Indian Polity Questions in Telugu Part-6
1. భారత దేశంలోని రాష్ట్రాల మధ్య సహకారం, సమన్వయాలకు ఉన్న రాజ్యాంగేతర, చట్టపరంకాని సాధనాలు ఏవి?
1. జాతీయాభివృద్ధి మండలి
2. గవర్నర్ల సమావేశం
3. మండల కౌన్సిళ్లు
4. అంతర్రాష్ట్ర మండలి
ఎ) 1, 2
బి) 1, 2, 3
సి) 3, 4
డి) 4
2. ఆదాయ పన్ను విధింపు, వసూలు, పంపిణీకి సంబంధించి కిందివాటిలో సరైంది?
ఎ) కేంద్రం పన్నులు విధించి, వసూలు చేసి, ఆ మొత్తాన్ని కేంద్రం, రాష్ట్రాల మధ్య పంపిణీచేస్తుంది.
బి) అన్ని పన్నులను కేంద్రమే విధించి, వసూలు చేసిన మొత్తాన్ని ఖర్చు చేస్తుంది.
సి) అన్ని పన్నులను కేంద్రం విధించి, వసూలు చేసిన మొత్తాన్ని రాష్ట్రాలకు పంపిణీ చేస్తుంది.
డి) ఆదాయపు పన్నుపై వసూలు చేసిన సర్‌చార్జీని మాత్రం కేంద్రం రాష్ట్రాల మధ్య పంపిణీ చేస్తుంది.
3.కింది వారిలో ఎవరిని భారత ప్రభుత్వ సివిల్ సర్వీస్ ముఖ్య అధికారిగా భావించవచ్చు?
ఎ) హోం శాఖ కార్యదర్శి
బి) కేబినెట్ కార్యదర్శి
సి) సిబ్బంది శాఖా కార్యదర్శి
డి) ప్రధానమంత్రి కార్యదర్శి
4. భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన పాలనా సంస్కరణల కమిషన్ మొదటి అధ్యక్షుడు?
ఎ) గుల్జారీలాల్ నందా
బి) టి.టి.కృష్ణమాచారి
సి) మొరార్జీ దేశాయ్
డి) ఇందిరా గాంధీ
5. కింది వాటిలో దేనిపై ప్రభుత్వ ఉద్యోగులకు ప్రకరణ 311 కింద ఇచ్చిన సంరక్షణ వర్తించదు?ఎ) సస్పెండ్ చేసేటప్పుడు
బి) హోదా తగ్గించినప్పుడు
సి) తొలగించినప్పుడు
డి) బర్తరఫ్ చేసినప్పుడు
6. కేంద్ర, రాష్ర్ట సంబంధాల అధ్యయనం కోసం కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిషన్ అధ్యక్షుడు?
ఎ) జస్టిస్ ఎం.ఎం.పూంచి
బి) వి.కె.దుగ్గల్
సి) ధీరేంద్ర సింగ్
డి) మాధవీ మీనన్
7. జంతు హింస నిషేధం రాజ్యాంగంలోని ఏ జాబితాలో ఉంది?
ఎ) యూనియన్ జాబితా
బి) రాష్ర్ట జాబితా
సి) ఉమ్మడి జాబితా
డి) ఏదీకాదు
8. భారత సమాఖ్య విధానాన్ని ఏకకేంద్ర విధానంగా ఎప్పుడు మార్చొచ్చు?
ఎ) పార్లమెంటు నిశ్చయించినపుడు
బి) రాష్ర్ట శాసనసభ తీర్మానం రూపొందించినప్పుడు
సి) సాధారణ ఎన్నికల సమయంలో
డి) జాతీయ అత్యవసర పరిస్థితిలో
9. అఖిల భారత సర్వీసులను ముఖ్యంగా ఐఏఎస్, ఐపీఎస్‌లను రద్దు చేయాలని సిఫార్సు చేసిన కమిటీ?
ఎ) కాకా కలేల్కర్ కమిషన్
బి) ఖేర్ కమిషన్
సి) రాజమన్నార్ కమిషన్
డి) సర్కారియా కమిషన్
10. కేంద్రం, రాష్ట్రాల అధికార విభజన వివాదాలు పరిష్కరించడానికి ఉపయోగించే సూత్రాలు?ఎ) డాక్‌ట్రిన్ ఆఫ్ కలరబుల్ లెజిస్లేషన్
బి) డాక్‌ట్రిన్ ఆఫ్ ఇంప్లైడ్ పవర్‌స
సి) డాక్‌ట్రిన్ ఆఫ్ హార్మోనియస్ కన్‌స్ట్రక్షన్
డి) పైవన్నీ
11. ప్రభుత్వ విత్తంపై పార్లమెంటు నియంత్రణ చేసే పద్ధతి?
ఎ) బడ్జెట్
బి) ఆర్థిక బిల్లు
సి) అనుమతి ఉపక్రమణ బిల్లు
డి) పైవన్నీ
12. కేంద్ర సంఘటిత నిధి నుంచి నిధులను తీసుకునేందుకు ఎవరు ప్రతిపాదన చేయాలి?
ఎ) రాష్ర్టపతి
బి) పార్లమెంటు
సి) కేంద్ర ఆర్థిక మంత్రి
డి) కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్
13. కేంద్రం, రాష్ట్రాల మధ్య సంబంధాలు దేనిపైన ఆధారపడతాయి?
1) రాజ్యాంగ ప్రకరణలు
2) సంప్రదాయాలు, వాడుకలు
3) న్యాయస్థానాల వ్యాఖ్యానాలు
4) సంప్రదింపులు, చర్చలు
ఎ) 1, 2, 3, 4
బి) 1, 2, 3
సి) 3, 4
డి) 1, 3, 4
14. కింది ఏ కమిషన్ కేంద్రం, రాష్ట్రాల సంబంధాలను సమీక్ష చేయలేదు?
ఎ) ఎం.ఎన్. పుంచీ
బి) రాజమన్నార్
సి) సర్కారియా
డి) దంత్‌వాలా
15. కింది ఏ అంశాలు రాష్ర్ట జాబితాలోకి రావు?
ఎ) శాంతి భద్రతలు
బి) మైనింగ్
సి) జైళ్లు
డి) క్రిమినల్ ప్రోసీజర్లు
16. కేంద్రం, రాష్ట్రాల మధ్య వివాదాలకు కారణం కానిది?
ఎ) గవర్నర్ల నియామకం
బి) రాష్ర్టపతి పాలన
సి) గ్రాంట్ల మంజూరు
డి) అఖిల భారత సర్వీసులు
17.సహకార సమాఖ్య అంటే ఏమిటి?
ఎ) రాష్ట్రాల ప్రాధాన్యతలు గుర్తించడం
బి) కేంద్రంపై ఆధారపడడం
సి) రాష్ట్రాలు అడిగిన సహాయాన్ని కేంద్రం అందించడం
డి) పరస్పర ఆధార, ప్రాధాన్యతలు
18. సహకార సమాఖ్యను పెంపొందించేపకరణలు?
ఎ) ప్రకరణ 252
బి) ప్రకరణ 258
సి) ప్రకరణ 258ఎ
డి) పైవన్నీ
19. కేంద్ర బడ్జెట్‌ను లోక్‌సభ తిరస్కరిస్తే....?
ఎ) బడ్జెట్‌ను మార్పు చేసి తిరిగి ప్రవేశపెడతారు
బి) కేంద్ర ఆర్థిక మంత్రి రాజీనామా చేస్తారు
సి) ప్రధానమంత్రి, మంత్రి మండలి రాజీనామా చేస్తుంది
డి) రాష్ర్టపతి నిర్ణయం మేరకు పరిస్థితి ఉంటుంది.
20. రాజ్యాంగంలో ప్రస్తావించకుండా ఆ తర్వా త కాలంలో అమల్లోకి వచ్చిన పన్నులు?
ఎ) కార్పొరేట్ ట్యాక్స్
బి) గిఫ్ట్ ట్యాక్స్
సి) సర్వీసు ట్యాక్స్
డి) పైవన్నీ
21. రాష్ర్ట పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులను ఎవరు నియమిస్తారు?
ఎ) గవర్నర్
బి) ముఖ్యమంత్రి
సి) భారత రాష్ర్టపతి
డి) యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
22. కింది వాటిలో శాసనమండలి లేని రాష్ర్టం?
ఎ) మహారాష్ర్ట
బి) రాజస్థాన్
సి) కర్ణాటక
డి) బీహార్
23.రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం 1956 ప్రకారం ప్రస్తుత సిక్కిం ఏ జోన్‌లో ఉంది?
ఎ) సెంట్రల్ జోన్
బి) నార్తర్‌న జోన్
సి) ఈస్టర్‌న జోన్
డి) నార్‌త ఈస్టర్‌న జోన్
24. కింది వాటిలో గవర్నర్ నియామకానికి వర్తించని అర్హత?
ఎ) అతడు/ఆమె భారత పౌరుడై ఉండాలి.
బి) అతడు/ఆమె వయసు 30 ఏళ్లకు తక్కువ ఉండొద్దు.
సి) అతడు/ ఆమె పార్లమెంటు లేదా రాష్ట్ర శాసన సభల్లో సభ్యులై ఉండొద్దు.
డి) అతడు/ఆమె ఆదాయం లభించే ఏ ఇతర పదవిలో ఉండొద్దు.
25. రాష్ర్ట శాసనసభలో ఏ రాజకీయ పక్షానికీ మెజారిటీ రానప్పుడు ముఖ్యమంత్రి ఎన్నికకు గవర్నర్ ప్రధానంగా పరిశీలించవలసిన విషయం?
ఎ) స్థిరమైన మెజారిటీ పొందే అవకాశమున్న యోగ్యుడైన వ్యక్తిని వెతకడం
బి) రాష్ర్ట శాసన సభలో అతి పెద్ద రాజకీయ పార్టీ
సి) పార్టీలతో ఏర్పడ్డ అతిపెద్ద కూటమి
డి) పార్టీ కార్యక్రమానికి దాని సభ్యుల విధేయత
ANSWERS:
1)ఎ 2)ఎ 3)బి 4)సి 5)ఎ 6)ఎ 7)సి 8)డి 9)సి 10)డి 11)డి 12)బి 13)ఎ 14)డి 15)డి 16)డి 17)డి 18)డి 19)సి 20)డి 21)ఎ 22)బి 23)డి 24)బి 25)ఎ
No comments:
Post a Comment