Chemistry Questions in Telugu Part-7



1. కింది వాటిలో హాలోజన్ కానిది ఏది?
1) ఫ్లోరిన్
2) క్లోరిన్
3) గ్జినాన్
4) అయోడిన్

2. అయోడిన్‌కు ప్రధాన ఆధారం?
1) సముద్ర మొక్కలు
2) నదీజలం
3) బావుల నీరు
4) బొగ్గు గనులు

3. తళతళా మెరిసే అలోహం ఏది?
1) ఫాస్ఫరస్
2) అయోడిన్
3) సల్ఫర్
4) లెడ్

4. ఉత్పతనం చెందే గుణం ఉన్న హాలోజన్?
1) అయోడిన్
2) బ్రోమిన్
3) క్లోరిన్
4) ఫ్లోరిన్

5.గది ఉష్ణోగ్రత వద్ద ద్రవరూపంలో ఉండే హాలోజన్ ఏది?
1) ఫ్లోరిన్
2) బ్రోమిన్
3) క్లోరిన్
4) అయోడిన్

6. ఆవర్తన పట్టికలోని మూలకాలన్నింటిలో అత్యధిక రుణ విద్యుదాత్మకత ఉన్న మూలకం ఏది?1) ఫ్లోరిన్
2) క్లోరిన్
3) బ్రోమిన్
4) అయోడిన్

7. ఆహారంలో రుచి కోసం వాడే క్లోరిన్ సమ్మేళనం ఏది?
1) సోడియం క్లోరేట్
2) బ్లీచింగ్ పౌడర్
3) సోడియం క్లోరైడ్
4) పొటాషియం క్లోరైడ్

8. టేబుల్ సాల్ట్ ఫార్ములా -
1) Na2CO3
2) NaCl
3) NaHCO3
4) CaOCl2

9. పాలల్లో స్టార్చ్ (గంజి పొడి)తో కల్తీ జరిగితే.. ఆ పాలకు అయోడిన్ కలిపినప్పుడు వచ్చే రంగు ఏది?
1) నీలం
2) ఆరెంజ్
3) ఎరుపు
4) పసుపు

10. థైరాయిడ్ హార్మోన్‌ను నియంత్రించే పదార్థం ఏది?
1) సల్ఫర్
2) అయోడిన్
3) ఫాస్ఫరస్
4) క్లోరిన్

11. కింది వాటిలో దేనికి యాంటీ సెప్టిక్ ధర్మం ఉంటుంది?
1) బ్రోమిన్
2) అయోడిన్
3) ఫ్లోరిన్
4) ఏదీకాదు

12. నీటిని క్రిమిరహితం చేయడానికి ఉపయోగించే వాయువు ఏది?
1) ఫ్లోరిన్
2) క్లోరిన్
3) బ్రోమిన్
4) ఆక్సిజన్

13.విరంజన చూర్ణం (బ్లీచింగ్ పౌడర్) ఘాటైన వాసన రావడానికి.. అది విడుదల చేసే ఏ వాయువు కారణం?
1) క్లోరిన్
2) ఫ్లోరిన్
3) ఆక్సిజన్
4) హైడ్రోజన్

14. గాజుపై డిజైన్‌లు వేయడానికి (ఎచ్చింగ్) ఉపయోగపడే పదార్థం?
1) హైడ్రో ఫ్లోరిక్ ఆమ్లం (HF)
2) హైడ్రో క్లోరిక్ ఆమ్లం (HCl)
3) నైట్రికామ్లం (HNO3)
4) ఏదీకాదు

15. బంగారాన్ని కరిగించడానికి ఉపయోగించే ‘రసరాజం (ఆక్వారీజియా)’ అనేది 1 : 3 నిష్పత్తిలో ఏయే గాఢ ఆమ్లాల మిశ్రమం?
1) HCl, HNO3
2) HNO3, HF
3) HCl, H2SO4
4) HNO3, HCl

16. మనం తీసుకున్న ఆహారం జీర్ణమవడానికి ఉదరంలో ఉత్పత్తయ్యే హైడ్రో క్లోరికామ్లం ముఖ్యమైంది. ఆహారంలో ఏ పదార్థం లోపిస్తే ఈ ఆమ్లం ఉత్పత్తి కష్టమవుతుంది?
1) చక్కెర (సుక్రోజ్)
2) టేబుల్ సాల్ట్ (సోడియం క్లోరైడ్)
3) నూనెలు
4) ప్రోటీన్లు

17. దంతక్షయాన్ని నిరోధించడానికి కనీస మోతాదులో (< 1.5 ppm) ఉండాల్సిన పదార్థం?
1) క్లోరైడ్
2) అయోడైడ్
3) ఫ్లోరైడ్
4) సోడియం

18. ఫ్లోరైడ్ గాఢత 3 ppm (3 mg/L) కంటే ఎక్కువైతే ఏ వ్యాధి వస్తుంది?
1) కలరా
2) గాయిటర్
3) ఫ్లోరోసిస్
4) మినిమేటా

19. నూలు, కలపగుజ్జును విరంజనం చేయడానికి ఉపయోగించే పదార్థం ఏది?
1) క్లోరిన్
2) ఫ్లోరిన్
3) అయోడిన్
4) సల్ఫర్

20. కింది వాటిలో రేడియోధార్మిక హాలోజన్ ఏది?
1) క్లోరిన్
2) ఫ్లోరిన్
3) బ్రోమిన్
4) ఆస్టటీన్

21. కింది వాటిలో క్లోరిన్ అనుఘటకంగా ఉన్న విష స్వభావం కలిగిన వాయువు ఏది?
1) ఫాస్‌జీన్
2) బాష్పవాయువు
3) మస్టర్డ్ వాయువు
4) పైవన్నీ

22. టెఫ్లాన్ అనే పదార్థం దేని పాలిమర్?
1) ఇథిలీన్
2) ప్రొపిలీన్
3) టెట్రా ఫ్లోరో ఇథిలీన్
4) టెట్రా క్లోరో ఇథిలీన్

23. హరిత గృహ ప్రభావానికి కారణమైన ప్రస్తుతం నిషేధించిన.. క్లోరోఫ్లోరో కార్బన్లను వేటిలో ప్రధానంగా వినియోగించారు?
1) రిఫ్రిజిరేటర్లు
2) టెలివిజన్‌లు
3) ఫ్లోరోసెంట్ ట్యూబులు
4) ఫిలమెంట్ బల్బులు

24. క్లోరోఫ్లోరో కార్బన్‌ల సాధారణ నామం?
1) LPG
2) ఫ్రియాన్‌లు
3) టెఫ్లాన్
4) గ్లాస్

25. ఫొటోగ్రాఫిక్ ప్లేట్లలో ఉపయోగించే హాలైడ్ ఏది?
1) సోడియం హాలైడ్
2) సిల్వర్ హాలైడ్
3) పొటాషియం హాలైడ్
4) కాల్షియం హాలైడ్

26. నియోప్రీన్ రబ్బరు మోనోమర్ ఏది?
1) వినైల్ క్లోరైడ్
2) ఎసిటలీన్
3) క్లోరోప్రీన్
4) క్లోరోక్వీన్

27.జతపరచండి.
జాబితా - I జాబితా - II
A) బ్లీచింగ్ పౌడర్ i) CaCl2
B) ఫాస్‌జీన్ ii) CHCl3
C) క్లోరో పిక్రిన్ iii) CaOCl2
D) క్లోరోఫాం iv) CCl3. NO2
A B C D
1) i ii iii iv
2) iii iv ii i
3) iv i ii iii
4) iii i iv ii

28.జంతువుల జీర్ణక్రియలో పాల్గొని విసర్జితం కాకుండా కొవ్వులో ఉండిపోతుందనే కారణంతో నిషేధించిన ప్రసిద్ధ క్రిమిసంహారిణి DDT ఏ హాలోజన్ ఉత్పన్నం?
1) ఫ్లోరిన్
2) క్లోరిన్
3) బ్రోమిన్
4) అయోడిన్

29. ఫ్లోరిడేటెడ్ టూత్‌పేస్ట్‌లలో వాడే సమ్మేళనం?
1) NaF
2) NaCl
3) CaF2
4) KF

30. లోహ క్షయాన్ని నిరోధించే ప్లాస్టిక్ లేదా నాన్‌స్టిక్ వంట పాత్రలకు ఏ పదార్థంతో కోటింగ్ చేస్తారు?
1) పాలిస్టైరీన్
2) రబ్బరు
3) టెరిలీన్
4) టెఫ్లాన్

31. భారీ పరిశ్రమల్లో గ్రాఫైట్‌తో పాటు కందెనగా ఉపయోగించే పదార్థం ఏది?
1) గ్రీజు
2) బయోడీజిల్
3) టెఫ్లాన్
4) డాల్డా

32. సోడియం క్లోరైడ్ జలద్రావణాన్ని ఏమంటారు?
1) బ్రైన్ ద్రావణం
2) క్లోరిన్ జలం
3) కాస్టిక్ సోడా ద్రావణం
4) కఠిన జలం

33. ద్రవరూపంలో ఉండే అలోహం ఏది?
1) క్లోరిన్
2) పాదరసం
3) హీలియం
4) బ్రోమిన్

34. నీటికి కొద్ది మోతాదులో క్లోరిన్‌ను కలిపితే, అది..?
1) నీటిని శుద్ధిచేస్తుంది
2) బ్యాక్టీరియాను చంపుతుంది
3) తాగడానికి సురక్షితమైంది
4) పైవన్నీ

35. కింది వాటిలో ఎక్కువ ఆమ్లత్వం కలిగిన ఆమ్లం ఏది?
1) HF
2) HCl
3) HBr
4) HI

36. క్లోరిన్ విరంజనకారిగా ఎప్పుడు పనిచేస్తుంది?
1) పొడిగాలి సమక్షంలో
2) తేమ ఉన్నప్పుడు
3) సూర్యరశ్మి సమక్షంలో
4) స్వచ్ఛమైన ఆక్సిజన్ సమక్షంలో

37. క్లోరిన్, క్లోరిన్ డై అక్సైడ్‌ల మిశ్రమం విరంజనకారిగా పనిచేస్తుంది. ఈ మిశ్రమాన్ని ఏమని పిలుస్తారు?
1) బ్లీచింగ్ పౌడర్
2) వాషింగ్ పౌడర్
3) యూక్లోరిన్
4) డై క్లోరిన్

38. కింది వాటిలో క్లోరిన్ విరంజన ధర్మానికి కారణమైంది ఏది?
1) ఆక్సీకరణం
2) క్షయకరణం
3) క్లోరినేషన్
4) హైడ్రోజినేషన్

39. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో U235 ఐసోటోప్‌ను ఉపయోగించి పరమాణు బాంబు తయారీలో.. యురేనియం సంగ్రహణకు ఉపయోగించిన హాలోజన్ ఏది?
1) ఫ్లోరిన్
2) క్లోరిన్
3) బ్రోమిన్
4) అయోడిన్

40. క్రిమిసంహారిణిగా ఉపయోగించే బ్రోమిన్ సమ్మేళనం ఏది?
1) మిథైల్ బ్రోమైడ్
2) బ్రోమో బెంజీన్
3) ఇథైల్ బ్రోమైడ్
4) పినసైల్ బ్రోమైడ్

41. జతపరచండి.
జాబితా - I జాబితా - II
A) హాలోన్స్ ) అగ్నిమాపకాలు
B) ఫ్రియాన్‌లు ii) ఫొటోగ్రఫీ
C) సిల్వర్ హాలైడ్‌లు iii) రిఫ్రిజిరెంట్‌లు
D) అయడో ఫాం iv) సిఫిలిస్ చికిత్స
A B C D
1) i ii iii iv
2) i iii ii iv
3) iv ii iii i
4) iii i iv ii

42. ఓజోన్ పొర క్షీణతకు కారణమైన హాలోహైడ్రోకార్బన్లు ఏవి?
1) క్లోరోఫ్లోరో కార్బన్లు (ఫ్రియాన్లు)
2) బ్రోమో అయడో హైడ్రోకార్బన్లు
3) పాలి బ్రోమో హైడ్రోకార్బన్లు
4) పాలి అయడో హైడ్రోకార్బన్లు

43. కింది వాటిలో సరికాని జత ఏది?
1) ట్రై అయడో మీథేన్ (అయడోఫాం) - యాంటీసెప్టిక్‌గా ఉపయోగపడుతుంది
2) ట్రైక్లోరో మీథేన్ (క్లోరోఫాం) - మత్తు మందు
3) ట్రై బ్రోమో ఈథైన్ - గోడౌన్లలో కీటకనాశనిగా వాడతారు
4) వినైల్ క్లోరైడ్ - రబ్బర్ తయారీ

44. కింది వాటిలో రెయిన్ కోట్‌ల తయారీలో ఉపయోగించేది ఏది?
1) బేకలైట్
2) పాలిస్టైరీన్
3) పాలివినైల్ క్లోరైడ్
4) టెఫ్లాన్

45. కర్రబొమ్మలకు రంగు వేయడానికి వాడే ‘మొసాయిక్ గోల్డ్’లో ఉండే పదార్థం?
1) గోల్డ్
2) స్టానిక్ క్లోరైడ్
3) ప్లాటినం
4) సిల్వర్ క్లోరైడ్

46. పంటి ఎనామిల్ గట్టితనానికి కారణమైన ‘హైడ్రాక్సీ ఎపటైట్’ను ఫ్లోరైడ్ మరింత గట్టితనం ఉన్న పదార్థంగా మారుస్తుంది. ఆ పదార్థం ఏది?
1) ఫ్లోరపటైట్
2) కాల్షియం ఫ్లోరైడ్
3) మెగ్నీషియం ఫ్లోరైడ్
4) ఫ్లోరాల్

47. ఫ్లోరోసిస్ వ్యాధిగ్రస్థుల ఆహారంలో అధికంగా ఉండాల్సిన పదార్థం?
1) సోడియం
2) పొటాషియం
3) కాల్షియం
4) మెగ్నీషియం

48. షాపింగ్ నిమిత్తం వాడే క్యారీ బ్యాగుల తయారీలో వినియోగించే పదార్థం?
1) స్టైరీన్
2) ఇథిలీన్
3) వినైల్ క్లోరైడ్
4) ఫీనాల్

49. కింది వాటిలో డ్రెసైల్‌లో ‘ఎలక్ట్రోలైట్’గా వేటిని ఉపయోగిస్తారు?
i) అమ్మోనియం క్లోరైడ్
ii) జింక్ క్లోరైడ్
iii) కాల్షియం క్లోరైడ్
iv) సోడియం క్లోరైడ్
1) i, ii
2) ii, iii
3) iii, iv
4) i, iv

50. సాధారణ గాలిలో ఉండని వాయువు ఏది?
1) ఆక్సిజన్
2) నైట్రోజన్
3) హీలియం
4) క్లోరిన్

ANSWERS:
1)3 2)1 3)2 4)1 5)2 6)1 7)3 8)2 9)1 10)2 11)2 12)2 13)1 14)1 15)4 16)2 17)3 18)3 19)1 20)4 21)4 22)3 23)1 24)2 25)2 26)3 27)4 28)2 29)1 30)4 31)3 32)1 33)4 34)4 35)4 36)2 37)3 38)1 39)1 40)1 41)2 42)1 43)4 44)3 45)2 46)1 47)3 48)3 49)1 50)4

No comments:

Post a Comment