Indian Polity Questions in Telugu Part-5

Indian Polity Questions in Telugu Part-5


1. భారత రాజ్యాంగ ప్రవేశికను దేని ఆధారంగా రూపొందించారు?
1) మోతీలాల్‌ నెహ్రూ నివేదిక
2) జవహర్‌లాల్‌ నెహ్రూ లక్ష్యాల, ఆశయాల తీర్మానం
3) రాజాజీ ఫార్ములా
4) లార్డ్‌ వేవెల్‌ ప్లాన్‌


2. భారత రాజ్యాంగ ప్రవేశికలో లేని అంశం?
1) భారతదేశంలో అధికారానికి మూలం
2) ప్రభుత్వం స్వరూపం
3) రాజకీయ వ్యవస్థ లక్ష్యం
4) రాజ్యాంగం అమలులోకి వచ్చిన తేది


3. ప్రవేశిక భారత రాజ్యాంగంలో అంతర్భాగం కాదని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు చెప్పింది?
1) బెరుబరి కేసు (1960)
2) కేశవానంద భారతీ కేసు (1973)
3) మినర్వా మిల్స్‌ కేసు (1980)
4) ఎల్‌ఐసీ ఆఫ్‌ ఇండియా కేసు (1995)


4. భారత రాజ్యాంగ ప్రవేశికను ఎన్నిసార్లు సవరించారు?
1) 104 సార్లు
2) ఒకసారి
3) రెండుసార్లు
4) సవరించలేదు



5. భారత రాజ్యాంగ ప్రవేశిక ఏ విధంగా ప్రారంభమవుతుంది.
1) భారత పౌరులమైన మేము
2) ఈ దేశ పౌరులమైన మేము
3) భారత ప్రజలమైన మేము
4) ఈ దేశ ప్రజలమైన మేము


6. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు రాజ్యాంగంలో ఎన్ని ప్రాథమిక విధులు ఉండేవి?
1) 08
2) 10
3) 11
4) లేవు


7. రాజ్యాంగంలో చేర్చిన ప్రాథమిక విధులకు సంబంధించి రాజ్యాంగ సవరణ చట్టాలు ఏవి?
1) 42, 44
2) 42, 86
3) 44, 86
4) 44, 84



8. 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా (2002) కింది వాటిలో వేటిని సవరించారు?
1) ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు
2) ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు
3) ప్రాథమిక విధులు, ఆదేశిక సూత్రాలు
4) ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, ఆదేశిక సూత్రాలు


9. ప్రాథమిక విధుల అమలు దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు?
1) జనవరి 3
2) జనవరి 10
3) డిసెంబర్‌ 3
4) డిసెంబర్‌ 10



10. ప్రాథమిక విధుల సక్రమ అమలుకై తగిన సూచనలు ఇవ్వటానికి నియమించిన కమిటీ ఏది? 1) ఎంపీ శర్మ
2) జేఎస్‌ వర్మ
3) ఎం.ఎన్‌. వెంకటాచలయ్య
4) స్వరణ్‌ సింగ్‌ కమిటీ




11. ఆదేశిక సూత్రాలు భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్‌లో ఉన్నాయి?
1) 35 నుంచి 51 వరకు
2) 35 నుంచి 50 వరకు
3) 36 నుంచి 51 వరకు
4) 36 నుచి 50 వరకు



12. భారత రాజ్యాంగం ప్రకారం ఆదేశిక సూత్రాలను ఎన్ని రకాలుగా వర్గీకరించారు?
1) 3
2) 5
3) 7
4) ఎలాంటి వర్గీకరణ లేదు



13. ఆదేశిక సూత్రాలను ఏ దేశ రాజ్యాంగం నుంచి స్వీకరించారు?
1) స్పెయిన్‌
2) ఐర్లాండ్‌
3) ఫ్రాన్స్‌
4) సోవియట్‌ రష్యా



14. కింది వాటిలో ఆదేశిక సూత్రం కానిదేది?
1) మద్యపాన నిషేధం
2) గోవధ నిషేధం
3) పని హక్కు
4) ఉమ్మడి సంస్కృతి పరిరక్షణ


15. ఆదేశిక సూత్రాలను ‘బ్యాంక్‌ వసతి ప్రకారం చెల్లించే చెక్కు వంటిదని’ వ్యాఖ్యానించింది ఎవరు?
1) ఎం.సి. చాగ్లా
2) బీఆర్‌ అంబేడ్కర్‌
3) కేటీ షా
4) కేసీ వేర్‌



16. ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు పరస్పర ఆధారాలు అని కింది వాటిలో తెలిపేది ఏది?
1) చంపకం దొరై రాజన్‌ కేసు
2) 25వ రాజ్యాంగ సవరణ చట్టం
3) కేశవానంద భారతి కేసు
4) పైవన్నీ సరైనవి




17. ఇప్పటి వరకు అమలు పరచని ఆదేశిక సూత్రం ఏది?
1) ఉమ్మడి పౌర స్మృతి
2) సంక్షేమ సూత్రాల అమలు
3) ప్రజారోగ్యాన్ని కాపాడటం
4) పేదలకు ఉచిత న్యాయ సహాయం



18. ఆదేశిక సూత్రాలలో ఆర్టికల్‌–39(ఎ), 39(డి), 39(ఎఫ్‌), 43(ఎ), 48(ఎ)లను ఏ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చారు?
1) 24
2) 25
3) 42
4) 44



19. ‘‘భవిష్యత్‌లో చేయబోయే అన్ని శాసనాలకు ఆదేశిక సూత్రాలే మూలంగా ఉండాలి’’ అని వ్యాఖ్యానించింది ఎవరు?
1) నెహ్రూ
2) అంబేడ్కర్‌
3) రాజేంద్ర ప్రసాద్‌
4) బీఎన్‌ రాయ్‌



ANSWERS:

1)2 2)4 3)1 4)2 5)3 6)4 7)2 8)4 9)1 10)2 11)3 12)4 13)2 14)4 15)3 16)3 17)1 18)3 19)2

No comments:

Post a Comment