రాష్ట్రీయం
రష్యాటెన్నిస్ క్రీడాకారిణి షరపోవా రిటైర్ మెంట్
- ఐదుసార్లు గ్రాండ్ స్లాం సాధించిన టెన్నిస్ రష్యాక్రీడాకారిణి,ఒకప్పుడు ప్రపంచ నెంబర్‌వన్‌గా నిలిచిన షరపోవా రిటైర్ మెంట్ నుప్రకటించింది.
- 2001లో డబ్ల్యూటీఏ టూర్‌తో ప్రొఫెషనల్ టెన్నిస్‌లో అరంగేట్రం చేసిన షరపోవా, 2005 ఆగస్టులో ప్రపంచ నెంబర్‌వన్‌గా అవతరించినది.
- 18 ఏళ్లకే ఈ ఘనత సాధించిన తొలి రష్యన్ ప్లేయర్‌గా రికార్డుకెక్కినది.
- వెటరన్ కోచ్ యూరీ యుట్‌కిన్ వద్ద శిక్షణ తీసుకుంది.
- తొలుత స్థానిక రిక్ మాకీ అకాడమీలో శిక్షణ తీసుకుంది.
- 1995లో ప్రముఖ ఐఎంజీ సంస్థ దృష్టిని ఆకర్షించి,ఆ సంస్థ స్పాన్సర్‌షిప్‌తో నిక్ బొలెటరీ అకాడమీలో చేరింది.
- ఆటకు తోడు ఎండార్స్ మెంట్ పరంగాఅత్యధిక ఆదాయాన్ని అందుకున్న క్రీడాకారిణిగా 2005 నుంచి వరుసగా 11 ఏళ్ళు అగ్రస్థానంలో నిలిచింది.
- ఒక్క 2015లో ఏకంగా రూ. 200 కోట్లు ఆర్జించి రికార్డును సృస్తింది.
- 2016లో ఆస్ట్రేలియన్ ఓపెన్ లో నిషేధిత ఉత్ప్రేరకము ‘మెల్డోనియం’ను షరపోవా వాడినట్టు నిర్ధారణ అవడం తో ప్రపంచ టెన్నిస్ సమాఖ్య ఆమెపై 15 నెలల నిషేధాన్ని విధించింది.
- షరపోవా గురించిసంక్షిప్తముగా
- పుట్టినతేదీ:1987 ఏప్రిల్ 19న న్యాగన్ (రష్యా)
- ప్రస్తుత నివాసం: ఫ్లోరిడా (అమెరికా)
- అత్యుత్తమ ర్యాంక్: 1 (2005, ఆగస్టు)
- ప్రస్తుత ర్యాంక్: 373
- కెరీర్ సింగిల్స్ టైటిళ్లు:35,
- కెరీర్ డబుల్స్ టైటిళ్లు: 3
- గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు: 5
- వింబుల్డన్ (2004)లో సెరెనాను ఓడించింది.
- ఆస్ట్రేలియన్ ఓపెన్ (2008), ,
- ఫ్రెంచ్ ఓపెన్ (2012, 2014),
- యూఎస్ ఓపెన్ (2006)
- లండన్ ఒలింపిక్స్‌లో( 2012 )రజత పతకం గెలుచుకుంది.
ట్రంప్ భారత్ పర్యటన విశేషాలు
- అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 2రోజుల పర్యటన(ఫిబ్రవరి 24,25) నిమిత్తం భారత్ కు వచ్చారు.
- ట్రంప్ తో పాటు సతీమణి మెలనియా,కూతురు ఇవాంక,అల్లుడు జేర్డ్ కుషనర్,బారత్ పర్యటనకు వచ్చారు .
- తొలుత గుజరాత్ లోని అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సబర్మతి ఆశ్రమానికి మోడీ తో కలిసి వెళ్లారు.
- ఆశ్రమం లో గాంధీ, కస్తూర్బా 1917-1930 లో నివసించిన హృదయ్ కుంజ్ లోకి ట్రంప్ దంపతులను తీసుకెళ్లి చూపించారు.
- ట్రంప్ దంపతులు చరఖాను తిప్పుతూ నూలు వడకడానికి ప్రయత్నించారు. ఇక్కడ దాదాపు 15 నిముషాలు గడిపారు.
- చేడు వినకు,చెడు చూడకు,చెడు మాట్లాడకు అన్న గాంధీజీ బోధనలను చాటించె మూడు కోతుల బొమ్మలను మోడీ ట్రంప్ దంపతులకు బహుమతిగా ఇచ్చారు.
- ఆశ్రమం తరుపున కార్తికేయ సారాబాయి ట్రంప్ దంపతులకు మహాత్మ గాంధీ ఆటోబయోగ్రఫీ పుస్తకం,చరఖా ,పెన్సిల్,డ్రాయింగ్ లను బహుకరించారు.
- తరువాత ఆశ్రమం నుంచి నమస్తే ట్రంప్ కార్యక్రమాన్ని ఏర్పాటుచేసిన మోతెరా స్టేడియం వరకు 22కిలోమీటర్లు రోడ్ షో జరిగింది, దేశ భిన్న సంస్కృతిని భిన్న ప్రాంత కళాకారుల చేత సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
- తెల్లని జంప్ షూట్ వేసుకున్న మెలనియాడ్రెస్ డిజైనర్ హెర్వి పియరీ ,ఇవాంక డ్రెస్ ప్రోయోంజా షూలర్ బ్యాండ్ కు చెందినది దీని ధర రూ 1.7 లక్షలు.
- స్టేడియం ప్రారంభించిన అనంతరం నమస్తే ట్రంప్ కార్యక్రమాన్ని లక్ష మందికి పైగా తిలకించారు. ఈకార్యక్రమం ద్వారా భారత్ కు అమెరికా మిత్రదేశము అని దేశ పౌరులకు అవగహన అయినది.
- ఇలాంటి కార్యక్రమమే 2019 సెప్టెంబర్ 23 న టెక్సాస్ హ్యూస్టన్ ఎన్ఎస్ జి స్టేడియం లో 50వేల మంది ప్రవాసీ భారతీయులతో హౌడీ మోదీ పేరు తో కార్యక్రమము జరిగినది .
- నమస్తే ట్రంప్ కార్యక్రమము తరువాత ఆగ్రా లోని తాజ్ మహల్ ను సందర్శించారు
- మెలనియాఢిల్లీ లోని మోతిబాగ్ లో వున్నా సర్వోదయ కో ఎడ్యుకేషనల్ సీనియర్ సెకండరీ స్కూల్
- ను సందర్శించారు ఇక్కడ గంటపాటు స్కూలును కలియ తిరిగారు.
- మట్టితో తాజ్ మహల్ ను శుభ్రం చేసిన మడ్ -ప్యాక్ ట్రీట్ మెంట్ (లైమ్ -రిచ్ క్లే మట్టిని 2మిల్లీ మీటర్ మందం పూసి ఒక రాత్రి ఉంచి ఎండిన తరువాత నీలం బ్రష్ చేత మట్టిని తొలిగిస్తారు తరువాత డిస్టిల్ వాటర్ తో శుభ్రం చేస్తారు )ను విని మెలనియా విస్మయము చెందారు.
- రాజ్ ఘాట్ లో ట్రంప్ దంపతులు మొక్కను నాటారు.
- చివరి రోజు ఐన మంగళవారంహైదరాబాద్ హౌస్ లో ట్రంప్,మోడీ సమావేశమయ్యారు 300 కోట్ల డాలర్ల తో అధునాతన ఆయుధాల కొనుగోలుకు ఒప్పందం జరిగినది.
- మానసికఆరోగ్యము పైరెండుదేశాల ఆరోగ్య శాఖల మధ్య ఒక అవగాహన ఒప్పందము జరిగినది .
- ట్రంప్ దంపతులకు కేసిఆర్ చార్మినార్ కళాకృతిని అందించారు.
29 బంతుల్లో 10 వికెట్లు తీసిన కెశ్విగౌతమ్
- మహిళల అండర్-19 క్రికెట్‌లో చండీగఢ్ కెప్టెన్ కెశ్వీ గౌతమ్,కేవలం 29 బంతుల్లో 10 వికెట్లు కూల్చి రికార్డ్ సృష్టించింది.
- బీసీసీఐ అండర్-19 మహిళల అంతర్ రాష్ట్ర వన్డే క్రికెట్ పోటీల్లో అరుణాచల్‌ప్రదేశ్ మ్యాచ్‌లో కెశ్వి అరుదైన ఈ రికార్డ్ ను సృష్టించింది.
- తొలుత బ్యాటింగ్ చేసిన చండీగఢ్ కెశ్వీ (49) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 4వికెట్లకు186 పరుగులుచేసింది.
- అరుణాచల్‌ప్రదేశ్8.5ఓవర్లలో25 పరుగులకే కుప్పకూలింది.
- కెశ్వి 4.5 ఓవర్లలో 12 పరుగులు మాత్రమే ఇచ్చి 10 వికెట్లను పడగొట్టింది.
- మహిళల క్రికెట్ చరిత్రలో ఏ వయసు విభాగం నుంచైనా వన్డే, టీ20ల్లో ఇలాంటి రికార్డు ఇంతవరకు నమోదు కాలేదు.
ఐక్యు ఎయిర్ విజువల్ సంస్ధ నివేదిక 2019
- ఐక్యు ఎయిర్ విజువల్ సంస్ధ నివేదిక 2019 ప్రకారం ప్రపంచములో ఎక్కువ వాయు కాలుష్యం వున్న 30 నగరాల్లో భారత్ లోనే 21 వున్నాయి.
- ప్రపంచములో అతి ఎక్కువ వాయు కాలుష్యం గలిగిన నగరం లో గాజియాబాద్ (ఉత్తరప్రదేశ్) గలదు.
- రాజధానుల విభాగంలోప్రథమ స్థానము లో ఢిల్లీ గలదు.
- చైనా లోని హౌటన్ వాయుకాలుష్యం లో ప్రపంచము లో 2వ స్థానము లో గలదు.
- భారత్ లో కాలుష్య నగరాలు నోయిడా,గ్రేటర్ నోయిడా, గురుగ్రామ్, భాండ్వాడి, లఖన్పూ, జింద్,ఫరీదాబాద్,బాగ్ పత్ గలవు
కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు-2019
కేంద్రసాహిత్య అకాడమీ అవార్డులను తెలుగు రచయితలు ఫిబ్రవరి 25 న డిల్లీ లో అందుకున్నారు, వారు
1. బండి నారాయణస్వామి
- వీరు శప్తభూమి నవలనురాయలసీమ సామజిక, చారిత్రక, సాంస్కృతిక అంశాలను వివరించారు.
- రాయలసీమ కరువు ,ప్రజల సుఖ దుఖఃలను వేరే ప్రాంత ప్రజలకు ఈ నవల ద్వారా వివరించారు. * మీ రాజ్యం మీరేలండి,రెండు కలల దేశము,గద్దలాడా తాండాయి,వీరి ప్రముఖ రచనలు
- 2 . పెన్నామధుసూదన్
- సంస్కృతంలో రాసిన ప్రజ్ఞాచాక్షుషం కావ్యానికి అవార్డు లభించినది. 850 శ్లోకాలతో రచించారు.
- మహారాష్ట్ర సాధువు గులాబ్ రావ్ మహారాజ్ ఆధ్యాత్మికతను వివరించారు.
- ప్రస్తుతము నాగపూర్ యూనివర్సిటీ లో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు.
- కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ రచించిన యాన్ ఎరా అఫ్ డార్క్ నెస్ కు ఇంగ్లీష్ విభాగములో అవార్డు లభించినది.
- జయ శ్రీ గోస్వామి మహంతి అస్సామీ భాషలో రచించిన చాణక్య చరిత్రకు అవార్డు లభించినది.
సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) నూతన కమిషనర్లు
- సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కమిషనర్‌గా కట్టా శేఖర్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు
- టీ న్యూస్ మాజీ సీఈవో- మైడ నారాయణరెడ్డి,
- విద్యార్థి నాయకుడు- గుగులోత్ శంకర్‌నాయక్
- సోషల్ వర్కర్లు సయ్యద్ ఖలీలుల్లా-న్యాయవాది,
- డాక్టర్ మహ్మద్ అమీర్ హుస్సేన్--న్యాయవాది ఆర్టీఐ కమిషనర్లుగా ప్రమాణస్వీకారం చేశారు.
- మోజాంజాహీ మార్కెట్‌లోని ఆర్టీఐ కార్యాలయంలో ఆర్టీఐ ప్రధాన కమిషనర్ రాజాసదారాం.. వీరిచేత ప్రమాణస్వీకారం చేయించారు. మూడేండ్లపాటు పదవిలో కొనసాగనున్నారు.
ఈజిప్టు మాజీ అధ్యక్షుడు హోస్నీ ముబారక్ మృతి
- ఈజిప్టు మాజీ అధ్యక్షుడు హోస్నీ ముబారక్ (91) ఫిబ్రవరి 25న మరణించారు. 30 ఏళ్లపాటు మధ్యప్రాచ్యంలో శాంతి, సుస్థిరతలకుప్రతీకగా అతనిని పేర్కొంటారు.
- 1981 నుంచి 2011 వరకు ఈజిప్టు అధ్యక్షుడిగా ఉన్న ముబారక్ అమెరికాకు మంచిమిత్రుడు. ముబారక్ నియంతృత్వము అనుసరిస్తున్నారంటూ 2011లో దేశవ్యాప్తంగా ప్రజలు ఆందోళనలు చేపట్టారు.
- 18 రోజులపాటు జరిగిన ఈ ఆందోళనల కారణంగా దాదాపు 900 మంది మరణించారు.
- దీంతో 2011 ఫిబ్రవరి 11న సైన్యం ఆయన్ను పదవీచ్యుతుణ్ని చేసి అధికారాలను తన చేతుల్లోకి తీసుకుంది.
- 900 మంది ఆందోళనకారుల మరణాలను నిలువరించడంలో విఫలమయ్యారన్న ఆరోపణలపై
- న్యాయస్థానాలు 2012 జూన్‌లో ముబారక్‌ను దోషిగా నిర్ధారించి యావజ్జీవ జైలుశిక్ష విధించాయి. ఈజిప్టు ఉన్నత న్యాయస్థానం 2014లో ఆ తీర్పును కొట్టివేసి ఆయన్ను నిర్దోషిగా ప్రకటించింది.2017 లోజైలు నుంచి విడుదలయ్యారు.
హురూన్ ప్రపంచ ధనవంతుల జాబితా-2020
- హురూన్ ప్రపంచ ధనవంతుల జాబితా -2020విడుదల చేసిన నివేదిక ప్రకారం
- ప్రపంచవ్యాప్తంగా 2,817 మంది బిలియనీర్లు ఉన్నారు. 2019లో కొత్తగా 480 మంది
- బిలియనీర్లుగా అవతరించారు.
- ప్రపంచ బిలియనీర్లజాబితా;
- 14,000 కోట్ల డాలర్లతో అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్-- అగ్రస్థానంలో నిలిచారు.
- 2వ స్థానములో---- బెర్నార్డ్ ఆర్నాల్డ్
- 3వ స్థానములో----బిల్ గేట్స్
- 4వ స్థానములో---వారెన్ బఫెట్
- 5స్థానములో-----మార్క్ జుకర్ బర్గ్ కలరుబిలియనీర్లదేశాల జాబితాలో గలరు.
- బిలియనీర్లదేశాల జాబితాలో;
- 1వ వస్థానము---చైనా -799 మంది బిలియనీర్లు.
- 2వస్థానము---అమెరికా- 626 మంది బిలియనీర్లు.
- 3వస్థానము---- భారత్ -138మంది బిలియనీర్లు గలరు
- భారత్ నుంచిబిలియనీర్ల జాబితాలో;
- 1వస్థానము--- రిలయన్స్ ఇండస్ర్టీస్ (ఆర్‌ఐఎల్) చైర్మన్ ముకే శ్ అంబానీ అగ్రస్థానంలో నిలిచారు. ఈయన నికర విలువ 6,700 కోట్ల డాలర్లు. గత ఏడాది ఈయన సంపద గంటకు రూ.7 కోట్లు పెరిగింది. ప్రపంచ కుబేరుల్లో ముకేశ్ అంబానీ తొమ్మిదో స్థానంలో ఉన్నారు.
- 2వస్థానము-- ఎస్‌పీ హిందుజా కుటుంబం (2,700 కోట్ల డాలర్లు)
- 3.,వస్థానము--- గౌతమ్ అదానీ (1,700 కోట్ల డాలర్లకు పైగా),ప్రపంచములో 68వస్థానము
- 4.వస్థానము---శివ్ నాడార్ ఆయన కుటుంబం ( దాదాపు 1,700 కోట్ల డాలర్లు) ప్రపంచములో 68వస్థానము
- 5వస్థానము ---లక్ష్మీ మిట్టల్ (1,500 కోట్ల డాలర్లు)
- 6.వస్థానము----ప్రముఖ బ్యాంకర్ ఉదయ్ కోటక్ (దాదాపు 1,500 కోట్ల డాలర్లు)స్వతహాగా బిలియనీర్‌గా మారిన ప్రపంచంలోని ఏకైక బ్యాంకర్ ఈయనే కావడం విశేషం.
- 7వస్థానంలో---- అజీమ్ ప్రేమ్‌జీ (1,400 కోట్ల డాలర్లు).
- 8 స్థానంలో ----సీరమ్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన సైరస్ పూనావాలా 1,200 కోట్ల డాలర్లు సంపద
- 91వ స్థానం-- --ఉదయ్ కోటక్ 15 బిలియన్ డాలర్ల సంపద.
- 24 ఏళ్ల వయసున్న ఓయో వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ సంపద 110 కోట్ల డాలర్లుగా ఉంది. దేశంలో అతిపిన్న సంపన్నుడు ఈయనే కావడం విశేషం.
- ప్రపంచవ్యాప్తంగా చూస్తే ముంబై తొమ్మిదో అతిపెద్ద సంపన్న నగరంగా నిలిచిం (50 మంది - 21,800 కోట్ల డాలర్ల సంపద).
- తెలుగు ధనవంతులు;
- పేరు సంపద కంపెనీ ర్యాంక్
- (కోట్ల డాలర్లు)
- మురళీ దివి, కుటుంబం 430 దివీస్ ల్యాబ్స్ 589
- పీ పిచ్చి రెడ్డి 190 ఎంఈఐఎల్ 1,530
- పీవీ కృష్ణా రెడ్డి 180 ఎంఈఐఎల్ 1,607
- పీవీ రాంప్రసాద్ రెడ్డి 180 అరబిందో ఫార్మా 1,607
- జూపల్లి రామేశ్వర్ రావు 140 మై హోమ్ 2,000
- కే సతీష్ రెడ్డి 120 డాక్టర్ రెడ్డీస్ 2,276
- జీవీ ప్రసాద్, జీ అనురాధ 100 డాక్టర్ రెడ్డీస్ 2,642
No comments:
Post a Comment