Biology Questions in Telugu Part-3



1. కింది వాటిలో ఏ హార్మోన్ అయోడిన్‌ను కలిగి ఉంటుంది?
 1) ఇన్సులిన్
2) పారాథార్మోన్
3) థైరాక్సిన్
4) అడ్రినాలిన్

2. ఏ హార్మోన్ లోపం వల్ల అధికంగా మూత్ర విసర్జన జరిగి, నాలుక తడి ఆరిపోయి అధిక దాహం కలుగుతుంది?
 1) అడ్రినాలిన్
2) ఆల్డోస్టీరాన్
3) ఆక్సిటోసిన్
4) వాసోప్రెస్సిన్

3. క్షీర గ్రంథులలో పాల ఉత్పత్తిని ప్రేరేపించే హార్మోన్?
 1) ఆక్సిటోసిన్
2) ప్రొలాక్టిన్
3) ల్యూటినైజింగ్ హార్మోన్
4) వాసోప్రెస్సిన్

4. గర్భధారణ సమయంలో జరాయువు ఏర్పాటు, క్షీర గ్రంథుల అభివృద్ధ్దిని నియంత్రించేది?
 1) రిలాక్సిన్
2) ఈస్ట్రోజన్
3) ప్రొజెస్టీరాన్
4) గ్లూకగాన్

5.‘ఎండోక్రైనాలజీ’ శాస్త్ర పిత ఎవరు?
 1) థామస్ రాబిన్‌సన్
2) థామస్ ఎడిసన్
3) థామస్ కుక్
4) హెన్రీ ఎండోక్రైన్

6. ‘ఎమర్జన్సీ హార్మోన్’ను స్రవించే గ్రంథి ఏది?
 1) థైరాయిడ్
2) అడ్రినల్
3) క్లోమం
4) థైమస్

7. థైరాక్సిన్ లోపం వల్ల పెద్దవారిలో వచ్చే వ్యాధి?
 1) టెటాని
2) క్రెటినిజం
3) గాయిటర్
4) రికె ట్స్

8. మానవ శరీరంలో సోడియం అయాన్లను నియంత్రించే హార్మోన్ ఏది?
 1) కార్టిసోల్
2) ఆల్డోస్టీరాన్
3) ఎడ్రినాలిన్
4) థైరాక్సిన్

9. ‘లింఫోసైట్స్’ అనే తెల్లరక్తకణాల ఏర్పాటు, శిక్షణలో పాల్గొనే గ్రంథి?
 1) పారాథైరాయిడ్
2) థైమస్ గ్రంథి
3) అడ్రినల్
4) పీనియల్ గ్రంథి

10. మానవ శరీరంలో ‘ఆడమ్స్ ఆపిల్’ అని ఏ గ్రంథిని పిలుస్తారు?
1) అడ్రినల్
2) థైరాయిడ్
3) థైమస్
4) క్లోమ గ్రంథి

11. మానవ శరీరంలోని రక్తంలోని కాల్షియంను, ఫాస్ఫేట్ను నియంత్రించేది?
1) వృద్ధి హార్మోన్
2) గ్లూకగాన్
3) పారాథార్మోన్
4) థైరాక్సిన్

12. రక్తపోటును నియంత్రించే హార్మోన్?
 1) థైరాక్సిన్
2) ఇన్సులిన్
3) వాసోప్రెస్సిన్
4) ఎడ్రినాలిన్

13. ‘పీయూష గ్రంథి’ నియంత్రణలో లేని గ్రంథి?
1) అవటు గ్రంథి
2) పార్శ్వ అవటు గ్రంథి
3) అధివృక్క గ్రంథి
4) క్లోమం

14.జీవక్రియా రేటును పెంచే హార్మోన్?
 1) కాల్సిటోనిన్
2) థైరాక్సిన్
3) ఇన్సులిన్
4) గ్లూకగాన్

15. కింది వాటిలో ‘Stress hormone’ ఏది’?
 1) కార్టిసాల్
2) ఆల్డోస్టీరాన్
3) ఎడ్రినాలిన్
4) టెస్టోస్టీరాన్

ANSWERS:
1)3 2)4 3)2 4)3 5)2 6)2 7)3 8)2 9)2 10)2 11)3 12)4 13)2 14)2 15)1

No comments:

Post a Comment