Indian History Questions in Telugu Part-3

Indian History Questions in Telugu Part-3


1. సూర్యుడు భూమి చుట్టూ తిరగడం లేదని చెప్పిన మేధావి?
1) వరాహ మిహిరుడు
2) ఆర్యభట్టు
3) శుశ్రుతుడు
4) చరకుడు

2. జతపరచండి.
జాబితా-I
i) చక్రం ఆకారంలో ఉన్న స్తూపం
ii) వృషభ శిఖరం
iii) నలగిరి ఏనుగు శిల్పం
iv) ఉపాలి అనే క్షురకుడు బౌద్ధాన్ని స్వీకరించే శిల్పం
జాబితా-II
a) అమరావతి
b) సాలి హుండం
c) నాగార్జునకొండ
d) రాంపూర్వ
1) i-a, ii-b, iii-c, iv-d
2) i-c, ii-a, iii-d, iv-b
3) i-b, ii-d, iii-a, iv-c
4) i-d, ii-c, iii-b, iv-a


3.కర్ణాటకలో కనగనహల్లిలోని శాసనంలో ‘రాణ్య అశోక’ అని ఏ లిపిలో లిఖించి ఉంది?
1) ఖరోష్ఠి
2) దేవనాగరి
3) బ్రాహ్మి
4) అరామిక్

4. బుద్ధుడి తొలి బోధన జరిగిన ప్రాంతం ఏది?
1) బోధ్ గయ
2) లుంబినీ వనం
3) సారనాథ్
4) కుశీ నగరం

5. ఇక్ష్వాకుల రాజధాని విజయపురి ఏ నదీ తీరంలో ఉంది?
1) గోదావరి
2) కావేరి
3) మూసీ
4) కృష్ణా
6. కింది వారిలో నాయనార్లు (శివ భక్తులు) ఎవరు?
1) నందనార్, సుందనార్
2) మాణిక్యవాచకర్, అప్పర్
3) కరైక్కాలమ్మ, అరయ్యార్
4) పై వారందరూ


7. మధ్యప్రదేశ్‌లో అతి ప్రాచీన కృష్ణుడి ఆలయం ఎక్కడ ఉంది?
1) విదిశ
2) ఉజ్జయిని
3) గ్వాలియర్
4) పన్నా
8. వాయవ్య దిశ నుంచి భారత్ ఉప ఖండానికి రావడానికి ఏ నదిని దాటాలి?
1) నర్మద
2) కావేరి
3) సింధూ నది
4) బ్రహ్మపుత్ర
9. ‘శివ భక్తులు ఏ రాజుకి, చావుకు, రుగ్మతలకు, నరకానికి కూడా భయపడరు’ అని పేర్కొన్నదెవరు?
1) పెరియాళ్వారు
2) అప్పర్
3) నమ్మళ్వార్
4) నందనర్

10. అతి ప్రాచీన శివలింగం ఉన్న గుడిమల్లం ప్రాంతం ఏ జిల్లాలో ఉంది?
1) చిత్తూరు
2) కర్నూలు
3) నెల్లూరు
4) శ్రీకాకుళం

11. కింది వాటిలో సరైన జత ఏది?
1) చింతకుంట - వైఎస్‌ఆర్ కడప జిల్లా
2) చింతమానుగవి - కర్నూలు జిల్లా
3) కామకూరు - శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
4) పైవన్నీ సరైనవే

12. పురావస్తు ఆధారాలు దొరికిన పాళ్వాయి ప్రాంతం ఏ జిల్లాలో ఉంది?
1) అనంతపురం
2) ప్రకాశం
3) తూర్పు గోదావరి
4) గుంటూరు

13. అశోకుడి శాసనాల్లో లిఖించిన ధమ్మ అనే పదం ఏ భాషకు చెందింది?
1) సంస్కృతం
2) అర్థమాగది
3) ప్రాకృతం
4) తమిళం

14. కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో మ్యాకదోని శాసనంలో పేర్కొన్న గహపతి ఎవరు?
1) స్కంధనాగ
2) శ్రీపులోమావి
3) సమ్హ
4) కుమారదత్త


15.కింది వాటిలో సరికాని జత ఏది?
1) నిశుంభసూదిని దేవాలయం - విజయాలయుడు
2) బృహదీశ్వరాలయం - మొదటి రాజేంద్ర చోళుడు
3) వేయి స్తంభాల గుడి - రుద్రదేవుడు
4) ఇబాదత్ ఖానా - అక్బర్

16. సుల్హ్-ఇ-కుల్ అంటే అర్థం ఏమిటి?
1) ప్రపంచ శాంతి
2) ప్రపంచ జ్యోతి
3) ప్రపంచ యుద్ధం
4) ప్రపంచ మతం

17. జతపరచండి.
జాబితా-I
i) అబ్దుల్ రజాక్
ii) న్యూనిజ్
iii) నికోలో కోంటి
iv) రాబర్‌‌ట క్లైవ్
జాబితా-II
a) పోర్చుగల్
b) ఇటలీ
c) పర్షియా
d) ఇంగ్లండ్
1) i-a, ii-b, iii-c, iv-d
2) i-c, ii-a, iii-b, iv-d
3) i-d, ii-c, iii-b, iv-a
4) i-c, ii-d, iii-a, iv-b

18. మొగలుల కాలంలో ‘జబ్త్’ అనే పదం దేన్ని సూచిస్తుంది?
1) రెవెన్యూ విధానం
2) సైనిక విధానం
3) మత విధానం
4) వాస్తు, కళా విధానం

19. కింది వాటిలో సరైన జత ఏది?
1) నానా ఫడ్నవీస్ - మరాఠా
2) సిరాజుద్దౌలా - బెంగాల్
3) హైదర్ అలీ - మైసూర్
4) పైవన్నీ సరైనవే


20.కింది వారిలో వీరశైవ మతానికి చెందని వారు ఎవరు?
1) బసవన్న
2) అల్లమ ప్రభువు
3) అక్కమహాదేవి
4) శంకరాచార్యులు

21. జతపరచండి.
జాబితా-I
i) పోతన
ii) కంచర్ల గోపన్న
iii) అన్నమయ్య
iv) చైతన్య ప్రభు
జాబితా-II
a) దాశరథి శతకం
b) హరేకృష్ణ మంత్రం
c) పదకవితా పితామహుడు
d) సహజ కవి
1) i-d, ii-a, iii-c, iv-b
2) i-c, ii-a, iii-b, iv-d
3) i-b, ii-d, iii-a, iv-c
4) i-d, ii-c, iii-b, iv-a

22.కాబూల్‌లో ‘చార్‌భాగ్’ను ఎవరు నిర్మించారు?
1) బాబర్
2) అక్బర్
3) జహంగీర్
4) షాజహాన్

23.జోద్‌బాయి మందిరం ఎక్కడ ఉంది? 
1) ఆగ్రా
2) ఢిల్లీ
3) ఫతేపూర్ సిక్రీ
4) కాబూల్

ANSWERS:

1)2 2)3 3)3 4)3 5)4 6)4 7)1 8)3 9)2 10)1 11)4 12)1 13)3 14)3 15)2 16)1 17)2 18)1 19)4 20)4 21)1 22)1 23)3

No comments:

Post a Comment