Current Affairs in Telugu 21st and 22 February


అంతర్జాతీయం

నూతన నత్త కు గ్రెటా థన్ బెర్గ్ పేరు

  • ఇటీవలకనుగొన్న నత్త కాయినోగాస్ట్రోపాడ్స్ జాతికి చెందినది, ఇవి కరువు,ఉష్ణోగ్రతలకు సున్నితత్వం తో ఉంటాయి.
  • బ్రునై లోని కౌల బేలలాంగ్ ఫీల్డ్ స్టడీస్ సెంటర్ వద్ద కనుగొన్నారు.
  • నెదర్లాండ్ లోని నేచురలిస్ బయోడైవర్సిటీ సెంటర్ కు చెందిన పర్యావరణవేత్త మెన్నో షిల్త్ జిన్ కనుగొన్నాడు.
  • రాత్రి పూట ఆకుల పై తిరుగుతుంది.
  • ఈ కొత్త నత్త కు పర్యావరణ మార్పుల ఫై ఉద్యమం చేస్తున్న స్వీడన్ బాలిక గ్రెటా థన్ బెర్గ్ పేరును పెట్టారు.


టైమ్స్ టాప్ 100 లో భారత విద్యా సంస్థలు
  • టైమ్స్ టాప్ 100 లో భారత విద్యా సంస్థలుటైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఎమర్జింగ్ ఎకానమిస్ ర్యాంకింగ్స్ -2020లో ప్రపంచము లో
  • అత్యుత్తమ యూనివర్శిటీ గా----- యూనివర్సిటీ అఫ్ ఆక్స్ ఫోర్డ్ యూనివర్సిటీ (యూకే)నిలిచింది. *రెండవ స్థానములో--------------- కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ (యు.ఎస్ ) నిలిచింది.
  • భారత్ నుంచి 11యూనివర్సిటీలు ఎంపికైనవి అవి
  • ది ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ సైన్సెస్ -16 వ ర్యా0కు
  •  ఐఐటీ ఖరగ్ పుర్ -32వ ర్యా0కు
  • ఐఐటీ ఢిల్లీ -38వ ర్యా0కు
  • ఐఐటీ మద్రాస్ -63వ ర్యా0కు ను సాదించినవి

అమెరికా లో ప్రధాన న్యాయమూర్తిగా భారతీయుడు
  • అమెరికా లోని ద్వితీయ ఉన్నత న్యాయస్థానము కోర్ట్ అఫ్ అప్పీల్స్ డీసీ సర్క్యూట్ ప్రధాన న్యాయమూర్తిగా భారత సంతతికి చెందిన జస్టిస్ శ్రీనివాసన్ నియమితులయ్యారు
  • దక్షిణాసియాలోనే ఈ పదవిని అధిరోహించిన తొలి వ్యక్తి గా రికార్డ్ కు ఎక్కాడు .
  • ఇతను చండీఘడ్ కు చెందిన వ్యక్తి.
  • స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ లో విద్యను అభ్యసించారు .
  • యునైటెడ్ స్టేట్స్ కు ప్రిన్సిపాల్ డిప్యూటీ సొలిసిటర్ జనరల్ గా పనిచేసాడు.
  • యునైటెడ్ స్టేట్స్ సుప్రీం కోర్ట్ ఎదుట శ్రీనివాసన్ 25 కేసులు వాదించాడు.



రాష్ట్రీయం
నేల కాలుష్యా నివారణ బాక్టీరియా
  • అమెరికాలోని కార్నెల్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు నేల కాలుష్యానికి చెక్‌పెట్టే సరికొత్త బ్యాక్టీరియాను కనుగొన్నారు. దానికి ‘మ్యాడ్‌సెనియానా’ అని పేరుపెట్టారు.
  • ప్లాస్టిక్ వ్యర్దాలచేతకాలుష్యం ఐన నేలల్లోకి పాలీ క్లినిక్‌ అరోమాటిక్‌ హైడ్రోకార్బన్‌(పీఏహెచ్‌) రసాయనాలు ఇంకుతుంటాయి.
  • వీటిప్రభావం వల్ల ప్రజలకుభయంకరమైన వ్యాధులు ప్రబలే అవకాశాలు గలవు
  • అలాంటి ప్రమాదకర పీఏహెచ్‌లను నిర్వీర్యం చేసి, వాటి స్థానంలో నేలలోకి పోషకాలైన నైట్రోజన్‌, ఫాస్పరస్‌ లనుభర్తీ చేయడం మ్యాడ్‌సెనియానా ప్రత్యేకత.
  • ఈ బ్యాక్టీరియా కాలుష్యభరిత నేలల్లో పెరిగే చెట్లు, మొక్కల నుంచి కార్బన్‌ను పీల్చుకొని మొక్కలకు కావలిసినసూక్ష్మ,స్థూలపోషకాలను అందజేస్తుంది.


ఆసియా రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్ లో సాక్షి మాలిక్ కు రజతం
  • ఆసియా రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్ పోటీల్లో ఓ రజతం, మూడు కాంస్యాలు భారత్‌ ఖాతాలో చేరాయ ఒలింపిక్‌ కాంస్య పతక విజేత సాక్షి మాలిక్‌ (65 కిలోలు) 0-2తో నవోమి రుకీ (జపాన్‌)చేతిలో ఓడి రజతానికే పరిమితమైంది
  • వినేశ్‌ ఫొగట్‌ (53 కిలోలు) తి లి కియు (వియత్నాం)పైగెలిచికాంస్య పతకము పొందాడు
  • అన్షు మాలిక్‌ (57 కిలోలు)సెవారా (ఉజ్భెకిస్థాన్‌)పైగెలిచికాంస్య పతకము పొందారు
  • గురుశరణ్‌ప్రీత్‌ కౌర్‌ (72 కిలోలు)ఎక్‌బయార్‌ (మంగోలియా)పై గెలిచారు.
  • దీంతో ఈ టోర్నీలో భారత మహిళలు ఓవరాల్‌గా ఎనిమిది పతకాల (మూడు స్వర్ణాలు, రెండు రజతాలు, మూడు కాంస్యాలు)తో అత్యుత్తమ ప్రదర్శన చేస్తున్నారు.

భారత మహిళా రెజర్లకు మూడు స్వర్ణాలు
  • భారత మహిళా రెజర్లు మూడు స్వర్ణాలను ఫ్రీస్టైల్ లో ఆసియా సీనియర్ రెజ్లింగ్ ఛాంపియన్ షిప్ లో సాధించారు .
  • దివ్య కాక్రన్ (68కేజీలు)అల్బినా (కజకిస్తాన్ ),డెల్ గెరమా (మంగోలియా),అజోదా (ఉజ్జెకిస్తాన్) నరువా మత్సుయూకి (జపాన్ )ఫై గెలిచి స్వర్ణము సాధించినది.
  • సరితా మోర్‌(59కేజీలు ) 3-2తో బాటెసెగ్‌ అట్లాసెసెగ్‌ (మంగోలియా)పై, గెలిచి పసిడి పతకమునెగ్గినది .
  • పింకీ(55కేజీలు ) 2-1తో దుల్గూన్‌ బొలొర్మా (మంగోలియా)పై గెలిచి పసిడి పతకము పొందినది.
  • నిర్మలా దేవి (50కేజీలు) 2-3తో మిహో ఇగరషి (జపాన్‌) చేతిలో ఓడి రన్నర్‌పగా నిలిచిరజత పతకము సాధించినది.
  • నవ్‌జోత్‌ కౌర్‌ (2018లో) తర్వాత ఆసియా సీనియర్‌ రెజ్లింగ్‌లో భారత అమ్మాయిలు స్వర్ణాల నెగ్గడం ఇదే తొలిసారి కావడం విశేషం.

మేటి క్రీడాకారిణి గాసింధు
  • వరల్డ్‌ చాంపియన్‌ పీవీ సింధు ఈఎస్‌పీఎన్‌ ‘ఫిమేల్‌ స్పోర్ట్స్‌ పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’అవార్డు కు వరుసగా మూడోసారి ఎంపికైంది.
  •  ఫిమేల్ స్పోర్ట్స్‌ పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌-- షూటర్‌ సౌరభ్‌ చౌదరికి దక్కింది.
  • కమ్‌బ్యాక్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ ----వరల్డ్‌ ర్యాపిడ్‌ చెస్‌ చాంపియన్‌గా నిలిచిన గ్రాండ్‌ మాస్టర్‌ కోనేరు హంపిఅవార్డుగెలుచుకున్నది.
  • కోచ్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ --బ్యాడ్మింటన్‌ జాతీయ కోచ్‌ గోపీ చంద్‌ గెలుచుకున్నాడు.
  • మూమెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’-------సింధు వరల్డ్‌ చాంపియన్‌గా నిలిచిన సందర్భాన్నిఈ విధముగా ప్రకటించింది.

నూతన నాబార్డ్ చైర్మన్
  • జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంక్ చైర్మన్ పదవి 24తరువాత మరోసారి తెలుగు వ్యక్తిగుంటూరు వాసి చింతల గోవింద రాజులు ఎంపికయ్యారు.
  • కొంతకాలంగా నాబార్డ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ హోదా లో పనిచేస్తున్నారు .
  • 20 దేశాల్లో పర్యటించి వ్యవసాయ రంగం బ్యాంకింగ్ సహకారం పై అధ్యయనము చేసారు.
  •  గ్రీన్ హౌస్ లోపూలు వాటి ఎగుమతులు,రొయ్యల పెంపకము పై పెట్టుబడుల ఆవశ్యకత, పాడిపరిశ్రమ రంగం లో మార్పులకు చేసిన కృషిని, నాబార్డ్ బ్యాంక్ బోర్డు గుర్తించింది.
  •  నాబార్డ్ కు చైర్మన్ గా పనిచేసిన తెలుగు వ్యక్తి కోటయ్య.


నూతన సీవీసీ,సీఐసి నియామకము
  • సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ చీఫ్ గా సంజయ్ కొఠారి ఎంపికయ్యారు.
  • కొఠారి రాష్ట్రపతి మాజీ కార్యదర్శిగా పనిచేసారు.
  • విజిలెన్స్ కమిషనర్ గా సురేష్ పటేల్ ఎంపికయ్యారు.
  • కేంద్ర సమాచార కమిషన్ చీఫ్ గా బిమల్ జుల్క్ ఎంపికయ్యారు
  • గతం లో సమాచార ప్రసార శాఖ మాజీ కార్యదర్శి గా పనిచేసారు.
  • సమాచార కమిషనర్ గా అనితా పాండోవెన్ ఎంపికయ్యారు.

తెలంగాణ పొడ తూర్పు,వానరాజ కోడి కి గుర్తింపు
  • తెలంగాణలోని నల్లమల్ల అటవీ ప్రాంతములో అధికముగా కనిపించే పొడ తూర్పు జాతి పశువులకు దేశీయ పశుజాతి గా గుర్తింపు లభించినది. ఇవి నాగర్ కర్నూల్ జిల్లా పరిధిలో అధికముగా గలవు.
  • హైద్రాబాద్ రాజేంద్రనగర్ లోని జాతీయ కోళ్ళ పరిశోధన సంస్థ వృద్ధి చేసిన వన రాజా కోడిని కూడ దేశీయ కోళ్ళ జాతిగా గుర్తించింది.
  • ఈగుర్తింపును భారత వ్యవసాయ పరిశోధనా మండలి కి చెందిన జాతీయ పశు జన్యువనరుల మండలి గుర్తించింది.
  •  దేశ వ్యాప్తముగా 197జాతులను గుర్తించగా వాటిలో
  •  వివిధ పశువులు -50
  •  దున్నపోతులు-17
  •  గొర్రెలు -44
  •  గుర్రాలు-7
  •  ఒంటెలు -9
  •  పందులు-10
  •  కోళ్లు -9
  •  బాతులు-3 రకాల కు గుర్తింపునిచ్చినది.



No comments:

Post a Comment