విటమిన్ ‘బి’ సమర్థ వినియోగానికి అవసరమైన మూలకం ఏది?
1) ఫాస్ఫరస్
2) సెలినియం
3) ఐరన్
4) మెగ్నీషియం

30. పళ్లపై గారను తొలగించి వాటిని తెల్లగా చేయడానికి ఉపయోగించే ఆమ్లం ఏది?
1) హైడ్రోక్లోరికామ్లం
2) నైట్రికామ్లం
3) సల్ఫ్యూరికామ్లం
4) ఫాస్ఫారికామ్లం

31. రక్తం గడ్డ కట్టడానికి, కండరాలు సంకోచించడానికి ఏ లోహం అవసరం?
1) ఇనుము(ఐరన్)
2) రాగి (కాపర్)
3) సోడియం
4) కాల్షియం

32. మొక్కల్లోని ఆకుపచ్చ రంగుకు కారణం పత్రహరితం (క్లోరోఫిల్) అనే సంక్లిష్ట పదార్థం. ఇందులో ఉండే లోహం ఏది?
1) ఐరన్
2) కాల్షియం
3) మెగ్నీషియం
4) కోబాల్ట్

33. సున్నపురాయి రసాయన నామం?
1) సోడియం కార్బొనేట్ (Na2CO3)
2) కాల్షియం కార్బొనేట్ (CaCO3)
3) కాల్షియం హైడ్రాక్సైడ్ (Ca(OH)2)
4) కాల్షియం ఆక్సైడ్ (CaO)

34. సున్నపురాయి దేని వల్ల చలువరాయి (మార్బుల్)గా మారుతుంది?
1) అధిక ఉష్ణోగ్రత
2) అధిక వర్షపాతం
3) అధిక పీడనం (ఒత్తిడి)
4) అల్ప పీడనం

35.టూత్ పేస్టుల్లో ఉపయోగించేవి?
1) CaCO3, CaO
2) CaCO3, MgCO3
3) CaCO3, Ca(OH)2
4) CaO, Ca(OH)2

36. ఎముకల పొడిలో ఉండే కాల్షియం సమ్మేళనం ఏది?
1) కాల్షియం సల్ఫేట్
2) కాల్షియం ఫాస్ఫేట్
3) కాల్షియం కార్బొనేట్
4) కాల్షియం ఆక్సైడ్

37. కిందివాటిలో భిన్నమైంది ఏది?
1) చలువరాయి
2) సున్నపురాయి
3) సుద్ద
4) బొగ్గు

38. కిందివాటిలో సరికాని జత ఏది?
1) సున్నపురాయి - కాల్షియం కార్బొనేట్ (CaCO3)
2) పొడిసున్నం - కాల్షియం ఆక్సైడ్ (CaO)
3) తడిసున్నం - కాల్షియం హైడ్రాక్సైడ్ (Ca(OH)2)
4) సున్నపు తేట - కాల్షియం సల్ఫేట్ (CaSO4)

39. ఇసుక, నీరు, సిమెంట్ (లేదా సున్నం) కలిసిన మిశ్రమానికి పేరు?
1) గచ్చు (మోర్టార్)
2) కాంక్రీట్
3) గట్టితనం ఉన్న కాంక్రీట్
4) తుప్పు

40. కిందివాటిలో కాల్షియం కార్బొనేట్ ఉపయోగం కానిది?
1) మేలు రకం కాగితం తయారీలోవాడతారు
2) టూత్‌పేస్టులో సున్నితమైన అపఘర్షకంగా వాడతారు
3) ‘చ్యూయింగ్ గమ్’లో ఒక అనుఘటకంగా ఉపయోగిస్తారు
4) ఎముకలు విరిగినప్పుడు కట్లు కట్టడానికి వాడతారు

41. కిందివాటిలో ఆమ్ల విరోధిగా వాడకూడని పదార్థం?
1) మెగ్నీషియం హైడ్రాక్సైడ్
2) కాల్షియం హైడ్రాక్సైడ్
3) కాల్షియం సల్ఫేట్
4) సోడియం బై కార్బొనేట్

42. నీటిని కలిపితే గట్టిపడే ఒక విశేష ధర్మాన్ని చూపే కాల్షియం పదార్థం ఏది?
1) సున్నపురాయి
2) ప్లాస్టర్ ఆఫ్ పారిస్
3) చలువరాయి
4) బ్లీచింగ్ పౌడర్

43.సిమెంట్ పరిశ్రమకు ప్రధాన ముడిసరకు?
1) సున్నపురాయి
2) ఇనుప ఖనిజం
3) చలువరాయి
4) ఫ్లై యాష్

44. కాల్షియం అధికంగా ఉండే ఆహార పదార్థం?
1) పాలు
2) మాంసం
3) నారింజ పండ్లు
4) టీ, కాఫీ

45.ప్లాస్మాలో ఉండే లోహ అయాన్‌లు ఏవి?
1) కాల్షియం
2) సోడియం
3) పొటాషియం
4) మెగ్నీషియం

46. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ అనేది ..?
1) కాల్షియం ఫాస్ఫేట్
2) కాల్షియం కార్బొనేట్
3) కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్
4) కాల్షియం క్లోరైడ్

47. మానవ శరీరంలో కాల్షియం పరిమాణం (సుమారుగా) ఎంత?
1) 25 g
2) 1200 g
3) 5000 g- -
4) 25 mg

48. ఇళ్లకు వేసే సున్నం, సున్నపుతేటలో ఉండేది?
1) కాల్షియం కార్బొనేట్
2) కాల్షియం ఆక్సైడ్
3) కాల్షియం హైడ్రాక్సైడ్
4) కాల్షియం క్లోరైడ్

49. తడి సున్నం (స్లేక్‌డ్ లైమ్)ను నీటిలో అవలంబనం చేస్తే వచ్చే సున్నపు తేటను పాన్ తయారీలో తమలపాకుపై రాస్తారు. ఈ సున్నపు తేటకు మరో పేరు?
1) మిల్క్ ఆఫ్ లైమ్
2) బట్టర్ మిల్క్
3) మిల్క్ ఆఫ్ సోయా
4) మిల్క్ ఆఫ్ మెగ్నీషియా

50. పోర్‌‌టలాండ్ సిమెంట్‌లోని ప్రధాన అనుఘటకాలేవి?
1) సున్నం, బొగ్గు, ఫ్లై యాష్
2) సున్నం, అల్యూమినా, జింక్
3) సున్నం, సిలికా, అల్యూమినా
4) సున్నం, అల్యూమినా, ఫ్లై యాష్

51. ముత్యంలో ప్రధాన అనుఘటకాలేవి?
1) సోడియం కార్బొనేట్, కాల్షియం కార్బొనేట్
2) కాల్షియం కార్బొనేట్, మెగ్నీషియం కార్బొనేటు
3) కాల్షియం ఆక్సైడ్, అల్యూమినియం ఆక్సైడ్
4) కాల్షియం సల్ఫేట్, కాల్షియం కార్బొనేట్

52. కిందివాటిలో ఏది లోపించడం వల్ల ఎముకలు, దంతాలు బలహీనపడతాయి?
1) కాల్షియం
2) ఫాస్ఫరస్
3) ఫ్లోరైడ్
4) పైవన్నీ

53. సిమెంట్ వేటి మిశ్రమం?
1) కాల్షియం కార్బొనేట్, కాల్షియం సిలికేట్
2) కాల్షియం సిలికేట్, కాల్షియం అల్యూమినేట్
3) ఇసుక, సున్నం, నీరు
4) జిప్సం, ప్లాస్టర్ ఆఫ్ పారిస్

54.మార్బుల్ రసాయన సంకేతం ఏది?
1) Ca(OH)2
2) CaCO3
3) CaO
4) CaHCO3

55. ఎమరాల్డ్‌లో ఉండే ప్రధాన మూలకం ఏది?
1) కాల్షియం
2) మెగ్నీషియం
3) బెరీలియం
4) సిలికాన్

56. సిమెంట్‌కు జిప్సం కలపడానికి కారణం?
1) గట్టిదనం కోసం
2) బూడిద రంగు కోసం
3) నీరు కలిపినప్పుడు ప్రారంభ దశలో నెమ్మదిగా సెట్టింగ్ జరగడానికి
4) బరువు తూగడానికి

57. ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌ను ఏ పదార్థం నుంచి తయారు చేయవచ్చు?
1) తడిసున్నం
2) జిప్సం
3) సిమెంట్
4) మార్బుల్

58. సముద్రపు నీటి నుంచి సంగ్రహించే లోహం?
1) బంగారం
2) సిల్వర్
3) మెగ్నీషియం
4) మెర్క్యూరీ

59. బాణాసంచా కాల్చినప్పుడు మిరుమిట్లు గొలిపే తెల్లని కాంతినిచ్చే లోహం ఏది?
1) మెగ్నీషియం
2) కాల్షియం
3) స్ట్రాన్షియం
4) బేరియం

60. టపాకాయలు కాల్చినప్పుడు సింధూర ఎరుపు రంగునిచ్చే లోహం ఏది?
1) మెగ్నీషియం
2) కాల్షియం
3) బేరియం
4) స్ట్రాన్షియం

61. నీటి తాత్కాలిక కాఠిన్యానికి కారణమైన ఆయాన్‌లు ఏవి?
1) బైకార్బొనేట్లు
2) క్లోరైడులు
3) సల్ఫేట్లు
4) పైవన్నీ

62. నీటికి శాశ్వత కాఠిన్యాన్ని కలిగించేవి?
1) క్లోరైడ్‌లు
2) సల్ఫేట్లు
3) 1, 2
4) ఏదీకాదు

63. కఠినజలంలో ఉండే లోహ ఆయాన్‌లు?
1) కాల్షియం, మెగ్నీషియం
2) సోడియం, పొటాషియం
3) కాల్షియం, బేరియం
4) సోడియం, జింకు

64. కిందివాటిలో ఏ సమ్మేళనం ఉండటం వల్ల నీటికి శాశ్వత కాఠిన్యత వస్తుంది?
1) కాల్షియం సల్ఫేట్
2) కాల్షియం బైకార్బొనేట్
3) సోడియం బైకార్బొనేట్
4) మెగ్నీషియం బై కార్బొనేట్

65. సున్నపురాయిపై ఆధారపడే పరిశ్రమ ఏది?
1) గాజు
2) సిమెంట్
3) 1, 2
4) స్టీల్

ANSWERS:
1)1 2)4 3)3 4)2 5)2 6)3 7)2 8)2 9)4 10)1 11)3 12)2 13)3 14)4 15)4 16)2 17)4 18)2 19)1 20)3 21)1 22)2 23)2 24)4 25)2 26)1 27)2 28)4 29)1 30)4 31)4 32)3 33)2 34)3 35)2 36)2 37)4 38)4 39)1 40)4 41)3 42)2 43)1 44)1 45)1 46)3 47)2 48)3 49)1 50)3 51)2 52)4 53)2 54)2 55)3 56)3 57)2 58)3 59)1 60)4 61)1 62)3 63)1 64)1 65)3

No comments:

Post a Comment