దిల్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్‌ వీరులెవరు?



ఉద్యోగార్థులూ జాతీయంగా, అంతర్జాతీయంగా జరుగుతున్న ముఖ్యమైన సంఘటనలను గమనిస్తూ ఉండాలి. వాటిలోని ప్రధానాంశాలను గుర్తుంచుకోవాలి. కేంద్ర స్థాయిలో జరిగేవైనా, రాష్ట్ర స్థాయిలో జరిగేవైనా పోటీ పరీక్షల్లో వర్తమానాంశాలకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. అందుకే వీటిని ఎప్పటికప్పుడు గమనిస్తూ గుర్తుంచుకోవడం ఎంతో అవసరం!


జాతీయం
1. కింది అంశాల్లో సరైనవి ఏవి?
ఎ) 2020 ఫిబ్రవరి 8న జరిగిన దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఫిబ్రవరి 11న ప్రకటించారు. మొత్తం 70 శాసనసభ స్థానాలకుగానూ అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) 62 చోట్ల విజయం సాధించింది.
బి) భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 8 చోట్ల గెలుపొందింది. కాంగ్రెస్‌ పార్టీ ఒక్క స్థానంలోనూ గెలుపొందలేదు.
సి) 2015 ఎన్నికల్లో ఆప్‌ 67 సీట్లు, బీజేపీ 3 చోట్ల నెగ్గాయి. దిల్లీలో వరుసగా మూడుసార్లు అధికార పగ్గాలు చేపట్టి ఆప్‌ హ్యాట్రిక్‌ సాధించింది. 1998-2013 మధ్యకాలంలో షీలా దీక్షిత్‌ నేతృత్వంలో కాంగ్రెస్‌ పార్టీ కూడా మూడు సార్లు వరుసగా అధికారంలో కొనసాగింది.
డి) ఫిబ్రవరి 16న ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ దిల్లీ సీఎంగా వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు.
(కేజ్రీవాల్‌ ప్రమాణ స్వీకారోత్సవానికి అవ్యాన్‌ తోమర్‌ అనే బాలుడు ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరయ్యాడు. కేజ్రీవాల్‌ మాదిరిగానే టోపీ, స్వెటర్, మఫ్లర్, కళ్లజోడు ధరించిన ఈ బాలుడు దిల్లీలోని ఆప్‌ కార్యాలయం దగ్గర ఫలితాల వెల్లడి రోజు అందరి దృష్టి ఆకర్షించాడు.)
1) ఎ, బి మాత్రమే 2) ఎ, సి మాత్రమే 3) ఎ, బి, సి మాత్రమే 4) పైవన్నీ
2. ఐటీ దిగ్గజం ‘ఇన్ఫోసిస్‌’ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి అల్లుడు, బ్రిటన్‌ ఎంపీ రిషి సునక్‌ను 2020 ఫిబ్రవరి 13న బ్రిటన్‌ ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌ ఏ శాఖ మంత్రిగా నియమించారు? (భారత సంతతికి చెందిన అలోక్‌శర్మను వాణిజ్య, ఇంధన, పారిశ్రామిక శాఖల మంత్రిగా, సుయెల్లా బ్రేవర్‌మన్‌ను అటార్నీ జనరల్‌గా ప్రధాని తాజాగా నియమించారు. ఇప్పటికే హోంమంత్రిగా భారత సంతతికి చెందిన ప్రీతి పటేల్‌ కొనసాగుతున్నారు.)
1) ఆర్థిక మంత్రి 2) పర్యావరణ మంత్రి 3) రైల్వే మంత్రి 4) విదేశాంగ మంత్రి
3. కిందివాటిలో ఏ సంస్థకు దివంగత కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్‌ పేరు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది? (ఫిబ్రవరి 14న దివంగత నేత సుష్మాస్వరాజ్‌ జయంతి నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.)
ఎ) ప్రవాసీ భారతీయ కేంద్రం బి) ఫారిన్‌ సర్వీస్‌ ఇన్‌స్టిట్యూట్‌ సి) భారత ఒలింపిక్‌ సంఘం డి) భారత పెట్రోలియం సంస్థ
1) ఎ మాత్రమే 2) ఎ, బి మాత్రమే 3) ఎ, బి, సి మాత్రమే 4) పైవన్నీ
4. ప్రముఖ పర్యావరణవేత్త, ది ఎనర్జీ అండ్‌ రిసోర్సెస్‌ ఇన్‌స్టిట్యూట్‌ (టెరి) మాజీ అధినేత ఆర్‌.కె. పచౌరి 2020 ఫిబ్రవరి 13న ఎక్కడ మరణించారు? (2001లో పద్మభూషణ్, 2008లో పద్మ విభూషణ్‌ పురస్కారాలను ఈయన గెలుచుకున్నారు. వాతావరణ మార్పులకు సంబంధించి ఏర్పాటైన ఐరాస ఇంటర్‌- గవర్నమెంటల్‌ ప్యానెల్‌- ఐపీసీసీ అధ్యక్షుడిగా పచౌరీ 2007లో అమెరికా అప్పటి ఉపాధ్యక్షుడు అల్‌గోర్‌తో కలిసి నోబెల్‌ శాంతి బహుమతి గెలుచుకున్నారు. టెరి వ్యవస్థాపక సంచాలకుడిగా పనిచేస్తున్న సమయంలో సహచర ఉద్యోగినిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో 2015లో తన పదవికి రాజీనామా చేశారు).
1) కాన్పూర్‌ 2) గువాహటి 3) దిల్లీ 4) అహ్మదాబాద్‌
జవాబులు: 1-4, 2-1, 3-2, 4-3




అంతర్జాతీయం
1. కింది అంశాల్లో సరైనవి ఏవి?
ఎ) 92వ ఆస్కార్‌ పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని 2020 ఫిబ్రవరి 10న అమెరికా లాస్‌ ఏంజెలెస్‌లోని డాల్బీ థియేటర్‌లో ఘనంగా నిర్వహించారు.
బి) దక్షిణ కొరియా చిత్రం ‘పారాసైట్‌’ ఉత్తమ చిత్రం, ఉత్తమ విదేశీ చిత్రం సహా అత్యధికంగా నాలుగు అవార్డులు గెలుచుకుంది. ఉత్తమ చిత్రంగా ఆస్కార్‌ అవార్డు అందుకున్న తొలి ఆంగ్లేతర చిత్రంగా ఘనత సాధించింది. ధనిక, పేద వర్గాల అంతరాల వల్ల సమాజంలో ఎలాంటి దయనీయ పరిస్థితులు ఏర్పడ్డాయన్న విషయాన్ని ‘పారాసైట్‌’ వినోదాత్మకంగా ఆవిష్కరించింది.
సి) ‘పారాసైట్‌’ చిత్ర దర్శకుడు బాంగ్‌ జాన్‌ హుకు ఉత్తమ దర్శకుడి పురస్కారం లభించింది. ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయితగానూ ఆస్కార్‌ అందుకున్నారు.
డి) గతంలో మూడుసార్లు ఆస్కార్‌ నామినేషన్‌లు అందుకున్న జోక్విన్‌ ఫోనిక్స్‌ ‘జోకర్‌’ చిత్రంలో నటనకుగానూ ఉత్తమ నటుడిగా ఆస్కార్‌ అందుకున్నారు. ఈయనకు ఇదే తొలి ఆస్కార్‌ పురస్కారం. అలనాటి ప్రముఖ నటి, గాయని జూడీ గార్లండ్‌ జీవిత కథతో తెరకెక్కిన ‘జూడీ’ చిత్రంలో నటించిన రెనీ జెల్‌వెగర్‌ ఉత్తమనటిగా ఆస్కార్‌ పొందింది. యాభైఏళ్ల వయసులో ఆమె దీన్ని అందుకున్నారు.
1) ఎ, బి మాత్రమే 2) ఎ, సి మాత్రమే 3) ఎ, బి, సి మాత్రమే 4) పైవన్నీ
2. కింది అంశాల్లో ఏది సరైనది?
ఎ) చైనా సహా పలు దేశాలను వణికిస్తున్న ప్రాణాంతక కొత్త తరహా కరోనా వైరస్‌కు ‘కొవిడ్‌-19’గా ప్రపంచ ఆరోగ్య సంస్థ నామకరణం చేసింది. కరోనా (సీవో), వైరస్‌ (వీఐ) డిసీజ్‌ (డీ) అనే పదాలకు సంక్షిప్త రూపంగా ఈ పేరును ఖరారు చేసింది.
బి) 2019 డిసెంబరులో జపాన్‌లోని వుహాన్‌లో తొలిసారిగా కరోనా వైరస్‌ ఉనికి బయటపడింది.
సి) కరోనా వైరస్‌తో ఉర్కిరిబిక్కిరి అవుతున్న చైనాకు సాయమందించేందుకు బ్రూస్‌ ఐల్వార్డ్‌ నేతృత్వంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ్బజూబీవ్శీ ఓ అంతర్జాతీయ నిపుణుల బృందాన్ని బీజింగ్‌కు పంపింది.
1) ఎ మాత్రమే 2) ఎ, బి మాత్రమే 3) ఎ, సి మాత్రమే 4) పైమూడు
3. సూర్యుడి ధ్రువ ప్రాంతాలకు సంబంధించిన మొట్టమొదటి చిత్రాలను అందించేందుకు అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా), ఐరోపా రోదసి సంస్థ (ఈఎస్‌ఏ)లు సంయుక్తంగా 2020 ఫిబ్రవరి 10న ‘సోలార్‌ ఆర్బిటర్‌’ అనే వ్యోమనౌకను అమెరికాలోని కేప్‌ కెనావెరాల్‌ వైమానిక స్థావరం నుంచి ఏ రాకెట్‌ ద్వారా ప్రయోగించాయి?
1) అట్లాస్‌-2 2) అట్లాస్‌-3 3) అట్లాస్‌-4 4) అట్లాస్‌-5
4. భారత్‌కు అత్యంత అధునాతనమైన గగనతల రక్షణ వ్యవస్థను సరఫరా చేసేందుకు ఏ దేశం అంగీకరించింది? (186 కోట్ల డాలర్ల విలువైన ‘సమీకృత గగనతల రక్షణ ఆయుధ వ్యవస్థ- ఏఐడీ డబ్ల్యూఎస్‌ ఆకాశమార్గంలో జరిగే శత్రుదాడిని తిప్పికొట్టడానికి, సైనిక దళాల ఆధునికీకరణలో భారత్‌కు ఉపయోగపడుతుంది.)
1) ఇజ్రాయెల్‌ 2) ఫ్రాన్స్‌ 3) రష్యా 4) అమెరికా
జవాబులు: 1-4, 2-3, 3-4, 4-4




ఇతరాలు
1. కింది అంశాల్లో సరైనవి ఏవి?
ఎ) తెలంగాణ చరిత్రలోనే రికార్డు స్థాయిలో ఈ ఏడాది (2019-20) ఆహార ధాన్యాల దిగుబడి రానుందని అర్థ గణాంక శాఖ ముందస్తు అంచనాల తాజా నివేదికలో వెల్లడించింది.
బి) రాష్ట్ర చరిత్రలో ఈ ఏడాది రెండు సీజన్లు- వానాకాలం (ఖరీఫ్‌), రబీ (యాసంగి) కలిపి 1.48 కోట్ల మెట్రిక్‌ టన్నుల వరి దిగుబడి రానుంది.
సి) వరి ధాన్యం దిగుబడి గత ఆర్థిక సంృృతో పోలిస్తే ఏకంగా ఖరీఫ్, రబీల్లో 48.09 లక్షల మెట్రిక్‌ టన్నులు అధికంగా పెరిగింది.
డి) ఖరీఫ్, రబీల్లో వరి 68.5 లక్షల ఎకరాల్లో సాగైంది. 2018-19తో పోలిస్తే ఏకంగా 20.76 లక్షల ఎకరాలు అధికంగా సాగు అయ్యింది.
1) ఎ మాత్రమే 2) ఎ, బి మాత్రమే 3) ఎ, బి, సి మాత్రమే 4) పైవన్నీ
2. ఆంధ్రప్రదేశ్‌లో తొలి ‘దిశ’ మహిళా పోలీస్‌ స్టేషన్‌ను 2020 ఫిబ్రవరి 8న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఎక్కడ ప్రారంభించారు? (రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 18 దిశ పోలీస్‌ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు ఈ సందర్భంగా సీఎం ప్రకటించారు. దిశ చట్టంపై అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేయడం, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఐఏఎస్‌ అధికారిణి కృతికా శుక్లా, ఐపీఎస్‌ అధికారిణి దీపికను ప్రభుత్వం ప్రత్యేక అధికారులుగా నియమించింది. ఈ చట్టం కింద ఏడు రోజుల్లో దర్యాప్తు, 14 పని రోజుల్లో విచారణ పూర్తి చేస్తారు. రేప్, గ్యాంగ్‌ రేప్‌లకు పాల్పడితే ఉరిశిక్ష విధించనున్నారు)
1) విశాఖపట్టణం 2) రాజమహేంద్రవరం 3) అనంతపురం 4) తిరుపతి
3. భారత బ్యాడ్మింటన్‌కు చేసిన సేవలకు గుర్తింపుగా 2019 కిగానూ పురుషుల కోచ్‌ల విభాగంలో ప్రతిష్ఠాత్మక ఐఓసీ (అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ) లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు?
1) చేతన్‌ ఆనంద్‌ 2) పుల్లెల గోపీచంద్‌ 3) ప్రకాష్‌ పదుకొణె 4) అనూప్‌ శ్రీధర్‌
4. అంతర్జాతీయ హాకీ సంఘం (ఎఫ్‌ఐహెచ్‌) 2019కిగానూ వర్థమాన క్రీడాకారిణి పురస్కారాన్ని భారత్‌కు చెందిన ఏ యువ హాకీ క్రీడాకారిణికి ప్రకటించింది? (పురుషుల హాకీలో 2019 ఏడాది వర్థమాన ఆటగాడిగా భారత్‌కే చెందిన వివేక్‌ సాగర్‌ ప్రసాద్‌ ఎంపికయ్యారు)
1) లాల్‌ రెమ్‌ సియామి 2) తేజస్విని రాజశేఖర్‌ 3) సునీతా లక్రా 4) దీప్‌ గ్రేస్‌ ఎక్కా
5. కింది అంశాల్లో సరైనవి ఏవి?
ఎ) అండర్‌-19 క్రికెట్‌ ప్రపంచ కప్‌-2020 విజేతగా బంగ్లాదేశ్‌ నిలిచింది. దక్షిణాఫ్రికాలోని పాచెఫ్‌స్ట్రూమ్‌లో జరిగిన ఫైనల్లో బంగ్లా జట్టు డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో 3 వికెట్ల తేడాతో భారత్‌పై నెగ్గింది.
బి) సీనియర్‌ లేదా అండర్‌-19 స్థాయిలో బంగ్లాదేశ్‌కు ఇదే తొలి ప్రపంచకప్‌. భారత్‌ ఈ టోర్నీలో ఇప్పటి వరకూ నాలుగుసార్లు విజేతగా నిలిచింది.
సి) తాజా టోర్నీలో భారత జట్టు కెప్టెన్‌గా ప్రియమ్‌ గార్గ్, బంగ్లా జట్టు కెప్టెన్‌గా అక్బర్‌ అలీ వ్యవహరించారు.
డి) భారత క్రికెటర్‌ యశస్వి జైశ్వాల్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద టోర్నమెంట్‌’ పురస్కారం గెలుచుకున్నాడు.
1) ఎ, బి మాత్రమే 2) ఎ, సి మాత్రమే 3) ఎ, బి, సి మాత్రమే 4) పైవన్నీ
జవాబులు: 1-4, 2-2, 3-2, 4-1, 5-4

No comments:

Post a Comment