Current Affairs in Telugu 23rd and 24th February, 2020

Current Affairs in Telugu 23rd and 24th February



అంతర్జాతీయం

అమెరికా అధ్యక్షులు -భారత్ పర్యటన

భారత్‌లో ఇప్పటి వరకు ఆరుగురు అమెరికా అధ్యక్షులు పర్యటించగా ట్రంప్‌ ఏడవ అధ్యక్షుడిగా నిలిచారు. భారత్ లో పర్యటించిన అమెరికా అధ్యక్షుల గురించి సంక్షిప్త సమాచారం
  • డ్వైట్‌ డి.ఐసన్‌హోవర్‌ (1959 డిసెంబర్‌ 9-14 )
  • భారత్‌లో అడుగుపెట్టిన తొలి అమెరికా అధ్యక్షుడు డ్వైట్‌ డి.ఐసన్‌హోవర్‌. నాటి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్‌, ప్రధాని నెహ్రూతో ఆయన సమావేశమయ్యారు.తాజ్‌మహాల్‌ను సందర్శించారు.
  • రిచర్డ్‌ఎం నిక్సన్‌ (1969 జూలై 31-ఆగస్టు1)
  • ఇందిరా గాంధీ హయాంలో భారత్‌లో పర్యటించిన రిచర్డ్‌ నిక్సన్‌, 22 గంటలపాటు మాత్రమే ఉన్నారు. 1971 బంగ్లాదేశ్‌ యుద్ధంలో పాకిస్థాన్‌ వైపు మొగ్గు చూపడంతో ఆయన పర్యటనపట్ల భారత్‌ పెద్దగా ఆసక్తి చూపలేదు.
  •  జిమ్మీ కార్టర్‌ (1978 జనవరి 1-3) 
  • ప్రధాని మొరార్జీ దేశాయ్‌ నేతృత్వంలో జనతా ప్రభుత్వం ఏర్పడినపుడు జిమ్మీ కార్టర్‌ భారత్‌లో పర్యటించారు 1971 బంగ్లా యుద్ధం,1974 భారత్ అణుపరీక్షలు జరపడం ఫలితముగా ఏర్పడిన ఉద్రిక్తతలను తగ్గించడానికి ఈపర్యటన సాగినది. 
  • బిల్‌ క్లింటన్‌ (2000 మార్చి 19-25)
  • జిమ్మీ కార్టర్‌ తర్వాత సుమారు 20 ఏండ్లకుపైగా అమెరికా అధ్యక్షులెవరు భారత్‌లో పర్యటించలేదు. 2000లో బిల్‌ క్లింటన్‌తన కుమార్తె చెల్సే తో భారత్‌కు వచ్చారు. వాజ్‌పేయి ప్రభుత్వం 1999లో అణు పరీక్షలు జరుపడం, కార్గిల్‌ యుద్ధంలో విజయం సాధించిన పరిణామాలతో, ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక , ఆర్థిక భాగస్వామ్యానికి ఆయన పర్యటన దోహదపడింది. ఇంధనం, పర్యావరణం అంశాల సంయుక్త ప్రకటనపై ఆయన సంతకం చేశారు. తాజ్‌మహల్‌తోపాటు జైపూర్‌, హైదరాబాద్‌, ముంబై వంటి ప్రముఖ ప్రాంతాలనూ సందర్శించారు. 
  • జార్జ్‌ డబ్ల్యూ బుష్‌ (2006 మార్చి 1-3)
  • ప్రధాని మన్మోహన్‌ నేతృత్వంలో యూపీఏ తొలి ప్రభుత్వం కొలువైన వేళ, భార్య లారా బుష్‌తో కలిసి జార్జ్‌ బుష్‌ భారత్‌ను సందర్శించారు. ఢిల్లీలోని పురానా ఖిలాలో కొద్ది మంది ప్రముఖులనుద్దేశించి ప్రసంగించారు. అణు ఒప్పందం ఖరారుకు ఆయన పర్యటన దోహదపడింది.
  • బరాక్‌ ఒబామా (2010 నవంబర్‌ 6-9, 2015 జనవరి 24-27)
  • రెండుసార్లు భారత్‌లో పర్యటించిన అమెరికా అధ్యక్షుడిగా బరాక్‌ ఒబామా రికార్డు సృష్టించారు.భారీ వాణిజ్య బృందంతో వచ్చిన ఆయన అమెరికా ఇండియా పారిశ్రామిక సదస్సులో ప్రసంగించారు. ఐరాస భద్రతామండలిలో భారత శాశ్వత సభ్యత్వానికి మద్దతిచ్చారు. 2015లోనూ గణతంత్ర దినోత్సవ ముఖ్య అతిధిగా వచ్చారు.

రాష్ట్రీయం

ఆసియా సీనియర్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌

 ఆసియా సీనియర్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లోపురుషుల ఫ్రీస్టయిల్‌ విభాగం పోటీల్లో భారత్‌కు ఒక స్వర్ణం, మూడు రజతాలు లభించాయి.
  • 57 కేజీల విభాగంలో రవి దహియా చాంపియన్‌ యుకి తకహాషి (జపాన్‌)పై. 14–5తో గెలిచిపసిడి పతకం నెగ్గాడు.
  •  65 కేజీల విభాగం ఫైనల్లో బజరంగ్‌ పూనియా (భారత్‌) 1–10తో టకుటో ఒటుగోరో (జపాన్‌) చేతిలో ఓడిపోయి రజతము గెలిచాడు.
  • 79 కేజీల విభాగం ఫైనల్లో గౌరవ్‌ బాలియాన్‌ (భారత్‌) 5–7తో బుడజపోవ్‌ (కిర్గిస్తాన్‌) చేతిలోఓడిపోయి రజతము గెలిచాడు.
  • 97 కేజీల విభాగం ఫైనల్లో సత్యవర్త్‌ కడియాన్‌ (భారత్‌) 0–10తో ముజ్తబా (ఇరాన్‌) చేతిలోరజత పతకము సాధించాడు.
  • ఆసియా రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్ లో చివరిరోజు భారత రెజ్లర్లు ఒక రజతం, రెండు కాంస్య పతకాలు సాధించారు.
  • 74 కిలోల విభాగం ఫైనల్లో జితేందర్‌ కుమార్‌ 1-3తో దనియర్‌ కైసనోవ్‌ (కజకిస్థాన్‌) చేతిలో ఓడి రజతంగెలిచాడు.
  • 86 కిలోల కాంస్యం పోరులో దీపక్‌ పూనియా 10-0తో అబ్దుల్‌ వాహబ్‌ (ఇరాక్‌)పై టెక్నికల్‌ పద్ధతిలో గెలిచి కాంస్య పతకం పొందాడు.
  • 61 కిలోల విభాగం లో రాహుల్‌ అవారే 4-2తో మజిద్‌ అల్మాస్‌ (ఇరాన్‌)ను ఓడించికాంస్యం పొందాడు.
  • మొత్తం మీద భారత్ ఆసియ ఛాంపియన్ షిప్ లో 5స్వర్ణాలు,6రజతాలు,9కాంస్యాలు సాధించినది.

పాలపుంత వెలుపల ఆక్సిజన్
  •  పాలపుంతకు వెలుపల మనిషి బ్రతకడానికి ఆక్సిజన్ ఉన్నట్టు ప్రపంచంలోనే తొలిసారి చైనాలోని షాంఘై ఆస్ట్రోనోమికల్ అబ్జర్వేటరీకి చెందిన శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
  • 581 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న మార్కారియన్ 231 అనే పాలపుంత నుంచి భూమికి చేరిన కాంతి తరంగాలను విశ్లేషించిన అక్కడ ఆక్సిజన్ ఉన్నట్టు కనుగొన్నారు.
  • పాలపుంతతో పోలిస్తే మార్కారియర్ 231పై వంద రెట్ల ఆక్సిజన్ ఉన్నట్టు శాస్త్రవేత్తల బృందం అంచనా వేసింది.

46 వేల ఏళ్లనాటి హార్న్డ్ లార్క్ పక్షి అవశేషాలు

  • ఇటీవల సైబీరియా మంచులో కనుకొన్న 46 వేల ఏళ్లనాటి హార్న్డ్ లార్క్ అనే పక్షి అవశేషాలు అని లండన్ శాస్త్రవేత్తలు తెలిపారు.
  •  ఈ పక్షి జాతుల పరిణామక్రమాన్ని అర్ధం చేసుకోవడానికి ఉపయోగపడతాయని తెలిపారు.
  • ఇదే ప్రాంతంలో కుక్క పిల్లను పోలిన జివి అవశేషాలుగతం లో లభ్యమైనవి అవి 18వేల ఏళ్ల నాటిది అని గుర్తించి దానికి "డొగార్అ" ని పేరుపెట్టారు.
  • ఇది కుక్కపిల్లా,తోడేలు పిల్లా.. అన్నది తేల్చేందుకు ఇంకా పరిశోధనలు జరుగుచున్నవి. 
  • ఇదే ప్రాంతం లో 50 వేల సంత్సరం నాటి సింహం పిల్ల,వూలి మామోత్ అవశేషాలు లభ్యమైనవి.






















No comments:

Post a Comment