రేపిస్టుల బహిరంగ ఉరికి పాక్ పార్లమెంట్ ఆమోదం


పిల్లలపై అత్యాచారాలకు, హత్యాచారాలకు పాల్పడే వారికి బహిరంగ ఉరిశిక్ష అమలు చేసే తీర్మానాన్ని పాకిస్తాన్ పార్లమెంట్ ఫిబ్రవరి 7న ఆమోదించింది.
Current Affairs
దేశంలో చిన్నారులపై పెరుగుతున్న హత్యాచారాలను నియంత్రించేందుకే ఈ తీర్మానాన్ని తీసుకొస్తున్నట్లు ఆ దేశ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి మొహమ్మద్ ఖాన్ చెప్పారు. హత్యాచారం చేసే వారికి కేవలం ఉరి సరిపోదని, వారికి బహిరంగ ఉరి వేయాల్సిందేనని తీర్మానం ప్రవేశపెడుతూ ఆయన చెప్పారు. ఈ తీర్మానం మెజారిటీ ఓట్లతో పాసయింది.
2018లో నౌషెరా అనే ప్రాంతంలో 8 ఏళ్ళ బాలికపై అత్యాచారం, ఆపై హత్య జరిగిన దారుణ ఘటన పాకిస్తాన్‌లో సంచలన సృష్ట్టించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా 2018 ఏడాదిలో చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించి 3,800 కేసులు నమోదైనట్లు అంచనా.


Click Here to read Current Affairs February 2020 in Telugu