Biology Questions in Telugu Part-1



1. గాయాలు త్వరగా మానటానికి ఉపయోగపడే విటమిన్ ఏది? 
ఎ) విటమిన్ ఎ
బి) విటమిన్ సి
సి) విటమిన్ ఇ
డి) విటమిన్ కె

2. లోహాన్ని కలిగి ఉండే విటమిన్ ఏది? 
ఎ) విటమిన్ ఎ
బి) విటమిన్ బి12
సి) విటమిన్ సి
డి) విటమిన్ డి

3. కింది వాటిలో నీటిలో కరగని విటమిన్ ఏది? 
ఎ) కాల్సిఫెరాల్
బి) థయమిన్
సి) ఆస్కార్బిక్ ఆమ్లం
డి) పిరిడాక్సిన్

4. పాలలో లేని విటమిన్ ఏది? 
ఎ) విటమిన్ డి
బి) విటమిన్ బి1
సి) విటమిన్ సి
డి) విటమిన్ బి12

5. ఆవుపాలు కొద్దిగా పసుపు రంగులో ఉండడానికి కారణం?
ఎ) గ్జాంధోఫిల్స్
బి) రిబోఫ్లేవిన్
సి) కెరోటిన్
డి) జాంధిన్

6. ‘పెల్లాగ్రా’ వ్యాధి రాకుండా నిరోధించే విటమిన్ ఏది? 
ఎ) విటమిన్ బి5
బి) విటమిన్ బి7
సి) విటమిన్ బి3
డి) విటమిన్ బి9

7. ఏ విటమిన్ లోపం వల్ల ‘మెగలోబ్లాస్టిక్ ఎనీమియా’ సంభవిస్తుంది? 
ఎ) కొబాలామిన్
బి) పిరిడాక్సిన్
సి) నియాసిన్
డి) ఫోలిక్ ఆమ్లం

8. ‘ఎల్లో ఎంజైమ్’ అని ఏ విటమిన్‌ను పిలుస్తారు? 
ఎ) విటమిన్ బి2
బి) విటమిన్ బి5
సి) విటమిన్ బి6
డి) విటమిన్ బి7

9. సాధారణ గుండె లయను నియంత్రించే విటమిన్ ఏది?
ఎ) ఆస్కార్బిక్ ఆమ్లం
బి) నియాసిన్
సి) పిరిడాక్సిన్
డి) థయమిన్

10. విటమిన్ బి12 లోపం ద్వారా వచ్చే రక్త హీనతను ఏమని పిలుస్తారు?
ఎ) న్యూట్రిషినల్ రక్తహీనత
బి) పెర్నీషియస్ రక్తహీనత
సి) మెగలోబ్లాస్టిక్ రక్తహీనత
డి) మైక్రోసిస్టిక్ రక్తహీనత

ANSWERS:
1)బి 2)బి 3)ఎ 4)సి 5)బి 6)సి 7)డి 8)ఎ 9)ఎ 10)బి

AP History Questions in Telugu Part-10


No comments:

Post a Comment