Indian Economy Questions in Telugu Part-4

Indian Economy Questions in Telugu Part-4


1. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు - 2019కు ఎంపికైన నగరం ఏది?
1) పుణే
2) ఇండోర్
3) భోపాల్
4) హైదరాబాద్


2. భారత్‌లో శుభ్రమైన రాజధానిగా స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు-2019కు ఎంపికైన నగరం ఏది?
1) బెంగళూరు
2) భోపాల్
3) చంఢీగఢ్
4) చెన్నై


3. రాజీవ్ Rinn యోజన (ఆర్.ఆర్.వై.) కింది ఏ వర్గాల ప్రజల గృహ అవసరాలకు ఉద్దేశించిన పథకం?
 1) పట్టణ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన, అల్పాదాయ వర్గాలు
2) పట్టణ ప్రాంతాల్లో మురికివాడల్లో నివసించే ప్రజలు
3) పట్టణ ప్రాంతాల్లో అధిక ఆదాయ వర్గాల ప్రజలు
4) పైవన్నీ



4. మురికివాడల్లో నివసించే ప్రజల గృహ అవసరాలను తీర్చడానికి ఉద్దేశించిన పథకం?
1) ప్రధాన మంత్రి ఆవాస్ యోజన
2) రాజీవ్ ఆవాస్ యోజన
3) అజీవికా
4) పైవన్నీ



5.2011 సెన్సెస్ ప్రకారం జనాభా వృద్ధి కింది ఏ రాష్ట్రంలో రుణాత్మకంగా నమోదైంది?
 1) సిక్కిం
2) త్రిపుర
3) మేఘాలయ
4) నాగాలాండ్



6. కింది ఏ రాష్ట్రాల జనాభా వృద్ధి భారత జనాభా వృద్ధి రేటుకు సమానంగా ఉంది?
1) తెలంగాణ, కేరళ, మధ్యప్రదేశ్
2) ఛండీఘర్, ఉత్తరాఖండ్, అసోం
3) ఆంధ్రప్రదేశ్, మేఘాలయ, త్రిపుర
4) నాగాలాండ్, పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్



7. భారత్‌లో పట్టణ జనాభా పెరుగుదలకు కారణం ఏది?
ఎ) భారత ఆర్థికాభివృద్ధిలో పట్టణీకరణ ప్రాధాన్యతను 11వ ప్రణాళిక గుర్తించడం.
బి) 1991 తర్వాత ప్రైవేట్ రంగ అభివృద్ధి
సి) పట్టణ ప్రాంతాల్లో అవస్థాపనా సౌకర్యాల లభ్యత
డి) నగరాల్లో ఆర్థిక అవకాశాలు పెరుగుదల
1) ఎ, సి
2) బి, డి
3) ఎ, బి, సి
4) ఎ, బి, సి, డి



8. 2011 గణాంకాల ప్రకారం అధిక జనాభా పరంగా ముంబై, ఢిల్లీ తర్వాత స్థానం పొందిన నగరం ఏది?
1) చెన్నై
2) కోల్‌కతా
3) బెంగళూరు
4) హైదరాబాద్




9. ఇటీవల నేషనల్ క్రైమ్ రికార్‌‌డ బ్యూరో అభిప్రాయంలో 2016లో అధికంగా రైతు ఆత్మహత్యలు కింది ఏ రాష్ట్రంలో సంభవించాయి?
 1) ఆంధ్రప్రదేశ్
2) తెలంగాణ
3) మహారాష్ట్ర
4) కేరళ


10. మెకిన్సే నివేదిక ప్రకారం భారత్ పట్టణ జనాభా 2030 నాటికి ఎంతగా ఉంటుందని అంచనా? 1) 490 మిలియన్లు
2) 510 మిలియన్లు
3) 590 మిలియన్లు
4) 640 మిలియన్లు



11. 2011 గణాంకాల ప్రకారం భారత్ మొత్తం జనాభాలో పట్టణ జనాభా?
 1) 31.06 శాతం
2) 31.16 శాతం
3) 32.17 శాతం
4) 37.11 శాతం



12. కింది వాటిలో పట్టణాభివృద్ధికి సంబంధించిన పథకం కానిది ఏది?
 1) జవహర్ రోజ్‌గార్ యోజన
2) స్మార్‌‌ట సిటీస్ మిషన్
3) రాజీవ్ ఆవాస్ యోజన
4) అమృత్



13. 2019-20 కేంద్ర బడ్జెట్‌లో గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు కేటాయించిన మొత్తం?
1) రూ. 41,000 కోట్లు
2) రూ. 45,000 కోట్లు
3) రూ. 48,000 కోట్లు
4) రూ. 52,000 కోట్లు



14. భారత్‌లో నగరాల మున్సిపల్ రాబడులు జీడీపీలో ఎంత శాతం?
 1) ఒక శాతం కంటే తక్కువ
2) రెండు శాతం
3) మూడు శాతం
4) నాలుగు శాతం


ANSWERS:

1)2 2)2 3)1 4)2 5)4 6)2 7)4 8)2 9)3 10)3 11)2 12)1 13)3 14)1

No comments:

Post a Comment