Chemistry Questions in Telugu Part-5



1. వాతావరణంలోకి కార్బన్ డై ఆక్సైడ్‌ను విడుదల చేసే ప్రక్రియలేవి?
ఎ. అగ్ని పర్వతాల విస్ఫోటనం
బి. జంతు శ్వాసక్రియ
సి. కిరణజన్య సంయోగక్రియ
డి. మొక్కలు కుళ్లిపోవడం
1) ఎ,బి మాత్రమే
2) ఎ, సి, డి మాత్రమే
3) ఎ, బి, డి మాత్రమే
4) పైవన్నీ

2. స్టీల్ పరిశ్రమ వాతావరణంలోకి విడుదల చేసే కాలుష్య కారక వాయువులేవి?
1) సల్ఫర్ డై ఆక్సైడ్
2) కార్బన్ డై ఆక్సైడ్
3) కార్బన్ మోనాక్సైడ్
4) పైవన్నీ

3. మెరుపులు ఏర్పడినప్పుడు విడుదలయ్యే వాయువు ఏది?
1) నైట్రస్ ఆక్సైడ్
2) కార్బన్ డై ఆక్సైడ్
3) సల్ఫర్ డై ఆక్సైడ్
4) నైట్రోజన్ డై ఆక్సైడ్

4. కాంతి రసాయన పొగమంచుకు కారణమైన పదార్థాలేవి?
1) నైట్రస్ ఆక్సైడ్
2) పొగ
3) పెరాక్సీ ఎసిటైల్ నైట్రేట్
4) పైవన్నీ

5. వాతావరణంలో అనుమతించదగ్గ కార్బన్ మోనాక్సైడ్ స్థాయి?
1) 10 పీపీఎం
2) 7 పీపీఎం
3) 50 పీపీఎం
4) 100 పీపీఎం

6. కింద ఇచ్చిన వాటిలో గాలిని కలుషితం చేయనిది?
1) ఫ్లై యాష్
2) ఫ్రియాన్
3) హైడ్రోజన్ సల్ఫైడ్
4) ఫ్లోరైడ్

7. అంటార్కిటికాలో ఓజోన్ క్షీణతకు కారణమైన పదార్థం?
1) ఎక్రోలిన్
2) PAN
3) CO, CO2
4) క్లోరిన్ నైట్రేట్

8. కార్బన్ మోనాక్సైడ్ (CO) విడుదలకు ప్రధాన కారణం?
1) పరిశ్రమలు
2) వాహనాలు
3) అడవులు
4) అగ్నిపర్వతాలు

9. రేడియో తరంగాలను పరావర్తనం చేసే వాతావరణ పొర?
1) స్ట్రాటో ఆవరణం
2) మీసో ఆవరణం
3) ట్రోపో ఆవరణం
4) థర్మో ఆవరణం

10. వాతావరణం పై పొరల్లో ఓజోన్ పొర క్షీణతకు కారణమైన వాయువులేవి?
1) ఫుల్లరీన్లు
2) ఫ్రియాన్లు
3) పాలిహాలోజన్లు
4) ఫెర్రోసీన్

11. ఫ్లై యాష్‌కు సంబంధించి కింది వాటిలో సరైన వాక్యం ఏది?
ఎ. ఇటుకల తయారీలో వాడతారు
బి. పోర్ట్ ల్యాండ్ సిమెంట్‌కు ప్రత్యామ్నాయంగా కొంతవరకు వాడవచ్చు
సి. ఫ్లై యాష్‌లో కాల్షియం ఆక్సైడ్, సిలికాన్ డై ఆక్సైడ్‌లు మాత్రమే ఉంటాయి. విషపూరిత మూలకాలుండవు
1) ఎ, బి మాత్రమే
2) బి మాత్రమే
3) ఎ, సి మాత్రమే
4) సి మాత్రమే

12. వాతావరణంలో మానవ కార్యకలాపాల వల్ల కార్బన్ డై ఆక్సైడ్ పరిమాణం రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ కార్యకలాపాల్లో ముఖ్యమైన వాటిని గుర్తించండి.
ఎ. శిలాజ ఇంధనాల దహనం
బి. వ్యవసాయం
సి. చెట్ల నరికివేత
డి. హరితహారం
1) ఎ, బి, డి మాత్రమే
2) ఎ, డి మాత్రమే
3) ఎ, బి, సి మాత్రమే
4) ఎ, సి మాత్రమే

13. వాహనాల నుంచి వెలువడే 2.5 మైక్రాన్ల పరిమాణంలో ఉండే కణ స్వభావ పదార్థాలు (Particulate matter) ఊపిరితిత్తుల్లోకి అత్యంత సునాయాసంగా ప్రవేశిస్తాయి. వీటివల్ల కలిగే జబ్బులేవి?
1) శ్వాస సంబంధిత వ్యాధులు
2) గుండె జబ్బులు
3) పక్షవాతం
4) పైవన్నీ

14. కిందివాటిలో కేన్సర్ కారక పదార్థాలు ఏవి?
1) కార్బన్ డై ఆక్సైడ్‌లు
2) ఎరోమాటిక్ సమ్మేళనాలు
3) ఎలిఫాటిక్ హైడ్రోకార్బన్‌లు
4) జడవాయువులు

15. ఆమ్ల వర్షానికి కారణమయ్యే ప్రధానమైన ఆక్సైడ్‌లు ఏవి?
ఎ. కార్బన్ ఆక్సైడ్‌లు బి. సల్ఫర్ ఆక్సైడ్‌లు
సి. నైట్రోజన్ ఆక్సైడ్‌లు
1) బి, సి మాత్రమే
2) ఎ, బి మాత్రమే
3) ఎ, సి మాత్రమే
4) పైవన్నీ

16. వరి పొలాలు ఏ విధంగా భూగోళ తాపానికి కారణమవుతున్నాయి?
1) నైట్రోజన్ డై ఆక్సైడ్ విడుదల చేయడం ద్వారా
2) మీథేన్ వాయువు విడుదల చేయడం ద్వారా
3) సల్ఫర్ డై ఆక్సైడ్ విడుదల ద్వారా
4) పైవన్నీ

17. కాంతి కాలుష్యం అంటే?
1) రాత్రివేళలో పెద్ద పెద్ద నగరాలను ఆవహించి ఉండే కాంతి పుంజం
2) ఫ్రియాన్ల వల్ల కలుషితమైన కాంతి
3) అడవులు మండటం వల్ల వెలువడే కాంతి
4) వాహనాల లైట్ల వల్ల వెలువడే కాంతి

18. కాంతి రసాయన స్మాగ్‌కు కారణమైనవి?
1) హైడ్రోకార్బన్‌లు
2) ఆల్డిహైడ్‌లు
3) పెరాక్సీ ఎసిటైల్ నైట్రేట్
4) పైవన్నీ

19. వాతావరణంలో కార్బన్ డై ఆక్సైడ్ పెరగడం వల్ల కలిగే దుష్ర్పభావం?
1) ఆమ్ల వర్షాలు కురుస్తాయి
2) హరిత గృహ ప్రభావం ఏర్పడుతుంది
3) జలచరాలు చనిపోతాయి
4) కిరణజన్య సంయోగ క్రియను నిరోధిస్తుంది

ANSWERS:
1)3 2)4 3)1 4)4 5)2 6)4 7)4 8)2 9)4 10)2 11)1 12)3 13)4 14)2 15)1 16)2 17)1 18)4 19)2

No comments:

Post a Comment