అయోధ్యలో రామమందిర నిర్మాణం


ls-img
 అయోధ్యలో రామమందిర నిర్మాణం దిశగా సుప్రీంకోర్టు ఆదేశానుసారం రామాలయ నిర్మాణానికి ట్రస్టు ఏర్పాటుచేశామని, దీనిపేరు ‘శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర’ అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ బుధవారం లోక్‌సభలో ప్రకటించారు
శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌ ప్రధాన కార్యాలయాన్ని ఢిల్లీలోని గ్రేటర్‌ కైలాశ్‌ ప్రాంతంలో ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది.దీనికి సీనియర్ న్యాయవాది కేశవ అయ్యంగార్ పరాశన్ దీనికి చైర్మన్ గా వ్యవహరిస్తారు
 కేంద్రము 67.7 ఎకరాల భూమిని ట్రస్టుకు అప్పగిస్తామని చెప్పినది . దీనిలో 15 మంది సభ్యులు ఉంటారని, ఇందులో దళిత సామాజిక వర్గం నుంచికచ్చితంగా  ఒకరు ఉంటారని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తెలిపారు. అయోధ్యలో రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదంపై సుప్రీంకోర్టు గత ఏడాది నవంబర్‌లో తుదితీర్పు వెలువరించినది.మూడు నెలల్లోగా ట్రస్టును ఏర్పాటుచేసి వివాదాస్పద భూమిని అప్పగించాలని కోర్టు ఆదేశించింది. ఈ గడువు ఈ నెల 9వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో కేంద్రం చర్యలు తీసుకున్నది..
 సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం మసీదు నిర్మాణానికి అయోధ్య జిల్లాలో ఐదెకరాల స్థలాన్ని కేటాయించింది. ఈ స్థలం అయోధ్య పట్టణానికి 18 కి.మీ.ల దూరంలోని సోహావల్‌ మండలం ధన్నీపూర్‌లో అయోధ్య-లక్నో హైవే పక్కన ఉన్నట్టు ప్రభుత్వ అధికార ప్రతినిధి శ్రీకాంత్‌ శర్మ తెలిపారు.
 శాశ్వత సభ్యులు 
స్వామి వాసుదేవానంద్ -ప్రయాగరాజపీఠాధిపతి 2. జగద్గురు మాధవాచార్య -ఉడిపి 3. యుగ పురుష్ పరమానంద -హరిద్వార్ 4. స్వామి గోవిందదేవ్ -పూణే 5. విమెలెందు మొహన్ ప్రతాప్ మిశ్రా -అయోధ్య రాజకుటింబీకుడు 6. అనిల్ మిశ్రా -అయోధ్యహోమియోపతి డాక్టర్ 7. కమలేశ్వర్ చౌపాల్ -పాట్నాదళితుడు

నామినేటెడ్ సభ్యులు1. ట్రస్ట్ ఎంపికచేసిన ఇద్దరు సభ్యులు 2.ఐఏఏస్ అధికారి -జాయింట్ సెక్రటరీ హాదా 3. రాష్ట్రప్రభుత్వ  ఐఏఏస్ అధికారి3. అయోధ్య కలెక్టర్ 4. పాలకమండలి చేర్మన్

No comments:

Post a Comment