Biology Questions in Telugu Part-5



1. భారతదేశం తొలిసారిగా జన్యుపరంగా తయారుచేసిన టీకా మందు?
1) మలేరియా
2) ఎఫ్.ఎమ్.డి.
3) హెచ్.బి.వి.
4) బి.సి.జి.

2. కింది ఏ వైరస్ వల్ల చికెన్ పాక్స్ వస్తుంది?
1) వారిసెల్లా వైరస్
2) అడినో వైరస్
3) నిఫా వైరస్
4) మిక్సో వైరస్

3. పోలియో వ్యాధి శరీరంలో ఏ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది?
1) శ్వాస వ్యవస్థ
2) జీర్ణ వ్యవస్థ
3) నాడీ వ్యవస్థ
4) కండరాల వ్యవస్థ

4. సాధారణ జలుబును కలిగించే వైరస్?
1) రుబెల్లా
2) రైనో వైరస్
3) ఫిఫా వైరస్
4) టోగో వైరస్

5. బ్రేక్‌బోన్ ఫీవర్ (Breakbone fever) అని ఏ వ్యాధిని అంటారు?
1) రుబెల్లా
2) చికున్‌గున్యా
3) డెంగ్యూ
4) పచ్చజ్వరం

6. National AIDS Control Organisation (NACO) ఎక్కడ ఉంది?
1) న్యూఢిల్లీ
2) పూణే
3) ముంబై
4) హైదరాబాద్

7. భారత్‌లో తొలిసారిగా చికున్‌గున్యా ఎప్పుడు కనిపించింది?
1) 1963
2) 1965
3) 1973
4) 2006

8. ఏడాది లోపు పసిపిల్లల్లో డయేరియాకు ప్రధాన కారణమైన వైరస్?
1) ఆల్ఫా
2) రోటా
3) లైసా
4) ఫేవీ

9. హెపటైటిస్ (Hepatitis) దేనితో సంబంధం కలిగిన జబ్బు?
1) గుండె మంట
2) కాలేయం మంట
3) రక్తకణాలు నశించడం
4) ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్

10. ‘పోలియో వ్యాక్సిన్’ను తయారుచేసిన శాస్త్రవేత్త?
1) ఇ.జెన్నర్
2) డా.సాక్
3) సెయింట్ హేల్
4) జెన్నర్

11. "Mumps' అనే వైరల్ వ్యాధిలో కింది ఏ అవయవం వాపుకు గురవుతుంది?
1) అధో జంభికా గ్రంథి
2) అధో జిహ్వికా గ్రంథి
3) పెరోటిడ్ గ్రంథి
4) జంభికా గ్రంథి

12. ఎయిడ్స్ (AIDS) గురించి యువతలో అవగాహన కల్పించే నిమిత్తం మన దేశంలో తొలిసారిగా Red Ribbon Express (RRE)ను ఎప్పుడు ప్రారంభించారు?
1) 2007 డిసెంబర్ 1
2) 2009 డిసెంబర్ 1
3) 2007 డిసెంబర్ 3
4) 2006 డిసెంబర్ 1

13. మానవులలో ఇన్ఫెక్షన్ వ్యాప్తిచేసే జికా వైరస్ (Zika virus)కు వాహకంగా పనిచేసే దోమ ఏ రకానికి చెందింది?
1) క్యూలెక్స్ 5
2) ఏడిస్ ఈజిప్టై
3) అనాఫిలిస్ దోమ
4) క్యూలెక్స్ పైపియన్‌‌స

ANSWERS:
1)3 2)1 3)3 4)2 5)3 6)1 7)1 8)2 9)2 10)2 11)3 12)1 13)2

No comments:

Post a Comment