టీఎస్‌ఆర్‌జేసీ-2020 నోటిఫికేషన్ విడుదల


టీఎస్‌ఆర్‌జేసీ-2020 నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు గురుకుల విద్యాలయ సంస్థ టీఎస్‌ఆర్‌జేసీ-2020 నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ ప్రవేశ పరీక్షలో ప్రతిభ ఆధారంగా రాష్ట్రంలోని 35 గురుకుల జూనియర్ రెసిడెన్షియల్ కళాశాలల్లో ఇంటర్ ఎంపీసీ/బైపీసీ/ఎంఈసీ (ఇంగ్లీష్ మీడియం)ల్లో ప్రవేశం లభిస్తుంది.
Adminissions
అర్హతలు ఇవీ..
2020 మార్చిలో పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. గతేడాది పదో తరగతి పాసైన విద్యార్థులు అర్హులు కాదు. జనరల్ కేటగిరీ(ఓసీ) అభ్యర్థులు పదో తరగతి/సమానమైన పరీక్షల్లో 6/10 జీపీఏ, బీసీ/ఎస్సీ/ఎస్టీ/ మైనారీటీ విద్యార్థులకు 5/10 జీపీఏ ఉండాలి. అన్ని కేటగిరీల వారికీ ఇంగ్లీష్‌లో 4 జీపీఏ తప్పనిసరి.

పరీక్ష విధానం ఇలా..
టీఎస్‌ఆర్‌జేసీ ప్రవేశ పరీక్ష ఇంగ్లీష్, తెలుగు భాషల్లో ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. 150 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్ష సమయం 2.30 గంటలు. ప్రశ్నలు పదో తరగతి సిలబస్ నుంచి, మూడు విభాగాలుగా ఉంటాయి.

ఫీజు చెల్లింపు
రిజిస్ట్రేషన్ ఫీజు రూ.200 http://tsrjdc.cgg.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో నెట్ బ్యాంకింగ్ లేదా డెబిట్/ క్రెడిట్ కార్డు ద్వారా చెల్లించాలి. ఆ సమయంలో విద్యార్థి పూర్తి వివరాలు పుట్టిన తేదీ, ఫోన్ నంబర్‌తో సహా నమోదు చేయడం తప్పనిసరి.

ముఖ్య తేదీలు
ఆన్‌లైన్ దరఖాస్తు తేది: 16 మార్చి నుంచి ఏప్రిల్ 15వ తేదీ వరకు
టీఎస్‌ఆర్‌జేసీ సెట్: మే 10 (ఉదయం 10 నుంచి 12.30 వరకు)
వెబ్‌సైట్: http://tsrjdc.cgg.gov.in

No comments:

Post a Comment