Biology Questions in Telugu Part-8



1. పురుషుల్లో ఊపిరితిత్తుల సంకోచ - సడలికలకు తోడ్పడే అవయవం ఏది?
1) గ్రసని
2) వాయునాళం
3) పక్కటెముకలు
4) విభాజక పటలం

2. ప్రయోగశాలల్లో ఉపయోగించే లిట్మస్ పేపర్‌ను దేనితో తయారు చేస్తారు?
1) పుట్టగొడుగులు
2) డయాటమ్స్
3) లెకైన్లు
4) వృక్ష ప్లవకాలు

3.కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియ ఎక్కడ ప్రారంభమవుతుంది?
1) నోరు
2) ఆహార వాహిక
3) జీర్ణాశయం
4) చిన్న పేగు

4. మైటోకాండ్రియాలను కణశక్తి భాండాగారాలు అని పిలుస్తారు. కింది వాటిలో దేనిలో ఇవి లోపించి ఉంటాయి?
1) కేంద్రక పూర్వజీవులు
2) పక్వ R.B.C.లు
3) నిజ కేంద్రక జీవులు
4) 1, 2

5. హృదయ స్పందన, వాంతులు, తుమ్ములు, దగ్గు, మింగడం లాంటి చర్యలు మెదడులోని ఏ విభాగం ఆధీనంలో ఉంటాయి?
1) మజ్జాముఖం (మెడుల్లా అబ్లాంగేటా)
2) వెన్నుపాము
3) అనుమస్తిష్కం
4) మస్తిష్కం

6. ‘భూమిని శుభ్రపరిచే జీవులు’ (స్కావెంజర్‌‌స ఆఫ్ ఎర్‌‌త) అని వేటిని పిలుస్తారు?
1) శైవలాలు
2) బ్యాక్టీరియా
3) డయాటమ్స్
4) వృక్ష ప్లవకాలు

7. సుగంధ ద్రవ్యాలుగా ఉపయోగించే లవంగాలు మొక్కలోని ఏ భాగానికి చెందినవి?
1) ఆకులు
2) కాండం
3) మొగ్గలు
4) ఎండిన విప్పారని పూమొగ్గలు

8.ఎరాయిడ్లలో పరాగ సంపర్కానికి సహాయపడేవి ఏవి?
1) నత్తలు
2) తేనెటీగలు
3) పాములు
4) మాత్‌లు

9. పక్షులు, గబ్బిలం రెండూ ఎగిరే జీవులే. కానీ, ఆ రెండింటికి మధ్య భేదం?
1) విభాజక పటలం
2) గుండెలో నాలుగు గదులు
3) రెక్కలు
4) మెదడు

10. లైసోజోమ్‌లు ఎక్కువగా ఉండే కణాలు?
1) ఎర్రరక్త కణాలు
2) విసర్జక కణాలు
3) గ్రంథి కణాలు
4) జీర్ణక్రియ కణాలు

11.వృక్షకణంలో మాత్రమే ఉండే కణాంగాలు?
1) గాల్జీ సంక్లిష్టాలు
2) మైటోకాండ్రియా
3) ప్లాస్టిడ్లు
4) ప్లాస్మిడ్లు

12. ఆకర్షణ పత్రాలు, ఫలాలు.. పసుపు, నారింజ రంగులో ఉండటానికి కారణం?
1) ల్యూకోప్లాస్ట్‌లు
2) అమైలోప్లాస్ట్‌లు
3) క్రొమోప్లాస్ట్‌లు
4) క్లోరోప్లాస్ట్‌లు

13. కింది వాటిలో క్రోమోజోమ్‌లకు సంబంధించిన క్రియ ఏది?
1) శరీర పెరుగుదల
2) శ్వాసక్రియ
3) శోషణం
4) అనువంశికం

14. డీఎన్‌ఏలో ఉండి ఆర్‌ఎన్‌ఏలో లేనిది ఏది?
1) అడినిన్
2) గ్వానైన్
3) థైమిన్
4) సైటోసీన్

15. m-RNA సంశ్లేషణ చెందే విధానాన్ని ఏమంటారు?
1) ప్రతికృతి
2) అనువాదం
3) ట్రాన్స్లొకేషన్
4) అనులేఖనం

16. వేరు కొనలో ఒక కణం నుంచి 128 కణాలు ఏర్పడటానికి ఎన్ని సమ విభజనలు జరగాలి?
1) 128
2) 127
3) 64
4) 32

17. కణ విభజనలోని ఏ దశలో DNA రెట్టింపు అవుతుంది?
1) G-1 దశ
2) S- దశ
3) G-2 దశ
4) మధ్యస్థ దశ

18. క్షయకరణ విభజనలో పారాగతి జరిగే దశ?
1) డిప్లోటీన్
2) జైగోటీన్
3) పాకిటీన్
4) డయాకైనసిన్

19. ‘కణజాల వర్ధనం’ అనే భావన గురించి పేర్కొన్నవారు?
1) హప్‌మిస్టర్
2) హాబర్‌లాంట్
3) హన్‌స్టయిన్
4) హన్నింగ్

20. కణజాల వర్ధనంలో అర్ధఘన యానకాన్ని తయారు చేయడానికి కావలసిన పదార్థం?
1) అగార్-అగార్
2) జిగురు
3) రెసిన్
4) పిండి పదార్థం

21. కేంద్రక రహిత సజీవ కణం ఏది?
1) దారునాళం
2) చాలనీ నాళమూలకాలు
3) దృఢకణాలు
4) దవ్వ రేఖ

22. జతపరచండి.
కణజాలం
i) స్థూలకోణ కణజాలం
ii) దృఢ కణజాలం
iii) దారువు
iv) పోషక కణజాలం
విధులు
a) నిర్జీవ యాంత్రిక కణజాలం
b) సజీవ యాంత్రిక కణజాలం
c) నీటి రవాణా
d) ఆహార పదార్థాల రవాణా
1) i-a, ii-b, iii-c, iv-d
2) i-b, ii-a, iii-c, iv-d
3) i-d, ii-c, iii-b, iv-a
4) i-c, ii-d, iii-b, iv-a

23. మొక్కల్లో పార్శ్వ వేర్లు దేని నుంచి ఉద్భవిస్తాయి?
1) బాహ్యచర్మం
2) అంతశ్చర్మం
3) పరిచక్రం
4) దవ్వ

24.కాస్పేరియన్ మందాలు ఉండటం దేని ముఖ్య లక్షణం?
1) పరిచక్రం
2) బాహ్యచర్మం
3) అంతశ్చర్మం
4) దవ్వ

25. పారిశ్రామికంగా ఏ మొక్క నుంచి బెండును ఉత్పత్తి చేస్తున్నారు?
1) యూకలిప్టస్
2) ఓక్ వృక్షం
3) రావి
4) వెదురు

26. బెండు కణాల్లో ఉన్న కణ కవచం దేనితో నిర్మితమవుతుంది?
1) సెల్యులోజ్
2) ఖైటిన్
3) సుబరిన్
4) క్యూటిన్

27. ఆపిల్‌లో తిన గలిగే భాగ స్వరూపం?
1) మధ్య ఫలకవచం
2) బీజదళాలు
3) పుష్పాసనం
4) అంతః ఫలకవచం

28. జీడి మామిడి ఫలంలో తిన గలిగే భాగం స్వరూపం?
1) బీజకవచం
2) పుష్పాసనం
3) మధ్యఫలకవచం
4) పుష్పవృంతం

29. కొన్ని ఫలాలు వాటి తిన గలిగే భాగాలకు సంబంధించి సరైన జత?
ఎ) మృదుఫలం - వంగ → పూర్తి ఫలం
బి) హెస్పరీడియం - నిమ్మ → అంతరఫలకవచం పైన ఉండే రసయుత కేశాలు
సి) టెంక ఉన్న ఫలం - కొబ్బరి → కణ, ద్రవయుత అంకురచ్చదం
డి) లోమేంటం - చింత → పూర్తి ఫలం
1) ఎ, డి
2) ఎ, సి, డి
3) ఎ, బి, సి
4) ఎ, బి, సి, డి

30. అతిపెద్ద పుష్పాలను ఉత్పత్తి చేసే వేరు పరాన్నజీవి మొక్క?
1) స్ట్రెగా
2) రప్లీషియా
3) ఒరబాంకి
4) సాంటాలమ్

31. సాంటాలమ్ ఆల్బమ్.. చిన్న మొక్క దశలో ఏ విధంగా ఉంటుంది?
1) సంపూర్ణ కాండ పరాన్న జీవి
2) సంపూర్ణ వేరు పరాన్న జీవి
3) పాక్షిక వేరు పరాన్న జీవి
4) పాక్షిక కాండ పరాన్న జీవి

32. హ్యూగోడీవ్రీస్.. మొదటిసారిగా ఉత్పరి వర్తనాలను దేనిలో గమనించాడు?
1) మొక్కజొన్న
2) ఈనోథీరా
3) డ్రాసోఫిలా
4) బార్లీ

33. జతపరచండి.
పైటో హర్మోన్లు
i) జిబ్బరెల్లిన్లు
ii) ఆక్సీన్లు
iii) ఇథిలీన్
iv) సైటోకైనిన్లు
ప్రభావం
a) రిచ్‌మాండ్ లాంగ్ ప్రభావం
b) ట్రిపుల్ అనుక్రియ పెరుగుదల
c) బార్లీ విత్తనాలు మొలకెత్తడం
d) అగ్రాధిక్యత
1) i-b, ii-c, iii-d, iv-a
2) i-b, ii-d, iii-c, iv-a
3) i-c, ii-b, iii-d, iv-a
4) i-c, ii-d, iii-b, iv-a

34. బ్యాక్టీరియాలో జన్యు పునఃసంయోజనం (ప్రత్యుత్పత్తి) ఎన్ని విధాలుగా జరుగుతుంది?
ఎ) సంయుగ్మం
బి) జన్యు పరివర్తనం
సి) జన్యు వాహనం
1) ఎ, బి, సి
2) ఎ
3) బి, సి
4) ఎ, సి/

35. నిశ్చితం (A): పుతికాహారి బాక్టీరియాలను ‘ప్రకృతిలోని పారిశుధ్య పనివారు’ అని పిలుస్తారు. కారణం (R): ఇవి పరిసరాలను పరిశుభ్రం చేస్తాయి
1) (A), (R)లు సరైనవి, (A)కు (R) సరైన వివరణ
2) (A), (R)లు సరైనవి, (A)కు (R) సరైన వివరణ కాదు
3) (A) సరైంది కానీ, (R) సరైంది కాదు
4) (A) సరైంది కాదు కానీ, (R) సరైంది

36. జతపరచండి.
వైరస్ రకం
i) బాక్టీరియోపాజ్
ii) మైకోపాజ్
iii) జైమోపాజ్
iv) సయనోపాజ్
దాడిచేసే అథిదేయి
a) శిలీంధ్రాలు
b) సయనో బాక్టీరియాలు
c) బాక్టీరియాలు
d) జంతువులు
e) ఈస్ట్
1) i-b, ii-e, iii-a, iv-d
2) i-b, ii-c, iii-d, iv-a
3) i-c, ii-b, iii-d, iv-a
4) i-c, ii-a, iii-e, iv-b

37.నిశ్చితం (A): వైరస్‌లను న్యూక్లియో ప్రోటిన్ రేణువులు అంటారు
కారణం (R): ఇవి ప్రోటీన్లు, కేంద్రకామ్లాలతో తయారవుతాయి
1) (A), (R)లు సరైనవి, (A)కు (R) సరైన వివరణ
2) (A), (R)లు సరైనవి, (A)కు (R) సరైన వివరణ కాదు
3) (A) సరైంది కానీ, (R) సరైంది కాదు
4) (A) సరైంది కాదు కానీ, (R)సరైంది

38. జతపరచండి.
జాబితా -I
i) హైడ్రోఫోనిక్స్
ii) బాష్పోత్సేక నిరోధం
iii) స్కోటోయాక్టివ్
iv) గర్డలింగ్ ప్రయోగం
జాబితా -II
a) ద్రవోద్గమంలో దారువు పాల్గొంటుందని నిరూపించడం
b) పత్ర రంధ్రాలు రాత్రి సమయంలో తెరుచుకోవడం
c) మృత్తికా రహిత మొక్కల వర్ధనం
d) పత్ర రంధ్రాలు మూసుకోవడాన్ని ప్రేరేపించడం
e) పత్ర రంధ్రాలు తెరుచుకోవడాన్ని ప్రేరేపించడం
1) i-b, ii-c, iii-b, iv-a
2) i-d, ii-b, iii-a, iv-c
3) i-c, ii-d, iii-b, iv-a
4) i-c, ii-a, iii-b, iv-d

39. ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ యాంటీబయోటిక్స్ ఔషధాలను (వినియోగ అవసరాలను బట్టి) ఎన్ని రకాలుగా వర్గీకరించింది?
1) యాక్సిక్ గ్రూప్ (అమాక్సి సిలిన్)
2) వాచ్‌గ్రూప్ (సిప్రోప్లోక్సాసిన్)
3) రిజర్‌‌వ గ్రూప్ (కొలిస్తిన్, సెపలోస్పోరిన్)
4) పైవన్నీ

40. జతపరచండి. 
పరాన్న జీవులు
i) ఎంటమీబా హిస్టోలైటికా
ii) ట్రిపనోమా గాంచియన్సీ
iii) ప్లాస్మోడియం వైవాక్స్
iv) వుచరేరియా బ్రాన్ కాప్టీ
వ్యాధులు
a) అతి నిద్ర
b) అమీబిక్ డిసెంట్రీ
c) మలేరియా
d) ఆంథ్రాక్స్
e) బోదకాలు
1) i-a, ii-b, iii-c, iv-d
2) i-b, ii-a, iii-d, iv-e
3) i-b, ii-a, iii-c, iv-e
4) i-c, ii-b, iii-d, iv-e

41. జతపరచండి.
జాబితా -I
i) హెర్పటాలజీ
ii) ఇక్తియాలజీ
iii) ప్రినాలజీ
iv) ఇథాలజీ
జాబితా -II
a) మెదడు అధ్యయనం
b) చేపల అధ్యయనం
c) సరీసృపాల అధ్యయనం
d) ఆవరణ శాస్త్రం
e) జంతువుల ప్రవర్తన అధ్యయనం
1) i-a, ii-b, iii-c, iv-d
2) i-c, ii-b, iii-a, iv-e
3) i-c, ii-b, iii-a, iv-d
4) i-c, ii-a, iii-a, iv-e

42. కింది వాటిలో ముఖబాహ్య జీర్ణక్రియ ఉన్న జీవి ఏది?
1) బొద్దింక
2) సముద్ర నక్షత్రం
3) జలగ
4) పైలా

43. కింది వాటిలో సరైన జత ఏది?
ఎ) ఎడ్రినలిన్ - బీపీకి కారణమైన హార్మోన్
బి) ఆక్సిటోసిన్ - పాల ఉత్పత్తికి తోడ్పడే హార్మోన్
సి) థైరాక్సిన్ - చిరుకప్ప రూప విక్రియకు తోడ్పడుతుంది
1) ఎ, బి, సి
2) బి
3) ఎ, సి
4) ఎ, బి

44. ప్రాణాంతకమైన మలేరియాకు కారణం?
1) ప్లాస్మోడియా మలేరియే
2) ప్లా-పాల్సీపెరం
3) ప్లా-ఓవేలి
4) ప్లా-వైవాక్స్

45. కింది వాటిలో టైపాయిడ్ లక్షణం కానిది ఏది?
1) లో పల్స్‌రేట్, హై ఫీవర్
2) పొత్తికడుపులో నొప్పి, హై పల్స్‌రేట్
3) లో పల్స్‌రేట్‌తోపాటు తరుచుగా మలవిసర్జన
4) 1, 2

46. బోదకాలు వ్యాధి దేని వల్ల వస్తుంది?
1) ప్రోటోజోవా పరాన్నజీవి
2) బాక్టీరియా
3) వైరస్
4) హెల్మింథిస్ పరాన్నజీవి

47. కింది వాటిలో బాక్టీరియా వల్ల కలిగే వ్యాధి ఏది?
ఎ) హన్‌సన్స్ డిసీజ్
బి) మీజిల్స్
సి) ఎల్లో ఫీవర్
డి) లాక్‌జా
ఇ) ఊపింగ్‌కాఫ్
ఎఫ్) ఫ్లూ
1) ఎ, డి, ఇ
2) ఎ, బి, సి
3) ఎ, డి, ఎఫ్
4) ఎ, బి, సి, డి, ఇ, ఎఫ్

48. జతపరచండి.
ఆల్కలాయిడ్స్
i) ఎల్.ఎస్.డి.
ii) కెఫిన్
iii) కొకైన్
iv) హసిస్
మొక్కలు
a) ఎరిత్రోక్సైలాన్
b) కాఫియా అరాబికా
c) కెన్నాబిస్
d) ఎర్గాట్
e) కమెల్లియా సయనెన్సిస్
1) i-a, ii-b, iii-c, iv-d
2) i-d, ii-b, iii-a, iv-c
3) i-d, ii-a, iii-b, iv-c
4) i-b, ii-c, iii-d, iv-e

49.పొగాకు నుంచి లభించే నికోటిన్ దేన్ని విడుదల చేయడం ద్వారా కేంద్రనాడీ వ్యవస్థను ఉత్తేజ పరుస్తుంది?
1) డోపమైన్
2) అడ్రినలిన్
3) హిస్టమిన్
4) సెరటోనిన్

ANSWERS:
1)4 2)3 3)1 4)4 5)1 6)2 7)4 8)1 9)1 10)4 11)3 12)3 13)4 14)3 15)4 16)2 17)2 18)3 19)2 20)1 21)2 22)2 23)3 24)3 25)2 26)3 27)3 28)4 29)3 30)2 31)3 32)2 33)4 34)1 35)1 36)4 37)1 38)3 39)4 40)3 41)2 42)2 43)2 44)2 45)2 46)4 47)1 48)2 49)2

Biology Questions in Telugu Part-7

No comments:

Post a Comment