AP History Questions in Telugu Part-8



1. శాతవాహన వంశ రాజుల కాలపట్టిక నిర్మించడానికి ఉపయోగపడేవి ?
i) పురాణాలు ii) సమకాలీన సూచికలు iii) శాసనాలున్న శిలల వయస్సు
iv) నాణాలు
1) i,iii
2) i,ii,iv
3) iii,iv
4) పైవన్నీ

2.నిశ్చిత వాక్యం (A): అశోకునికి పూర్వమే ఆంధ్రులు స్వతంత్ర రాజ్యస్థాపన చేశారు.
హేతువు వాక్యం (R): అశోకుని 13వ శిలాశాసనం (క్రీ.పూ. 256) ఆంధ్రులు రాజవిషయంలో నివసిస్తున్నట్టు తెలుపుతుంది.
1) (A) (R) లు సరైనవి. (R)(A) కి సరైన వివరణ
2) (A) సరైనది. (R) సరికానిది
3) (A) సరికానిది. (R) సరైనది
4) (A) (R) లు సరైనవి. (R)(A) కి సరైన వివరణ కాదు.

3. శాతవాహన రాజుల పాలన కాల నిర్ణయంలో పురాణాల పాత్ర ఏమిటి ?
i) 30 మంది శాతవాహన రాజులు 450 సంవత్సరాలు పాలించారని పురాణాలు చెబుతున్నాయి.
ii) పురాణాల్లో పేర్కొన్న రాజుల పేర్లు ప్రాచీన శాసనాలు, నాణాల నుంచి సేకరించిన రాజుల పేర్లతో పోలిక లేదు.
iii) శాత వాహన వంశ చరిత్రకు అత్యంత ప్రామాణికం మత్స్యపురాణం.
iv) సిముకుడు కణ్వ వంశానికి చెందిన సుశర్మని వధించి రాజ్యాధికారాన్ని పొందినట్టు అన్ని పురాణాలు ఏకగ్రీవంగా చెబుతున్నాయి.
1) i,ii,iv
2) i,iii,iv
3) ii,iv
4) పైవన్నీ

4. శ్రీముకుని నుంచి గౌతమీపుత్ర శాతకర్ణి వరకు తొలి, మలి శాతవాహనులుగా చరిత్రకారులు విభజించడానికి కారణం ?
i) తొలి శాతవాహన రాజులు బలవంతులు
ii) పశ్చిమ మహారాష్ట్ర, గుజరాత్, మాళ్వాలలో శాతవాహనుల పాలన కొంతకాలం తర్వాత ఆగిపోయింది.
iii) గౌతమీపుత్ర శాతకర్ణి శక, యవన, పహ్లవులను ఓడించి, పశ్చిమ ప్రాంతాలను మళ్ళీ శాతవాహనుల అధికారంలోకి తెచ్చాడు.
iv) ఉత్తరాన కన్యాకుబ్జ నుంచి దక్షిణాన కంచి వరకు మలి శాతవాహన పాలన విస్తరించింది.
1) i,iv
2) ii,iii
3) i,ii,iv
4) పైవన్నీ

5. నానాఘట్ శిలాశాసనం, ఆ శిల వయస్సును బట్టి క్రీ.పూ. 2వ శతాబ్ధం మధ్యభాగం నుంచి క్రీ.పూ. 1వ శతాబ్ధి చివరి భాగానికి చెందినదిగా తెలుస్తోంది. ఈ కాలం కింది వారి పాలనకు సమకాలీనం ?
 i) అలెగ్జాండర్
ii) హెలియొడోరస్ - బెస్నగర్ స్తంభ శాసనం
iii) ఖారవేలుడు - హాతిగుంఫా శాసనం
iv) సముద్రగుప్తుడు - అలహాబాద్ శాసనం
1) i,iii
2) ii,iii,iv
3) ii,iii
4) i,ii,iii

6. కింది వాటిలో సరైనది ? 
i) కొండాపూర్, కోటిలింగాల్లో లభించిన సాదవాహన, సిముకుల నాణాలు, లిపి ప్రకారం ఇవి క్రీ.పూ. 3వ శతాబ్ధానికి చెందినవిగా నిర్ణయించవచ్చు.
ii) నెవాసాలో లభించిన శాతవాహన, కన్హ, శ్రీశాతకర్ణుల నాణాలను పరిశీలించిన సంకాలియా పండితుడు క్రీ.పూ. 3వ శతాబ్ధానికి చెందినవిగా నిర్ధారించారు.
1) i
2) ii
3) i,ii
4) i,ii రెండూ సరికావు

7. క్రీ.పూ. 271లో శాతవాహనుల పరిపాలన ప్రారంభమైనదని కింది వాటిలో దేని ఆధారంగా నిర్ధారించవచ్చు ?
i) హాతిగుంఫ, నానాఘట్ శాసనాల్లోని లిపుల పోలిక ద్వారా
ii) బిందుసారుని మరణంతో మగధలోని వారసత్వపోరు ద్వారా
iii) సమకాలీన విదేశీయులైన పశ్చిమ క్షత్రపుల (క్షహరాటులు, కార్ధమకులు) కాలంతో సమన్వయం ద్వారా
iv) గౌతమిపుత్ర శాతకర్ణి, అతని తల్లి బాలశ్రీల నాసిక్ శాసన ం ద్వారా
v) జోగల్ తంబి నాణాలు, వృషభదత్తుని నాసిక్, కార్లే శాసనాలు
vi) వృషభదత్తుని మంత్రి అయమల జున్నార్ శాసనం, చష్టన అందౌ శాసనం
vii) పెరిప్లస్ గ్రంధం
1) i,ii,vi,vii
2) iii,iv,v,vii
3) i,iv,v,vii
4) పైవన్నీ

8. శాతవాహనులు కణ్వదాస్యం నుంచి ఏ సంవత్సరం విముక్తయ్యారు ?
 1) క్రీ.పూ. 28
2) క్రీ.శ. 28
3) క్రీ.శ. 56
4) క్రీ.పూ. 56

9. జతపరచండి.
 చరిత్రకారుడు
i) గొర్తి వెంకటరావు
ii) భండార్కర్
iii) సర్కార్
iv) గోపాలాచారి
శాతవాహనుల రాజ్యపాలన ప్రారంభకాల నిర్ణయం
a) క్రీ.పూ. 73
b) క్రీ.పూ. 30
c) క్రీ.పూ. 271
d) క్రీ.పూ. 234
1) i-a,ii-b,iii-c,iv-d
2) i-c,ii-a,iii-b,iv-d
3) i-c,ii-a,iii-d,iv-b
4) i-b,ii-a,iii-c,iv-d

II శాతవాహన రాజులు
10. ఉత్తర భారతంలో శక, యవన, పహ్లవ వంటి విదేశీయుల దాడులతో అయోమయస్థితిలో ఉన్న దక్షిణాపథాన్ని సమైఖ్యం చేసి శాంతి భద్రతలు కల్పించిన ఘనత ఎవరిది ?

1) మౌర్యులు
2) బృహత్పలాయనులు
3) శాతవాహనులు
4) చోళులు

11.పాటలీపుత్రంలో కూడా విజయ పతాకాన్ని ఎగురవేసి దేశంలో సాంస్కృతికంగా ఏకత్వాన్ని సాధించినవారు ?
1) శాలంకాయనులు
2) శాతవాహనులు
3) చేర రాజులు
4) 1,2

12. కింది వాటిలో సిముక (శ్రీముఖుడు) రాజుకు సంబంధించినది ?
i) శిశుకుడు (మత్స్య పురాణం), సింధుకుడు (వాయు,బ్రహ్మండ పురాణం), బలిపుచ్ఛకుడు (విష్ణు పురాణం), సుద్ర, సిప్రక, ఛిముక అనే పేర్లు ఇతనికి ఉన్నాయి.
ii) పురాణాల ప్రకారం శాతవాహనుల్లో మొదటి వాడు.
iii) కోటి లింగాల వద్ద ఇతని నాణాలు లభించాయి.
iv) నానాఘట్ శాసనంలో రాయశ్రీముఖుని ప్రసక్తి ఉంది.
1) i,ii
2) i,ii,iv
3) i,iii
4) పైవన్నీ

13. నిశ్చిత వాక్యం (A): సిముకుడు శాతవాహన రాజ్య స్థాపకుడే కానీ స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించలేదు. 
హేతువు వాక్యం (R): కళింగ యుద్ధంలో అశోకుని శక్తి సామర్ధ్యాలు చూసిన ఆంధ్రులు అతనికి లోబడే ఉన్నారు.
1) (A) సరైనది. (R) సరికానిది.
2) (A) (R) లు సరైనవి.
3) (A) సరికానిది. (R) సరైనది.
4) (A) (R) లు సరికానివి.

14. i) అశోకుని కళింగ విజయంతో శ్రీముఖునిలో మిత్రభావం కలిగింది. అందువల్లే అశోకుడు (13వ శిలాశాసనం) అంధ్రులను హితరాజుల పట్టికలో చే ర్చాడు.
 ii) సిముకుడు మహారాష్ర్టలోని రధికుల రాజ్యాన్ని అణచివేసి, తన అధికారాన్ని ధృడపరచుకునేందుకు మహారధి కూతురితో, తన కుమారుడి వివాహం జరిపించాడు. పైఠాన్ (ప్రతిష్ఠాన పురం) తన రాజధానిగా చేసుకున్నాడు.
iii) సిముకుడు విదర్భలోని భోజులను ఓడించి దానిని ఆక్రమించాడు.
iv) ఉత్తర తెలంగాణ, దక్షిణ విదర్భ, తూర్పు మహారాష్ర్ట ప్రాంతాలు సిముకుని ఆధీనంలోకి వచ్చాయి.
పై వ్యాఖ్యానాల ఆధారంగా సిముకుడు ?
1) గొప్ప విజేత
2) దూరదృష్టిగల రాజనీతిజ్ఞుడు
3) శాతవాహనుల రాజ్యానికి గట్టి పునాది వేశాడు
4) పైవన్నీ

15.ప్రస్తుత తెలంగాణ రాష్ర్టంలోని కోటిలింగాల వద్ద బయల్పడిన సిముకుని నాణాలను పరిశీలించిన పి.వి.పరబ్రహ్మశాస్త్రి ప్రకారం ‘‘పురాణాల్లో ప్రస్తావించిన చిముకుడు, నాణాలపై ఉన్న సిముకుడు ఒక్కడేనని’’ పేర్కొన్నాడు. అక్కడ లభించిన రాగి, పోటిన్ నాణాలపై ఉన్న చిహ్నాలు ఏమిటి ?
i) నాణాల ముందు భాగం మీద తొండం పెకైత్తి నిలబడివున్న ఏనుగు, శ్రీవత్స చిహ్నం
ii) నాణాల వెనుక భాగంపై ఉజ్జయిని, స్వస్తిక చిహ్నలు
iii) నాణెం ముందు భాగంపై సింహం చిహ్నం
iv) నాణెం వెనుక భాగంపై కలశం, దాని కిరువైపుల దీపస్తంభాలు
1) i,iv
2) ii,iii,iv
3) i,ii
4) పైవన్నీ

16. కింది వాటిలో సరైనది ?
 i) ప్రాకృత భాషలో కలిగి బ్రాహ్మీలిపితో, చిముక శాతవాహన ముద్ర కలిగిన నాణాలు ఒక్క కోటిలింగాలలో మాత్రమే లభ్యమయ్యాయి.
ii) సిరి శాతవాహన పేరున్న నాణాలు కోటిలింగాల, విదర్భ (మహారాష్ర్ట) ప్రాంతాల్లో లభించాయి.
iii) పేరులో ‘శాతవాహన’ అనే వంశనామం తగిలించుకున్న ఏకైక పాలకుడు చిముకుడు
iv) నాసిక్ ఇతర ఆధారాలు చిముకుడిని సిముక శాతవాహన అని పేర్కొన్నాయి.
1) i,iv
2) i,ii,iii
3) i,ii
4) i,ii,iii,iv

17. i) సిముకుడి నాణాలు కరీంనగర్‌లోని మునులగుట్ట అనే జైనుల వసతి గృహంలో లభించాయి.
ii) జైన సాహిత్యం ప్రకారం ఇతడు జైనమతాభిమాని. జైన దేవాలయాలను, చైత్యాలయాలను ఇతను కట్టించాడు.
iii) ప్రతిష్ఠానపురంలో జైన ఆచార్యుడు కాలకసూరి నిర్వహించిన సభకు సిముకుడు హాజరయ్యాడని జైన సాహిత్యం తెలుపుతోంది.
iv) అప్పటికే దేశంలో జరుగుతున్న వైధికమతోద్ధరణోద్యమాన్ని గుర్తించి తన రాజ్య భద్రత దృష్ట్యా క్రమంగా సిముకుడు బ్రాహ్మణ మతాభిమానయ్యాడు.
v) చివరి దశలో సిముకుడు క్రూరుడయ్యాడని, ప్రజలు అతన్ని చంపారని జైన సాహిత్యం పేర్కొంది.
పై వ్యాఖ్యాలాధారంగా సిముకుడు ఆదరించిన మతం?
1) జైనమతం
2) బ్రాహ్మణమతం
3) అన్ని మతాలపై సమదృష్టి
4) మొదట జైనం, తర్వాత బ్రాహ్మణ మతం

18. శాతవాహనుల్లో గుహాలయాన్ని తొలిపించిశాసనాన్ని వేయించిన వారిలో మొదటివారు ?
 1) సిముక
2) బాలశ్రీ
3) నాగానిక
4) కృష్ణ (కన్హ)

19. కింది వాటిలో సరైనది ?
i) కన్హు (కృష్ణ)ని కాలంలో మహారాష్ర్ట శాతవాహన సామ్రాజ్యంలో భాగమైంది.
ii) కన్హ నాసిక్‌లో బౌద్దశ్రమణులకు గుహాలయాన్ని తొలిపించి దానం చేశాడు.
iii) నాసిక్ దాన శాసనాన్ని కన్హుని మహామాత్రుడైన ‘సమన’ రాయించాడు.
1) i,ii
2) ii,iii
3) i,iii
4) పెవన్నీ

20. శాతకర్ణిఐ కాలంలో భారతదేశంలో జరిగిన సంఘటనలు ?
 i) అశోకుడు కళింగ యుద్ధం చేశాడు.
ii) కళింగలో మహామేఘవాహన వంశస్థుడైన ఖారవేలుని పాలన మొదలైంది.
iii) మగధలో మౌర్య సామ్రాజ్యాన్ని అంతం చేసి పుష్యమిత్రసుంగుడు శుంగవంశాన్ని స్థాపించాడు.
iv) సుశర్మ కణ్వ వంశాన్ని మగధలో స్థాపించాడు.
1) i,iii
2) i,ii,iv
3) ii,iii
4) i,iii,iv

21. మహారాష్ర్టలోని నానాఘట్ గుహాలయంలోని అలంకార శాసనంపై ఎవరెవరి శిలాప్రతిమలున్నాయి ?
i) శాతకర్ణిఐ, నాగానిక
ii) త్రనకయిరో
iii) నలుగురు రాజకుమారులు
iv) శ్రీముకుడు
1) ii,iv
2) i,ii,iii
3) ii,iii,iv
4) పైవన్నీ

22. మత్య్స పురాణలో ‘మల్లకర్ణి’ గా పేర్కొన్న మొదటి శాతకర్ణి బలవృద్ధికి కారణం ?
1) ఐర వంశస్థులతో సంబంధాలు
2) ఇక్ష్వాకులతో వివాహ సంబంధాలు
3) అంగీయ కులానికి చెందిన మహారఠి త్రనకయిరోతో సంబంధ బాంధవ్యాలు
4) భోజులతో వివాహ సంబంధాలు

23. తూర్పు తీర రేవుపట్టణాలను, కృష్ణా, గోదావరి నదీలోయలను ఆక్రమించడానికి చాళుక్య, చోళ, బహమనీ, విజయనగర రాజ్యాల మధ్య సంఘర్షణలు జరిగాయి. వీటికి నాంది శాతవాహన యుగంలో జరిగింది. ఈ యుగంలో ఎవరెవరి మధ్య సంఘర్షణలు మైదలైనాయి?
1) గౌతమిపుత్ర శాతకర్ణి - ఖారవేలుడు
2) పులోమావి - కణ్వ
3) శాతకర్ణి-I - ఖారవేలుడు
4) యజ్ఞశ్రీశాతకర్ణి- శ్రీఛాంతమూలుడు

24. కింది వాటిలో సరైనది ?
 i) చుళ్ళ కళింగ జాతకంలో కళింగ అధిపతిపై అశ్మకుని విజయం గురించి ఉంది. శాతవాహన రాజ్యం తూర్పుకు విస్తరించింది.
ii) హాతిగుంఫ శాసనం ప్రకారం భోజక, పటినిక, మహిష వంటి దక్షిణాపథ జాతులతో కలిసి ఖారవేలుడు క్రీ.పూ. 181లో శాతకర్ణిని లక్ష్యపెట్టక కన్ణబెణ్ణా (కృష్ణా నది) వరకు వెళ్ళి ముషిక నగరాన్ని భయపెట్టాడు.
1) i
2) ii
3) రెండూ సరికావు
4) i,ii

25. మొదటిశాతకర్ణికి, పుష్యమిత్రశుంగ(మగధ) పుత్రుడైన ‘అగ్నిమిత్రుడికి’ విదర్భపై ఆధిపత్యపోరు జరుగగా, ఈ రాజ్యము రెండుగా చీలింది. ఈ అంశం ఏ నాటకంలో ఉంది ?
1) కాళిదాసు- అభిజ్ఞాన శాకుంతలం
2) కాళిదాసు- మేఘసందేశం
3) కాళిదాసు- విక్రమోర్వశీయం
4) కాళిదాసు- మాళవికాగ్నిమిత్రం

26.నానాఘట్ శాసనంలోని శాతకర్ణిఐ రాజకీయ విజయాల ప్రకారం పశ్చిమమాళ్వ, అనుప, విదర్భలను ఇతని ఆథీనంలో ఉన్నాయి. అతని రాజ్య విస్తరణ శాసనాలు, నాణాల ఆధారంగా కింది విధంగా తెల్పవచ్చు ?
1) ప్రతిష్ఠానం వరకు
2) ప్రతిష్ఠానం నుంచి ఉజ్జయిని వరకు
3) ప్రతిష్ఠానం నుంచి ఉజ్జయిని, విదిశ వరకు
4) ప్రతిష్ఠానం నుంచి ఉజ్జయిని, ఉజ్జయిని నుంచి విదిశ, అక్కడి నుంచి మగద వరకు

27. ఖారవేలునిపై విజయానికి, సామ్రాజ్య విస్తరణకు సూచనగా శాతకర్ణిఐ చేసిన యాగాలు ?
i) రెండు అశ్వమేధ యాగాలు
ii) రాజసూయం
iii) వాజపేయ యాగం
iv) సర్పయాగం
v) చండీయాగం
1) i,iv,v
2) i,ii,iii
3) i,ii
4) ii,iii

28. శాతకర్ణిఐ అపరాంత, కొంకణ జనపదాలను ఆక్రమించి పశ్చిమ దిశగా విస్తరించిన ఫలితం? 1) మహాసామ్రాజ్యాధిపతయ్యే అవకాశం
2) బ్రాహ్మణ మతాన్ని వ్యాప్తి చేసే అవకాశం
3) అరేబియా సముద్రతీరంపై రేవు పట్టణాల నుంచి జరిగే నౌకావ్యాపారం మీద ఆధిపత్యం
4) 1,2

29. నానాఘట్ శాసనం ప్రకారం శాతకర్ణిఐ బిరుదులు ?
 i) వీర ii) శూర
iii) దక్షిణాపథపతి iv) అప్రతిహతచక్ర
1) i,iii
2) ii,iii,iv
3) i,ii,iii
4) పైవన్నీ

30. శాతకర్ణిఐ కి చెందిన రానోసాతకణిస, రానోసిరిసాతకణిస పేర్లున్న నాణాలు లభించిన ప్రదేశాలు ?
i) మహారాష్ర్ట ii) గుజరాత్
iii) మధ్యప్రదేశ్ iv) తెలంగాణ
iv) ఆం్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలోని సాతాని కోట
1) i,ii,iii
2) iv,v
3) ii,iv,v
4) i,ii,iii,iv,v

31.కింది వాటిలో సరైనది ?
i) శాతకర్ణిఐ అశ్వమేధయాగ సమయంలో ముద్రించిన నాణాం పూణెలో లభించింది.
ii) అప్తోర్యామ, అనారంభణీయ, అగ్న్యధేయ, త్రిరాత్ర, దశరాత్ర, త్రయోదశీరాత్రం వంటి యజ్ఞాలను శాతకర్ణిఐ చేసినట్టు నానాఘట్ శాసనం తెల్పుతోంది.
iii) గోవులను, కార్షాపణాలను బ్రాహ్మణులకు శాతకర్ణిఐ ఇచ్చినట్టు నానాఘట్ శాసనం తెల్పుతోంది.
1) i,iii
2) ii,iii
3) ii
4) పైవన్నీ

32.మొదటి శాతకర్ణి భార్యగా దేవి బిరుదుతో తన నామ శాసనంతో సహా, ప్రతిమను నిలుపుకున్న ‘నాగానిక’ పాత్ర ?
 1) సామాజికం
2) ధర్మికం
3) రాజకీయం
4) పైవన్నీ

33.కింది వాటిలో సరైనది ?
i) మొదటి శాతకర్ణి మరణానంతరం కుమారులు చిన్నవారవటంతో దేవినాగానిక స్వంతంగానే రాజ్యభారం వహించింది.
ii) యజ్ఞహుతదూపన సుగంధయా, దిఘవ్రత సుందయా అని దేవినాగానిక వర్ణించుకుంది.
iii) నానాఘట్ శిల్పాల్లో హకుసిరి, శతిశ్రీమత్, శాతవాహన, వేదసిరి అనే మొదటి శాతకర్ణి కుమారుల పేర్లు ఉన్నాయి.
1) i
2) ii,iii
3) i,ii
4) i,ii,iii

34. శాతకర్ణిఐ మరణానంతరం శాతవాహన రాజ్య విభజన జరిగినట్టు వివిధ ప్రదేశాల్లో లభించిన అతని కుమారుల నాణాల ద్వారా తెలుస్తోంది. వారు పాలించిన ప్రాంతాలను జతపరచండి ? రాజకుమారులు
i) వేదసిరి (పూర్ణోత్సంగుడు)
ii) సతసిరి
iii) శాతవాహన (సదవాహన)
ప్రాంతం
a) శూర్నారక
b) ప్రతిష్ఠానం
c) తూర్పుమాళ్వ
1) i-c,ii-b,iii-a
2) i-b,ii-c,iii-a
3) i-a,ii-b,iii-c
4) i-b,ii-a,iii-c

35. ఎవరి మనుమరాలైన ‘భటపాలిక’ అనే స్త్రీ, నాసిక్ గుహాలయాల్లో ఒక గుహాలయాన్ని తొలిపించి, శాసనం రాయించింది ?
 1) మహాహకుసిరి
2) వేదసిరి
3) శాతవాహన
4) శ్రీముఖ

36. కింది వాటిలో సరైనది ?
i) ఖారవేలుని హాతిగుంఫ శాసనం ప్రకారం శాతవాహన రాజ్యంలోని విచ్ఛితిని ఆసరాగా చేసుకుని భోజక, పిటినిక జాతులను వశపరచుకొని మైసోలియాలోని వాణిజ్య కేంద్రమైన పిథుండనగరం (భట్టిప్రోలు)ను గాడిదలతో దున్నించినట్టు తెలుస్తోంది.
ii) ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి సమీపంలోనున్న గుంటుపల్లి శాసనం ఖారవేలుడు నేటి గోదావరి, కృష్ణా జిల్లాలను ఆక్రమించినట్టు సూచిస్తోంది.
iii) ఖారవేలుని లేఖకుడైన చులగోముడు బౌద్ధాలయ మండప నిర్మాణానికి ధనం ఇచ్చినట్టు గుంటుపల్లి శాసనం పేర్కొంది.
1) i,ii
2) ii,iii
3) i,iii
4) i,ii,iii

37.శకద్వీపం నుంచి శకులను ఆహ్వానించి శాతవాహన రాజుపై దండయాత్రలకు పురికొల్పినట్టు చెబుతున్న గ్రంథం, ఆచార్యుని పేరు ?
 1) మాధ్యమిక వాదం- ఆచార్య నాగార్జున
2) కాలకాచార్యకథానిక- కాలకాచార్యుడు
3) వరిశిష్టపర్వన్- హేమచంద్ర
4) ఏదీకాదు

38. భారతదేశానికి వచ్చిన విదేశీయులను కాలక్రమపట్టిక ఆధారంగా అమర్చండి ?
i) కుషాణులు
ii) శకులు (సింధియన్లు)
iii) పార్ధియన్లు (పహ్లవులు)
iv) ఇండో- గ్రీకులు
1) i,ii,iii,iv
2) iv,i,iii,ii
3) iv,ii,iii,i
4) i,iv,iii,i

39. భారతదేశంలో శకుల అధికారం క్షీణించినా, వారు రాష్ర్ట పాలకులుగా నియమించిన మహాక్షత్రపులు, క్షాత్రపులు చిన్నచిన్న రాజ్యాలను నెలకొల్పారు. వాటినే శాత్రపీలు అంటారు. వాటికి సంబంధించి కింది వాటిలో సరైనది ?
i) పశ్చిమ క్షాత్రపుల్లో మహారాష్ర్ట, మాళవక్షాత్రపులున్నారు.
ii) మహారాష్ర్ట క్షాత్రపులు క్షహరాట వంశస్థులు
iii) భూమక, నహపాణ, క్షహరాట వంశాలకు చెందిన వారు.
iv) ఉజ్జయిని క్షాత్రపులు కర్దమక వంశానికి చెందిన వారు. యశమతిక, ఛష్టన, రుద్రదాముడు రాజులుగా ఉండిరి.
1) i,iv
2) ii,iii
3) i,ii,iii
4) పైవన్నీ

40. కింది వాటిలో శాతకర్ణి - ఐఐకు సంబంధించినది ? 
i) మందపురి శాసనం ద్వారా ఖారవేలుని తదుపరి రాజు కుదేపసిరి గురించి తెలుపుతుంది.
ii) ఐఐ శాతకర్ణి కళింగను ఆక్రమించాడు.
iii) సాంచి ద్వారం పైనున్న శాసనం, ఇతని పేరుతోనున్న నాణాలు తూర్పు మాళ్వ రాజ్య ఆక్రమణను ధృవపరుస్తున్నాయి.
1) i,ii
2) ii,iii
3) iii
4) పైవన్నీ

41. ఖారవేలుడు, పుష్యమిత్రశుంగుడు, డెమిట్రియస్ వంటి యోధానుయోధులు రాజ్యాలను కబళిస్తున్న రోజుల్లో ఆంధ్రదేశాన్ని కాపాడి, వారికి సమఉజ్జనిపించుకున్న శాతవాహన రాజు ?
1) గౌతమిపుత్ర శాతకర్ణి
2) శాతకర్ణి -III
3) యజ్ఞశ్రీశాతకర్ణి
4) శాతకర్ణి - II

42. విదిశ పరిసరాలలో ఎన్నో బౌద్ధ స్తూపాలున్నాయి. వాటిని భిల్సాతోపులంటారు. ఇక్కడి సాంచీస్తూపం శాతవాహన శిల్పమునకు ముఖ్య ఉదాహరణ. ఈ స్తూపం దక్షిణద్వారం వద్ద రెండవ శాతకర్ణి కళాకారుల్లో ఎవరి శాసనం ఉంది ?
 1) వృషభదత్తుడు
2) వాసిష్ఠీపుత్ర ఆనంద
3) స్వాతికర్ణ
4) మన్దులక

43. ‘రానొ శివ సిరిస అపీలకస’ అనే పేరుగల అపీలకుని రాగి నాణేం, ‘‘రానో శాతకణిస’ అనే పేరుగల చతురస్రాకార నాణేం లభించిన ప్రదేశం ?
 1) చత్తీస్‌ఘడ్
2) ఉత్తరప్రదేశ్
3) బెంగాల్
4) కడబారు

44. కుంతల శాతకర్ణి గురించి తెలిపేవి ?
 i) వాత్సాయన కామసూత్రాలు
ii) రాజశేఖరుని కావ్యమీమాంస
iii) క్షేమేంద్రుని కథాసరిత్సాగరం
1) i
2) ii,iii
3) ii
4) i,ii,iii

45. కింది వాటిలో కుంతల శాతకర్ణికి సంబంధించినది ?
 i) కుంతల శాతకర్ణి, అతని భార్య మలయమతిని వాత్సాయన కామసూత్రాలు పేర్కొన్నాయి.
ii) ఇతని ఆస్థానంలో గుణాడ్యుడు, శర్వవర్మ అనే పండితులుండేవారు.
iii) పాటలీపుత్ర పాలకుడైన కాణ్వసుశర్మను, మిన్నగర లేక బ్రోచ్ పాలకుడైన నహపాలున్ని ఓడించాడు.
iv) పాటలీపుత్రాన్ని జయించాడు.
1) i,ii
2) ii,iii,iv
3) i,ii,iii
4) i,ii,iii,iv

46. మొదటి పులోమావి పాటలీపుత్రంలోని కణ్వ సుశర్మను ఓడించడంతో ఆంధ్ర రాజుల చిరకాల వాంఛ నెరవేరింది. తర్వాత అవంతి, అకర రాజ్యాలను జయించిన శాతవాహనుల విజృంభణను అరికట్టడానికి ప్రయత్నించిన వారు ?
i) కుషాణులు - కనిష్కుడు
ii) క్షహరాట వంశం - భూమక, నహపాణ
iii) కర్దమక వంశం - ఛష్టన
iv) హూణులు
1) i,iii
2) iii,iv
3) ii,iii
4) i,ii,iii

47. కింది వాటిలో సరైనది ?
i) మత్స్యపురాణం కణ్వ సుశర్మను, పులోమావి చంపినట్టు తెల్పుతోంది.
ii) శాతవాహనులు మగధను 10 సంవత్సరాలు పాలించినట్టు యుగపురాణం చెబుతుంది.
1) i
2) ii
3) i,ii
4) ఏదీకాదు

48. కింది వాటిలో శక - శాతవాహన సంఘర్షనలకు సంబంధించినది ? 
i) ఈ సంఘర్షణలో ప్రథమఘట్టం రెండో శాతకర్ణి కాలంలో జరిగింది.
ii) శకులు ఉజ్జయినిని ఆక్రమించగా ప్రతిష్ఠాన రాజు విక్రమాధిత్యుడు వారిని పారద్రోలి విజయసూచకంగా క్రీ.పూ.58లో విక్రమార్కశకం ప్రారంభమైందని ‘కాలకాచార్య కథానిక’ అనే జైన గ్రంథం తెల్పుతోంది.
iii) భూమకుడు తర్వాత నహపాణుడుకు, శాతవాహనులు మౌళ్వ, కొంకణ, అపరాంత ప్రాంతాలను కోల్పోయారు.
iv) వీరి సంఘర్షణలను గ్రీకు గ్రంథం ‘‘పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్సీ’’ ధృవపరుస్తోంది.
1) ii,iii,iv
2) i,iv
3) ii,iii,iv
4) పైవన్నీ

49. ‘సమకాలికులు’ పూరాణాల్లో ఏ శాతవాహన రాజును రిక్తవర్ణుడు, అరిష్ట కర్ముడు అని పిలిచారు ?
1) హాలుడు
2) పులోమావి
3) గౌరకృష్ణుడు
4) గౌత మిపుత్ర శాతకర్ణి

50.హాలుడు తన సామ్రాజ్య తూర్పు భాగానికి దండుతో వెళ్ళాడు. ఆ ప్రాంతాన్నే సప్తగోదావరి (ద్రాక్షారామం) అంటారు. ఈ రాజకీయ సంఘటనను తెల్పుతున్న గ్రంథం ? 
1) గాథాసప్తసతి
2) పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్సీ
3) లీలావతి
4) అభిదాన చింతామణి

51. శాతవాహనుల రేవుపట్టణమైన కళ్యాణ్‌కు వస్తున్న గ్రీకు నావలను నహపణ (మంబనస్) బ్రోచ్‌కు మళ్ళేటట్టు చేశాడని చెబుతున్న గ్రంథం ? 
1) ఇండికా
2) జాగ్రఫీ
3) పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్సీ
4) పైవన్నీ

52. కింది వాటిలో సరైనది ?
i) నహపణ క్రీ.శ. 40-80ల మధ్య శాతవాహనులను ఓడించి గుజరాత్ నుంచి కొంకణ వరకు పశ్చిమకోస్తాను ఆక్రమించాడు.
ii) హాలుని తర్వాత శాతవాహన పీఠము, తెలంగాణ మీదుగా ఆంధ్రకి తరలి, దరణి కోట వీరి రాజధాని అయింది.
1) i
2) ii
3) i,ii
4) ఏదీకాదు

ANSWERS:
1)4 2)3 3)2 4)2 5)3 6)3 7)4 8)1 9)2 10)3 11)2 12)4 13)2 14)4 15)3 16)4 17)4 18)4 19)4 20)3 21)4 22)3 23)3 24)4 25)4 26)3 27)3 28)3 29)4 30)4 31)4 32)4 33)2 34)2 35)1 36)4 37)2 38)3 39)4 40)4 41)4 42)2 43)1 44)4 45)3 46)3 47)3 48)4 49)3 50)3 51)3 52)3

No comments:

Post a Comment