Chemistry Questions in Telugu Part-2



1. లోహాలు మెరవడానికి కారణం?
1) తెల్లనిరంగు
2) గాల్వనైజేషన్
3) లోహాల్లోని స్వేచ్ఛా ఎలక్ట్రాన్లు కాంతిని పరావర్తనం చెందించడం వల్ల
4) లోహాల్లోని ప్రోటాన్లు కాంతిని శోషించుకోవడం వల్ల

2. నేల పొరల్లో విస్తారంగా దొరికే లోహం?
1) మెగ్నీషియం
2) అల్యూమినియం
3) బంగారం
4) ఐరన్

3. కిందివాటిలో అయస్కాంతత్వం లేని లోహాలు ఏవి?
i) ఐరన్
ii) జింక్
iii) టిన్
iv) కోబాల్ట్
1) i, ii
2) ii, iii
3) iii, iv
4) i, iv

4. దృఢత్వంతో పాటు సాగే గుణం ఉన్న లోహం?
1) ఐరన్
2) నిక్రోమ్
3) టంగ్‌స్టన్
4) బంగారం

5. ఎలాంటి వాతావరణంలో ఇనుము త్వరగా తప్పుపడుతుంది?
1) పొడిగాలిలో
2) శూన్యంలో
3) తేమగాలి ఉన్న సముద్రతీరంలో
4) జింక్‌తో పూతపూసినపుడు

6. ఇనుము తుప్పుపట్టడం ఏ ప్రక్రియ?
1) క్షయకరణం
2) ఉత్పతనం
3) బాష్పీభవనం
4) ఆక్సీకరణం

7. ఇనుము తుప్పు పట్టినపుడు దాని బరువు?
1) పెరుగుతుంది
2) తగ్గుతుంది
3) మారదు
4) తగ్గి పెరుగుతుంది

8. ఇనుము తుప్పు పట్టినపుడు ఏర్పడే పదార్థం ఏది?
1) ఫై సల్ఫేట్
2) ఫై సల్ఫైడ్
3) ఫెర్రిక్ ఆక్సైడ్
4) ఫెర్రిక్ క్లోరైడ్

9. లోహక్షయాన్ని నివారించడానికి జింక్‌తో పూత పూస్తారు. ఇది ఏ ప్రక్రియ ?
1) ఆక్సీకరణం
2) ప్రొటెక్షన్
3) ఎలక్ట్రాలసిస్
4) గాల్వనైజేషన్

10. విద్యుత్ బల్బులో ఫిలమెంట్‌ను దేనితో తయారు చేస్తారు?
1) ఐరన్
2) ప్లాటినం
3) టంగ్‌స్టన్
4) గోల్డ్

11.విద్యుత్ బల్బులో గాలిని పూర్తిగా తొలగించడానికి కారణం?
1) కాంతి ప్రసారం పెంచడానికి
2) బల్బు పగిలిపోకుండా ఉండేందుకు
3) ఫిలమెంట్ గాలిలో మండి (ఆక్సీకరణం చెంది) కాలిపోకుండా ఉండేందుకు
4) బరువు తగ్గించడానికి

12. కిందివాటిలో సరైన జత కానిది ?

1) కంచు - కాపర్, టిన్
2) ఇత్తడి - కాపర్, జింక్
3) నిక్రోమ్ - ఐరన్, క్రోమియం, నికెల్
4) జర్మన్ సిల్వర్- సిల్వర్, జర్మేనియం

13. జర్మన్ సిల్వర్‌లో లేని లోహం?
1) సిల్వర్
2) కాపర్
3) జింక్
4) నికెల్

14. టిన్ రసాయన సాంకేతికం?
1) Ti
2) Sn
3) W
4) ఏదీకాదు

15. ఉక్కు తుప్పు పట్టకుండా నిరోధించే ప్రధాన లోహం?
1) ఐరన్
2) కార్బన్
3) క్రోమియం
4) నికెల్

16. స్టెయిన్‌లెస్ స్టీల్ ఏ లోహాల మిశ్రమం?
1) ఐరన్, నికెల్
2) ఐరన్, క్రోమియం, నికెల్
3) ఐరన్, క్రోమియం, జింక్
4) ఐరన్, మాంగనీస్

17.ఎర్రరక్త కణాల్లోని హీమోగ్లోబిన్‌లో ఉండే లోహం?
1) కోబాల్ట్
2) ఐరన్
3) మెగ్నీషియం
4) కాపర్

18.మెర్క్యురీకి సంబంధించిన సరైన వాక్యం?
1) గది ఉష్ణోగ్రత వద్ద ద్రవరూపంలోఉంటుంది
2) థర్మామీటర్‌లో, భారమితిలో ఉపయోగిస్తారు
3) ఉష్ణవ్యాకోచం చాలా ఎక్కువ
4) పైవన్నీ

19. పంటి ఫిల్లింగ్‌లకు ఉపయోగించే దంత ఎమాల్గంలో ఉండే లోహం?
1) సిల్వర్
2) టిన్
3) మెర్క్యురీ
4) ఐరన్

20. మానవుడు కనిపెట్టిన తొలి లోహం ఏది?
1) కాపర్
2) గోల్డ్
3) సిల్వర్
4) ఐరన్

21. సీసం(లెడ్) విషపూరిత లోహాం. శరీరంలోకి ఏ విధంగా ప్రవేశిస్తుంది ?
1) వాహన కాలుష్యం
2) పెయింట్లు
3) ఆటబొమ్మలు
4) పైవన్నీ

22. శరీరంలోని లెడ్ విషాన్ని తొలగించడానికి ఏ కారకాన్ని ఉపయోగిస్తారు?
1) టీఈఎల్
2) ఈడీటీఏ
3) టీఎన్‌టీ
4) ఆర్డీఎక్స్

23.స్టోరేజ్ బ్యాటరీలు ఏ విషపూరిత లోహాన్ని విడుదల చేస్తాయి ?
1) టిన్
2) మెర్క్యురీ
3) లెడ్
4) గోల్డ్

24. లెడ్ విషం వల్ల ఏ ప్రభావాలు కల్గుతాయి ?
1) జ్ఞాపకశక్తి తగ్గుదల
2) కిడ్నీ సంబంధిత వ్యాధులు
3) నిద్రలేమి
4) పైవన్నీ

25. మోనజైట్ ఇసుక నుంచి ఏ ఖనిజం లభిస్తుంది?
1) యురేనియం
2) థోరియం
3) కాపర్
4) జింక్

26. బ్యాటరీలు ఎక్కువకాలం పనిచేయడానికి ఉపయోగించే లోహం ?
1) నికెల్
2) లిథియం
3) సిల్వర్
4) మెర్క్యురీ

27. సోల్డరింగ్‌లో ఉపయోగించే లోహాలు?
1) లెడ్
2) టిన్
3) రెండూ
4) పైవేవీ కావు

28. పాత కంప్యూటర్ల ఐఇల నుంచి వేరుచేసే లోహం ఏది?
1) సిల్వర్
2) గోల్డ్
3) లెడ్
4) మెర్క్యురీ

29.కారుచక్రాల తయారీకి వాడే లోహం?
1) ఐరన్
2) అల్యూమినియం
3) సిల్వర్
4) టంగ్‌స్టన్

30. వాహనాల్లో ఉపయోగించే గ్రీజు తయారీలో వాడే లోహాలు?
1) సోడియం, సిల్వర్
2) సోడియం, మెర్క్యురీ
3) సోడియం, కాల్షియం
4) సోడియం, ఐరన్

31.ఇళ్లలో ఉపయోగించే ఎలక్ట్రిక్ వైర్లలో వాడే లోహం?
1) అల్యూమినియం
2) ఐరన్
3) కాపర్
4) క్రోమియం

32. కంప్యూటర్లు, ఎంపీ3 ప్లేయర్లలో ఉపయోగించే బలమైన అయస్కాంతాల తయారీలో వాడే లోహం?
1) ఐరన్
2) ప్లాటినం
3) నియోడిమియం
4) కోబాల్ట్

33. శీతల పానీయాలు ఉండే టిన్‌ల తయారీలో ఏ లోహాన్ని వాడతారు ?
1) అల్యూమినియం
2) కాపర్
3) స్టీల్
4) ఐరన్

34. రేడియోధార్మిక కిరణాలను శోషించుకొని రక్షణ కవచంగా నిలిచేది ?
1) రాగి రేకుస
2) ప్లాటినం రేకు
3) లెడ్ రేకు
4) బంగారు రేకు

35. సముద్రాల్లో ప్రధానంగా లభించే లోహాం ఏది ?
1) సోడియం (Na)
2)పొటాషియం (K)
3) మెగ్నీషియం (Mg)
4) కాల్షియం (Ca)

36. మిశ్రమ లోహాల్లో పాదరసం ఉంటే దాన్ని ఏమంటారు ?
1) ఎమాల్గమ్
2) ఎమల్షన్
3) క్రయోలైట్
4) ఏదీకాదు

37.కంప్యూటర్‌ల్లో వినియోగించే మైక్రోచిప్ లేదా ఈసీ తయారీలో ఉపయోగించే మూలకం?
1) సీసం
2) ఐరన్
3) గ్రాఫైట్
4) సిలికాన్

38. కిందివాటిలో అర్ధవాహకం ఏది?
1) వెండి
2) ఐరన్
3) గ్రాఫైట్
4) సిలికాన్

39. సూర్యశక్తిని విద్యుచ్ఛక్తిగా మార్చే ప్రక్రియలో సోలార్ ప్యానెల్ తయారీలో ఉపయోగించే మూలకం ?
1) బెరీలియం
2) సిలికాన్
3) కాపర్
4) లెడ్

40. ఉప్పునీరు (కఠిన జలం)లో ఉండే ప్రధాన అయాన్‌లు ?
1) సోడియం, పొటాషియం
2) కాల్షియం, మెగ్నీషియం
3) సోడియం, కాల్షియం
4) జింక్, కాపర్

41. కిందివాటిలో ఏ లోహం ఫెర్రో అయస్కాంత ధర్మాన్ని ప్రదర్శించదు?
1) ఐరన్ (Fe)
2) నికెల్ (Ni)
3) కోబాల్ట్ (Co)
4) టిన్ (Sn)

42. కిడ్నీ రాళ్లలో అధికంగా ఉండే లోహం ?
1) ఐరన్
2) సిలికాన్
3) కాల్షియం
4) సోడియం

43. అధిక రక్తపోటు ఉన్న వారి ఆహారంలో ఉండాల్సిన లోహాలు ? 
1) తక్కువ సోడియం, తక్కువ పొటాషియం
2) తక్కువ పొటాషియం, ఎక్కువ సోడియం
3)తక్కువ సోడియం, ఎక్కువ పొటాషియం
4) ఎక్కువ ఉప్పు, ఎక్కువ కారం

44. పొటాషియం ఏ ఆహార పదార్థాల్లో పుష్కలంగా లభిస్తుంది ?
1) అరటిపండ్లు
2) పుట్టగొడుగులు
3) ముదురు ఆకుపచ్చ ఆకుకూరలు
4) పైవన్నీ

45. రక్తం గడ్డకట్టడంలో ఏ లోహం ప్రధానపాత్ర వహిస్తుంది ?
1) సోడియం
2) పొటాషియం
3) క్లోరైడ్
4) కాల్షియం

46. శరీరంలో పొటాషియం అయాన్ ఏ పాత్ర పోషిస్తుంది ?
1) గుండెకు సంబంధించి విద్యుత్ ప్రసరణ నియంత్రణ
2) ప్రొటీన్లు, కండరాల నిర్మాణం
3) ఆమ్ల-క్షార తుల్యత నియంత్రణ
4) పైవన్నీ

ANSWERS:
1)3 2)2 3)2 4)2 5)3 6)4 7)1 8)3 9)4 10)3 11)3 12)3 13)1 14)2 15)3 16)2 17)2 18)4 19)4 20)1 21)4 22)2 23)3 24)4 25)2 26)2 27)3 28)2 29)2 30)3 31)3 32)3 33)1 34)3 35)3 36)1 37)2 38)4 39)2 40)2 41)4 42)3 43)3 44)4 45)4 46)4

No comments:

Post a Comment