Indian History Questions in Telugu Part-5

Indian History Questions in Telugu Part-5


ఆంగ్లేయుల విజృంభణ:
1. క్రీ.శ. 1602లో భారత్‌కు వచ్చిన ఆంగ్ల రాయబారి ఎవరు?
1) విలియం హాకిన్స్
2) హెన్రీ మిడిల్‌టన్
3) జేమ్స్ లంకాస్టర్
4) సర్ థామస్ రో

2. సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టిన బెంగాల్ గవర్నర్ జనరల్?
1) వారన్ హేస్టింగ్స్
2) కారన్ వాలీస్
3) వెల్లస్లీ
4) విలియం బెంటిక్


3. లార్డ్ హార్డింజ్ ప్రభుత్వ ఉద్యోగాలకు ఇంగ్లీష్ భాష తప్పనిసరి అని ఎప్పుడు ప్రకటించాడు?
1) 1835
2) 1844
3) 1856
4) 1861


4. అయోధ్య నవాబుతో వారన్ హేస్టింగ్స్ చేసుకున్న సంధి ఏది?
1) బెనారస్ సంధి
2) మంగుళూరు సంధి
3) అలహాబాద్ సంధి
4) అమృత్‌సర్ సంధి



5. ‘రాజస్థాన్ కథావళి’ గ్రంథకర్త ఎవరు?
1) సర్ జాన్ మార్షల్
2) పారిట్జర్
3) సర్ విల్కిన్స్
4) కల్నల్ టాడ్


6. హుగ్లీ నందు వర్తక స్థావరమును నెలకొల్పిన ఆంగ్లేయుడు ఎవరు?
1) గేబ్రియల్ బౌటన్
2) థామస్ బెస్ట్
3) జాన్ న్యూబెరి
4) రాల్ఫ్ పిచ్


7. హింసకు పాల్పడుతున్నారని పిండారీలు అనే దారి దోపిడీ దొంగలను ఎవరు అణిచివేశారు?
1) సర్ హ్యుగ్‌రోజ్
2) సర్ థామస్ హిప్లాస్
3) సర్ విలియం జోన్స్
4) జోనాథన్ డంకన్


8. జతపరచండి.
జాబితా-1 జాబితా-2
1. 1765 ఎ. శ్రీరంగ పట్నం సంధి
2. 1773 బి. బక్సార్ యుద్ధం
3. 1764 సి. రెగ్యులేటింగ్ చట్టం
4. 1792 డి. అలహాబాద్ సంధి
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
3) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి
4) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ



9. ఆంగ్లేయులు మచిలీపట్నంలో కర్మాగారం నెలకొల్పడానికి ఫర్మానా జారీ చేసిందె వరు?
1) ఇబ్రహీం కులీ కుతుబ్ షా
2) మహ్మద్ కులీ కుతుబ్‌షా
3) మహ్మద్ కుతుబ్‌షా
4) అబుల్‌హసన్ తానీషా


10. ‘ఆర్కాటు వీరుడు’ అని ఎవరిని పిలుస్తారు?
1) లార్డ్ వెల్లస్లీ
2) లార్డ్ కారన్ వాలీస్
3) రాబర్‌‌ట క్లైవ్
4) సర్ ఆర్థర్ కాటన్


11. కింది ఏ ఆర్థిక విధానానికి పితామహుడు అని మెర్టిన్స్ బర్డ్కు పేరు?
1) మహల్‌వారీ విధానం
2) రైత్వారీ విధానం
3) శాశ్వత శిస్తు విధానం
4) బందోబస్తు విధానం


12. కింది వాటిలో సరైన జత ఏది?
1. దస్తక్ - ఈస్టిండియా కంపెనీవారు తమ ఉద్యోగులకు ఇచ్చే వ్యాపార లెసైన్స్లు
2. దివానీ - రెవెన్యూ వసూలు చేయు అధికారం
3. దరోగా - ఠాణా పోలీసు అధికారి
4. పైవన్నీ



13. హిందూ ధర్మశాస్త్రాన్ని ఆంగ్లంలోకి అనువదించింది ఎవరు?
1) జేమ్స్ ప్రిన్సెప్
2) హాల్‌హెడ్
3) కల్నల్ మెకంజీ
4) సర్ విలియం జోన్స్


14. సెయింట్ డేవిడ్ కోటను ఆంగ్లేయులు ఎక్కడ నిర్మించారు?
1) మద్రాస్
2) కలకత్తా
3) కడలూరు
4) బొంబాయి


15. సామంత సంబంధ నిరోధక విధానంను అనుసరించి పాలించిందెవరు?
1) సర్ విలియం స్లీమన్
2) కల్నల్ యంగ్ హజ్బెండ్
3) లార్డ్ డల్హౌసీ
4) మార్క్వస్ ఆఫ్ హేస్టింగ్స్


16. లార్డ్ కర్జన్ పురావస్తు శాఖను ఎప్పుడు నెలకొల్పాడు?
1) 1878
2) 1902
3) 1904
4) 1905


17. అలెగ్జాండర్ రీడ్ రైత్వారీ పద్ధతిని తొలిసారిగా ఎక్కడ ప్రవేశపెట్టాడు?
1) దత్త మండలాలు
2) బొంబాయి
3) మీరట్
4) బారామహల్


18. పీష్వా పదవిని రద్దుచేసిన బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు?
1) లార్డ్ హేస్టింగ్స్
2) లార్డ్ విలియం బెంటిక్
3) లార్డ్ వెల్లస్లీ
4) లార్డ్ వారన్ హేస్టింగ్స్



19. అక్బర్ చక్రవర్తిని ‘కాంబే రాజా’ అని సంభోధించిన ఉత్తరాన్ని పంపిన ఇంగ్లండ్ రాణి?
1) ఎలిజెబెత్-1
2) ఎలిజెబెత్-2
3) మేరి
4) సోిఫియా



20. భారతదేశ ప్రథమ గవర్నర్ జనరల్‌గా పనిచేసిన ఆంగ్లేయుడు ఎవరు?
1) లార్డ్ హేస్టింగ్స్
2) రాబర్‌‌ట క్లైవ్
3) విలియం బెంటిక్
4) డల్హౌసీ


21. బొంబాయిని ఈస్టిండియా కంపెనీ ఎవరి నుంచి కౌలుకు తీసుకుంది?
1) జేమ్స్-1
2) జేమ్స్-2
3) ఛార్లెస్-1
4) ఛార్లెస్-2


22. జతపరచండి.
జాబితా-1
1. 1813
2. 1817
3. 1855
4. 1856
జాబితా-2
ఎ. ఎన్‌ఫీల్డ్ రైఫిల్స్‌ను ప్రవేశపెట్టారు
బి. సంథాల్ తిరుగుబాటు
సి. కలకత్తా హిందూ కళాశాల స్థాపన
డి. భారత్‌లో క్రైస్తవ మిషనరీల ప్రవేశానికి అనుమతి
1) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
2) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి
3) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
4) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ


23. ఛార్లెస్ ఉడ్స్ 1854లో ఏ అంశాల పరిశీలనకు ఉపక్రమించి ప్రణాళిక రూపొందించాడు?
1) రైల్వే వ్యవస్థ
2) విద్యా వ్యవస్థ
3) పోలీస్ వ్యవస్థ
4) రోడ్డు రవాణా వ్యవస్థ

ANSWERS:

1)3 2)3 3)2 4)1 5)4 6)1 7)2 8)4 9)2 10)3 11)1 12)4 13)2 14)3 15)4 16)2 17)4 18)1 19)1 20)3 21)4 22)4 23)2
Indian History Questions in Telugu Part-4

No comments:

Post a Comment