Indian History Questions in Telugu Part-7

Indian History Questions in Telugu Part-7


1. విజయనగర రాజుల కాలంలో అత్యంత జనాదరణ పొందిన సంగీత పరికరం?
1) మృదంగం
2) వీణ
3) నాదస్వరం
4) వేణువు

2. ‘భగవద్గీత’ను మరాఠీ భాషలోకి అనువదించిందెవరు? 
1) ఏక్‌నాథ్‌
2) నామ్‌దేవ్‌
3) చండీదాస్‌
4) జ్ఞానదేవుడు


3. కాకతీయుల కాలంలో కూనవరం దేనికి ప్రసిద్ధిగాంచింది? 
1) కలంకారీ పరిశ్రమ
2) బొమ్మల తయారీ
3) గాజుల తయారీ పరిశ్రమ
4) కత్తుల పరిశ్రమ


4. ‘ప్రచ్ఛన్నబుద్ధుడు’ అని ఎవరిని అంటారు?
1) మధ్వాచార్యులు
2) రామానుజాచార్యులు
3) వల్లభా చార్యులు
4) ఆదిశంకరా చార్యులు


5. ‘క్వీన్‌ ఆఫ్‌ మ్యూజికల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌’ అని ఏ సంగీత పరికరాన్ని అంటారు?
1) వేణువు (ప్లూట్‌)
2) వయోలిన్‌(ఫిడేల్‌)
3) నగారా(ఢంకా)
4) ఏదీకాదు


6. భారతదేశంలో నిర్మించిన తొలి పాలరాతి సమాధి ఏది?
1) ఆటల మసీదు
2) హిందోలామహల్‌
3) హోషంగా సమాధి
4) తాజ్‌మహల్‌


7. దశవతార గుహను రాష్ట్ర కూటుల కాలంలో ఎక్కడ శిల్పీకరించారు?
1) మహాబలిపురం
2) ఉజ్జయిని
3) బేలూరు
4) ఎల్లోరా


8. ఎన్ని సంవత్సరాలు పూర్తయిన కట్టడాలకు ప్రాచీన కట్టడ హోదాను భారత ప్రభుత్వం ప్రకటిస్తుంది?
1) 100 సంవత్సరాలు
2) 200 సంవత్సరాలు
3) 300 సంవత్సరాలు
4) 400 సంవత్సరాలు



9. కద్రి గోపాల్‌నాథ్‌ అయ్యర్‌ ఏ సంగీత పరికరం వాయించుటలో దిట్ట?
1) మృదంగం
2) శాక్సాఫోన్‌
3) సితార్‌
4) గిటార్‌


10. తీరదేవాలయాలు ఏ దేవునికి అంకితం?
1) శివుడు
2) విష్ణువు
3) బ్రహ్మ
4) కుమారస్వామి


11. గంగానది ప్రక్షాళనకు నిరాహార దీక్ష చేసి ఆ సందర్భంలోనే మరణించిన వారు ఎవరు?
1) డి.ఎస్‌.హుడా
2) చండీ ప్రసాద్‌ భట్‌
3) విజయ్‌ గోఖలే
4) జి.డి. అగర్వాల్‌


12. శ్రీకృష్ణ దేవరాయలు ఏ సంవత్సరంలో రాజ్యపాలనా బాధ్యతలు చేపట్టాడు?
1) 1509
2) 1512
3) 1518
4) 1519


13. కొండలను తొలిచి గుహలను నిర్మించిన తొలి పల్లవ రాజు ఎవరు?
1) సింహ విష్ణువు
2) మహేంద్ర వర్మ–1
3) నరసింహ వర్మ–1
4) నందివర్మ


14. వేలువన విహారమును బౌద్ధ సంఘానికి దానం చేసింది ఎవరు?
1) బింబిసారుడు
2) అజాత శత్రువు
3) ప్రసేనజిత్తు
4) ఉదయనుడు


15. ‘త్రిసముద్రాధిపతి’ బిరుదాంకితుడెవరు?
1) గౌతమీపుత్ర శాతకర్ణి
2) శివ శ్రీ శాతకర్ణి
3) యజ్ఞశ్రీ శాతకర్ణి
4) 3వ పులోమావి


16.‘అష్టాంగ సంగ్రహం’ ఏ అంశాలకు సంబంధించినది?
1) ఖగోళ అంశాలు
2) వైద్య సంబంధ అంశాలు
3) గణిత శాస్త్ర అంశాలు
4) సంస్కృత వ్యాకరణ అంశాలు


17. ‘బార్డోలీ వీరుడు’ అని ఎవరిని అంటారు?
1) సర్ధార్‌ అజిత్‌ సింగ్‌
2) సర్ధార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌
3)మంగళ్‌ పాండే
4) కన్హూర్‌ జి మెహతా


18. ‘జల్, జంగిల్, జమీన్‌’ నినాద కర్త ఎవరు?
1) రాంజీ గోండ్‌
2) కొమురం భీం
3) గాం మల్లుదొర
4) అంబుల్‌ రెడ్డి



19. ‘ప్రిన్స్‌ ఆఫ్‌ పెయింటర్స్‌’ అని ఎవరిని అంటారు? 
1) బాబర్‌
2) జహంగీర్‌
3) షాజహాన్‌
4) అక్బర్‌


20. థామస్‌ మన్రో ఎక్కడ మరణించారు?
1) ఆదోని
2) ధర్మవరం
3) పత్తికొండ
4) రాప్తాడు


21. చంద్రకాంత్‌ సోంపుర ఏ రంగంలో దిట్ట?
1) శిల్ప కళారంగం
2) వైద్యరంగం
3) వైమానిక రంగం
4) విద్యుత్‌ రంగం


22. అర్జునుని తపస్సు శిల్పం ఎక్కడ శిల్పీకరించారు?
1) మథురై
2) కాంచీపురం
3) శ్రావణ బెళగొళ
4) మహాబలిపురం


23. భగవద్గీత మహాభారతంలో ఏ పర్వంలో ఉంది?
1) ఆదిపర్వం
2) భీష్మ పర్వం
3) సభాపర్వం
4) అరణ్య పర్వం


24. కాంగ్రా తేనీరు ఏ రాష్ట్రంలో తయారు చేస్తారు?
1) హిమాచల్‌ప్రదేశ్‌
2) అరుణాచల్‌ ప్రదేశ్‌
3) సిక్కిం
4) తమిళనాడు


25. డోనా గంగూలీ ఏ నాట్య ప్రక్రియలో కీర్తిగాంచారు?
1) కథక్‌
2) మోహినీ అట్టం
3) ఒడిస్సీ
4) మణిపురి

ANSWERS:

1)2 2)1 3)4 4)4 5)2 6)3 7)4 8)1 9)2 10)1 11)4 12)1 13)2 14)1 15)3 16)2 17)2 18)2 19)2 20)3 21)1 22)4 23)2 24)1 25)3

No comments:

Post a Comment