Current Affairs in Telugu 1st and 2nd January

అంతర్జాతీయం 


ఎర్త్‌షాట్‌ పురస్కారం
ప్రపంచానికి పెను ముప్పుగా పరిణమిస్తున్న పర్యావరణ మార్పులకు అడ్డుకట్ట వేసేలా వినూత్న ఆవిష్కరణలు చేపట్టేవారికి 'ఎర్త్‌షాట్‌' పేరుతో పురస్కారాలు బ్రిటన్‌ రాకుమారుడు విలియమ్‌ అందజేయనున్నారు. 

* రానున్న దశాబ్ద కాలంపాటు ఏటా ఐదుగురికి ఈ బహుమతులను ప్రదానం చేస్తారు. 

* పర్యావరణానికి సంబంధించి మానవాళి చరిత్రలో అత్యంత ప్రతిష్ఠాత్మక పురస్కారాలుగా వాటిని పేర్కొంటున్నారు.

అంటార్కిటికా పర్వతాన్ని అధిరోహించిన పూర్ణ
*పర్వతారోహణలో తెలంగాణకు చెందిన మాలావత్‌ పూర్ణ మరో ఘనత సాధించింది. అంటార్కిటికా ఖండం లోని 'విన్సన్‌ మాసిఫ్‌' పర్వతాన్ని డిసెంబర్ 26,2019 న ఆమె అధిరోహించింది. 

*ప్రపంచలోని ఎత్తయిన పర్వతాన్ని అధి రోహించి చరిత్ర సృష్టించింది. ధైర్య సహసాలను ప్రద       ర్శిస్తూ ఆరేండ్లలో ఆరు ఖండ్లాలోని ఆరు ఎతైన పర్వాతా లను అతి సునయాసంగా అధిరోహించింది.  

*ప్రపంచం లోని ఏడు ఖండాల్లో ఉన్న ఏడు ఎతైన పర్వతాలను అధిరోహించాలనే లక్ష్యంతోనే ఈ విజయాలు సాధిస్తూ వస్తోంది.

వ్యక్తిగత కార్ల నిషేధం
* డీజిల్, పెట్రోల్‌తో సంబంధం లేకుండా ప్రపంచంలో ప్రైవేటు కార్లను పూర్తిగా నిషేధిస్తున్న తొలి            నగరం బ్రిటన్‌లోని యార్క్‌ సిటీ. 

*పబ్లిక్‌ రవాణా బస్సులు, దివ్యాంగులను తీసుకెళ్లే వాహనాలు మినహా మిగతా ప్రయాణికులను                   తీసుకెళ్లే ప్రైవేటు వాహనాలన్నింటిని నిషేధించాలని నగర మున్సిపల్‌ కార్పొరేషన్‌                                 నిర్ణయించింది. 

*ఈ నిషేధం సిటీవాల్స్‌ వరకు, నగరం చుట్టూ నిర్మించిన గోడల పరిధి వరకు ఉంటుంది. 

* నగరం చుట్టూ రోమన్‌ కాలంలో నిర్మించిన గోడలు ఇప్పటికీ అక్కడ బలంగానే ఉన్నాయి.

మతిమరుపు వ్యాధికి మందు

*తీవ్ర మతిమరుపు వ్యాధి అయిన అల్జీమర్స్‌ను నయం చేసేందుకు చైనాలో కొత్త మందు మార్కెట్లోకి         వచ్చింది. 

*దీంతో ఈ వ్యాధితో బాధపడుతున్న కొన్ని లక్షల మందికి ఎంతో ఊరట చేకూరనుంది

* బ్రౌన్‌ ఆల్గే (శైవలం) నుంచి సంగ్రహించిన ఈ మందు అల్జీమర్స్‌ వ్యాధికి ప్రపంచంలోనే కనుగొన్న      మొట్ట మొదటిది.

*జీవీ-971గా పిలుస్తున్న ఈ మందుకు నవంబర్‌ 2న అధికారికంగా చైనా ప్రభుత్వం    అనుమతులిచ్చింది. 

*ఏడాది పాటు వాడాలంటే ఒక రోగికి దాదాపు రూ.4 లక్షలు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు.

*ఈ మందును చైనాలో మెడికల్‌ ఇన్సూరెన్స్‌ జాబితాలో చేర్చే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో రీయింబర్స్‌మెంట్‌ చేసుకునే వీలు కలుగుతుంది. 

* ఆల్జీమర్స్ వల్ల మతిమరపు ముదిరి మనిషి గతాన్ని పూర్తిగా మరిచిపోతాడు. ప్రవర్తనలో కూడా చాలా మార్పు వస్తుంది. ఈ సమస్య మొదలైతే.. పెరగడమే కానీ, తగ్గడం ఉండదు. 

* ప్రపంచవ్యాప్తంగా సుమారు 4.6 కోట్ల మంది ఈ వ్యాధితో బాధడుతున్నట్లు గణంకాలు తెలుతున్నాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం.. మారుతున్న జీవనశైలి, నిద్రలేమి, ఒత్తిడి తదితర కారణాల వల్ల ఆల్జిమర్స్ బారిన పడుతున్నారని తెలిసింది.

*షాంఘై గ్రీన్‌వ్యాలీ ఫార్మాస్యూటికల్స్‌ - ప్రపంచవ్యాప్తంగా 200 కేంద్రాల్లో 2,000 మందికిపైగా అల్జీమర్స్‌ రోగులపై ఔషధ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు,ఇందుకోసం రూ.21 వేల కోట్లు (3బిలియన్‌ డాలర్లు) ఖర్చు చేయనున్నట్లు పేర్కొంది. 

*మెదడులో ఉండే నాడీ కణాల మధ్య ‘బీటా అమైలాయిడ్‌’ అనే విషతుల్య ప్రోటీన్లు పేరుకుపోతుండటం వల్ల ఆల్జిమర్స్‌ ఏర్పడతాయని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. 

*నాడీ కణాల మధ్య సమాచార ప్రసారాన్ని ఈ ప్రోటీన్లు అడ్డుకోవడం వల్ల బాధితులకు గతంలో జరిగిన విషయాలను, పదాలను, వ్యక్తులను మరిచిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. బీటా అమైలాయిడ్‌ ప్రోటీన్ల సంఖ్య పెరిగితే కొద్ది వ్యక్తిలో నిద్రలేమి సమస్య కూడా ఏర్పడుతుంది. 

*సాధారణంగా ఈ వ్యాధి 60 ఏళ్లు దాటినవారికి వచ్చేది. కానీ, ఆధునిక కాలంలో ఇది 40 ఏళ్లు దాటినవారిని కూడా ఆవహిస్తోంది. మొదట్లో చిన్న చిన్న విషయాలను మరిచిపోవడంతో ఈ వ్యాధి మొదలవుతుంది. అయితే, ఇది సాధారణమే కదా అని చాలామంది సీరియస్‌గా తీసుకోరు. ఆ తర్వాత వ్యక్తుల పేర్లను మరిచిపోవడం, పదాలు తడబటం మొదలవుతుంది.

జాతీయం 

అంధుల కొరకు మొబైల్ యాప్
*రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI అంధుల కోసం ప్రత్యేకంగా ఓ యాప్ రిలీజ్ చేసింది. ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఈ యాప్‌ను అధికారికంగా రిలీజ్ చేశారు. 

*కరెన్సీ నోట్లను గుర్తించడంలో అంధులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారంగా 'MANI' పేరుతో ఈ యాప్‌ను తయారు చేసింది ఆర్‌బీఐ. 

*'MANI' అంటే 'మొబైల్ ఎయిడెడ్ నోట్ ఐడెంటిఫయర్'. అంటే. మొబైల్ సాయంతో నోట్లను గుర్తించే యాప్ అని అర్థం.

*ఈ యాప్‌ను ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేస్తే చాలు.ఇంటర్నెట్ లేకపోయినా పనిచేస్తుంది. 
*అంధులు నోట్ల విలువను అంటే అది ఎన్ని రూపాయల నోట్ అన్న విషయం గుర్తించడానికి ఉపయోగపడుతుంది. 

*కరెన్సీ నోట్‌ను మొబైల్‌లోని కెమెరా సాయంతో స్కాన్ చేస్తే చాలు. ఎన్ని రూపాయల నోట్ అన్న విషయం తెలుస్తుంది. హిందీ, ఇంగ్లీష్‌లో ఆడియో ఔట్‌పుట్ ఉంటుంది. 

*2016 నవంబర్‌లో నోట్ల రద్దు తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 'మహాత్మా గాంధీ సిరీస్'లో రూ.10, రూ.20, రూ.50, రూ.100, రూ.200, రూ.500, రూ.2,000 విలువైన నోట్లను రిలీజ్ చేసింది. 

* ఈ కొత్త నోట్లను గుర్తించడంలో అంధులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

*వారి ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని ఈ యాప్ తయారు చేసింది ఆర్‌బీఐ. అయితే ఈ యాప్ ద్వారా ఆ నోటు ఒరిజినలో, డూప్లికేటో గుర్తించడం సాధ్యం కాదని ఆర్‌బీఐ తెలిపింది.


చైనా  జనాభా దాటనున్న భారత్

*2019 జనవరి1 న భారతదేశంలో మొత్తం 67,385 పిల్లలు జన్మించగా, ప్రపంచవ్యాప్తంగా 3,92,078 పిల్లలు పుట్టినట్లు యూనిసెఫ్‌ ఓ నివేదికలో వెల్లడించింది.

*ఈ నివేదికను పరిశీలిస్తే త్వరలోనే భారత్‌దేశ జనాభా చైనాను దాటుతుందని యూనిసెఫ్‌ అంచనా వేసింది. 

*భారత్‌తో పాటు మరో ఏడు దేశాల్లో జన్మించిన శిశువులు.. ప్రపంచవవ్యాప్తంగా పుట్టిన పిల్లల సంఖ్యకు సగంగా నమోదు అయింది. 

*చైనా(46,299), నైజిరియా(26,039), పాకిస్తాన్(6,787), ఇండోనేషియా(13,020), అమెరికా(10,452), రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో (10, 247), ఇథియోపియా(8, 493) దేశాల్లో పిల్లలు జన్మించారు. 

*అయితే ఈ ఏడాది మొదటి రోజు జన్మించిన పిల్లల సంఖ్యను గమనిస్తే చైనా కన్నా భారత్‌లోనే ఎక్కుగా నమోదైంది. 

*2019 జూన్‌లో ఐక్యరాజ్యసమితి ప్రపంచ జనాభా నివేదికను వెల్లడించిన సందర్భంలో ఇండియా జనాభా వచ్చే దశా‍బ్దకాలంలో చైనాను అధిగమిస్తుందని చెప్పింది. 

*ఏటా జనవరి 1న జన్మించిన శిశువుల గణనను యూనిసెఫ్‌​ నిర్వహిస్తుంది. ​ 

*2018లో 2.5 మిలియన్‌ శిశువులు జన్మించి మొదటి మాసంలోనే మరణించారని ఆ సంస్థ తెలిపింది. 

*అయితే ఈ పిల్లలంతా ప్రసవ సమయంలో వచ్చే సమస్యలు, అంటు వ్యాధులతో మృతి చెందారని వెల్లడించింది. 

*యూనిసెఫ్‌ ప్రకారం,గత మూడు దశాబ్దాలగా ప్రపంచవ్యాప్తంగా ఐదు సంవత్సరాలలోపు మృతిచెందిన పిల్లల సంఖ్య సగానికి తగ్గింది. 

* ప్రతి జనవరిలో యూనిసెఫ్ న్యూ ఇయర్ రోజున పుట్టిన శిశువులను లెక్కిస్తుంది. ఇది అరుదైన సంధర్భం కాబట్టి వారిని లెక్కిస్తుంది. వారి ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షిస్తుంది

ఐఆర్పీఎఫ్‌ఎస్‌ గా ఆర్పీఎఫ్‌

*రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (ఆర్పీఎఫ్‌) పేరు ఇండియన్‌ రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ సర్వీస్‌ (ఐఆర్పీఎఫ్‌ఎస్‌)గా మారింది. 

*ఆర్పీఎఫ్‌కు రైల్వేశాఖ గ్రూప్‌ 'ఏ' హోదా కల్పించడంతోపాటు పేరు మారుస్తూ ఉత్తర్వులిచ్చింది. 

*న్యాయస్థానాల ఆదేశాల మేరకు మంత్రివర్గ నిర్ణయంతో ఆర్పీఎఫ్‌కు ఆర్గనైజ్డ్‌ గ్రూప్‌ ఏ స్టేటస్‌ (ఓజీఏఎస్‌) కల్పించారు. 

* ఇకపై ఆర్పీఎఫ్‌.. ఇండియన్‌ రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ సర్వీస్‌గా మారనుంది. 

* ఆర్పీఎఫ్‌కు ఓజీఏఎస్‌ హోదా కల్పించేందుకు గత ఏడాది జూలైలోనే కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 

*ప్రభుత్వ అధికారులు అనుభవిస్తున్న ప్రయోజనాలను ఆర్పీఎఫ్‌ సిబ్బందికి సైతం కల్పించింది. 

*నాన్‌ ఫంక్షనల్‌ అప్‌గ్రెడేషన్‌ (ఎన్‌ఎఫ్‌యూ) మంజూరులోనూ ఐఆర్పీఎఫ్‌ఎస్‌ సిబ్బందికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నది. 

* 2008 నుంచి అమలవుతున్న ఎన్‌ఎఫ్‌యూ పథకం ప్రకారం.. ఐఏఎస్‌, ఓజీఏఎస్‌ అధికారులు పదోన్నతులు పొందకపోయినా వారి బ్యాచ్‌వారితో సమానంగా పేస్కేల్‌ ప్రయోజనాలు కలుగుతాయి.


త్రిభుజాకారంలో పార్లమెంట్

* కేంద్ర ప్రభుత్వం కొత్త పార్లమెంట్ భవనాన్ని త్రిభుజాకారంలో నిర్మించనుంది. 

*త్రిభుజాకార పార్లమెంటు భవనంలో నిర్మించే నూతన లోక్‌సభను దాదాపు తొమ్మిది వందల మంది కూర్చునేందుకు వీలుగా తీర్చిదిద్దుతారు. 

*త్రిభుజాకారా పార్లమెంటుకు ఎదురుగా ప్రధాన మంత్రి కొత్త కార్యాలయం, నివాసం ఉంటుంది. దాని పక్కనే కేంద్రీకృత సచివాలయాన్ని నిర్మించే ప్రతిపాదన పరిశీలనలో ఉంది. 

*ప్రస్తుతం రైల్ భవన్ ఉన్న ప్రాంతంలో ప్రధాన మంత్రి నూతన కార్యాలయం, నివాస భవనాల నిర్మాణం జరగవచ్చు. 

*ప్రస్తుత పార్లమెంటు భవనంలోని వాహనాలు నిలిపే ప్రాంతంలో కొత్త పార్లమెంటు భవనాన్ని త్రిభుజాకారంలో నిర్మిస్తారు. 

*రాజ్‌పథ్‌లోని వ్యవసాయం, సమాచార తదితర శాఖల భవనాలను కూల్చివేసి అక్కడ కేంద్రీకృత సచివాలయ భవనాన్ని కట్టాలనుకుంటున్నారు. 

*ఎనిమిది అంతస్థులతో నిర్మించే నూతన సచివాలయం ఆత్యంత ఆధునికంగా ఉంటుంది. 

* నూతన త్రిభుజాకార పార్లమెంట్ ముందు 75 సంవత్సరాల స్వాతంత్య్ర దినోత్సవ జ్ఞాపికగా ఒక దిగ్గజ స్థూపాన్ని (ఐకానిక్ టవర్) నిర్మించే ప్రతిపాదన పరిశీలనలో ఉంది. 

*. రాష్టప్రతి భవనం ఎదురుగా ఉన్న రాజ్‌పథ్ (సెంట్రల్ విస్టా) ఉన్న దాదాపు రెండున్నర కిలోమీటర్ల రోడ్డు ప్రాంతాన్ని నూతన భారత దేశానికి చిహ్నంగా రూపాంతరం చేయనున్నారు. 

*ఈ నిర్ణయానికి అనుగుణంగా రాజ్‌పథ్ రోడ్డు, దానికి ఇరుపక్కల ఉన్న భవనాలను కూల్చివేసి వాటి స్థానంలో దేశ సంస్కృతికి అద్దం పట్టే కట్టడాలను నిర్మించే ప్రతిపాదనలు సిద్ధవౌతున్నాయి. 

* ఈ నిర్మాణ ప్రతిపాదనల ప్రకారం త్రిభుజకార పార్లమెంటుతోపాటు పలు దిగ్గజ భవనాలు, స్థూపాన్ని నిర్మించనున్నారు. 

* రాష్టప్రతి భవన్ ముందు భాగంలో ఇరువైపుల ప్రధాన మంత్రి కార్యాలయం, రక్షణ, ఆర్థిక, హోం శాఖల భవనాలుండే సౌత్ బ్లాక్ నార్త్ బ్లాక్‌లను ప్రదర్శన శాలలుగా మార్చనున్నారు. 

*. త్రిభుజాకార నూతన పార్లమెంటు, కేంద్ర సచివాలయం, మంత్రుల శాఖా కార్యాలయాల మధ్య రాకపోకల కోసం భూగర్భ రైల్‌ను ఏర్పాటుచేసే ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉన్నది. 

*నార్త్‌ బ్లాక్‌ (ప్రస్తుతం ఆర్థిక, హోంశాఖలున్నాయి), సౌత్‌ బ్లాక్‌ (ప్రస్తుతం పీఎంవో, రక్షణ, విదేశీ వ్యవహారాల శాఖలున్నాయి)లను 2 మ్యూజియాలుగా మార్చుతారు. 1857కు ముందు భారత్‌ను ఒకదానిలో, ఆ తర్వాతి భారత్‌ను మరోదానిలో ఆవిష్కరిస్తారు. 

*రైల్‌ భవన్‌, శాస్త్రి భవన్‌, వాయు భవన్‌ సహా పలు భవనాలను కూల్చివేస్తారు. వాటి స్థానంలో రాజ్‌పథ్‌ వెంబడి 2024 కల్లా 8 అంతస్థులతో కూడిన 10 నూతన భవనాలను నిర్మిస్తారు. 

*వాటి ఎత్తు ఇండియా గేట్‌ కంటే తక్కువగా ఉంటుంది. కొత్తగా నిర్మించే కేంద్ర ఉమ్మడి సచివాలయం దాదాపు లక్ష మంది ఉద్యోగులు విధులు నిర్వర్తించేందుకు వీలుగా ఉంటుంది.

భారత్ పాక్ - 'అణుస్థావరాల సమాచార మార్పిడి'

*భారత్‌, పాకిస్థాన్‌ మధ్య 'అణుస్థావరాల సమాచార మార్పిడి' సంప్రదాయం ఈ ఏడాది కూడా కొనసాగింది. 

*జనవరి 1న ఈ సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటుండగా.. 2019,జనవరి 1వ తేదీన కూడా ఇరుదేశాలు సమాచారాన్ని పంచుకున్నాయి. 

*సమాచార మార్పిడి ఒప్పందం 1991 జనవరి 27 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ ఒప్పందం పై 1998 లో సంతకం చేశారు. 

*ఈ ఒప్పందం ప్రకారం ఇరు దేశాలు తమ తమ దేశాల్లో ఉన్నఅణు స్థావరాల జాబితాను పంచుకుంటాయి. 

*1992 జనవరి 1న మొదటిసారి అణుస్థావరాల జాబితాను పరస్పరం ఇచ్చిపుచ్చుకోగా, ప్రస్తుతం 29వ సారి సమాచార మార్పిడి జరిగింది. 

* కశ్మీర్‌ విభజన అనంతరం దౌత్యసంబంధాల విషయంలో ఏర్పడిన ఉద్రిక్తతల మధ్య ఇరుదేశాలు అణుస్థావరాల సమాచారం మార్చుకోవడం కీలకంగా మారింది. 

* మరోవైపు ఇరుదేశాల్లోని జైలుల్లో ఉన్న తమ దేశ పౌరుల జాబితాను కూడా భారత్‌-పాక్‌ ఇచ్చిపుచ్చుకున్నాయి. 

*తమ జైళ్లల్లో పాకిస్థాన్‌కు చెందిన 267 మంది పౌరులు, 99 మంది మత్స్యకారులు భారత్ పేర్కొంది.

* తమ జైళ్లల్లో 55 మంది భారత పౌరులు, 227 మంది మత్స్యకారులు ఉన్నారని పాక్‌ తెలిపింది.



చంద్రయాన్-3,గగన్ యాన్
1.చంద్రయాన్ 3---చంద్ర మిషన్‌ చంద్రయాన్‌-2 తర్వాత, కొన్ని నెలల వ్యవధిలోనే చంద్రయాన్‌-3 ప్రాజెక్టును ప్రారంభించడానికి ఇస్రో ప్రయత్నాలు మొదలు పెట్టింది. 

* ఇస్రో చీఫ్‌ కె. శివన్‌ 

*చంద్రయాన్‌-3 ప్రాజెక్టు అయితే అనుకున్న సమయానికి కాకుండా 14-16 నెలలు ఆలస్యంగా 2021 నాటికి పూర్తి అయ్యే అవకాశం ఉంది. 

* చంద్రయాన్‌ -3కి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 

* 2020లో చంద్రయాన్‌-3ని ప్రయోగం జరుగుతుందని గతంలో ఇస్రో ప్రకటించింది. 

* ఇందులో ల్యాండర్‌, రోవర్‌, ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ ఉంటాయి. ఇందులో పరికరాలకు రూ.250 కోట్లు కాగా, ప్రయోగానికి మరో రూ.365 కోట్లు. 

*చంద్రయాన్‌-2 ఆర్బిటార్‌ చాలాబాగా పని చేయడం వల్ల, చంద్రయాన్‌-3కి కూడా వినియోగించుకోనున్నారు. 

* చంద్రయాన్‌-2లో భాగంగా చంద్రుడిపై సున్నితంగా దిగడంలో విఫలం చెందిన నేపథ్యంలో మరోసారి చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండర్‌ను దింపాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకున్నది. 

*చంద్రయాన్‌-3కి సంబంధించి రెండో స్పేస్‌పోర్ట్‌కు అవసరమైన భూమిని సేకరిస్తున్నారు, ఇది తమిళనాడులోని తూతుకుడి వద్ద ఏర్పాటు కానుంది.ఈ స్పేస్ పోర్ట్ నిర్మాణ వ్యయం రూ.250 కోట్లు.దక్షిణ భారతదేశంలోని భౌగోళిక అనుకూలతల నుంచి ప్రయోజనం పొందేందుకే అక్కడ లాంచ్‌ప్యాడ్‌ను ఏర్పాటు చేస్తున్నారు.అక్కడినుంచి మొదట ఎస్‌ఎస్‌ఎల్వీ (స్మాల్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికిల్‌) రాకెట్లను, భవిష్యత్తులో భారీ రాకెట్లను ఉపయోగిస్తారు.మరోవైపు 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.14వేల కోట్లు కేటాయించాలని కేంద్రానికి ఇస్రో ప్రతిపాదించనున్నది. 

*ఇస్రో అభివృద్ధి చేసిన స్వదేశీ జీపీఎస్‌ 'నావిక్‌'కు సంబంధించిన చిప్‌లను ఫోన్‌లలో అమర్చేందుకు ఇస్రో, చైనాకు చెందిన ఫోన్ల కంపెనీ షియోమి మధ్య జరుగుతున్న చర్చలు తుది దశకు చేరుకున్నాయి. ఈ చిప్‌లను క్వాల్‌కమ్‌ సంస్థ తయారుచేస్తుంది. 

*చంద్రయాన్ 3ప్రాజెక్ట్ వ్యయం- రూ.615 కోట్లు . 2.గగన్‌యాన్‌--- 

*మానవసహిత అంతరిక్ష యాత్ర 'గగన్‌యాన్‌' కోసం భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్‌) చెందిన నలుగురిని ఇస్రో ఎంపిక చేసింది. వారంతా పురుషులే. 

*వారిని శిక్షణ కోసం రష్యాకు పంపనున్నారు.

*ప్రధానంగా మానవ రహిత వ్యోమనౌకను ఈ ఏడాదిలోనే అంతరిక్షంలోకి ప్రయోగాత్మకంగా పంపనున్నారు. 

* గగన్‌యాన్‌ ప్రాజెక్టును ప్రధాని మోదీ 2018 ఆగస్టు 15 ప్రసంగంలో ప్రకటించారు. 

* 2022 నాటికి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అంతరిక్షంలోకి తొలి భారతీయుడిని పంపనున్నారు. 

* ఈ ప్రాజెక్టుకు సహకారం అందించేలా భారత్‌, రష్యా, ఫ్రాన్స్‌ మధ్య గతంలో ఒప్పందం కుదిరింది. 

* పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో దీనిని చేపట్టనున్నారు.

మత్స్య రంగం పథకాల అమలు
*మత్స్య రంగానికి వివిధ పథకాలతో రాష్ర్టాలకు కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తున్న కోట్లాది రూపాయలను రాష్ట్రాలు సరిగా ఖర్చు చేయడం లేదు. 

* ఖర్చుచేసిన నిధులకు వినియోగపత్రాలు(యూసీ) సమర్పించని రాష్ర్టాలు కూడా ఉన్నాయి. 

*మత్స్యరంగం సమగ్రాభివృద్ధి కోసం వివిధ పథకాల్లో 75:25, 60:40 నిష్పత్తిలో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు నిధులను భరించాల్సి ఉంది. 

* ఆ మేరకు అనేక రాష్ర్టాలు తమ వాటా కింద నిధులు జమ చేయకపోగా, కేంద్రం ఇచ్చిన నిధులను మత్స్య రంగాభివృద్ధికి ఖర్చు చేయకుండా, ఇతర పద్దులకు బదలాయిస్తున్నాయి. 

*కేంద్ర పథకాలకు నిబంధనల మేర కు రాష్ర్టాలు తమ వాటా నిధులు ఇవ్వకపోతే ఈ పథకాలు విఫలం దిశగా వెళ్తాయని కేంద్ర వ్యవసాయశాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘం కేంద్రానికి తాజాగా సమర్పించిన నివేదికలో పేర్కొంది. 

* పీసీ గడ్డి గౌదార్‌ నేతృత్వంలోని ఈ కమిటీ పై అంశాలను పేర్కొంది. 

* గతేడాది అక్టోబరు 29 వరకు రూ.599.40 కోట్ల వరకు యూసీలు పెండింగ్‌లో ఉన్నాయి. 

* యూసీలు సమర్పించని రాష్ర్టాలలో తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, బిహార్‌ తొలి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. 

* నిధుల కేటాయింపు విధానంలో మార్పులు తీసుకురావాలని, 75:25, 80:20 నిష్పత్తిలో కేటాయింపు ఉండాలనిసూచించింది.


మరోసారి లక్ష దాటిన జీఎస్టీ వసూళ్లు
*జీఎస్‌టీ వసూళ్లు మళ్లీ రూ.లక్ష కోట్లు దాటాయి. గత ఏడాది డిసెంబర్‌ నెలలో జీఎస్‌టీ కింద రూ.1,08,184 కోట్లు వసూలయ్యాయి. 

* 2018 డిసెంబరులో వసూలైన రూ.94,728 కోట్లతో పోలిస్తే ఇది 16 శాతం రూ.8274 కోట్లు ఎక్కువ. 

*2019లో జీఎస్‌టీ వసూళ్లు రూ.లక్ష కోట్లు దాటడం వరుసగా ఇది రెండో నెల గత ఏడాది నవంబర్‌ నెలలో జీఎస్‌టీ వసూళ్లు రూ.1,08,492 కోట్లకు చేరాయి. 

* గత ఏడాది డిసెంబరు నెలలో వసూలైన రూ.1,08,184 కోట్ల జీఎస్‌టీ రూ.19,962 కోట్లు సీజీఎస్‌టీ రూ.26,792 కోట్లు ఎస్‌జీఎస్‌టీ రూ.48,099 కోట్లు ఐజీఎస్‌టీ రూ.8,331 కోట్లు సెస్సు ద్వారా వసూలయ్యాయి. 

*జీఎస్‌టీ వసూళ్లు వరుసగా రెండు నెలలపాటు రూ.లక్ష కోట్లు దాటడంతో వినియోగ డిమాండ్‌ పెరుగుతున్నట్టు చెప్పవచ్చు. 

* ప్రస్తుతం జీడీపీ వృద్ధి రేటు తగ్గడానికి, పెట్టుబడుతలోపాటు వినియోగ డిమాండ్‌ తగ్గడం ప్రధాన కారణం. 
*2019-20 ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ వసూళ్లు వరుసగా ఏప్రిల్‌లో రూ.1,13,865 కోట్లు, మేలో రూ.1,00,289 కోట్లు, జూన్‌లో రూ.99,939 కోట్లు, జూలైలో రూ.1,02,083 కోట్లు ఆగస్ట్‌లో రూ.98,202 కోట్లు, సెప్టెంబర్‌లో రూ.91,916 కోట్లు, అక్టోబర్ నెలలో రూ.95,380 కోట్లు, నవంబర్‌లో రూ.1,03,492 కోట్లు, డిసెంబర్‌లో రూ.1.03,184 కోట్లు వసూలయ్యాయి.


No comments:

Post a Comment