Chemistry Questions in Telugu Part-8



1. పరమాణువులో ఉండే ప్రాథమిక కణాలేవి?
i. ఎలక్ట్రాన్‌లు
ii. ప్రోటాన్‌లు
iii. న్యూట్రాన్‌లు
1) i, ii మాత్రమే
2) ii, iii మాత్రమే
3) i, iii మాత్రమే
4) i, ii, iii

2. ‘విభజించడానికి వీలుకాని అతి చిన్న కణమే పరమాణువు’ అని ప్రతిపాదించినవారు?
1) రూథర్‌ఫర్డ్
2) స్టోనీ
3) గోల్డ్ స్టీన్
4) జాన్ డాల్టన్

3. పరమాణువును ‘పుచ్చ పండు’తో పోల్చినవారు?
1) డాల్టన్
2) రూథర్‌ఫర్డ్
3) జె.జె. థామ్సన్
4) చాడ్విక్

4.పరమాణువులో ఎలక్ట్రాన్‌ల ఉనికిని కనుగొన్న శాస్త్రవేత్త?
1) రూథర్‌ఫర్డ్
2) జె.జె. థామ్సన్
3) చాడ్విక్
4) డాల్టన్

5.గోల్డ్ స్టీన్ ఏ కణాలను కనుగొన్నారు?
1) ఎక్స్ కిరణాలు
2) ఎలక్ట్రాన్‌లు
3) ప్రోటాన్‌లు
4) న్యూట్రాన్‌లు

6. ‘న్యూట్రాన్’లను కనుగొన్న శాస్త్రవేత్త?
1) చాడ్విక్
2) రాంట్‌జెన్
3) స్టోనీ
4) థామ్సన్

7. కిందివాటిలో ధనావేశ కణాలేవి?
1) ఎలక్ట్రాన్‌లు
2) ప్రోటాన్‌లు
3) న్యూట్రాన్‌లు
4) ఎక్స్ - కిరణాలు

8. కిందివాటిలో ‘తటస్థ కణాలు’ ఏవి?
1) ఎలక్ట్రాన్‌లు
2) ప్రోటాన్‌లు
3) న్యూట్రాన్‌లు
4) పైవేవీకాదు

9. a - కణం అంటే..?
1) హీలియం పరమాణువు
2) హీలియం కేంద్రకం
3) హీలియం అణువు
4) హైడ్రోజన్ కేంద్రకం

10. ‘సూర్యుడి చుట్టూ గ్రహాలు పరిభ్రమించినట్లు, కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్‌లు తిరుగుతుంటాయి’ అని ప్రతిపాదించినవారు?
1) రూథర్‌ఫర్డ్
2) చాడ్విక్
3) న్యూటన్
4) డాల్టన్

11. ‘పరమాణు కేంద్రకం’లో ఉండే కణాలేవి?
i. ఎలక్ట్రాన్‌లు
ii. ప్రోటాన్‌లు
iii. న్యూట్రాన్‌లు
1) i, ii మాత్రమే
2) ii, iii మాత్రమే
3) i, iii మాత్రమే
4) i, ii, iii

12. కిందివాటిలో విద్యుదయస్కాంత తరంగాల రూపంలో ఉండే కిరణాలేవి?
1) ఆల్ఫా
2) బీటా
3) ఎక్స్ - కిరణాలు
4) పైవన్నీ

13. టంగ్‌స్టన్, మాలిబ్డినమ్ లాంటి భారలోహాలను వేగంగా చలించే ఎలక్ట్రాన్‌లతో ఢీ కొట్టించినప్పుడు ఏ కిరణాలు ఉత్పత్తి అవుతాయి?
1) ఎక్స్-కిరణాలు
2) ఆల్ఫా కిరణాలు
3) బీటా కిరణాలు
4) గామా కిరణాలు

14. జతపరచండి.
జాబితా - I జాబితా - II
a) ఎక్స్ - కిరణాలు i) హెన్రీ బెక్వరల్
b) రేడియోధార్మికత ii) రాంట్‌జెన్
c) పరమాణు నమూనా iii) ఐన్‌స్టీన్
d) కాంతి విద్యుత్ఫలితం iv) నీల్స్‌బోర్
a b c d
1) i ii iii iv
2) ii i iii iv
3) ii i iv iii
4) iv ii iii i

15. అతి తక్కువ అయనీకరణ శక్మం కలిగిన లోహ తలంపై తగిన పౌనఃపున్యం ఉన్న కాంతి పడినప్పుడు, ఆ లోహ తలం నుంచి ఎలక్ట్రాన్‌లు బయటకు వచ్చే ప్రక్రియను ఏమంటారు?
1) కాంతి విద్యుత్ ఫలితం
2) రేడియోధార్మికత
3) కేంద్రక విఘటనం
4) రామన్ ఫలితం

16. ఒకే పరమాణు సంఖ్య, వేర్వేరు ద్రవ్యరాశి సంఖ్యలు ఉన్న పరమాణువులను ఏమంటారు?
1) ఐసోబార్‌లు
2) ఐసోటోన్‌లు
3) ఐసోటోప్‌లు
4) ఐసోడయఫర్‌లు

17. ఐసోటోప్‌లలో ఏ కణాల సంఖ్య వేరుగా ఉంటుంది?
1) ఎలక్ట్రాన్‌లు
2) ప్రోటాన్‌లు
3) న్యూట్రాన్‌లు
4) పైవన్నీ

18. Na-23, Na-24 అనేవి ‘సోడియం’కు సంబంధించిన...?
1) ఐసోటోప్‌లు
2) ఐసోటోన్‌లు
3) ఐసోడయఫర్‌లు
4) ఐసోమర్‌లు

19. రేడియోధార్మికత ప్రమాణం ఏది?
1) క్యూరీ
2) బెక్వరల్
3) రూథర్‌ఫర్డ్
4) పైవన్నీ

20. కిందివాటిలో అత్యంత ప్రమాదకర కిరణాలు ఏవి?
1) దృగ్గోచర కాంతి కిరణాలు
2) రేడియో తరంగాలు
3) పరారుణ కిరణాలు
4) కాస్మిక్ కిరణాలు

21. ఒక వస్తువు త్రిమితీయ ప్రతిబింబాన్ని నమోదు చేసే ‘హోలోగ్రఫీ’ విధానంలో ఏ కాంతిని ఉపయోగిస్తారు?
1) UV
2) IR
3) లేజర్
4) కాస్మిక్

22. కిందివాటిలో హైడ్రోజన్ ఐసోటోప్ ఏది?
1) సాధారణ హైడ్రోజన్ (H)
2) భార హైడ్రోజన్ (డ్యుటీరియం - D)
3) ట్రిటియం (T)
4) పైవన్నీ

23. హైడ్రోజన్ (H), డ్యుటీరియం (D), ట్రిటియం (T)లలో ఉండే న్యూట్రాన్‌ల సంఖ్య వరసగా..?
1) 1, 2, 3
2) 1, 1, 1
3) 0, 1, 2
4) 2, 1, 0

24. కిందివాటిలో రేడియోధార్మికతకు సంబంధించి సరికాని వాక్యం ఏది?
1) రేడియోధార్మికత.. పరమాణు కేంద్రకానికి సంబంధించిన విషయం
2) రేడియోధార్మిక పదార్థం స్వచ్ఛందంగా ఆల్ఫా, బీటా, గామా కిరణాలను వెదజల్లుతూ ఉంటుంది
3) రేడియోధార్మికతను హెన్రీ బెక్వరల్ కనుగొన్నారు
4) ఉష్ణోగ్రత, పీడనాలతో రేడియోధార్మికత మారుతుంది

25. కిందివాటిలో గామా(g) కిరణాలకు సంబంధించి సరైన వాక్యం ఏది?
i. కోబాల్ట్-60 కేంద్రకం మంచి ఆధారం
ii. కేన్సర్ చికిత్సలో ఉపయోగిస్తారు
iii. ఎగుమతికి ఉద్దేశించిన గింజధాన్యాలు, కాయగూరలు, పండ్లను ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి గామా కిరణాల (Gamma irradiation)కు గురిచేస్తారు
1) ii, iii మాత్రమే
2) i, ii మాత్రమే
3) i, iii మాత్రమే
4) i, ii, iii

26. భూమి, శిలల వయసును నిర్ధారించడానికి ఉపయోగపడే ఐసోటోప్ ఏది?
1) కార్బన్
2) యురేనియం
3) కోబాల్ట్
4) గోల్డ్

27. శిలాజాల వయసును నిర్ధారించడానికి ఉపయోగపడే ఐసోటోప్ ఏది?
1) కార్బన్ -12
2) రేడియో కార్బన్ (C - 14)
3) సోడియం - 23
4) యురేనియం - 235

28. శరీరంలో రక్తం గడ్డకట్టిన భాగాలను గర్తించడానికి ఉపయోగపడే ఐసోటోప్ ఏది?
1) సోడియం - 23
2) సోడియం - 24
3) కార్బన్ -14
4) అయోడిన్ -131

29. రేడియో ఫాస్ఫరస్ (P - 32)ను దేని కోసం ఉపయోగిస్తారు?
1) మరణించినవారి వయసు నిర్ధారణకు
2) థైరాయిడ్ గ్రంథి పనితీరును పరిశీలించడానికి
3) కేన్సర్ కణాల నిర్మూలనకు
4) మొక్కల వేర్లు భూమి నుంచి ఫాస్ఫరస్ గ్రహించే విధానం తెలుసుకోవడానికి

30. కేన్సర్ కణాల నిర్మూలనకు చేసే ‘రేడియోథెరఫీ’ చికిత్సలో ఉపయోగపడేది?
1) కోబాల్ట్ - 60
2) సోడియం -24
3) అయోడిన్ - 131
4) యురేనియం - 233

31. కిందివాటిలో రేడియోధార్మికత నుంచి రక్షణ కల్పించే లోహం ఏది?
1) యురేనియం
2) థోరియం
3) కోబాల్ట్
4) లెడ్

32. ‘లిటిల్ బాయ్’, ‘ఫ్యాట్ మ్యాన్’ అనేవి..?
1) బ్యాడ్మింటన్, బాక్సింగ్ ప్లేయర్‌ల పేర్లు
2) శరీర బరువు నియంత్రణకు సంబంధించిన టెక్నిక్‌లు
3) టామ్ అండ్ జెర్రీ కార్టూన్ సీరియల్‌లో పాత్రల పేర్లు
4) రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌లోని హిరోషిమా, నాగసాకి నగరాలపై వేసిన పరమాణు బాంబుల పేర్లు

33. పరమాణు బాంబును ఏ సూత్రం ఆధారంగా తయారు చేశారు?
1) కేంద్రక సంలీనం
2) కేంద్రక విచ్ఛిత్తి
3) విద్యుద్విశ్లేషణ
4) రసాయన విచ్ఛిత్తి

34. ‘అణు విద్యుత్’ ఉత్పాదన చేసే అణురియాక్టర్ల నిర్మాణంలో ఇమిడి ఉన్న సూత్రం?
1) అనియంత్రిత కేంద్రక విచ్ఛిత్తి చర్య
2) ఉత్తేజిత కేంద్రక విచ్ఛిత్తి చర్య
3) నియంత్రిత కేంద్రక విచ్ఛిత్తి చర్య
4) రసాయన ద్వంద్వ వియోగ చర్య

35. మెదడులోని కణతులను గుర్తించడానికి, థైరాయిడ్ చికిత్సలో ఉపయోగించే ఐసోటోప్ ఏది? 1) అయోడిన్ -131
2) సోడియం - 24
3) యురేనియం - 238
4) థోరియం - 236

36. ‘యెల్లో కేక్’ అంటే ఏమిటి?
1) కూల్ కేక్
2) పసుపు పట్టీ
3) యురేనియం ఆక్సైడ్
4) సోడియం ఆక్సైడ్

37. ‘న్యూక్లియర్ ఫ్యుయల్ కాంప్లెక్స్’ ఎక్కడ ఉంది?
1) విశాఖపట్నం
2) అమరావతి
3) హైదరాబాద్
4) మణుగూరు

38. నక్షత్రాల్లోని శక్తికి ఆధార సూత్రం ఏది?
1) కేంద్రకం సంలీనం
2) కేంద్రక విచ్ఛిత్తి
3) కేంద్రక విఘటనం
4) కేంద్రక చలనం

39. ‘మోనోజైట్’ ఇసుక నుంచి ప్రధానంగా లభించేది?
1) యురేనియం
2) థోరియం
3) క్రోమియం
4) మాలిబ్డినం

40.అణు రియాక్టర్‌లలో ‘మితకారి’ విధి?
1) విస్ఫోటంగా మారే శృంఖల చర్యను నియంత్రించడానికి న్యూట్రాన్‌ల వేగాన్ని తగ్గిస్తుంది
2) న్యూట్రాన్‌లను సరఫరా చేస్తుంది
3) కేంద్రకాలను విడదీస్తుంది
4) కేంద్రకాన్ని న్యూట్రాన్‌లతో వేగంగా తాడనం చెందేలా చేస్తుంది

41. కిందివాటిలో ‘మితకారి’గా పనిచేసేవి?
i. గ్రాఫైట్
ii. భారజలం
iii. హైడ్రోజన్ పెరాక్సైడ్
1) i మాత్రమే
2) i, ii మాత్రమే
3) ii, iii మాత్రమే
4) పైవన్నీ

42. బ్రీడర్ రియాక్టర్‌లలో యురేనియం-23 ను ఉపయోగించి విచ్ఛిన్న సామర్థ్యం ఉన్న ఏ కేంద్రకాన్ని ఉత్పిత్తి చేస్తారు?
1) యురేనియం - 235
2) ప్లుటోనియం - 238
3) థోరియం - 232
4) యురేనియం - 237

43. అణురియాక్టర్‌లలోశృంఖల చర్యను నియంత్రించడానికి, విచ్ఛిత్తి ప్రక్రియలో ఉత్పత్తి అయిన న్యూట్రాన్‌లను శోషణం చేసుకోవడానికి ఉపయోగించే నియంత్రణ కడ్డీల తయారీకి ఉపయోగపడేది?
i. బోరాన్
ii. కాడ్మియం
iii. యురేనియం
iv. లెడ్
1) i, ii
2) i, iii
3) i, iii, iv
4) పైవన్నీ

ANSWERS:
1)4 2)4 3)3 4)2 5)3 6)1 7)2 8)3 9)2 10)1 11)2 12)3 13)1 14)3 15)1 16)3 17)3 18)1 19)4 20)4 21)3 22)4 23)3 24)4 25)4 26)2 27)2 28)2 29)4 30)1 31)4 32)4 33)2 34)3 35)1 36)3 37)3 38)1 39)2 40)1 41)2 42)2 43)1

No comments:

Post a Comment