Indian History Questions in Telugu Part-2

Indian History Questions in Telugu Part-2


స్వాతంత్రోద్యమ చరిత్ర : 

1. మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికాకు ప్రథమంగా ఎప్పుడు వెళ్లాడు?
1) క్రీ.శ. 1889
2) క్రీ.శ. 1893
3) క్రీ.శ. 1895
4) క్రీ.శ. 1899

2. గాంధీజీ దక్షిణాఫ్రికాలో ప్రారంభించిన పత్రిక?
1) నేషనల్ హెరాల్డ్
2) నవజీవన్
3) యంగ్ ఇండియా
4) ఇండియన్ ఓపీనియన్

3. ఉప్పు సత్యాగ్రహంలో గాంధీజీ ఏ ప్రాంతంలో శాసనాలను ఉల్లంఘించాడు?
1) సబర్మతి
2) పోర్‌బందర్
3) దండి
4) వార్థా

4. జతపరచండి.
జాబితా-1
1. అస్సాం కేసరి
2. పంజాబ్ కేసరి
3. దేశబందు
4. దీనబందు
జాబితా-2
ఎ. సి.ఎఫ్. ఆండ్రూస్
బి. చిత్తరంజన్‌దాస్
సి. లాలాలజపతిరాయ్
డి. అంబికారాయ్ చౌదరి
1) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి
2) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
3) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
4) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి

5. అతివాదులకు నాయకుడెవరు?
1) లాలా లజపతిరాయ్
2) భగత్‌సింగ్
3) బాలగంగాధర తిలక్
4) బిపిన్ చంద్రపాల్

6. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎక్కడ జన్మించారు?
1) కటక్
2) కలకత్తా
3) ముర్షిదాబాద్
4) భువనేశ్వర్

7. ‘గీతా రహస్యం’ గ్రంథకర్త ఎవరు?
1) గోపాలకృష్ణ గోఖలే
2) బిపిన్ చంద్రపాల్
3) లాలా లజపతిరాయ్
4) బాలగంగాధర తిలక్

8. జతపరచండి.
జాబితా-1
1. మీరాబెన్
2. మార్గరేట్ నోబుల్
3. మేడం బికాజీకామా
4. కాదింబినీ గంగూలీ
జాబితా-2
ఎ. ఐఎన్‌సీ సమావేశాలకు హాజరైన తొలి మహిళ
బి. భారతదేశ స్వాతంత్య్ర విప్లవానికి మాత
సి. గాంధీజీ శిష్యురాలు
డి. స్వామి వివేకానంద శిష్యురాలు
1) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి
2) 1-సి, 2-డి, 3-బి, 4-ఎ
3) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
4) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ


9. భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లను ఎప్పుడు ఉరితీశారు?
1) 1929 డిసెంబర్ 19
2) 1930 మార్చి 12
3) 1931 మార్చి 23
4) 1942 ఆగస్ట్ 9

10. ‘భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు’ అనే మన దేశ ప్రతిజ్ఞ రాసిందెవరు?
1) శ్యామ్‌లాల్ పర్షాద్‌గుప్త
2) పైడిమర్రి వెంకటసుబ్బారావు
3) చందాల కేశవదాసు
4) దేవులపల్లి కృష్ణశాస్త్రి

11. 1908లో బాల గంగాధర తిలక్‌ను బ్రిటిష్‌వారు ఎక్కడ నిర్భంధించారు?
1) పూనా
2) అండమాన్
3) కోయంబత్తూర్
4) మాండలే

12. జనగణమన గీతాన్ని తొలిసారిగా ఏ ఐఎన్‌సీ సమావేశంలో ఆలపించారు?
1) కలకత్తా - 1911
2) లక్నో - 1916
3) బెల్గాం - 1924
4) కాన్పూర్ - 1925

13.వందేమాతరం ఉద్యమం ప్రారంభ కేంద్రం ఏది?
1) ఢిల్లీ
2) మీరట్
3) కలకత్తా
4) సిమ్లా

14. స్వదేశీ సంస్థానాల విలీనీకరణ కాలంలో కాశ్మీర్ పాలకుడు ఎవరు?
1) దులీప్‌సింగ్
2) రంజిత్‌సింగ్
3) హరిసింగ్
4) ఖాన్ బహదూర్‌ఖాన్

15. మంత్రిత్రయ రాయబారంలో ఉన్న సభ్యులెవరు?
1) పెథిక్ లారెన్‌‌స
2) సర్ స్ట్రాఫర్‌‌డ క్రిప్స్
3) ఎ.వి. అలెగ్జాండర్
4) పై అందరూ

16. 1946 ఆగస్ట్ 16న మహ్మదాలీ జిన్నా ప్రత్యక్ష కార్యాచరణకు పిలుపు ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
1) ఆంగ్లేయులను తక్షణం భారత్ నుంచి వెళ్ళగొట్టడానికి
2) బలప్రయోగం ద్వారా పాకిస్తాన్ సాధన కోసం
3) ముస్లిం విద్యాసంస్థల నిధుల మంజూరు కోసం
4) ఏదీకాదు

17. హిందూ మహాసభను 1915లో స్థాపించింది ఎవరు?
1) మదన్ మోహన్ మాలవ్య
2) డాక్టర్ హెగ్డేవార్
3) ఎం.ఎస్. గోల్వాల్కర్
4) వి.డి. సావర్కర్

18. 1929లో చేసిన శారదా చట్టం అమలులోకి వచ్చే నాటికి భారత వైశ్రాయి ఎవరు?
1) లార్‌‌డ ఇర్విన్
2) లార్‌‌డ లిన్‌లిత్‌గో
3) లార్‌‌డ వెవేల్
4) లార్‌‌డ కర్జన్

19. జతపరచండి.
సంస్థ:
1. ఎఐటీయూసీ
2. ఐఎన్‌ఎ
3. ఎస్‌ఎన్ డీపీవై
4. ఐఎన్‌సీ
స్థాపకులు:
ఎ. నేతాజీ సుభాష్ చంద్రబోస్
బి. శ్రీ నారాయణగురు
సి. ఎ.ఓ. హ్యుమ్
డి. ఎన్.ఎం. జోషి
1) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
2) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
3) 1-డి, 2-ఎ, 3-బి, 4-సి
4) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి

20. రాజాజీ ప్రణాళికను ఏ సంవత్సరంలో ప్రకటించారు?
1) 1942
2) 1943
3) 1944
4) 1946


ANSWERS:
1)2 2)4 3)3 4)3 5)3 6)1 7)4 8)2 9)3 10)2 11)4 12)1 13)3 14)3 15)4 16)2 17)1 18)1 19)3 20)3

No comments:

Post a Comment