Indian Economy Questions in Telugu Part-1

Indian Economy Questions in Telugu Part-1


1. కింది వాటిలో ఏ పథకానికి అధిక మొత్తంలో వనరులను 2020-21 కేంద్ర బడ్జెట్‌లో ప్రతిపాదించారు?
1) జాతీయ ఆరోగ్య మిషన్
2) పి.ఎం. కిసాన్
3) జాతీయ విద్యామిషన్
4) ప్రధానమంత్రి ఆవాస్ యోజన


2. 2020-21 కేంద్ర బడ్జెట్‌లో ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని ఎంతగా ప్రతిపాదించారు? 
1) రూ. 1,80,000 కోట్లు
2) రూ. 1,90,000 కోట్లు
3) రూ. 2,01,000 కోట్లు
4) రూ. 2,10,000 కోట్లు



3. 2020-21 కేంద్ర బడ్జెట్‌లో కింది ఏ మంత్రిత్వశాఖకు అధిక మొత్తంలో వనరులు కేటాయించారు? 
1) రక్షణ
2) హోంఅఫైర్‌‌స
3) వ్యవసాయం
4) గ్రామీణవృద్ధి



4. 2020-21 కేంద్ర బడ్జెట్‌లో మొత్తం పన్ను రాబడిలో కింది ఏ పన్ను వాటా అధికంగా ఉంటుందని అంచనా. 
1) కార్పొరేషన్ పన్ను
2) ఆదాయపు పన్ను
3) వస్తు, సేవల పన్ను
4) కస్టమ్స్ సుంకం




5. ఎఫ్.ఆర్.బి.ఎం. చట్టం ప్రకారం 2024-25 నాటికి కేంద్ర ప్రభుత్వ రుణం జి.డి.పి.లో ఎంతగా నిర్వహించాలి?
1) 50 శాతం
2) 40 శాతం
3) 35 శాతం
4) 25 శాతం



6. ఎస్సీ, ఎస్టీల సబ్-ప్లాన్ అమలుకు 2020 -21 కేంద్ర బడ్జెట్‌లో ఎంత మొత్తాన్ని ప్రతి పాదించారు?
1) రూ. 1,36,909 కోట్లు
2) రూ. 1,55,109 కోట్లు
3) రూ. 1,61,709 కోట్లు
4) రూ. 1,71,605 కోట్లు


7. ఐపీఓ ద్వారా కింది ఏ సంస్థలో తన వాటాలో కొంత భాగాన్ని విక్రయించాలని ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రతిపాదించింది? 
1) ఓఎన్‌జీసీ
2) బీఎస్‌ఎన్‌ఎల్
3) ఎల్.ఐ.సి.
4) పైవన్నీ



8. 2019-20లో సవరించిన అంచనాల ప్రకారం కేంద్రప్రభుత్వ స్థూల పన్ను రాబడిలో కింది ఏ పన్ను వాటా ఎక్కువ? 
1) సంపద పన్ను
2) కార్పొరేషన్
3) వస్తు, సేవల పన్ను
4) ఆదాయపు పన్ను



9. అధిక పన్నేతర రాబడి 2019-20లో కేంద్ర ప్రభుత్వానికి కింది వాటిలో దేని ద్వారా లభించింది? 1) డివిడెండ్లు, లాభాలు
2) వడ్డీ రాబడులు
3) బహిర్గత గ్రాంట్లు
4) పైవేవీ కావు.


10. రక్షణ మంత్రిత్వ శాఖకు 2020-21లో కేటాయించిన మొత్తం ఎంత?
1) రూ. 4,71,378 కోట్లు
2) రూ. 4,81,178 కోట్లు
3) రూ. 4,85,115 కోట్లు
4) రూ. 4,89,125 కోట్లు


11. 2020-21లో నామినల్ జి.డి.పి. వృద్ధి ఎంతగా ఉంటుందని అంచనా? 
1) 7 శాతం
2) 8 శాతం
3) 10 శాతం
4) 11 శాతం



12. 2020-21లో వ్యవసాయ పరపతి లక్ష్యం?
1) రూ. 10 లక్షల కోట్లు
2) రూ. 15 లక్షల కోట్లు
3) రూ. 20 లక్షల కోట్లు
4) రూ. 25 లక్షల కోట్లు



13. ఏ విధమైన వడ్డీ, జరిమానా లేకుండా 2020 మార్చి 31 నాటికి వివాదాస్పదమైన పన్ను చెల్లింపునకు సంబంధించిన పథకం?
1) వివాద్ సేవిశ్వాస్
2) ఆకాంక్ష భారత్
3) సమాజ సంరక్షణ
4) సబ్‌కావికాస్



14. సబ్సిడీలపై మొత్తం వ్యయాన్ని 2020-21 బడ్జెట్‌లో ఎంతగా ప్రతిపాదించారు?
 1) రూ. 1,75,000 కోట్లు
2) రూ. 2,10,000 కోట్లు
3) రూ. 2,62,109 కోట్లు
4) రూ. 2,71,175కోట్లు



15. 2020-21 కేంద్ర బడ్జెట్‌లో ద్రవ్యలోటు లక్ష్యాన్ని జి.డి.పి.లో భాగంగా ఎంతగా ప్రతిపాదించారు? 1) 3.1 శాతం
2) 3.5 శాతం
3) 3.8 శాతం
4) 4.1 శాతం



16. కింది వాటిలో దేన్ని 2020-21 బడ్జెట్ లక్ష్యంగా ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించారు? 
1) డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ద్వారా అనేక సేవల డెలివరీ
2) Disaster resilience ద్వారా నష్ట భయ నివారణ
3) పెన్షన్, బీమా Penetration ద్వారా సాంఘిక భద్రత సాధన
4) పైవన్నీ 


ANSWERS:
1)2 2)4 3)1 4)3 5)2 6)1 7)3 8)2 9)1 10)1 11)3 12)2 13)1 14)3 15)2 16)4

No comments:

Post a Comment