Indian History Questions in Telugu Part-1

Indian History Questions in Telugu Part-1


దక్షిణ భారతదేశ చరిత్ర :
1. తెలుగులో తొలి టాకీ చిత్రం ఏది?
1) భీష్మ ప్రతిజ్ఞ
2) భక్త ప్రహ్లాద
3) మాలపిల్ల
4) రైతుబిడ్డ

2. తంజావూరు నాయక రాజ్యస్థాపకుడెవరు?
1) చెవ్వప్ప
2) అచ్యుతప్ప
3) రఘునాథ నాయకుడు
4) విశ్వనాథ నాయకుడు

3. ‘ఆంధ్రకవితా పితామహుడు’ అల్లసాని పెద్దనకు శ్రీకృష్ణదేవరాయలు అగ్రహారంగా ఇచ్చిన గ్రామం?
1) రెంటచింతల
2) పెంచికలదిన్నె
3) కోకట
4) నవఖండవాడ

4. తెలుగు నేలలో తొలి రైలు ఎప్పుడు నడిచింది?
1) 1853
2) 1862
3) 1869
4) 1872

5. సాంఘిక శుద్ధి ఉద్యమం అంటే ఏమిటి?
1) ప్రతి గ్రామంలో వీధులను శుభ్రం చేయడం
2) ప్రతి గ్రామంలో గ్రంథాలయాలు ఏర్పాటు చేయడం
3) ప్రతి గ్రామంలో వైద్యాలయాలు ఏర్పాటు చేయడం
4) మతం మార్చుకున్న హిందువులను తిరిగి హిందూ మతంలోకి తీసుకురావడం.

6. జతపరచండి.
జాబితా–1
1. అభినవ సోక్రటీస్‌
2. కలియుగార్జున
3. ఇండియన్‌ హెర్క్యూలస్‌
4. స్టార్‌ ఆఫ్‌ ఇండియా
జాబితా–2
ఎ. అఫ్జల్‌ ఉద్ధౌలా
బి. కోడి రామమూర్తి
సి. ఎ. రామమూర్తి
డి. రఘుపతి వెంకటరత్నం నాయుడు
1) 1–సి, 2–ఎ, 3–డి, 4–బి
2) 1–బి, 2–డి, 3–ఎ, 4–సి
3) 1–డి, 2–సి, 3–బి, 4–ఎ
4) 1–ఎ, 2–బి, 3–సి, 4–డి

7. ‘ముసారం’ అని ఏ విదేశీయుడిని పిలిచేవారు?
1) రేమండ్‌
2) జార్జి రస్సెల్‌
3) విలియం పామర్‌
4) మెట్‌కాఫ్‌

8. ‘తెలంగాణ పీపుల్స్‌ స్ట్రగుల్‌ అండ్‌ ఇట్స్‌ లెసన్స్‌’ గ్రంథకర్త?
1) కాళోజి నారాయణరావు
2) సురవరం ప్రతాపరెడ్డి
3) దాశరథి కృష్ణమాచార్యులు
4) పుచ్చలపల్లి సుందరయ్య

9. 1904లో ‘శ్రీ రాజరాజ నరేంద్ర ఆంధ్రభాషా నిలయం’ ఎక్కడ ఏర్పాటు చేశారు?
1) సూర్యాపేట
2) హన్మకొండ
3) హైదరాబాద్‌
4) జోగిపేట

10. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో తెలుగు నేలలో ఏఏ ప్రాంతాలపై బాంబులు వేయడం జరిగింది?
1) కాకినాడ, విశాఖపట్నం
2) కృష్ణపట్నం, మచిలీపట్నం
3) హైదరాబాద్, సికింద్రాబాద్‌
4) కరీంనగర్, నిర్మల్‌

11. కొండపల్లి దుర్గమును శ్రీకృష్ణదేవరాయలు ఎప్పుడు ఆక్రమించాడు?
1) 1509
2) 1512
3) 1516
4) 1519

12. అర్జునుని తపస్సు శిల్పంను ఎక్కడ శిల్పీకరించారు?
1) మథురై
2) కాంచీపురం
3) శ్రావణ బెళగొళ
4) మహాబలిపురం

13. దక్షిణ భారతదేశంలో 1898లో ‘భారత సంఘసంస్కరణల సభ’ ఎక్కడ జరిగింది?
1) మచిలీపట్నం
2) హైదరాబాద్‌
3) మద్రాస్‌
4) కోయంబత్తూర్‌

14. జస్టిస్‌ పార్టీ ఎన్నికల గుర్తు ఏమిటి?
1) ఏనుగు
2) త్రాసు
3) నిచ్చెన
4) గాలిపటం

15. ‘మధురై కొండ’ అనే బిరుదు ధరించినవారు?
1) రాజరాజు–1
2) విజయాలయుడు
3) మొదటి పరాంతకుడు
4) రాజేంద్ర చోళ–1

16. జగన్‌ మిత్రమండలి స్థాపకుడెవరు?
1) ఉన్నవ లక్ష్మీనారాయణ
2) కుసుమ ధర్మన్న
3) మాదిరి భాగ్యరెడ్డివర్మ
4) బోయి జంగయ్య

17. శ్రీభాగ్‌ ఒప్పందం నాటి మద్రాస్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు?
1) రాజారామరాయణింగార్‌
2) సుబ్బరాయలు రెడ్డియార్‌
3) సి. రాజగోపాలాచారి
4) కె.వి. రెడ్డి నాయుడు

18. గదర్‌ పార్టీలో చేరిన ఏకైక తెలుగువాడు?
1) గుంటూరు శేషేంద్రశర్మ
2) దర్శి చెంచయ్య
3) పి.ఆనందాచార్యులు
4) తల్లాప్రగడ సుబ్బారావు

19. హైదరాబాద్‌లో విడిది చేసిన తొలి భారతదేశ వైశ్రాయి?
1) లార్డ్‌ డఫ్రిన్‌
2) లార్డ్‌ మేయో
3) లార్డ్‌ రిప్పన్‌
4) లార్డ్‌ కర్జన్‌

20. కామ్రేడ్స్‌ అసోషియేషన్‌ను ఎవరు స్థాపించారు?
1) వట్టికోట అళ్వార్‌స్వామి
2) దొడ్డి కొమరయ్య
3) రావి నారాయణరెడ్డి
4) మక్థూం మెహినుద్దీన్‌


ANSWERS:

1)2 2)1 3)3 4)2 5)4 6)3 7)1 8)4 9)2 10)1 11)3 12)4 13)3 14)2 15)3 16)3 17)3
18)2 19)3 20)4

No comments:

Post a Comment