Indian Polity MCQs in Telugu- Part-I

Indian Polity MCQs in Telugu- Part-I


1. లోక్‌సభ, అసెంబ్లీల్లో ఎస్సీ, ఎస్టీ, ఆంగ్లో-ఇండియన్ల రిజర్వేషన్లను ఎన్నో రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 2030 సంవత్సరం వరకు పొడిగించారు?
1) 101
2) 102
3) 103
4) 104

2. భారత పార్లమెంట్ తొలిసారిగా ఎప్పుడు సమావేశం అయింది?
1) 1952 మార్చి 13
2) 1952 మే 13
3) 1953 మార్చి 13
4) 1953 మే 13

3. లోక్‌సభ గరిష్ట సభ్యుల సంఖ్య ఎంత?
1) 545
2) 550
3) 552
4) 543

4. లోక్‌సభలో అతి తక్కువగా అంటే ఒక్కొక్క స్థానం ఉన్న రాష్ట్రాలు ఏవి?
1) సిక్కిం, నాగాలాండ్, గోవా
2) సిక్కిం, గోవా, మణిపూర్
3) సిక్కిం, నాగాలాండ్, మిజోరాం
4) సిక్కిం, మిజోరాం, మణిపూర్

5. రాజ్యసభకు 233 మంది ఎన్నిక ద్వారా వచ్చే సభ్యుల ఎన్నిక విధానం ఏ విధంగా ఉంటుంది?
1) సాధారణ మెజారిటీ పద్ధతి, రహస్య ఓటు పద్ధతి
2) సాధారణ మెజారిటీ పద్ధతి, బహిరంగ ఓటు పద్ధతి
3) నైష్పత్తిక ప్రాతినిధ్య, రహస్య ఓటు పద్ధతి
4) నైష్పత్తిక ప్రాతినిధ్య, బహిరంగ ఓటు పద్ధతి




6. పార్లమెంట్‌కు పోటీచేసే అభ్యర్థి చెల్లించవలసిన డిపాజిట్ ఎంత?
1) 10,000
2) 15,000
3) 20,000
4) 25,000

7. భారత పార్లమెంట్ సంవత్సరానికి కనీసం ఎన్నిసార్లు సమావేశం కావాలి?
1) ఒకసారి
2) రెండుసార్లు
3) మూడుసార్లు
4) నిర్ణీత కనీస పరిమితి లేదు

8. కింది ఏ బిల్లుల విషయంలో పార్లమెంట్ ఉభయ సభలకు సమాన అధికారం ఉంది?
ఎ) సాధారణ బిల్లు
బి) రాజ్యాంగ సవరణ బిల్లు
సి) నూతన రాష్ట్రాల ఏర్పాటు బిల్లు
డి) ద్రవ్యబిల్లు

1) ఎ, బి
2) ఎ, సి
3) ఎ, బి,సి
4) ఎ, బి, సి, డి

9. సభలో సభ్యుడు కాకున్న సభకు అధ్యక్షతవహించే వ్యక్తి?
1) లోక్‌సభ స్పీకర్
2) లోక్‌సభ డిప్యూటీ స్పీకర్
3) రాజ్యసభ చైర్మన్
4) పై ముగ్గురూ

10. లోక్‌సభలో అధికారికంగా గుర్తింపు పొందిన తొలి ప్రతిపక్ష నేత ఎవరు?
1) జె.బి. కృపలానీ
2) మొరార్జీ దేశాయ్
3) చరణ్‌సింగ్
4) వై.బి. చవాన్
11. లోక్‌సభకు తొలిసారిగా మధ్యంతర ఎన్నిక ఎప్పుడు జరిగింది?
1) 1967
2) 1971
3) 1977
4) 1980

12. ఎంపీల్యాడ్‌‌స స్కీమ్ కింద ఒక్కొక్క ఎం.పి.కి సంవత్సరానికి నియోజకవర్గ అభివృద్ధికి ఎన్ని కోట్లు ఇస్తున్నారు?
1) 1
2) 3
3) 5
4) 10

13. ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు పొందిన భారత ప్రధానులు ఎంత మంది ఉన్నారు?
1) 2
2) 3
3) 4
4) 5

14. ఇప్పటి వరకు లోక్‌సభకు 17 సార్లు ఎన్నికలు జరగ్గా అతి ఎక్కువ కాలం కొనసాగిన లోక్‌సభ ఎన్నోది?
1) 3
2) 5
3) 7
4) 9



15. పార్లమెంట్ సభ్యులు ఎన్ని రోజుల పాటు పార్లమెంట్ సమావేశాలకు హాజరు కాకుంటే సభ్యత్వం రద్దు అవుతుంది?
1) 30 రోజులు
2) 60 రోజులు
3) 3 నెలలు
4) 6 నెలలు

16. రాష్ర్ట జాబితాలోని అంశాలపై కూడా పార్లమెంట్ ఏ సందర్భంలో శాసనాలు రూపొందించవచ్చు?
1) జాతీయ ప్రయోజనం
2) రెండు రాష్ట్రాలు ఉమ్మడి ప్రయోజనం కోసం
3) అత్యవసర పరిస్థితి అమలులో ఉన్నప్పుడు
4) పై అన్నీ సందర్భాల్లో

17. పస్తుతం ఉన్న లోక్‌సభ సభ్యుల సంఖ్యను ఏ సంవత్సరం వరకు మార్చకూడదు?
1) 2025
2) 2026
3) 2030
4) 2035

18. భారత పార్లమెంట్ సమావేశాలు దేనితో ప్రారంభమవుతాయి?
1) శూన్య సమయం
2) ప్రశ్నోత్తరాలు సమయం
3) అరగంట చర్చ
4) సావధాన తీర్మానం

ANSWERS:
1) 4   2) 2   3) 3   4) 3   5) 4   6) 4   7) 2   8) 3    9) 3    10) 4   11) 2   12) 3    13) 2   14) 2   15) 2    16) 4    17) 2    18) 2


Download in Pdf




No comments:

Post a Comment