Chemistry Questions in Telugu Part-6



1. పదార్థ నాలుగో స్థితిని ఏమంటారు?
1) ఘన
2) ద్రవ
3) ప్లాస్మా
4) ద్రవ స్ఫటిక

2. ఇనుము తుప్పు పట్టడానికి సంబంధించి కింది వాటిలో సరైన వాక్యం ఏది?
i) ఇది ఒక భౌతిక చర్య
ii) ఇది ఒక రసాయన చర్య
iii) ఆక్సీకరణ చర్య జరగడం వల్ల ఇనుము ఫెర్రిక్ ఆక్సైడ్‌గా మారుతుంది
iv) బరువులో పెరుగుదల కనిపిస్తుంది
v) పొడిగా ఉన్న ప్రాంతం తుప్పు పట్టడానికి అనువైంది
1) i, ii, iii, iv
2) i, ii, iii, iv, v
3) ii, iii, iv
4) ii, iii, iv, v

3. కింది వాటిలో ఉత్పతనం (ఘన స్థితి నుంచి ద్రవంగా మారకుండా నేరుగా వాయు స్థితిలోకి మారడం) చెందే గుణం లేని పదార్థం ఏది?
1) టేబుల్ సాల్ట్
2) కర్పూరం (కాంఫర్)
3) డ్రై ఐస్
4) అయోడిన్

4. పెట్రోలు ఉన్న డబ్బాకు మూత లేకుంటే ఏమవుతుంది?
1) ఉత్పతనం చెందుతుంది
2) బాష్పీభవనం చెందుతుంది
3) ఘనీభవిస్తుంది
4) పేలిపోతుంది

5. కింది వాటిలో వాయువులను ద్రవీకరించడానికి అనువైన పరిస్థితులు ఏవి?
i) అతి శీతలీకరణ
ii) వేడిచేయడం
iii) సంపీడ్యత (అధిక పీడనం) చెందించడం
iv) పీడనాన్ని తగ్గించడం
1) i, iii
2) i, ii
3) i, iv
4) ii, iv

6. పూరి గుడిసె, పెంకుటిళ్లలో చిన్న రంధ్రం ద్వారా కాంతి ప్రసరించినప్పుడు ఆ కాంతి మార్గం మెరుస్తూ కనిపిస్తుంది. ఈ ప్రక్రియలో ఇమిడి ఉన్న ధర్మం ఏది?
1) కాంతి పరావర్తనం
2) కాంతి సంపూర్ణాంతర పరావర్తనం
3) టిండాల్ ప్రభావం
4) కాంతి ఉష్ణీయ ప్రభావం

7. నీరు, కొవ్వు అనేవి సాధారణంగా ఒకదానిలో మరొకటి కలవని విరుద్ధ ధర్మాలున్న పదార్థాలు. కానీ పాల లాంటి కొల్లాయిడ్‌లో నీటిలో కొవ్వు కణాలు విస్తరించి ఉంటాయి. అయితే పాలలో వీటిని కలిపి ఉంచేది ఏది?
1) కెసిన్ అనే ఎమల్సీకరణ కారకం
2) రైబోఫ్లేవిన్ అనే ఎమల్సీకరణ కారకం
3) కెసిన్ అనే ఆక్సీకరణ కారకం
4) కెరొటిన్ అనే వర్ణద్రవ్యం

8.స్వచ్ఛమైన స్థితిలో ఒకే రకమైన పరమాణువులను కలిగి ఉండేది?
1) పదార్థం
2) అణువు
3) మూలకం
4) సమ్మేళనం

9. కింది వాటిలో జర్మన్ సిల్వర్‌లో ఉండని లోహం ఏది?
1) కాపర్
2) జింక్
3) నికెల్
4) సిల్వర్

10. జతపరచండి.
జాబితా - I జాబితా - II
A) కంచు (బ్రాంజ్) i) కాపర్+టిన్
B) ఇత్తడి (బ్రాస్) ii) నికెల్+ఇనుము +క్రోమియం
C) నిక్రోమ్ iii) కాపర్ + జింక్
D) గన్ మెటల్ iv) రాగి+జింక్ + తగరం(టిన్)
A B C D
1) i ii iii iv
2) i iii ii iv
3) iv iii ii i
4) ii iii i iv

11. గాజు అనేది ఒక..
1) స్ఫటికం
2) అతి శీతల ద్రవం(Super cooled Liquid)
3) సాధారణ ద్రవం
4) ప్లాస్మా

12. ఒకేపరమాణు సంఖ్య కలిగి, వేర్వేరు ద్రవ్యరాశులున్న కేంద్రకాలను ఏమంటారు?
1) సమస్థానీయాలు (ఐసోటోపులు)
2) ఐసోబార్‌లు
3) ఐసోటోనులు
4) ఐసోడయఫర్‌లు

13. ఇనుప గొట్టాలు తుప్పు పట్టకుండా వాటిపై జింక్ లాంటి చురుకైన లోహాలతో పూత పూయడాన్ని ఏమంటారు?
1) ఎన్నీలింగ్
2) బ్లోయింగ్
3) గాల్వనైజేషన్
4) ఎలక్ట్రోప్లేటింగ్

14. నీరు ద్రవ స్థితిలో ఉండటానికి కారణమైన బంధం ఏది?
1) అయానిక బంధం
2) సమయోజనీయ బంధం
3) అంతరణుక హైడ్రోజన్ బంధాలు
4) లోహ బంధాలు

15.ఏ లోహ అయాన్ల కారణంగా నీటికి కాఠిన్యత ఏర్పడుతుంది?
1) సోడియం, లిథియం
2) కాల్షియం, సోడియం
3) కాల్షియం, మెగ్నీషియం
4) సోడియం, పొటాషియం

16.వాతావరణ పరిశీలనలో వాడే బెలూన్లలో నింపడానికి ఉపయోగించే వాయువు ఏది?
1) హీలియం
2) నియాన్
3) ఆక్సిజన్
4) ఫ్లోరిన్

17. అమ్మోనియా తయారీకి కావాల్సిన ప్రధాన వాయువు ఏది?
1) ఆక్సిజన్
2) నైట్రోజన్
3) క్లోరిన్
4) హీలియం

18. న్యూట్రాన్లు లేని కేంద్రకం ఏది?
1) హీలియం
2) హైడ్రోజన్
3) నైట్రోజన్
4) ఫ్లోరిన్

19. టీవీ రిమోట్లలో ఉండే చిన్న బల్బు ఒక..
1) పరారుణ కిరణాల (IR) - LED
2) అతినీలలోహిత కిరణాల(UV) - LED
3) గామా కిరణాల - LED
4) ఏదీకాదు

20. జతపరచండి.
జాబితా - I జాబితా - II
A) ఫ్రియాన్‌లు i) నవ్వించే వాయువు
B) నైట్రస్ ఆక్సైడ్ ii) నూనెల హైడ్రోజనీకరణం
C) క్లోరిన్ iii) నీటిని క్రిమి రహితం చేయడం
D) హైడ్రోజన్ iv) రిఫ్రిజిరెంట్
A B C D
1) i iii iv ii
2) iv iii i ii
3) iv i iii ii
4) ii iv i iii

21. కింది వాటిలో గాయిటర్ వ్యాధితో సంబంధం ఉన్న మూలకం ఏది?
1) క్లోరిన్
2) అయోడిన్
3) యురేనియం
4) సోడియం

22. డ్రై సెల్‌లో ఉపయోగించే రసాయనం ఏది?
1) అమ్మోనియం క్లోరైడ్
2) జింక్ క్లోరైడ్
3) మాంగనీస్ డై ఆక్సైడ్
4) పైవన్నీ

23. సల్ఫ్యూరికామ్లానికి సంబంధించి కింది వాటిలో సరికాని వాక్యం ఏది?
1) రసాయనాల రాజుగా పేర్కొంటారు
2) బ్యాటరీల్లో ఉపయోగిస్తారు
3) ఆక్వారేజియాలో భాగం
4) ఆమ్ల వర్షంలో ఉండే ఆమ్లం

24. కింది వాటిలో విరంజన ధర్మం ఉన్న వాయువు ఏది?
1) ఓజోన్
2) క్లోరిన్
3) సల్ఫర్ డై ఆక్సైడ్
4) పైవన్నీ

25. మానవ శరీరంలో అధికంగా ఉండే మూలకం ఏది?1) సిలికాన్
2) ఆక్సిజన్
3) నైట్రోజన్
4) హైడ్రోజన్

26. మానవుడి గోర్లు, వెంట్రుకల్లో ప్రధానంగా ఉండే పదార్థం ఏది?
1) కార్బొహైడ్రేట్
2) లిపిడ్
3) ప్రోటీన్
4) విటమిన్

27. గాలిలో ఆక్సిజన్ పరిమాణం ఎంత?
1) నాల్గింట ఒక వంతు (25%)
2) అయిదింట ఒక వంతు (20%)
3) మూడింట ఒక భాగం (33%)
4) అయిదింట నాలుగు భాగాలు (80%)

28. నీటిలో నిల్వ ఉంచే మూలకం ఏది?
1) సోడియం
2) లిథియం
3) అయోడిన్
4) భాస్వరం

29. ముత్యాల్లో ఉండే రసాయన పదార్థం ఏది?
1) కాల్షియం కార్బొనేట్
2) కాల్షియం హైడ్రాక్సైడ్
3) మెగ్నీషియం హైడ్రాక్సైడ్
4) సోడియం కార్బొనేట్

30. ‘బేకింగ్ సోడా’ రసాయనిక నామం?
1) సోడియం కార్బొనేట్
2) సోడియం బైకార్బొనేట్
3) పొటాషియం బైకార్బొనేట్
4) సోడియం సల్ఫైడ్

31. పొడి మంచు (డ్రై ఐస్) అని దేనికి పేరు?
1) ఘన అయోడిన్
2) ఘన కార్బన్ డై ఆక్సైడ్
3) సోడియం క్లోరైడ్
4) అయోడిన్‌తో సమృద్ధి పరిచిన సోడియం క్లోరైడ్

32. గోల్డెన్ రైస్ ద్వారా ఏ విటమిన్ లభిస్తుంది?
1) విటమిన్ - డి
2) విటమిన్ - ఇ
3) విటమిన్ - ఎ
4) విటమిన్ - సి

33. రబ్బరుకు గట్టిదనాన్ని చేకూర్చడానికి ఉద్దేశించిన వల్కనైజేషన్ ప్రక్రియలో ఉపయోగించే మూలకం ఏది?
1) క్లోరిన్
2) సల్ఫర్
3) నైట్రోజన్
4) హైడ్రోజన్

34. విరంజన చూర్ణం తయారీకి కావాల్సిన ముడి పదార్థం ఏది?
1) జిప్సం
2) ప్లాస్టర్ ఆఫ్ పారిస్
3) పొడిగా మార్చిన తడి సున్నం(డ్రై స్లేక్‌డ్ లైమ్)
4) చలువరాతి ముక్కలు

35. ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌ను దేని నుంచి తయారు చేస్తారు?
1) జిప్సం
2) ముడి సున్నపురాయి
3) నైట్రోలిమ్
4) తడి సున్నం

36. కింది వాటిలో వంట పాత్రల తయారీకి వాడే మిశ్రమలోహం ఏది?
1) డ్యూరాలుమిన్
2) స్టీల్
3) ఇత్తడి
4) పైవన్నీ

37. ఇమిటేషన్ జ్యువెలరీలో వాడే ‘నికెల్-సిల్వర్’ మిశ్రమ లోహంలో ఉండని లోహం ఏది?
1) సిల్వర్
2) కాపర్
3) నికెల్
4) జింక్

38. కింది ఏ ఆహారపదార్థంలో కెఫీన్ ఉండదు?
1) కోలా పానీయం
2) చాక్లెట్
3) టీ
4) పాల కోవా

39. మిర్రర్‌ల కళాయి పూతలో ఉపయోగించే లోహం ఏది?
1) సిల్వర్
2) ప్లాటినం
3) ఐరన్
4) గోల్డ్

40. మానవుడి రక్తం pH విలువ ఎంత?
1) 3
2) 8.6
3) 7.4
4) 11

41. హెల్మెట్ల తయారీలో ఎలాంటి స్టీల్ వాడతారు?
1) క్రోమియం స్టీల్
2) మాంగనీస్ స్టీల్
3) టంగ్‌స్టన్ స్టీల్
4) స్టెయిన్‌లెస్ స్టీల్

42. కింది వాటిలో ‘న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్’ ఉన్న నగరం ఏది?
1) ముంబై
2) చెన్నై
3) హైదరాబాద్
4) కోల్‌కతా

43.‘వెనిగార్’ అనేది దేని సమ్మేళనం?
1) ఎసిటికామ్లం
2) ఫార్మాల్డీహైడ్
3) ఇథైల్ ఆల్కహాల్
4) హైడ్రోజన్ పెరాక్సైడ్

44. టమోటా పండ్లు ఎరుపు వర్ణంలో ఉండటానికి కారణమైన పదార్థాలేవి?
1) ఫ్లెవనాయిడ్లు
2) ఆల్కలాయిడ్లు
3) కెరోటినాయిడ్ కుటుంబానికి చెందిన లైకోపీన్
4) గ్జాంథోసయనిన్

45. నిమ్మ ఉప్పులో ఉండే రసాయనం ఏది?
1) ఎసిటికామ్లం
2) ఆస్కార్బికామ్లం
3) సిట్రికామ్లం
4) హైడ్రోక్లోరికామ్లం

46. కింది వాటిలో ఆమ్ల విరోధి ఏది?
1) పారాసిటమాల్
2) ఆస్ప్రిన్
3) పాంటప్రజోల్
4) సిప్రోఫ్లొక్సాసిన్

47. రెయిన్ కోట్ల తయారీలో వాడే పాలిమర్ ఏది?
1) అల్ప సాంద్రత పాలీథీన్ (LDPE)
2) అధిక సాంద్రత పాలీథీన్ (HDPE)
3) టెఫ్లాన్
4) పాలీస్టైరీన్

48. మానవుడి కడుపులో ఉత్పత్తి అయ్యే ఆమ్లం ఏది?
1) నైట్రికామ్లం
2) హైడ్రోక్లోరికామ్లం
3) సల్ఫ్యూరికామ్లం
4) ఎసిటికామ్లం

49.కింది వాటిలో వాతావరణంలో కార్బన్ డై ఆక్సైడ్ పెరిగిపోవడానికి కారణమైన మానవ కార్యకలాపాలేవి?
i) శిలాజ ఇంధనాల దహనం
ii) వ్యవసాయం
iii) చెట్ల నరికివేత
iv) హరితహారం
1) i, ii, iv
2) i, iv
3) i, ii, iii
4) i, iii

50. కింది వాటిలో ఆమ్ల వర్షానికి కారణమైన ప్రధాన ఆక్సైడ్‌లు ఏవి?
i) కార్బన్ ఆక్సైడ్‌లు
ii) సల్ఫర్ ఆక్సైడ్‌లు
iii) నైట్రోజన్ ఆక్సైడ్‌లు
1) ii, iii
2) i, ii
3) i, iii
4) i, ii, iii

51. వాతావరణంలో కార్బన్ డై ఆక్సైడ్ పెరగడం వల్ల కలిగే దుష్ర్పభావం ఏది?
1) ఆమ్ల వర్షాలు కురుస్తాయి
2) హరిత గృహ ప్రభావం
3) జలచరాలు నశిస్తాయి
4) కిరణజన్య సంయోగ క్రియ నిరోధానికి గురవుతుంది

52. కింది వాటిలో అత్యంత ప్రమాదకరమైంది ఏది?
1) ఫ్లైయాష్
2) మసి(సూట్)
3) స్మాగ్
4) దుమ్ము

ANSWERS:
1)3 2)3 3)1 4)2 5)1 6)3 7)1 8)3 9)4 10)2 11)2 12)1 13)3 14)3 15)3 16)1 17)2 18)2 19)1 20)3 21)2 22)4 23)3 24)4 25)4 26)3 27)2 28)4 29)1 30)2 31)2 32)3 33)2 34)3 35)1 36)4 37)1 38)4 39)1 40)3 41)2 42)3 43)1 44)3 45)3 46)3 47)1 48)2 49)3 50)1 51)2 52)2

No comments:

Post a Comment