Current Affairs in Telugu 25th February, 2020



అంతర్జాతీయం
మలేషియా ప్రధాని రాజీనామ
  • ప్రపంచములోఅతిపెద్ద వయస్సు ప్రధాని94 ఏళ్ల మహతిర్ తన పదవికి రాజీనామా చేశారు.
  • గతంలో1981-2003 వరకుప్రధాని గా వున్నారు.
  • 2018, మే 10న మలేసియా ప్రధానిగా మహతీర్ రెండవసారి పదవీ బాధ్యతలు స్వీకరించారు.
  • జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు, ఇటీవల భారత ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టంపై ప్రధాని మహాతిర్ తీవ్ర విమర్శలు చేసారు.

కామన్‌వెల్త్ షూటింగ్, ఆర్చరీ చాంపియన్‌ షిప్ 2022 భారత్ ఆతిద్యం
  • భారత్ 2022 జనవరిలో జరిగే కామన్‌వెల్త్ షూటింగ్, ఆర్చరీ చాంపియన్‌షిప్ పోటీలకు ఆతిధ్యం ఇవ్వనుంది.
  • ఈ పోటీలను చండీఘడ్ లో నిర్వహించనున్నారు.
  • ఈ పోటీల్లో వచ్చే పథకాలను 2022 జులై 27 నుంచి బర్మింగ్‌హామ్‌లో జరిగే కామన్‌వెల్త్ క్రీడల ర్యాంకింగ్‌‌సకు పరిగణనలోకి తీసుకోనునట్లు సీజీఎఫ్ పేర్కొంది.
  • షూటింగ్, ఆర్చరీ ఈవెంట్లను 2022 జనవరిలో నిర్వహిస్తామని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) తెలిపింది
  • 2022 కామన్వెల్త్ గేమ్స్‌కు బర్మింగ్‌హామ్ జూలై 27 నుంచి ఆగస్టు 7 వరకు ఆతిథ్యమివ్వనుంది. అయితే అతిథ్య దేశానికి ఉన్న సౌలభ్యం మేరకు ఇంగ్లండ్ రోస్టర్ విధానంలో భాగంగా షూటింగ్, ఆర్చరీ ఈవెంట్లను గేమ్స్ నుంచి తప్పించింది.
  • ఈ నేపథ్యంలో కామన్వెల్త్ గేమ్స్ కంటే ముందుగా ఆ రెండు క్రీడల్ని భారత్‌లో నిర్వహించాలని, అందులో సాధించిన పతకాల్ని ప్రధాన గేమ్స్ పట్టికలో ఓ వారం తర్వాత చేరుస్తామని సీజీఎఫ్ తెలిపింది.
  • సీజేఫ్ అధ్యక్షుడు లూయిస్ మార్టిన్.1996లో కామన్వెల్త్ పోటీలు ప్రారంభించినప్పటి నుంచి షూటింగ్ కు అవకాశము దక్కినది
  • ఆర్చరీకి1982,2010 క్రీడలలో మాత్రమే అవకాశముఇచ్చారు.

జాతీయం

రచయిత్రి సత్యవతికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
  • 1940లో గుంటూరు జిల్లాలో జన్మించి విజయవాడలో నివాసముంటున్న ప్రముఖ రచయిత్రి పి. సత్యవతికి అనువాద విభాగంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు-2019 లభించింది.
  • ప్రైజ్ -50వేలు మరియు తామ్రపత్రము
  • మొత్తం 23 భాషల్లో అనువాదాలను ఎంపికచేయగా. 23 మంది అనువాద రచయితలను ఈ అవార్డు వరించింది.
  • ది ట్రూత్ అబౌట్ మీ : ఏ హిజ్రా లైఫ్ స్టోరీ’ అనే ఆంగ్ల ఆత్మకథను తెలుగులో ‘ఒక హిజ్రా ఆత్మకథ’గా అనువదించినందుకు ఈ పురస్కారం లభించింది.
  • 200కు పైగా కథలు, అనేక నవలలు రచించారు
  • ఇల్లు అలకగానే,
  • మంత్రనగరి,
  • పి.సత్యవతి కథలు వంటి కథా సంపుటాలు, ఐదు నవలలతో పాటు అనేక కథలను కూడా అనువదించారు.
  • ‘వాటిజ్ మై నేమ్’-- కథ పదో తరగతిలో పాఠ్యాంశంగా..
  • ‘విల్ హీ కమ్ హోం’-- కథ ఇంటర్‌లో పాఠ్యాంశంగా ఉన్నాయి.
  • రాష్ట్ర ప్రభుత్వం ఉగాదికి ప్రదానం చేసే కళారత్న (హంస) పురస్కారం,పెద్దిభోట్ల స్మారక పురస్కారంలను అందుకొంది

రాష్ట్రీయం
‘జగనన్న వసతి దీవెన పథకం’
  • విజయనగరంలోని అయోధ్య మైదానంలో ఫిబ్రవరి 24న జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ‘జగనన్న వసతి దీవెన పథకం’నుప్రారంబించారు.
  • ఏడాదికి రెండున్నర లక్షలు కన్నా తక్కువ ఆదాయం ఉన్న ప్రతి పేద విద్యార్థి కుటుంబానికి ఏటా రూ.20 వేల చొప్పున ఆర్థికసాయంతో 11 లక్షల 87 వేల మంది పిల్లలకు ఆ తల్లుల ఖాతాల్లోకి దాదాపు రూ.1,100 కోట్లు నేరుగా చేరుతాయని తెలిపారు.
  • అమ్మఒడి కింద ఒకటి నుంచి 12వ తరగతి చదువుతున్న పిల్లల కోసం రూ.6,400 కోట్లుఇస్తున్నట్లు తెలిపారు. ఈ మూడు పథకాలకూ కలిపి ఏడాదికి రూ.12,400 కోట్లు ఖర్చుచేస్తున్నట్లు తెలిపారు. *కుటుంబంలో ఎంత మంది పిల్లలు చదువుతున్నా అందరికీ వసతి దీవెన సాయం అందుతుంది. *వసతిదీవెన కింద ఏడాదికి రూ.2,300 కోట్లు, విద్యాదీవెన పథకంలో పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద దాదాపు ఏడాదికి రూ.3,700 కోట్లు ఖర్చుఅవుతున్నట్లు తెలిపారు.
  • డిగ్రీ, పీజీ చదివే విద్యార్థులకు జనవరి, ఫిబ్రవరి నెలల్లో మొదటి వాయిదా కింద రూ.10 వేలు, జూలై, ఆగస్టులో రెండో వాయిదా కింద మరో రూ.10 వేలు.. మొత్తంగా ఏటా రూ.20 వేలు పిల్లల తల్లులకు అందజేయనున్నట్లు తెలిపారు.
  • ఐటీఐ విద్యార్థులకు రెండు విడతల్లో రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రెండు విడతల్లో రూ.15 వేలు వారి తల్లులకు అందజేయనున్నట్లు తెలిపారు.

   ఖగోళ శాస్త్రవేత్త మైఖేల్ మ్యాడ్ మైక్ హ్యూస్ మృతి
  •  ఓ రాకెట్ ప్రమాదంలో ఖగోళ శాస్త్రవేత్త మైఖేల్ మ్యాడ్ మైక్ హ్యూస్ మరణించారు.
  • భూమి బల్లపరుపుగా ఉందని నిరూపిస్తానని తాను సొంతంగా తయారు చేసుకున్న రాకెట్‌ను పరీక్షించే ప్రయోగం విఫలం చెందడంతో మరణించారు.
  • తన స్టీమ్ రాకెట్‌తో భూమి గుండ్రంగా లేదని నిరూపించేందుకు అంతరిక్షంలోకి వెళ్లారు. ప్రయోగించిన కొద్దిసేపటికే ఈ ప్రయోగం విఫలమైంది.
  • ఆ రాకెట్ అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం బార్‌స్టో సమీపంలో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పేలిపోయింది.

No comments:

Post a Comment