AP History Questions in Telugu Part-9



1. శాతవాహనులు తమ పాలనావిధానానికి ఆధారంగా తీసుకున్నవి?
i) మౌర్యుల పాలనాంశాలు
ii) మానవ ధర్మశాస్త్రం (మనుస్మృతి)
iii) కౌటిల్యుని అర్థశాస్త్రం
iv) మత్య్స పురాణం
 1) i,iv
2) i,ii,iv
3) i,ii,iii
4) పైవన్నీ

2. శాతవాహన పరిపాలనా విధాన లక్షణం కానిది ?
i) కేంద్రీకృత పరిపాలన
ii) భూదానాలు, గ్రామదానాలు
iii) వీరి పాలన సైనిక ఆధిపత్యం, భూస్వామ్యయుతం
iv) యుద్ధాలు, క్రతువులు
v) వ్యవసాయ మిగులు ఉత్పత్తిని ప్రజోపయోగ కార్యక్రమాలకు ఉపయోగించారు
vi) పన్నులు స్వల్పం
1) i,iii,vi
2) ii,iv,v,vi
3) i,v,vi
4) iii,v,vi

3.‘శాతవాహనుల పాలన కేంద్రీకృతం కాదు’.
పై వ్యాఖ్యకు సంబంధించి ఈ కింది వాటిలో సరైనది ?
i) సామంతులు స్వపరిపాలనాధికారాన్ని కలిగి ఉన్నారు
ii) గ్రామధికారులు ఇష్టానుసారం తమ అధికారాన్ని చెలాయించేవారు
iii) సామంతులకు స్వంతంత్రంగా నాణాలను ముద్రించే అధికారం ఉండేది
iv) ప్రాచీన భారతదేశంలో శాతవాహనులతో సహా రాజుకు చట్టాలు చేసే అధికారం లేదు
1) i,iii
2) ii,iii,iv
3) i,iv
4) i,ii,iii,iv

4. కింది వాటిలో సరైనది ?
 «i) ధర్మశాస్త్ర సమ్మతమైన రాచరికం శాతవాహన రాజ్యాంగానికి మూలం
ii) శాతవాహనులు వంశపారంపర్య రాజరిక విధానాన్ని కొనసాగించారు
iii) రాజుకు సంతానం లేకపోతే అతని సోదరులు రాజ్యపీఠం అలంకరించడానికి అర్హులు
iv) రాజకుమారుడు బాలుడైతే అతనికి యుక్తవయసు వచ్చేవరకు రాజు సోదరుడు కానీ, రాజకుమారుని తల్లి కానీ పరిపాలనా బాధ్యతలు నిర్వహించేవారు
1) i,ii
2) iii,iv
3) i,ii,iii
4) పైవన్నీ

5. కింది వాటిలో సరైనది ?
 i) శ్రీముఖుని తదుపరి శాతకర్ణి -ఐ చిన్నవాడు కావడంతో తమ్ముడు కృష్ణుడు (కన్హ) రాజ్యపాలనా బాధ్యతలు స్వీకరించాడు
ii) శాతకర్ణి - ఐ మరణానంతరం వేదసిరి / పూర్ణోత్సుంగుడు బాలుడగుటచే తల్లి నాగానిక పాలనాబాధ్యతలు చేపట్టినట్టు నానాఘట్ శాసనం తెలుపుతోంది
iii) రాజు బాల్యంలోనే సింహాసనం అధీష్టించిన సందర్భంలో రాజమాత పరిపాలనా వ్యవహారాలను రాజు పేరుతో కొనసాగించేవారు. బాలశ్రీ నాసిక్ శాసనం ఈ విషయాన్ని ధృవపరుస్తోంది.
1) i,iii
2) i,ii
3) ii,iii
4) i,ii,iii

6. శాతవాహన రాజులు ధరించిన మాతృనామ సంజ్ఞల (Metronymics) వల్ల, వారికి రాజ్యం తల్లి నుంచి సంక్రమించేదని, వీరు ‘మాతృస్వామ్య’ (Matrilineal) విధానంతో కూడిన సాంఘిక సంప్రదాయం కలిగినవారని పేర్కొన్న చరిత్రకారుడు / చరిత్రకారులు ?
 1) ఆ..ఔ.హనుమంతరావు
2) సతీష్ చంద్ర
3) ఖ..శర్మ
4) 1,2,3

7. i) శాతవాహన నామం శాతవాహనుడనే రాజు ద్వారా వచ్చింది
 ii) గౌతమిపుత్రశాతకర్ణి ‘కులపురుష పరంపరాగత...’ పొందినాడని బాలశ్రీ వర్ణించింది
iii) మాతృనామ సంజ్ఞలు గౌతమిపుత్ర శాతకర్ణికి పూర్వం లేవు
iv) కేవలం ఇద్దరి రాణుల పేర్లు మాత్రమే మాతృనామసంజ్ఞల ద్వారా తెలుస్తున్నవి
పై వాక్యాలాధారంగా శాతవాహనుల రాజరికం ?
1) పితృస్వామ్యం (patrilineal)
2) మాతృస్వామ్యం (matrilineal)
3) పితృ లేదా మాతృ స్వామ్యం
4) చెప్పలేము

8. కౌటిల్యుని అర్థశాస్త్రంలో పేర్కొన్న అభిగామిక లక్షణాలనే శాతవాహనుల కాలం నాటి ఏ శాసనంలో స్ఫురద్రూపి, ఆరోగ్యం, దేహధారుడ్యం కలవాడు, ఉన్నత వంశంలో జన్మించిన వాడుగా గౌతమిపుత్ర శాతకర్ణిని గురించి తెలిపింది ?
1) నాసిక్ శాసనం
2) నాసిక్‌ప్రశస్తి
3) కార్లే శాసనం
4) జున్నార్ శాసనం

9. నాభాగ, నహ్రుష, జనమేజయ, నగర, యయాతి, రామ, అంబరీషుల వంటి చక్రవర్తులతో సమానమైన తేజస్సు, సమానపరాక్రమం, ధార్మికత కలిగినవానిగా ఎవరి వ్యక్తిత్వాన్ని బాలశ్రీ నాసిక్ ప్రశస్తిలో వర్ణించింది ?
1) వాసిష్ఠిపుత్ర పులోమావి
2) యజ్ఞశ్రీశాతకర్ణి
3) గౌతమిపుత్ర శాతకర్ణి
4) ఎవరూకాదు

10. శాతవాహన రాజుల బిరుదులకు సంబంధించి కింది వాటిలో సరైనది ?
i) మౌర్యుల వలె నిరాడంబర రాజ బిరుదు
ii) రాజాధిరాజ, సామ్రాట్, ఏకరాట్ బిరుదులు
iii) గౌతమి బాలశ్రీ తన కొడుకును, మనవడిని ‘మహారాజు’ అని పిలిపించింది
iv) శాతవాహన శాసనాల్లో పాలకుడిని ఏకరీతిగా రాజని పిలవడం జరిగింది
1) i,iv
2) ii,iii,iv
3) i,iii,iv
4) పైవన్నీ

11. రాజు దైవాంశ సంభూతుడని, విశ్వకర్మ అన్ని దేవుళ్ళ నుంచి వారి ముఖ్య లక్షణాలను గ్రహించి రాజును సృష్టిస్తాడని తెలిసే ధర్మశాస్త్ర వాఙ్మయాలు ?
1) నారదస్మృతి
2) విష్ణుస్మృతి
3) బృహస్పతి స్మృతి
4) 1,2,3

12. ‘నా సుఖ దుఃఖాలు సామాన్యప్రజల కన్నా భిన్నం కాదన్న’ శాతవాహనరాజు ?
 1) యజ్ఞశ్రీశాతకర్ణి
2) వాసిష్ఠీపుత్ర పులోమావి
3) హాలుడు
4) గౌతమిపుత్రశాతకర్ణి

13.‘న్యాయవిరుద్ధమైన పన్నులనెన్నడూ విధించలేదు. బ్రాహ్మణులను సంతృప్తిపరచడమేగాక, అతి పేదవారి బాగుకోసం పాటుపడెను’. ఈ వ్యాఖ్య ఏ శాతవాహనరాజుకు సంబంధించినది ?
 1) శాతకర్ణి - I
2) గౌతమిపుత్ర శాతకర్ణి
3) పులోమావి
4) యజ్ఞశ్రీశాతకర్ణి

మంత్రిమండలి - ఉద్యోగులు
14. కింది వాటిలో సరైనది ?

 i) అశోకుని శాసనాలు మహామాత్రులనే పేర ఒక ఉన్నతాధికార వర్గాన్ని పేర్కొంటున్నవి
ii) శాతవాహన రాజైన కృష్ణుని (కన్హ) కొలువులో ఒక మహామాత్రుడు ఉన్నట్టు నాసిక్ శాసనం తెలుపుతోంది
1) i
2) ii
3) i,ii
4) ఏదీకాదు

15. జతపరచండి ?
మంత్రులు
i) విశ్వామాత్యులు
ii) రాజామాత్యులు
iii) మహామాత్యులు
iv) శ్రమణామాత్యులు / మహా ఆర్యక
iv) అమాత్య
అధికారం
a) రెవెన్యూ వ్యవహారాలు
b) మతసంస్థల అజమాయిషి
c)రాజు ఆంతరంగాక సలహాదారు
d) రాజాజ్ఞలను అమలు పరచడం
e) ఆహారాల పాలకుడు
1) i-a,ii-b,iii-c,iv-d,v-e
2) i-c,ii-d,iii-a,iv-b,v-e
3) i-c,ii-d,iii-b,iv-a,v-e
4) i-b,ii-a,iii-c,iv-d,v-e

16. శకక్షాత్రపుల శాసనాలలో పేర్కొన్న ‘మతిసచివ’, ‘కర్మసచివ’ ల బాధ్యతలు ?
1) రాజాజ్ఞలను అమలుపరచడం, రాజు ఆంతరంగిక సలహాదారు
2) ఆహారాల అధిపతి, రాజాజ్ఞలను అమలుపరచడం
3) ఆర్థికమంత్రి, రక్షణ మంత్రి
4) రాజు ఆంతరంగిక సలహాదారు, రాజాజ్ఞలను అమలు పరచడం

17. జతపరచండి ?
 శాతవాహన అధికారులు
i) భాండాగారికుడు
ii) హేరణికుడు
iii) లుఖకుడు
iv) ప్రతీహారుడు
హోదా / బాధ్యత
a) ఆంతరంగిక కార్యదర్శిగా రాజాజ్ఞల రచన (writer / clerk)
b) ప్రజలకు రాజదర్శనం / రాజభవన రక్షకుడు
c) వస్తు సముదాయ ఖజానా (controller of stores)
d) ధనాన్ని నిల్వ చేయడం (treasurer)
1) i-a,ii-b,iii-c,iv-d
2) i-b,ii-a,iii-c,iv-d
3) i-c,ii-d,iii-a,iv-b
4) i-c,ii-d,iii-b,iv-a

18. i) నిబంధకార - రాచకార్యాలు పత్రాలలో రాసి భద్రపరిచే అధికారి (registrar of documents)
ii) పట్టికాపాలక - ఆర్కైవ్‌‌స డెరైక్టర్ (archives director)
iii) గణపక - గణకుడు (accountant)
iv) మహాతక - రాజభవనంలో గృహబాధ్యతలు నిర్వహించడం (chamberlain)
v) మహామాత్ర - అన్ని శాఖలకు పెద్ద (head of departments)
1) i,iii
2) ii,iv
3) iii,iv,v
4) పైవన్నీ

19. కేంద్ర ప్రభుత్వ వ్యవహారాలన్నీ పత్రాలలో రాసి భద్రపరిచే ఉద్యోగులను నిబంధకారులని అంటారు. తర్వాత కాలంలో వీరు నిర్వహించే శాఖని ఏమని పిలిచేవారు ?
1) అఠవణ
2) కందాచార
3) అక్షపాలిక
4) అక్షపటలక

20. నాసిక్ గృహాలయాల్లో భటపాలిక వేయించిన శాసనం ప్రకారం ఆమె రాజమాత్యుడు, భండాగారికుడైన అణియతనకుని భార్యగా తెల్పుతోంది. దీని ప్రకారం ?
1) శాతవాహనుల కాలంలో భండాగారికుడు మాత్రమే రాజమాత్యుడు
2) శాతవాహనుల కాలంలో అధికారులందరూ రాజమాత్యులనే అధికార వర్గానికి చెందినవారు
3) శాతవాహనుల కాలంలో రాజమాత్యులందరూ భండాగారిక వర్గానికి చెందుతారు
4) 1,2,3

సామ్రాజ్య విభజన - అధిపతులు
21. నిశ్చితవాక్యం (A) : భారతవేశ ప్రాచీన చరిత్రలో శాతవాహనులు సామ్రాజ్యాల యుగానికి చెందినవారు

 హేతువు (R) : మౌర్యసామ్రాజయం అస్తమించిన తర్వాత ప్రాచీన భారతదేశ చరిత్రలో అత్యంత విస్తీర్ణ సామ్రాజ్యాన్ని నెలకొల్పినవారు శాతవాహనులు.
1) A సరైనది, R సరికానిది
2) A సరికానిది, R సరైనది
3) A,R లు సరికానివి
4) A,R లు సరైనవి

22. i) శాతవాహన రాజులు దక్షిణపథపతులుగా వర్ణించుకున్నారు
 ii) ఉచ్ఛదశలో శాతవాహన సామ్రాజ్యం ఉత్తరంగా వింధ్యపర్వతాలను దాటి కచ్, సురాష్ర్ట, మాళ్వ భూభాగాలను కూడా ఆక్రమించింది
iii) పాటలీపుత్రం వరకూ శాతవాహనులు విజృంభించారు
iv) శాతవాహన సామ్రాజ్యం ఆరావళి నుంచి నీలగిరుల వరకు కూడా ఒక దశలో విస్తరించింది
పై వాక్యాల ఆధారంగా కింది వాటిలో సరైనది ?
1) శాతవాహన సామ్రాజ్యం అరేబియా నుంచి బంగాళాఖాతం వరకు విస్తరించింది
2) అరేబియా, హిందూ సముద్రాల మధ్య ప్రాంతాల్లో శాతవాహన సామ్రాజ్యం విస్తరించింది
3) తూర్పున బంగాళాఖాతం, పశ్చిమాన అరేబియా సముద్రం, ఉత్తరాన నర్మదా, దక్షిణాన కృష్ణా నదుల ప్రాంతాల్లో శాతవాహన సామ్రాజ్యం విస్తరించింది
4) ఉత్తరాన కాశ్మీర్ నుంచి దక్షిణాన కన్యాకుమారి వరకు శాతవాహన సామ్రాజ్యం విస్తరించింది

23. శాతవాహనుల పరిపాలన, సాంఘిక, ఆర్థిక జీవన, మత, కళ, సాహిత్యాలపై వీరి ప్రభావం ఉంది ?
 i) వైదిక రుషులు
ii) మౌర్యుల ఉన్నతాధికారులు
iii) బౌద్ధమత ప్రచారకులు
1) i
2) ii
3) ii,iii
4) i,ii,iii

24. శాతవాహనుల కాలం నాటి సామంతులు ఎవరు ?
i) రాజు - వారి నామాలతో నాణాల ముద్రణ
ii) మహాభోజులు, మహారథిలు - పశ్చిమ, దక్కన్‌లను పాలించే వారసత్వ సామంతులు
iii) మహాసేనాపతి - కొందరు కేంద్రంలో శాఖల నియంత్రణ, మరికొందరు రాజ్య సరిహద్దు వద్ద
iv) అమాత్యులు - కేంద్రంలో రాజు దగ్గర ఉండేవారు
1) i,iii
2) ii,iii
3) i,ii,iii
4) పైవన్నీ

25.కింది వాటిలో సరైనది ?
i) ‘మహారథిక’ అనేది ఒక బిరుదు కలిగిన సామంత ప్రభువులు. భూమిశిస్తు, ఇతర సుంకాల రూపంలో ఆదాయాన్ని వసూలు చేస్తూ, ఒక ప్రాదేశిక విభాగంపై ఆధిపత్యం కలిగి ఉంటారు
ii) మహాభోజు అనేవారు మహారథికుల విధులను పోలి, వారికన్నా ఉన్నతులైనవారు
iii) కుర, చుటు, ఇక్ష్వాక వంశ శాతవాహన సామంతుల మాతృ సంజ్ఞలు ధరించారు
1) i
2) ii
3) i,ii,iii
4) ఏదీకాదు

26. వాసిష్ఠిపుత్ర పులోమావి కాలం నాటి కార్లా గృహశాసనం ‘బఖళకీయు’ డైన మహారథి వాసిష్ఠిపుత్ర సోమదేవుడు చేసిన ఒక దానాన్ని తెలుతోంది. దీని ప్రకారం---?
 1) రాజు అనుమతి పొంది దానధర్మాలు చేశాడు
2) రాజు అనుమతి పొందకుండానే దానధర్మాలు చేశాడు
3) మంత్రులు ధృవీకరించాక రాజు అనుమతితో దానాన్ని చేశాడు
4) ఏదీకాదు

27. శాతవాహనుల కాలంలో రాజులు కాకుండా స్వయంగా నాణాలను మాద్రించి విడుదల చేసినవారు ?
i) రాజప్రతినిధులు
ii) మహారథికులు
iii) మహాభోజకులు
iv) కుర, చుటు, ఇక్ష్వాక వంశాల వారు
1) i,iii
2) i,ii,iii
3) ii,iii,iv
4) i,ii,iii,iv

28. జతపరచండి ?
ప్రాంతం
i) కొల్హాపురం
ii) మైసూర్
iii) విజయపురి
iv) మహారాష్ర్ట
శాతవాహనుల సామంతులు
a) ఇక్ష్వాకులు
b) కురవంశస్థులు
c) చుటు వంశస్థులు
d) మహారథిలు
1) i-c,ii-a,iii-b,iv-d
2) i-c,ii-b,iii-d,iv-a
3) i-b,ii-a,iii-c,iv-d
4) i-a,ii-b,iii-c,iv-d

29.శాతవాహన రాజ్య విభాగాలను ఆరోహణ క్రమంలో అమర్చండి ?
i) నిగమం ii) ఆహారం iii) జనపథం iv) గ్రామం
1) i,ii,iii,iv
2) iv,i,iii,ii
3) iii,iv,i,ii
4) iii,ii,i,iv30. శాతవాహనుల ప్రత్యక్ష పాలనలోనున్న రాజ్యాన్ని అనేక ఆహారాలు (ప్రావిన్‌‌స) గా విభజించారు. వాటి అధిపతి ?
1) మహామాత్రులు
2) అమాత్యులు
3) ఆహారధిపతి


4) మహాసేనాపతి
31. ఆహారాల అధిపతులైన అమాత్యులకి సంబంధించి కింది వాటిలో సరైనది ?

i) భూదానాలు, గ్రామాలను రాజు అనుమతి లేనిదే ఇవ్వరాదు
ii) పదవి వంశపారంపర్యం
iii) బదిలీలు 5 సంవత్సరాలకొకసారి జరిగేవి
iv) తొలగించడానికి వీలులేదు
v) కేవలం 6 సంవత్సరాల వ్యవధిలో ముగ్గురు అమాత్యులను నియమించనట్టు గౌతమీపుత్ర శాతకర్ణి నాసిక్ శాసనం తెలుపుతోంది
1) i,ii
2) i,iii,iv
3) iii,iv
4) పైవన్నీ

32. శాతవాహనుల శాసనాల్లో ఆహారాలుగా పిలువబడినవి ? 
i) గోవర్ధన ii) సోపార iii) మామల iv) శాతవాహన
1) i,ii
2) i,iii,iv
3) iii,iv
4) పైవన్నీ

33.శకులతోటి సంఘర్షణ వల్ల సరిహద్దు ప్రాంతాల రక్షణకు శాతవాహ నులు ప్రత్యేక శ్రద్ధ వహించి ఆప్రాంతాలను సైన్యాధిపతుల ఆధీనంలో ఉంచి వారికి సామంతాధికారాలు ఇచ్చినటు,్ట వారిని ------అనే పేరుతో పిలచినట్టు మ్యానదొని శాసనం తెల్పుతోంది.
 1) గ్రామణి
2) గుల్మిక
3) అమాత్య
4) మహామాత్ర

34. మూడో పులోమావి మ్యాకదొని శాసనం ప్రకారం శాతవాహనుల ఆహారానికి మహాసేనాపతి ?
1) ఖందనాగుడు
2) శివస్కంధ
3) ఖందవర్మ
4) ఖందశర్మ

35. శాతవాహనుల గ్రామ పాలనకి సంబంధించి కింది వాటిలో సరైనది ?
i) చివరిపాలనా విభాగం
ii) అధిపతి గ్రామణి / గ్రామిన్
iii) గ్రామపరిధి 5 - 10 గ్రామాల వరకు ఉండేది
iv) స్వయం పరిపాలనాధికారం ఉండేది
1) i,ii
2) ii,iii,iv
3) i,iii
4) i,ii,iii,iv

36. గ్రామానికి అధిపతి ‘గ్రామణి’ అని, అతని అధికార దర్పాల గురించి తెలిపే గ్రంధం ?
 1) కౌటిల్యుని అర్థశాస్త్రం
2) యోగసారం
3) నీతిసార
4) గాథాసప్తసతి

9. ఆంధ్రప్రదేశ్ సామాజిక, సాంస్కృతిక చరిత్ర
37. శాతవాహనుల కాలం నాటి వాణిజ్య కేంద్రాల్లోని ‘నిగమ’ కు సంబంధించి కింది వాటిలో సరైనది ?

i) నగరాల్లో ‘నిగమ’ అనేవి పౌరసభలు
ii) పరిపాలనా బాధ్యతలు నిర్వహించేవి
iii) ఇవి వాణిజ్య సంఘాలు
iv) గృహపతులు (గృహపతి - కొన్ని రైతు గృహాలకు అధిపతి) కూడా సభ్యులుగా ఉండేవారు
v) సభలలో పౌరులు, వారి అభిప్రాయాలను స్వేచ్ఛగా ప్రకటించేవారు
1) i,ii
2) i,ii,iii
3) i,iii,iv,v
4) పైవన్నీ

న్యాయ, సైనిక విధానాలు
38. శాతవాహనుల కాలంలో నేరస్తులకు విధించే శిక్షల గురించి, స్మశానంలో నేరస్తులను వేళాడదీసే విషయాల గురించి తెలిపే గ్రంథం --------?

 1) గాధాసప్తసతి
2) కథాసరిత్సాగరం
3) బృహత్కథ
4) కాంత్ర వ్యాకరణం

39. ‘బురుజు మీద ఉండే ఒక్క విలుకాడు నూరు మంది శత్రువులకు ఈడవుతారని, కోటలో ఆయుధాలు, ధనం, ధాన్యం, వాహన పశువులు, బ్రాహ్మణులు, వృత్తిపనివారు, శిల్పకుశలురు, పశుగ్రాసం, నీరు సమృద్ధిగా నిల్వచేయాలని’ కోట ప్రాధాన్యాన్ని వివరించిన గ్రంథం?
 1) గాధాసప్తసతి
2) మనుధర్మ శాస్త్రం
3) నీతిసార
4) మత్య్స పురాణం

40.ఖారవేలుని హాతిగుంఫ శాసనం, అమరావతి శిల్ప ఫలకాలు తెలిపేదేమిటి ?
1) యుద్ధ వ్యూహరచన, చతురంగబలాలు
2) చతురంగబలాలు, యుద్ధ వ్యూహరచన
3) యుద్ధ వ్యూహరచన, దిగ్విజయ యాత్రలు
4) సైనిక స్థావరాలు, ఆయుధాలు

41. చతురంగ బలాలలో లేనిది ?
 i) అశ్వదళం ii) గజసైన్యం iii) రధాలు iv) కాల్బలం v) పురచరిష్ణు vi) ఫిరంగిదళం
1) i,v
2) ii,vi
3) v,vi
4) iii,v,vi

42. అమరావతి శిల్పాలలో కనిపించే ఆయుధాలు ?
i) విల్లు - అంబులు ii) కత్తి iii) బల్లెం iv) పరశువు
v) గద vi) డాలు vii) ధృడమైన కర్ర
1) i,ii,iii
2) iii,iv,v,vi
3) i,ii,iii,v,vi
4) పైవన్నీ

43. ‘ముదుకుతల’ అనే సేనాధిపతి (సేనాగోప) పేరు ఏ శాసనంలో కనిపిస్తోంది ?
1) నాసిక్
2) కార్లే
3) అమరావతి
4) జున్నార్

44. కింది వాటిలో సరైనది ?
i) కటక: సైన్యాగారం (contonement)
ii) స్కంధావారం: తాత్కాలిక సైనిక శిబిరం (military camp)
1) i
2) ii
3) i,ii
4) ఏదీకాదు

ఆదాయం
45. శాతవాహనుల రాజ్యానికి ప్రధాన ఆదాయ మార్గమైన భూమిశిస్తు ఎంత ఉండేది ?

1) 1/2
2) 1/3
3) 1/4
4) 1/6

46. కింది వాటిలో సరికానిది ?
 i) రాజ్యంలో వ్యవసాయ భూమి అంతటికి రాజు స్వంతదారుడు
ii) రాజక్షేత్రం (రాజ కంఖేట) మాత్రమే రాజు స్వంతం
iii) రాజ క్షేత్రానికి వెలుపల భాదానం చేయవలసి వస్తే పొలాన్ని రాజు కొనేవాడు
iv) బ్రాహ్మణ, శ్రమణులకు భూదానాలిచ్చే సంప్రధాయం మలివేద కాలంలో ప్రారంభమైంది
v) గౌతమిపుత్ర శాతకర్ణి బౌద్ధ సన్యాసులకు భూములు దానంతోబాటు వాటి మీద పరిపాలన, ఆర్ధిక సంబంధమైన హక్కులను కూడా ఇచ్చినట్టు నాసిక్ శాసనం తెల్పుతోంది.
1) ii,iii
2) i,iv
3) ii,v
4) i,iv,v

47. జతపరచండి ?
i) దేయ, మేయ
ii) కారుకర
iii) భాగ
iv) భోగ
a) రహదారుల మీద సుంకాలు, వృత్తిపన్ను
b) పంటలో రాజుకు ఇవ్వవలసిన భాగం
c) సాధారణ గ్రామాల్లో వ్యవసాయదారులు పూర్తిగా భూమిపై యాజమాన్య హక్కులు కలిగి సాగుచేసి, వచ్చిన ఫలసాయంలో రాజుకివ్వవలసినది
d) ప్రభుత్వ భూముల్లో వ్యవసాయదారులు చెల్లించేది
1) i-a,ii-b,iii-c,iv-d
2) i-b,ii-a,iii-d,iv-c
3) i-c,ii-b,iii-a,iv-d
4) i-d,ii-a,iii-c,iv-b

48. శాతవాహనుల కాలంలో దేయ, మేయలనగా ?
1) ధాన్య, ధన రూపంలో చెల్లించే పన్నులు
2) ధన, ధాన్య రూపంలో చెల్లించే పన్నులు
3) వెట్టి, నిర్భంద చాకిరి
4) యుద్ధ సమయంలో ప్రజలు రాజుకు చెల్లించే పన్నులు

49. శాతవాహను అనంతర రాజవంశాల శాసనాలు పేర్కొన్న అదియమనుస్స (ఆర్థిక మనుష్య) ఎవరు ?
1) వర్తకం చేసేవ్యక్తి
2) నూతన జనావాసాలలో వ్యవసాయం చేసే వ్యక్తి
3) ఆర్థిక మంత్రి
4) ఉద్యోగి

50. శాతవాహనుల కాలంలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్నవి ?
i) పంటలు ii) వర్తకం iii) గనులు iv) ఉప్పుతయారీ
1) i,ii
2) ii,iii
3) i,ii,iii
4) iii,iv

ANSWERS:
1) 3 2)3 3)4 4)4 5)2 6)3 7)1 8)2 9)3 10)3 11)4 12)4 13)2 14)3 15)2 16)4 17)3 18)4 19)4 20)2 21)4 22)3 23)3 24)3 25)3 26)2 27)4 28)1 29)4 30)2 31)3 32)4 33)2 34)1 35)4 36)4 37)4 38)1 39)2 40)2 41)3 42)4 43)3 44)3 45)4 46)2 47)2 48)2 49)2 50)4

AP History Questions in Telugu Part-8

No comments:

Post a Comment