Geography Questions in Telugu Part-1

Geography Questions in Telugu Part-1


1. తెలుగుగంగ నీటి ప్రాజెక్టు ద్వారా ఏ నగరం నీటి సమస్య తీరుస్తున్నారు?
1) బెంగళూరు
2) కొచ్చిన్
3) హైదరాబాద్
4) చెన్నై


2. కిందివాటిలో అంతర్జాతీయ ప్రాజెక్టు ఏది?
 1) హీరాకుడ్
2) గండక్
3) రిహాండ్
4) మయూరాక్షి



3. జపాన్ సహాయంతో పూర్తి చేసిన పైథాన్ (జయక్‌వాడీ) జల విద్యుత్ ప్రాజెక్టు ఏ నదిపై ఉంది
1) గంగ
2) గోదావరి
3) నర్మద
4) కావేరి



4. భారతదేశంలోని నీటిపారుదల సౌకర్యాలను ప్రధానంగా ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు?
1) 4
2) 3
3) 2
4) 5




5.రుద్రమాత కాలువ ఏ రాష్ట్రంలో ఉంది?
 1) గుజరాత్
2) బిహార్
3) మహారాష్ట్ర
4) ఒడిశా



6. భారతదేశంలో ఏ ప్రాంతంలో చెరువులు ప్రధాన నీటిపారుదల వనరులుగా ఉన్నాయి?
1) ఈశాన్య ప్రాంతం
2) ఉత్తర భారతదేశం
3) దక్కను పీఠభూమి
4) హిమాలయ పర్వత శ్రేణి ప్రాంతాలు



7.భారతదేశంలో అత్యధిక నీటిపారుదల సాంద్రత ఉన్న రాష్ట్రం ఏది?
1) ఉత్తరప్రదేశ్
2) పంజాబ్
3) మిజోరాం
4) రాజస్థాన్



8. కిందివాటిలో భారతదేశంలో చెరువుల ద్వారా ఎక్కువ నీటిపారుదల సౌకర్యం కల్పిస్తున్న రాష్ట్రం ఏది?
1) రాజస్థాన్
2) మధ్యప్రదేశ్
3) తమిళనాడు
4) కేరళ



9. భారతదేశంలో అన్నింటి కంటే ఎక్కువగా నీటిపారుదల సౌకర్యాలు వేటి ద్వారా కల్పిస్తున్నారు?
 1) బావులు
2) కాలువలు
3) చెరువులు
4) జీవ కాలువలు




10. భవాని రిజర్వాయర్ కాలువల వల్ల ఏ రాష్ట్రం ప్రయోజనం పొందుతోంది?
1) కర్ణాటక
2) గుజరాత్
3) పశ్చిమ బెంగాల్
4) తమిళనాడు



11. తెహ్రీడ్యామ్‌ను ఏ నదిపై నిర్మించారు?
1) యమున
2) భాగీరథి
3) గంగా
4) బ్రహ్మపుత్ర



12.బెంగాల్ ప్రాంతంలో దామోదర్ లోయ కార్పొరేషన్ (DVC) ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
 1) 1951
2) 1953
3) 1961
4) 1948



13. భారతదేశంలోని నీటిపారుదల ప్రాజెక్టులను ఎన్ని రకాలుగా విభజించవచ్చు?
 1) 3
2) 4
3) 2
4) 5



14. మధ్య తరహా నీటిపారుదల పథకం అంటే ఏమిటి?
1) 2000 హెక్టార్ల కంటే తక్కువ విస్తీర్ణానికి నీటి పారుదల కల్పించే పథకం
2) 2000-10,000 హెక్టార్ల ఆయకట్టు ప్రాంతం ఉన్న పథకం
3) 20,000 హెక్టార్ల కంటే ఎక్కువ ఆయకట్టు ఉన్న పథకం
4) పైవేవీ కావు



15. ఆయకట్టు ప్రాంత అభివృద్ధి పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు?
 1) 1990-91
2) 1972-73
3) 1974-75
4) 2007-08



16. భాక్రానంగల్ ప్రాజెక్టు ద్వారా సుమారుగా ఎన్ని మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన సాధిస్తున్నారు
1) 4100
2) 1280
3) 1100
4) 1204



17. ఇందిరాగాంధీ కెనాల్ ద్వారా ఏ రాష్ట్రంలో నీటిపారుదల సౌకర్యాలు కల్పిస్తున్నారు?
1) రాజస్థాన్
2) గుజరాత్
3) మధ్యప్రదేశ్
4) ఉత్తరప్రదేశ్



18. బాగ్లీహార్ ప్రాజెక్టు విషయంలో ఏ రెండు దేశాల మధ్య వివాదం ఉంది?
 1) భారతదేశం - బంగ్లాదేశ్
2) భారతదేశం - చైనా
3) భారతదేశం - పాకిస్తాన్
4) చైనా - నేపాల్



19. కిందివాటిలో 4801 మీటర్ల పొడవుతో భారత్‌లో అతి పొడవైన ప్రాజెక్టుగా గుర్తింపు పొందింది ఏది? 
1) నాగార్జున సాగర్
2) హీరాకుడ్
3) భాక్రానంగల్
4) బియాస్


20. నాగార్జునసాగర్ ఆనకట్టను ఏ నదిపై నిర్మించారు?
1) గోదావరి
2) గంగా నది
3) పెన్నా
4) కృష్ణానది



21. సర్దార్ సరోవర్ ప్రాజెక్టును ఏ నదిపై నిర్మించారు? 
1) భాగీరథి
2) చంబల్
3) నర్మద
4) తపతి



22. ఆలమట్టి ప్రాజెక్టును ఏ నదిపై నిర్మించారు?
 1) కావేరి
2) కృష్ణా
3) గోదావరి
4) మహానది




23. కిందివాటిలో పూర్తిగా భారతీయ సాంకేతిక పరిజ్ఞానంలో రూపుదిద్దుకున్న ప్రాజెక్టు ఏది?
 1) నాగార్జున సాగర్
2) దామోదర్ నదీ లోయ ప్రాజెక్టు
3) భాక్రానంగల్
4) హీరాకుడ్

24. హీరాకుడ్ ప్రాజెక్టును ఒడిశా రాష్ట్రంలో ఏ నదిపై నిర్మించారు?
1) నర్మద
2) తపతి
3) కృష్ణా
4) మహానది



25. {పపంచంలో రాతితో నిర్మించిన అతి పెద్ద ఆనకట్ట ఏది?
1) భాక్రానంగల్
2) హీరాకుడ్
3) నాగార్జున సాగర్
4) కోసి



26. రాణా ప్రతాప్ సాగర్ ఆనకట్ట ఏ పథకంలో ఒక భాగం?
1) గండక్
2) చంబల్
3) కోసీ
4) బియాస్



27. నేపాల్ సరిహద్దులోని హనుమాన్ నగర్ సమీపంలో నిర్మించిన ప్రాజెక్టు ఏది? 
1) గండక్
2) చంబల్
3) బియాస్
4) కోసి



28.గుజరాత్‌లో నిర్మించిన సర్దార్ సరోవర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టిన వ్యక్తి?
 1) మేధాపాట్కర్
2) సుందర్‌లాల్ బహుగుణ
3) అన్నా హజారే
4) సత్యప్రకాశ్



29. ముల్లపెరియార్ డ్యామ్ సమస్య ఏ రెండు రాష్ట్రాల మధ్య ఉంది?
 1) తమిళనాడు - ఆంధ్రప్రదేశ్
2) తమిళనాడు - కేరళ
3) తమిళనాడు - కర్ణాటక
4) కేరళ - కర్ణాటక



30. ప్యాంగ్ డ్యామ్‌ను ఏ నదిపై నిర్మించారు?
1) సట్లేజ్
2) రావి
3) బియాస్
4) జీలం



31. {పపంచ నీటి దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?
 1) జూన్ 22
2) మార్చి 12
3) జూన్ 12
4) మార్చి 22



32.జాతీయ జల విజ్ఞాన సంస్థ ఎక్కడ ఉంది?
1) లక్నో
2) రూర్కీ
3) వారణాసి
4) కోల్‌కతా



33. సెంట్రల్ వాటర్ కమిషన్‌ను ఎప్పుడు స్థాపించారు?
1) 1945
2) 1979
3) 1990
4) 2002



34. కృష్ణానదిపై పులిచింతల ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్‌లోని ఏ జిల్లాలో నిర్మించారు?
1) తూర్పు గోదావరి
2) కర్నూలు
3) గుంటూరు
4) పశ్చిమ గోదావరి



35. గోదావరి నదిపై శ్రీరాంసాగర్ ప్రాజెక్టును ఏ జిల్లాలో నిర్మించారు?
 1) పశ్చిమ గోదావరి
2) కరీంనగర్
3) గుంటూరు
4) నిజామాబాద్



36. కిందివాటిలో ఏ ప్రాజెక్టు ద్వారా ఢిల్లీ నగరానికి 200 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నారు?
1) రిహాండ్
2) రామ్‌గంగా
3) గండక్
4) భాక్రానంగల్



37. కిందివాటిలో ఏ ప్రాజెక్టును ‘శ్రీపాద సాగర్’ అని పిలుస్తున్నారు?
 1) పులిచింతల
2) శ్రీరాంసాగర్
3) ఎల్లంపల్లి
4) ఇచ్చంపల్లి



38. సట్లేజ్ - యమున నదులను కలిపే కాలువ ఏ రాష్ట్రంలో ఉంది?
 1) పంజాబ్
2) హర్యానా
3) ఉత్తరప్రదేశ్
4) గుజరాత్




39. నదుల గురించి చేసే అధ్యయనాన్ని ఏమంటారు?
 1) పోమాలజీ
2) పోటమాలజీ
3) హైటాలజీ
4) ఒరింటాలజీ



40. ఫరక్కా ప్రాజెక్టు ఏ నదిపై ఉంది?
 1) గండక్
2) దామోదర్
3) మహానది
4) హుగ్లీ



41. కిందివాటిలో సరికాని జత ఏది?
 1) రిహాండీ ప్రాజెక్టు - ఉత్తరప్రదేశ్
2) కుందా ప్రాజెక్టు - కర్ణాటక
3) తావా ప్రాజెక్టు - మధ్యప్రదేశ్
4) ఒరయు ప్రాజెక్టు - రాజస్థాన్



42. మాచ్‌ఖండ్ ప్రాజెక్టు ఏయే రాష్ట్రాల మధ్య ఉంది?
1) ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక
2) కేరళ - ఆంధ్రప్రదేశ్
3) ఒడిశా - ఆంధ్రప్రదేశ్
4) ఆంధ్రప్రదేశ్ - ఛత్తీస్‌గఢ్



43.పాలార్ ప్రాజెక్టు ఏ రెండు రాష్ట్రాల మధ్య వివాదాస్పదమైంది?
 1) తమిళనాడు - కర్ణాటక
2) తమిళనాడు - ఆంధ్రప్రదేశ్
3) కర్ణాటక - కేరళ
4) తమిళనాడు - కేరళ



44.మయూరాక్షి ప్రాజెక్టును ఏ నదిపై నిర్మించారు?
 1) మయూరాక్షి
2) హుగ్లీ
3) కువారీ
4) దామోదర్



45. సరస్సుల గురించి చేసే అధ్యయనాన్ని ఏమంటారు?
1) పోరుమాలజీ
2) లిమ్నాలజీ
3) పెడాలజీ
4) ఏదీకాదు



46. ఉత్తర భారతదేశంలో కాలువల ద్వారా వ్యవసాయం అధికంగా జరగడానికి కారణం?
1) రంధ్రాన్విత నేలలు
2) భూగర్భంలో నీరు అధికంగా ఉండటం
3) జీవనదులు కాలువలకు భూమికగా ఉండటం
4) జనసాంద్రత అధికంగా ఉండటం




47. భారతదేశంలో ఏ ప్రాంతంలో నీటిపారుదల సాంద్రత తక్కువగా ఉంది?
 1) ఉత్తర భారతదేశం
2) ఈశాన్య ప్రాంతం
3) దక్కన్ పీఠభూమి
4) డెల్టా ప్రాంతాలు




48. ‘మలంపూజ’ కాలువ ఏ రాష్ట్రానికి చెందింది?
 1) కేరళ
2) తమిళనాడు
3) కర్ణాటక
4) మహారాష్ట్ర



49.భారతదేశంలో అత్యల్ప నీటిపారుదల సాంద్రత ఉన్న రాష్ట్రం ఏది?
 1) హర్యానా
2) పంజాబ్
3) బిహార్
4) మిజోరాం



50. భారతదేశంలో బావుల ద్వారా అధికంగా నీటి పారుదల సౌకర్యం కల్పిస్తున్న రాష్ట్రం ఏది?
1) మధ్యప్రదేశ్
2) మహారాష్ట్ర
3) ఉత్తరప్రదేశ్
4) పంజాబ్



51. ‘మెట్టూరు జల విద్యుత్ కేంద్రం’ ఏ నదిపై ఉంది?
 1) తుంగభద్ర
2) మహానది
3) కావేరి
4) గోదావరి



52. కిందివాటిలో ‘దామోదర్ వ్యాలీ కార్పొరేషన్’ లో భాగాలైన ఆనకట్టలు ఏవి?
 1) తిలైయా
2) మైథాన్
3) పంచట్
4) పైవన్నీ



53. భారతదేశ జాతీయ నది?
 1) గోదావరి
2) గంగా
3) కృష్ణా
4) నర్మద



54. భారతదేశంలో జాతీయ జల మండలిని ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1) 1975
2) 1948
3) 1951
4) 1990



55.దామోదర్ వ్యాలీ ప్రాజెక్టు ఒక?
 1) జలవిద్యుత్
2) నీటిపారుదల
3) బహుళార్థ సాధక
4) ఏదీకాదు



56.కింది వాటిలో ఏ జల విద్యుత్ కేంద్రం ఉత్తరప్రదేశ్‌లో ఉంది?
 1) మయూరాక్షి
2) రిహాండ్
3) కంగ్సబతి
4) హీరాకుడ్



57. అత్యధిక ప్రాజెక్టులను ఏ నదిపై నిర్మించారు?
 1) గోదావరి
2) గంగా
3) నర్మద
4) కావేరి



58. భారతదేశంలో కెల్లా అత్యంత ఎత్తై ప్రాజెక్టు?
1) నాథ్ ప్రాజెక్టు
2) తెహ్రీ ప్రాజెక్టు
3) నాగార్జున ప్రాజెక్టు
4) హీరాకుడ్ ప్రాజెక్టు



59. కిందివాటిలో అంతర్జాతీయ ప్రాజెక్టు?
1) కోసి
2) చంబల్
3) తెహ్రీడ్యామ్
4) మయూరాక్షి



60. భారతదేశంలో ఎత్తైన వంతెన ఏది?
1) సేవోక్ వంతెన
2) నైని వంతెన
3) చంబల్ వంతెన
4) ఎల్లిస్ వంతెన


61. కింది వాటిని జతపర్చండి?
 జాబితా - I జాబితా - II
a) రిహింద్ i) కర్ణాటక
b) సీలేరు ii) తమిళనాడు
c) మెట్టూరు iii) ఆంధ్రప్రదేశ్
d) ఆల్‌మట్టి iv) ఉత్తరప్రదేశ్
సరైన సమాధానం
1) a-iv, b-iii, c-ii, d-i
2) a-i, b-ii, c-iii, d-iv
3) a-iv, b-iii, c-i, d-ii
4) a-i, b-ii, c-iv, d-iii


62. భాక్రానంగల్ ప్రాజెక్టును ఏ నదిపై నిర్మించారు? 
1) రావి
2) బియాస్
3) సట్లేజ్
4) చినాబ్


63. కింది వాటిని జతపర్చండి?
 జాబితా - I
a) సర్దార్ సరోవర్ డ్యాం
b) దక్షిణ భారతదేశంలో ఎత్తైన పర్వత శిఖరం
c) తోడాలు
d) రాగి
జాబితా - II
i) అనైముడి
ii) అగ్నిగుండాల
iii) నర్మదా
iv) నీలగిరి
1) a-iv, b-ii, c-i, d-iii
2) a-ii, b-iii, c-iv, d-i
3) a-iii, b-i, c-iv, d-ii
4) a-i, b-iv, c-iii, d-ii

ANSWERS:

1)4 2)2 3)2 4)2 5)1 6)3 7)2 8)3 9)1 10)4 11)2 12)4 13)1 14)2 15)3 16)4 17)1 18)3 19)2 20)4 21)3 22)2 23)1 24)4 25)3 26)2 27)4 28)1 29)2 30)3 31)4 32)2 33)1 34)3 35)4 36)2 37)3 38)1 39)2 40)4 41)2 42)3 43)2 44)145)2 46)3 47)2 48)1 49)4 50)3 51)3 52)4 53)2 54)4 55)3 56)2 57)3 58)2 59)1 60)3 61)1 62)3 63)3

Indian Economy Questions in Telugu Part-9


No comments:

Post a Comment