AP History Questions in Telugu Part-5



I ఆధారాలు
1. కింది వాటిలో శాతవాహనుల చరిత్ర రచనకు ప్రామాఖ్యత రీత్యా ఉపయోగపడే ఆధారాల సరైన క్రమం ?

 i) స్వదేశీ, విదేశీ రచనలు
 ii) కట్టడాలు
 iii) నాణాలు
 iv) శాసనాలు
1) i, iv, iii, ii
2) iv, iii, ii, i
3) ii, i, iii, iv
4) iv, iii, i, ii

2. శాతవాహనుల చరిత్రకు సంబంధించని శాసనమేది?
i) నాసిక్, కార్లేలోని 24 ప్రాకృత శాసనాలు
ii) హాతిగుంఫా, గుంటుపల్లి శాసనాలు
iii) జునాగఢ్ శాసనం
iv) మట్టిపాడు శాసనం
1) i, iv
2) iii
3) iv
4) ii, iii

3. తొలి, మలి శాతవాహనుల శాసనాలు లభించిన ప్రాంతాలు ?
 i) నాసిక్
 ii) కార్లే
 iii) కన్హేరి, చిన్నగంజాం
 iv) నానేఘాట్, కొడవలి
v) మ్యాకదొని, అమరావతి
1) i, ii, iii
2) iii, iv, v
3) i, iii, iv, v
4) i, ii, iii, iv, v

4. జతపరచండి.
 శాసనం సంబంధించిన రాజు
i) చిన్నగంజాం a) శాతకర్ణి
ii) కొడవలి b) చందసతి
iii) నాసిక్ c)గౌతమీపుత్ర యజ్ఞశ్రీ శాతకర్ణి
iv) సాంచీ d) కృష్ణ
1) i- a, ii- b, iii- c, iv- d
2) i- a, ii- c, iii- d, iv- b
3) i- c, ii- b, iii- d, iv- a
4) i- c, ii- b, iii- a, iv- d

5. కింది వ్యాక్యానాల్లో సరైనవి
(i) శాతవాహన శాసనాలు మహారాష్ట్రలో ఎక్కువగా ఆంధ్ర తక్కువగా లభించాయి.
(ii) శాతవాహన శాసనాలు ప్రాకృత భాషలో బ్ర హ్మీలిపితో ఉన్నాయి.
1) i సరైనది. ii సరికానిది
2) i, iiలు సరికానివి
3) i సరికానిది. ii సరైనది
4) i, iiలు సరైనవి.

6. శాతవాహనుల చరిత్రకు సంబంధించని సమకాలీన శాసనమేది ?
 1) ఉజ్జయిని క్షత్రపుల నాసిక్, కన్హేరి (రుషభదత్తుని) శాసనాలు
2) రుద్రదాముని జునాగఢ్ శాసనం
3) అత్తివర్మ గోరంట్ల శాసనం
4) ఖారవేలుని హాతిగుంఫా శాసనం

7. జతపరచండి.
 శాసనం
i) బాలశ్రీ నాసిక్ శాసనం
ii) రుద్రదాముని జునాగఢ్ శాసనం
iii) ఖారవేలుని హాతిగుంఫా శాసనం
iv) కృష్ణుని నాసిక్ శాసనం
తెలియజేసే అంశం
a) శాతకర్ణికి సమకాలీనం
b) తొలి శాతవాహనుల చరిత్ర
c) గౌతమిపుత్ర శాతకర్ణి కాలం నాటి దక్షిణభారతదేశ రాజకీయ పరిస్థితులు
d) మలి శాతవాహనులు మహారాష్ర్టను కోల్పోవడం
1) i- d, ii- c, iii- b, iv- a
2) i- c, ii- d, iii- a, iv- b
3) i- c, ii- d, iii- b, iv- c
4) i- c, ii- d, iii- b, iv- a

8. శాతవాహనుల చరిత్రకు ఉపయోగపడే స్వదేశీ గ్రంధాలేవి ?
i) కథాసరిత్సాగరం
ii) గార్గి సంహితలోని అంతర్భాగమైన యుగ పురాణం
iii) జైన సూత్ర గ్రంధాలు
iv) పురాణాలు
1) i, iii, iv
2) iv
3) ii, iv
4) i, ii, iii, iv

9. శాతవాహనుల చరిత్రకు ఉపయోగపడని విదేశీ గ్రంధం /గ్రంధాలేవి ?
 i) ప్లీని- నేచురల్ హిస్టరీ
ii) జస్టిన్- ఎపిటోమ్
iii) అరియన్- గ్రీకు రచనలు
iv) టాలమి- భౌగోళిక గ్రంధం
1) i, ii
2) iii, iv
3) iv
4) ii

10. శాతవాహన చరిత్ర రచనకు ప్రధానమైన పురాణాలేవి ?
i) వాయు పురాణం
ii) మత్స్య పురాణం
iii) భాగవత పురాణం
iv) విష్ణు పురాణం
v) బ్రహ్మాండ పురాణం
1) i, iv
2) i, ii, iii
3) i, ii, iv, v
4) i, ii, iii, iv, v

11. ఆంధ్రుల వంశావళిని తెలిపే ‘‘కలియుగ రాజ వృత్తాంతం’’ ఏ పురాణంలోని భాగం ?
 1) వాయుపురాణం
2) భవిష్యపురాణం
3) మత్స్యపురాణం
4) భాగవతపురాణం

12. పురాణాలను ‘‘డైనాస్టీస్ ఆఫ్ కలి ఏజ్’’ (Dynasties of Kali age) అనే పేరుతో ఆంగ్లంలోకి అనువదించిన వారు ?
1) శ్యామ శాస్త్రి
2) కన్నింగ్‌హాం
3) చార్లెస్ విల్కిన్స్
4) పార్గిటర్

13. కింది వాటిలో సరైనది? 
i) పురాణాల్లో పేర్కొన్న శాతవాహన రాజుల వివరాలు అనుమానాస్పదం, అస్థిరమైనవి.
ii) పురాణాల కంటే శాసనాలు, నాణాలు విశ్వసనీయమైన ఆధారాలు.
1) i
2) ii
3) i, ii
4) i, ii సరికావు

14.కింది వాటిలో సరికాని జత ?
గ్రంధం తెలిపే విషయం
i) మత్స్య పురాణం - శాతవాహన వంశ వృక్ష పట్టికలు
ii) కధాసరిత్సాగరం - శాతవాహనుల పాలన, ప్రజల స్థితిగతులు
iii) వాత్సాయన కామసూత్రాలు - శాతవాహనుల కాలం నాటి సాంఘిక, ఆర్థిక పరిస్థితులు
iv) జాగ్రఫి (టాలమి) - శాతవాహన రాజ్యంలోని వాణిజ్య పట్టణాలు, ఓడరేవులు
v) పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్సీ - భారతదేశంలోని ఓడరేవులు గురించి, ఆఫ్రికాతో శాతవాహనుల సంబంధాలు.
1) i, v
2) iii, iv
3) v
4) iv

15. శాతవాహనుల చరిత్రనకు సంబంధంలేని సమకాలిక వంశ చరిత్ర ?
i) శక ii) మౌర్య iii) శుంగ iv) కాణ్వ v) ఛేది vi) శ్రీకాకుళాంధ్ర విష్ణువు
vii) సంగం కాలం (చోళ, చేర, పాండ్య)
1) i, ii, vii
2) vii
3) vi
4) ii, vi

16. శాతవాహనుల ఆర్థిక స్థితిగతులు తెలిపే వెండి, రాగి, సీసం, పోటిన్ నాణాలు దొరికిన ప్రదేశాలు ?
i) ఆంధ్రప్రదేశ్ - నాగార్జునకొండ
ii) తెలంగాణ - కొండాపూర్
iii) మధ్యప్రదేశ్ - త్రిపురి
iv) మహారాష్ర్ట - నేవాసా
1) i, ii
2) iii, iv
3) i, iii, iv
4) i, ii, iii, iv

17. శాతవాహనుల కాలంలో వర్తక వ్యాపారం ముఖ్యంగా రోమన్లతో జరిగిందనడానికి ఆధారాలేమిటి ?
i) రోమన్ సామ్రాజ్యాన్ని పాలించిన అగస్టస్, టిబెరియస్, నీరో చక్రవర్తుల నాణాలు ఆంధ్రప్రదేశ్, ఇతర ప్రాంతాలలో లభించాయి.
ii) ఆంధ్రప్రదేశ్‌లోని కడప, నంద్యాల, నెల్లూరు, విశాఖపట్నాలలో రోమన్ నాణాలు విస్తారంగా లభించాయి.
1) i
2) ii
3) i, ii రెండూకావు
4) i, ii

18.శాతవాహనుల కాలంలో వాడుకలోనున్న కార్షపణం, కుశనము, సువర్ణము, పదక /ప్రతీక నాణాల ఆకృతి ?
1) గుండ్రం
2) చతురస్రం
3) అండాకృతి
4) 1,2,3

19. ఆంధ్రప్రదేశ్‌లోని ఏఏ ప్రదేశాలలో జరిపిన పురావస్తు తవ్వకాల్లో శాతవాహనులకు సంబంధించిన ఆధారాలు వెలుగులోకి వచ్చాయి ?
 i) అమరావతి
ii) భట్టిప్రోలు- గుడివాడ
iii) జగ్గయ్యపేట- గుంటుపల్లి
iv) రామతీర్థం- శాలిహుండం
1) i, iii, iv
2) ii, iii
3) ii, iii, iv
4) i, ii, iii, iv

20. శాతవాహనుల సాంస్కృతిక చరిత్ర రచనకు తోడ్పడేవి ? 
i) సాంచీ ద్వారములు
ii) అమరావతి చైత్య శిల్పం
iii) అజంతా చిత్రలేఖనం
1) ii
2) i, iii
3) ii, iii
4) i, ii, iii

21. శాతవాహనులను పురాణాలలో ఏమని వ్వవహరించారు ?
i)ఆంధ్ర ii) ఆంధ్రజాతీయులు
iii) ఆంధ్ర భృత్యులు iv) శాతవాహన
1) ii, iii
2) i, iv
3) i, ii, iii
4) i, ii, iii, iv

22. భండార్కర్, విన్సెంట్ స్మిత్, బర్జెస్, రాప్సన్‌లు శాతవాహన ఆంధ్రులని పేర్కొనడానికి కారణం ?
1) శాసనాలు, నాణాలపై శాతవాహన రాజుల పేర్లు ఉన్నాయి
2) పురాణాల్లో ఆంధ్ర రాజుల పేర్లు ఉన్నాయి
3) కట్టడాలు ఆంధ్రలో ఎక్కువగా ఉన్నాయి
4) శాసనాలు, నాణాలపై ఉన్న శాతవాహన రాజుల పేర్లు, పురాణాల్లో పేర్కొన్న ఆంధ్రరాజుల పేర్లతో చాలా వరకు సరిపోతున్నాయి.

23. శాతవాహనులు, ఆంధ్రులు ఒకరేనని చెబుతూ, ఆంధ్రులు వింద్య పర్వత ప్రాంత తెగలలో ఒకరిగా పేర్కొన్న చరిత్రకారుడు?
 1) K.A.నీలకంఠశాస్త్రి
2) బార్నెట్
3) P.T. శ్రీనివాస అయ్యంగార్
4) వి.ఎ. స్మిత్

24. శాతవాహన; ఆంధ్ర పదాలను ఈ విధంగా పేర్కొనవచ్చు ?
1) గణనామం; రాజవంశావళి పేరు
2) గుర్తు; జాతి
3) రాజవంశావళి పేరు; గణనామం
4) బిరుదు; జాతి

25.ఆంధ్ర భృత్యులు అనగా ‘ఆంధ్రసేవకులు’ అనే పదాన్ని కింది విధంగా చెప్పవచ్చు ?
 1) విశ్వామిత్రుని శాపం మూలంగా వింద్య పర్వత ప్రాంతాల్లో ఉన్న వారు
2) ఆంధ్ర మహావిష్ణువు సేవకులు
3) మౌర్యుల ఆస్థానంలో సేవకులుగా ఉన్న శాతవాహనుల పూర్వులు అశోకుని తదుపరి విజృభించి స్వతంత్య్రాధికారాన్ని పొందినవారు
4) పైవన్నీ

26. i) శాతవాహనుల శాసనాల్లో వారెక్కడా ఆంధ్రులమని చెప్పుకోలేదు
 ii) సమకాలీన హాతిగుంఫా, గిర్నార్, తలంగుండు శాసనాలు శాతవాహనులని పేర్కొన్నాయేకానీ ఆంధ్రుల పేరు లేదు
iii) పురాణాలు ఆంధ్ర, ఆంధ్రభృత్య పదాలను వాడాయేకానీ శాతవాహన పదం వాడలేదు
iv) ఆంధ్రుల్లో శాతవాహనులు ఒక ఉపవంశం
పై వ్యాఖ్యానాలాధారంగా శాతవాహనుల జాతీయతపై గ..సుక్తంకర్ అభిప్రాయం?
1) శాతవాహనులు ఆంధ్రులు
2) శాతవాహులు ఆంధ్రులుకారు, ఆంధ్ర భృత్యులు మాత్రమే
3) శాతవాహనులు విదేశీయులు
4) శాతవాహనులు ఉత్తరాదివారు

27.‘‘శాతవాహనులు ఆంధ్రులుకారనీ, పురాణాలు తెలిపినట్టు ఆంధ్రభృత్యులు మాత్రమే’’ అనే V.S.సుక్తంకర్ వాదాన్ని బలపరచినవారు?
 1) వి.ఎ. స్మిత్
2) రాయచౌదరి
3) శ్రీనివాసశాస్త్రి
4) 2,3

28.కింది వాటిలో సరైనది ?
i) శాతవాహనులు ఆంధ్రదేశాన్ని పాలిస్తున్న కాలంలో సంకలనం అయినందున పురాణాలు వారిని ఆంధ్రులని వర్ణించుండవచ్చని రాయ్‌చౌదరి అన్నారు
ii) ఆంధ్రుల భాష తెలుగు, శాతవాహనులు వాడినది ప్రాకృత భాష. కాబట్టి శాతవాహనులు ఆంధ్రేతరులని శ్రీనివాసశాస్త్రి వాదము
1) i
2) ii
3) i, ii
4) i, ii కాదు

29. అశోకుని శాసనాల్లోని సాతేయపుత్రులే శాతవాహనులని అన్నది ?
1) బార్నెట్
2) పార్గిటర్
3) V.S.భక్లే
4) గొర్తి వెంకట్రావ్

III జన్మస్థల వాదాలు
30. V.S.సుక్తంకర్ శాతవాహనుల జన్మస్థలం కర్ణాటకలోని బళ్ళారని అనడానికి కారణం ?

i) శాతవాహన రాజైన 3వ పులోమావికి చెందిన ‘మ్యాఖదొని’ (జనగలిగుండు అనే రాతి) శాసనంలో ఈ ప్రాంతాన్ని ‘శాతవాహనిహార’ గా తెలిపారు. ఇది బళ్ళారి జిల్లాలో ఉంది.
ii) పల్లవ శివస్కందవర్మ బళ్ళారి జిల్లాలోని హిరడగల్లి తామ్రశాసనంలో ‘శాతవాహనిరట్ట’ గా ఈ ప్రాంతాన్ని పేర్కొన్నారు.
1) i
2) ii
3) i,ii
4) i,iiలు అసత్యాలు

31. ఖారవేలుని హాతిగుంఫా శాసనం, బాలశ్రీ నాసిక్ శాసనం ఆధారంగా విదర్భరాజ్యమే శాతవాహనుల జన్మస్థానమన్నవారు ?
 1) బర్జెస్
2) వి.వి.మిరాశీ
3) వి.వి.కృష్ణశాస్త్రి
4) భండార్కర్

32.ప్రాకృత భాషను ఉపయోగించినందున శాతవాహనులు మహారాష్ర్టులన్న చరిత్రకారుడు ?
 1) గొర్తి వెంకట్రావ్
2) భండార్కర్
3) పి.టి.శ్రీనివాస అయ్యంగార్
4) వి.ఎ.స్మిత్

33. జోగేల్కర్ పండితుని ప్రకారం శాతవాహనుల జన్మస్థలం మహారాష్ర్ట. 
ఈ వ్యాఖ్యకు సంబంధించి కింది వాటిలో సరైనది?
i) మహారాష్ర్టలోని పూనే జిల్లాలోని ఆంధ్రీనది తీరవాసులు శాతవాహనులు
ii) క్షహరాటులను తరిమివేసి, వివిధ తెగల్ని ఐక్యం చేసి నవరాష్ట్రాన్ని (మహారాష్ర్ట) స్థాపించారు.
iii) శాతవాహనులు మాతృసంజ్ఞలను వాడారు. ఇది మహారాష్ర్ట ఆచారం.
1) i, iii
2) i, ii
3) ii, iii
4) i, ii, iii

34. V.S.బాక్లే, .అ.జోగెల్కర్, కె. గోపాలాచారివంటి పండితులు శాతవాహనుల స్వస్థలం మహారాష్ర్ట అని చెప్పడానికి కారణం ?
 1) శాతవాహన రాజుల వివరాలు స్పష్టంగా మహారాష్ర్ట పరిసర ప్రాంతాల్లో మాత్రమే దొరుకుతున్నాయి.
2) మాతృసంజ్ఞలను వాడారు.
3) తొలి శాతవాహన శాసనాలు, నాణాలు మహారాష్ర్ట పరిసర ప్రాంతాల్లో లభ్యమైనాయి.
4) 1, 2, 3

35. ‘శాతవాహనులు ఆంధ్రులని అంగీకరిస్తే వారి సామ్రాజ్యం తూర్పు నుంచి పశ్చిమానికి విస్తరించిందని చెప్పవచ్చు’ అని అన్నదెవరు ?
 1) K.A.N. శాస్త్రి
2) గొర్తి వెంకటరావు
3) ఫ్రిజులుస్కీ
4) కౌశాంబి

36. చరిత్రకు తెలిసిన నాటి నుంచి ఆంధ్రులు కృష్ణా, గోదావరి నదీ మైదానాల ప్రాంతాల్లో నివసించేవారని శాతవాహనుల ఏకైకత్వాన్ని తెలిపిన వారు ?
 1) గుత్తి వెంకటరావు
2) మారేమండ రామారావు
3) నేలటూరు వెంకటరమణయ్య
4) 1,2,3

37.i) శాతవాహనులు ఒక రాజ్యాధికార శక్తిగా ఆంధ్రలో ఆవిర్భవించారు. 
ii) తమ పాలనను తొలినాళ్ళలో నాసిక్ దాకా విస్తరించారు.
iii) తొలి శాసనాల లభ్యస్థానం వీరి చరిత్రకు అంతగా ఆధారపడదగినది కాదు.
iv) గాథాసప్తసతిలో ‘హాలుని రాజ్యంలో గోదావరి ఆవిర్భవించి ప్రవహించి సాగరంలో కలుస్తుంది’ అనే వాక్యం ఉంది.
పై వ్యాఖ్యానాలాధారంగా.. ఆర్.జి. భండార్కర్, వి.ఎ.స్మిత్, ఎం.రామారావు, జి.వి. రావుల అభిప్రాయంలో శాతవాహనులు ?
1) మహారాష్ర్టులు
2) ఆంధ్రులు
3) విదర్భ ప్రాంతీయులు
4) 1, 2, 3

38. శాతవాహన, శాతకర్ణి, చిముకుని (శ్రీముఖుని) నాణాలు తెలంగాణలోని కోటిలింగాల, కొండాపూర్‌లలో లభ్యమైనాయి. శ్రీముఖుని నాణాలు కేవలం కోటిలింగాల ప్రాంతంలో మాత్రమే దొరకడం వల్ల శాతవాహనుల పాలన తెలంగాణలోనే ప్రారంభమైందని అన్నవారు ?
 i) అజయ్‌మిత్ర శాస్త్రి
ii) దేమెరాజారెడ్డి
iii) ఠాకూర్ రాజారాం సింగ్
iv) వి.వి.కృష్ణశాస్త్రి
1) i, iv
2) ii, iii, iv
3) iv
4) i, ii, iii, iv

39. తెలంగాణలోని కోటిలింగాల ప్రాంతంలో లభ్యమైన నాణాల ఆధారంగా ప్రఖ్యాత పురాతత్వవేత్త P.V.P శాస్త్రి అభిప్రాయం ప్రకారం శాతవాహనులు ?
I) మొదటి నుంచి శాతవాహనులు ఆంధ్రులు
ii) కోటిలింగాల ప్రాంతమే తొలి శాతవాహనుల జన్మస్థలం
iii) ఈ ప్రాంతం శాతవాహన యుగానికి ముందు, శాతవాహనుల కాలానికి సంబంధించినది.
1) i, ii
2) ii
3) ii, iii
4) i, ii, iii


IV--- తొలి అధికార పీఠం
40. శాతవాహనులు శుంగ వంశానికి సమకాలికులని, కృష్ణా గోదావరి ప్రాంతం నుంచి పశ్చిమ భాగానికి విస్తరించారన్న పండితుడు ?

 1) సుక్తంకర్
2) V.V.కృష్ణశాస్త్రి
3) రాప్సన్
4) గోపాలాచారి


41. బర్జెస్, బార్నెట్ పండితుల ప్రకారం శాతవాహనుల తొలి, తర్వాత రాజధానులు ?
 1) ప్రతిష్ఠానపురం- అమరావతి
2) శ్రీకాకుళం- ధాన్యకటకం
3) భోదన్- శ్రీకాకుళం
4) ధాన్యకటకం- కోటిలింగాల

42. కింది వాటిలో ధాన్యకటకానికి సంబందించినది ?
 i) దీనికి ధమ్నకడ, ధరణికోట, శ్రీధాన్య, శ్రీస్థాన అనే పేర్లు కూడా ఉన్నాయి
ii) బౌద్ధ వాజ్మయంలో దీనిని పూర్వశైలగా వర్ణించారు.
iii) యువాన్ చాంగ్ దీనికి తూర్పున వజ్రపాణి ఆలయం ఉన్నట్టు తెలిపాడు.
iv) సెరివణిజ జాతకం దీనిని ‘ఆంధ్రగనగరి’గా తెలిపింది.
1) i, iii, iv
2) ii, iv
3) ii, iii
4) i, ii, iii, iv

43. i) మజ్జిమ దేశ సరిహద్దుల్లోని ‘శతకణ్ణిక’ నగరాన్ని వినయ పీటిక తెల్పుతుంది.
ii) అస్సక, ములక జనపధాలను ఆంధ్ర రాజ్యాలుగా ‘సుత్తనిపాతం’ చెబుతుంది.
iii) జైన వాజ్మయం ప్రకారం శాతవాహనుల రాజధాని ప్రతిష్టానం.
iv) నెవాసా వద్ద తొలి శాతవాహన రాజులైన కన్హ, సిరిశాతకణి, సిరిశాతవాహనుల నాణాల ముద్రలు లభించాయి.
v) సిరి శాతవాహన నాణాలు పూణా, వరంగల్, హైదరాబాద్, కొండాపూర్‌లలో లభించాయి.
vi) పైఠాన్ గుండా దేశీయ, విదేశీయ వాణిజ్యం జరిగేది.
పై వాక్యాల ఆధారంగా శాతవాహనుల తొలి అధికారపీఠం ?
1) కొండాపూర్
2) ప్రతిష్ఠానపురం/ పైఠాన్
3) హైదరాబాద్
4) వరంగల్
V వంశనామం

44. శాతవాహనుల వంశోత్పత్తిని తెలిపే జినప్రభాసూరి అనే జైనపండితుడి గ్రంధం ?
1) ద్వాత్రింశత్పుత్తాలిక
2) కథాపరిత్సాగరం
3) ప్రతిష్ఠానపురకల్ప
4) సమయసార
45. క్రీ.శ.7వ శతాబ్ధానికి చెందిన ద్వాత్రింశత్పుత్తాలిక తెలిపే విషయాలు?
i) సంస్కృత కథా కావ్యం
ii) శాతవాహన వంశోత్పత్తి జనప్రభసూరి చెప్పిన బ్రాహ్మణ- నాగ సంబంధాన్నే తెలుపుతుంది.
iii) కథాసన్నివేశం ఉజ్జయినీ నగరంగా చెబుతుంది.
1) ii, iii
2) i, iii
3) i, ii
4) i, ii, iii

46. జతపరచండి.
 గ్రంథం
i) అభిదాన చింతామణి
ii) కథాసరిత్సాగరం
iii) ప్రతిష్ఠానపురకల్ప
శాతవాహన నిర్వచనం
a) సాత అనే యక్షుని వాహనంగా కలవాడు
b) శతాధికంగా వాహనాలు పొందినవాడు
c) సుఖప్రదమైన వాహనం కలవాడు
1) i- a, ii- b, iii- c
2) i- c, ii- a, iii- b
3) i- c, ii- b, iii- a
4) i- b, ii- a, iii- c

47.‘‘శాలివాహన’’ పదం ‘‘శాతవాహన’’ కు అపభ్రంశ రూపంగా చెప్పిన ప్రాకృత వ్యాకరణవేత్త ?
 1) శర్వవర్మ
2) రాజశేఖరుడు
3) పతంజలి
4) హేమచంద్రుడు

48.కింది వ్యాక్యానాల్లో సరైంది.
 (i) ముండారి భాష ప్రకారం శాతవాహన అంటే గుర్రం కుమారుడని ఫ్రీజులుస్కీ తెలిపాడు.
(ii) మౌర్యుల నుంచి సేనలను, ఏనుగులను, గుర్రాలను మొదలైన వాహనాలను పొంది శాతవాహనులైనారని కె. గోపాలాచారి అభిప్రాయం.
1) i సత్యం. ii అసత్యం
2) i, iiలు అసత్యాలు
3) i అసత్యం. ii సత్యం.
4) i, iiలు సత్యాలు

49.పురాణాల్లో మొదటిగా పేర్కొన్న ఏ వ్యక్తి, శాతవాహనుల వంశ మూలపురుషుడైన సాదవాహనుడు ఒక్కరే అని కోటిలింగాల వద్ద దొరికిన నాణాల ఆధారంగా నిర్ధారించవచ్చు ?
1) కన్హ
2) శాతకర్ణి
3) సిముక
4) శాతకర్ణి II

50. మహారాష్ర్టలోని నెవాసా, తెలంగాణలోని కొండాపూర్‌లలో లభించిన నాణాలు శాతవాహన రాజులలో ఎవరివి ?
 1) సదవాహన
2) కన్హ
3) శాతకర్ణి- I
4) గుర్తుపట్టలేము

VI- కులం
51. ‘శాతవాహనులు బ్రాహ్మణ కులస్తులు’. దీనికి సంబంధించి కింది వాటిలో సరైనది ?

1) మొదటి శాతకర్ణి అనేక వైదిక క్రతువులు చేశాడు
2) గౌతమిపుత్రశాతకర్ణి ఆగమనిలయుడని, క్షత్రియదర్పమానమర్థనుడని, ఏకబ్రాహ్మణుడని నాశిక్ శాసనం తెల్పింది
3) వాసిష్ఠ, గౌతమ వంటి ఉన్నత గోత్రాల బ్రాహ్మణులు శాతవాహనులకు తమ కుమార్తెలను ఇచ్చి వివాహం చేశారు
4) పైవన్నీ

52. i) బాలశ్రీ తాను రాజర్షిపత్నిగా తెల్పింది
 ii) వైదిక వాజ్మయం ఆంధ్రులను అనార్యులుగా తెల్పుతుంది.
iii) జైన వాజ్మయం శాతవాహన మూల పురుషుడు బ్రాహ్మణ యువకుడినకు, శూద్ర స్త్రీ యందు జన్మించినట్టు తెల్పుతుంది.
iv) కథాసరిత్సాగరం ప్రకారం సాతుడు అనే యక్షుడు ఒక బ్రాహ్మణ కన్యను వరించడంతో శాపగ్రస్తుడైనట్టు తెల్పుతుంది
v) ‘శాలివాహన’ అనే పదాన్ని బట్టి అనార్యజాతిగా ఉండిన శాతవాహనులు వ్యవసాయవృత్తిని అవంలంభిస్తూ బలవంతులైనారు.
ఈ వ్యాఖ్యానాలాధారంగా శాతవాహనుల కులం ?
1) శూద్రులు
2) బ్రాహ్మణులు
3) క్షత్రియులు
4) వర్ణసాంకర్యం జరుగుతున్న ఆ రోజుల్లో కులాన్ని నిర్ణయించలేము

53. ‘శాతవాహనులు తల్లివైపు గోత్రాలను పాటించని క్షత్రియులని’ అన్నది ?
 1) ఆర్. జి. భండార్కర్
2) కె. గోపాలాచారి
3) మికాషి
4) వి. వి. కృష్ణశాస్త్రి

54.వృషలుడు అంటే వర్ణధర్మాన్ని విస్మరించడంవల్ల కులాన్ని పోగొట్టుకున్నవాడు లేదా కులంలేని వాడిగా పురాణాలు ఏ ఆంధ్రజాతీయుడిని పేర్కొన్నాయి ?
 1) శాతకర్ణి II
2) సిముక
3) చంతశాతకర్ణి
4) హాలుడు 

ANSWERS:

1)4 2)3 3)4 4)3 5)4 6)3 7)2 8)4 9)4 10)4 11)2 12)4 13)3 14)3 15)3 16)4 17)4 18)4 19)4 20)4 21)3 22)4 23)3 24)3 25)3 26)2 27)4 28)3 29)3 30)3 31)2 32)3 33)4 34)3 35)2 36)4 37)2 38)4 39)4 40)3 41)2 42)4 43)2 44)3 45)4 46)2 47)4 48)4 49)3 50)1 51)4 52)4 53)2 54)2

No comments:

Post a Comment