Biology Questions in Telugu Part-9



1. ఊపిరితిత్తులలో ‘ఉచ్చ్వాసం’, ‘నిశ్వాసం’ ప్రక్రియల్లో జరిగే మార్పులు వరసగా..
 1) లోపలి పీడనం తగ్గుతుంది - లోపలి పీడనం పెరుగుతుంది
2) లోపలి పీడనం పెరుగుతుంది - లోపలి పీడనం తగ్గుతుంది
3) లోపలి పీడనం తగ్గుతుంది - లోపలి పీడనం తగ్గుతుంది
4) లోపలి పీడనం పెరుగుతుంది - లోపలి పీడనం పెరుగుతుంది

2. మన దేహంలో కదలని కీలు, మడతబందు కీలు ఉన్న అవయవాలు ఏవి?
 1) భుజం, మెడ
2) పై దవడ - తల, ముంజేయి
3) కింది దవడ - తల, భుజం
4) మోకాలు, మెడ

3. ద్విపార్శ్వ సౌష్ఠవం, త్రిస్తరిత లక్షణంతోపాటు ఖండితయుత దేహం కలిగివున్న జీవులు ఏవి? 1) జలగలు
2) ఆల్చిప్పలు
3) ఏలిక పాములు
4) సీ ఆర్చిన్‌లు

4. ‘తారక’ పరిమాణాన్ని కాంతి తీవ్రతను బట్టి సర్దుబాటు చేయగల కండర నిర్మాణం? 
1) శైలికామయ కండరాలు
2) అవలంబిత స్నాయువులు
3) కంటిపాప
4) స్నాయువులు, కండరాలు

5. సూక్ష్మమైన మొక్కలు, జంతువులపై కీటకనాశనులు ప్రమాదకరమైన ప్రభావాన్ని చూపుతాయని తన గ్రంథంలో సూచించిన శాస్త్రవేత్త ఎవరు?
 1) రేచల్ కార్సన్
2) జూలియట్ క్యూరి
3) మేరీ ఎన్నింగ్
4) రోసాలిండ్

6. కింది వాటిలో నీటి నుంచి ఆహారాన్ని వడపోసి గ్రహించడానికి తమ దంతాలను ఉపయోగించుకొనేవి ఏవి?
 1) కొంగ - కప్ప
2) చేప - బాతు
3) చేప - బల్లి
4) కప్ప - బాతు

7. సాక్యులస్, యుట్రిక్యులస్‌ల నుంచి బయలుదేరిన నాడీ తంతువులు కలసి ఏర్పడేది?
 1) కర్ణావర్త నాడి
2) పేటికా నాడి
3) శ్రవణ నాడి
4) దృక్ నాడి

8. రవి రక్తవర్గం 'A', రవి తండ్రి రక్తవర్గం 'O'. అత్యవసర సమయంలో రవికి, రవి తండ్రికి రక్తదానం అవసరమైతే ఎక్కించాల్సిన రక్త వర్గాలు?
 రవి రవి తండ్రి
1) A, O O
2) AB AB
3) B, O A
4) B B, O

9. క్లోమం స్రవించే ఎంజైములు ఏవి?
 1) అమైలేజ్, సుక్రేజ్, లైపేజ్
2) ట్రిప్సిన్, అమైలేజ్, లైపేజ్
3) లైపేజ్, పెప్సిన్, టయలిన్
4) పెప్సిన్, లైపేజ్, సుక్రేజ్

10. మానవుని హృదయంలో కుడి పార్శ్వం వైపు ఉన్న కవాటాలు?
1) అగ్రత్రయ కవాటం, పుపుస ధమని కవాటం
2) అగ్రత్రయ కవాటం, మహాధమని కవాటం
3) అగ్రద్వయ కవాటం, మహాధమని కవాటం
4) మిట్రల్ కవాటం, పుపుస ధమని కవాటం

11. రక్తకేశనాళికా గుచ్ఛంలో పీడనం పెరగడానికి కారణమేమిటి?
 1) సన్నని నాళం ఉన్న అభివాహి ధమనిక
2) పోడోసైట్ల మధ్య ఉన్న సూక్ష్మరంధ్రాలు
3) సన్నని నాళం ఉన్న అపవాహి ధమనిక
4) సన్నని నాళం ఉన్న అపవాహి సిరిక

12. కింది వాటిలో ఒకే సందర్భంలో జరిగే ప్రతీకారచర్య, సహజాత ప్రవృత్తి ఏది? 
1) కదులుతున్నది ఏదైనా మొదటిసారి కనిపిస్తే దాని వెనకే వెళ్లడం
2) మొనదేలిన వస్తువును తాకినపుడు కలిగే ప్రతిస్పందన
3) సంతానోత్పత్తి కోసం భిన్న లింగ జీవులను ఎన్నుకోవడం
4) బడిగంట మోగగానే విద్యార్థులు మైదానాన్ని వదలి వెళ్లడం

13. హేమంత్ తన ఆహారంలో నీటిలో కరిగే, కొవ్వుల్లో కరిగే విటమిన్లు ఉండేలా చూసుకుంటాడు. కింది వాటిలో కొవ్వులో కరిగే విటమిన్, నీటిలో కరిగే విటమిన్లు ఏవి?
 1) ఫోలిక్ ఆమ్లం, ఆస్కార్బిక్ ఆమ్లం
2) బయోటిన్, కాల్సిఫెరాల్
3) టోకోఫెరాల్, ఫిల్లోక్వినోన్
4) రెటినాల్, పైరిడాక్సిన్

14. కింది వాటిలో ‘దండాల’ ప్రత్యేక లక్షణం ఏమిటి?
1) అతి తక్కువ కాంతిలో వస్తువులను గుర్తించడం
2) కాంతివంతమైన వెలుతురులో రంగుల్ని గుర్తించడం
3) రంగుల్లోని ప్రత్యేకతల్ని గుర్తించడం
4) దృష్టి స్పష్టంగా ఉండేలా చేయడం

15. వేర్వేరు మట్టి నమూనాలు, ప్లాస్టిక్ గరాటు, వడపోత కాగితం, నీరు, కొలజాడి, డ్రాపర్లను ఉపయోగించి నిర్వహించే ప్రయోగం ద్వారా తెలుసుకోగలిగేది?
 1) మట్టిలో తేమ శాతం
2) మట్టి నీటిని పీల్చుకునే స్వభావం
3) మట్టిలోని ఖనిజ లవణాలు
4) మట్టిలో ఉండే పదార్థాలు

16. కింది ఏ ఆల్కలాయిడ్ స్క్రీజోఫ్రీనియాను నివారిస్తుంది?
1) థియీన్
2) మార్ఫీన్
3) రిసర్పిన్
4) అట్రోపిన్

17. సకశేరుకాల కాలేయ కణాలలో నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం లోపిస్తే?
 1) ప్రొటీన్ల సంశ్లేషణ జరగదు
2) జీర్ణరసాల ఉత్పత్తి జరగదు
3) కొవ్వుల సంశ్లేషణ జరగదు
4) విషపదార్థాల నిర్వీర్యం జరగదు

18. A, B ల నుంచి సరైన వాటిని ఎన్నుకొని కింది పట్టికను పూరించండి. 
వినాళ గ్రంథి పేరు విడుదలచేసే హార్మోన్
స్త్రీ బీజకోశం - A
B - ల్యూటినైజింగ్ హార్మోన్
1) A : ప్రొలాక్టిన్, B: క్లోమం
2) A : ప్రొజెస్టిరాన్, B: పిట్యుటరీ
3) A : అడ్రినలిన్, B: అడ్రినల్
4) A : థైరాక్సిన్, B : థైమస్

19. కస్క్యుట రెఫ్లెక్సా దేని ద్వారా ఆహారాన్ని గ్రహిస్తుంది?
 1) అంటు వేర్లు
2) చూషకాలు
3) వాయుగత వేర్లు
4) లెంటికణాలు

ANSWERS:
1)1 2)2 3)1 4)3 5)1 6)2 7)2 8)1 9)2 10)1 11)3 12)2 13)4 14)1 15)2 16)3 17)4 18)2 19)2

No comments:

Post a Comment