Current Affairs in Telugu 27th December 2019

అంతర్జాతీయం 


పౌరసత్వ చట్టం పై అమెరికా సంస్థ నివేదిక

*పౌరసత్వ చట్టం పై అమెరికాకు చెందిన 'కాంగ్రెషనల్‌ రీసెర్చి సర్వీస్‌'--ప్రతిపాదిత జాతీయ పౌర పట్టికతో కలిపి అమలు చేయడం వల్ల భారత్‌లోని ముస్లిం వర్గంపై ప్రభావం పడే అవకాశం ఉందని అమెరికాకు చెందిన 'కాంగ్రెషనల్‌ రీసెర్చి సర్వీస్‌'(సీఆర్‌ఎస్‌) అభిప్రాయపడింది. 
* ఈ మేరకు రూపొందించిన ఓ నివేదికను కాంగ్రెస్‌ సభ్యులకు కమిటీ అందజేసింది. 
*భారత చరిత్రలో తొలిసారి మతం ఆధారంగా పౌరసత్వం కల్పిస్తున్నారని నివేదిక పేర్కొంది. 
* సీఆర్‌ఎస్‌ అనేది యూఎస్‌ కాంగ్రెస్‌కు చెందిన స్వతంత్ర్య అధ్యయన విభాగం. 
* ప్రాముఖ్యత సంతరించుకున్న దేశీయ, అంతర్జాతీయ అంశాలపై అధ్యయనం చేసి ఈ కమిటీ కాంగ్రెస్‌ సభ్యులకు నివేదికలు సమర్పిస్తుంటుంది. 
*వీటిని కాంగ్రెస్‌ అధికారిక నివేదికలుగా మాత్రం పరిగణించదు. 
*1955 నాటి పౌరసత్వ సవరణ చట్టానికి పలు సార్లు సవరణలు చేశారని.. కానీ ఎప్పుడూ మతాన్ని ప్రాతిపదికగా తీసుకోలేదని సీఆర్‌ఎస్‌ పేర్కొంది. 
*తాజా సవరణ భారత రాజ్యాంగంలో అధికరణ 14, 15ని సవాల్‌ చేసేలా ఉంది అని ఈ నివేదిక పేర్కొంది. 
* సీఏఏపై ప్రభుత్వ వాదనను కూడా సీఆర్‌ఎస్‌ నివేదికలో పేర్కొంది. బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌లో ముస్లింలు ఎలాంటి హింసకు గురికావడం లేదని అందుకే వారికి పౌరసత్వం కల్పించడం లేదన్న సీఏఏ మద్దతుదారుల వాదనని కూడా నివేదిక పొందుపరిచింది. 
* తాజా చట్టం వల్ల దేశంలోని ఏ ఒక్క పౌరుడూ పౌరసత్వం కోల్పోరన్న ప్రభుత్వ హామీని కూడా నివేదికలో పొందుపరిచారు.




























జాతీయం 
  

యూపీఎస్సీ ద్వారా రైల్వే నియామకాలు
*రైల్వేలో ఎనిమిది వేర్వేరు సర్వీసులను కలిపి 'ఇండియన్‌ రైల్వే మేనేజ్‌మెంట్‌ సర్వీస్‌' (ఐఆర్‌ఎంఎస్‌)ను ప్రభుత్వం తీసుకురానుంది అందులో భాగంగానే ఇకపై నూతన నియామకాలను యూపీఎస్‌సీ సివిల్‌ సర్వీసు పరీక్షల ద్వారానే చేపట్టనున్నారు. 
* రైల్వేబోర్డు ఛైర్మన్‌ వి.కె.యాదవ్‌ 
* రైల్వే సేవల్లోకి రాదలచుకున్నవారు యూపీఎస్సీకి హాజరయ్యేవారి తరహాలో ప్రిలిమ్స్‌ రాసి, ఆ తర్వాత ఐఆర్‌ఎంఎస్‌లోని అయిదు ప్రత్యేక సేవల్లో ఏది కావాలో తెలపాల్సి ఉంటుంది. 
* ఈ అయిదింటిలో నాలుగు (సివిల్‌, మెకానికల్‌, టెలికాం, ఎలక్ట్రికల్‌) సాంకేతికమైనవి, ఒకటి మాత్రం సాంకేతికపరమైనది. 
* ఇంజినీరింగ్‌తో సంబంధం లేని విభాగంలో తీసుకోబోయేవారిని అకౌంట్స్‌, ట్రాఫిక్‌, పర్సనల్‌ సర్వీస్‌కు వినియోగించుకుంటారు. 
*తొలివిడత నియామకాలు 2021లో జరుగుతాయి. 
*రైల్వేబోర్డు ఛైర్మన్‌/ సీఈవోగా మాత్రం ఇండియన్‌ రైల్వే సర్వీస్‌ అధికారే ఉంటారు. 
* అత్యంత అనుభవజ్ఞులైన కొంతమంది... స్వతంత్ర నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ సభ్యులుగా ఉంటారు.



హైదరాబాద్ - ముంబై బుల్లెట్ రైలుకు ప్రతిపాదన
*ముంబై, హైదరాబాద్‌ మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించేలా రైల్వే శాఖ ప్రయత్నిస్తోంది. 
* ఈ చర్యల్లో భాగంగా, ముంబై నుంచి హైదరాబాద్‌ల మధ్య బుల్లెట్ రైలును నడపనుంది. 
*ఈ ప్రాజెక్టు అమలు సాధ్యాసాధ్యాలపై డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) తయారీకి ఆదేశించింది. ఇందుకోసం రూ.7 కోట్ల నిధులను కూడా కేటాయించింది. 
*సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారై, ఆపై బోర్డు రివ్యూ మీటింగ్ జరిగితే, రెండు నగరాల మధ్యా హై స్పీడ్ రైల్వే కారిడార్‌కు కేంద్రం అనుమతి ఇస్తుంది. 
*దేశంలో తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టుగా ముంబై - అహ్మదాబాద్ మధ్య వచ్చే సంవత్సరం నుంచి పనులు ప్రారంభం కానున్నాయి. 
* ఇదే తరహాలో దేశంలో మరో ఐదు హై స్పీడ్ రైల్ ప్రాజెక్టులను చేపట్టాలని రైల్వేశాఖ భావిస్తోంది. 
*వీటిలో సికింద్రాబాద్ నుంచి నాగపూర్ మధ్య సెమీ హై స్పీడ్ రైల్ లైన్‌కు సహకరించేందుకు రష్యన్ రైల్వేస్‌కు చెందిన జాయింట్ స్టాక్ కంపెనీ అంగీకరించింది. 
*దేశంలో హై స్పీడ్ కారిడార్ల పనులను పర్యవేక్షించేందుకు నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ గతంలో ఏర్పాటు అయింది. 
* హైదరాబాద్ - ముంబై మధ్య హై స్పీడ్ రైల్ కారిడార్ మొత్తం 711 కిలోమీటర్ల మేర ఏర్పాటు కానుంది. పూణె మీదుగా రైల్వే లైన్ సాగుతోంది. 
* డీపీఆర్ రెడీ అయిన తర్వాత దాన్ని రైల్వే బోర్టు సమీక్ష కోసం పంపాల్సివుంటుంది. అక్కడి నుంచి కేంద్రానికి వెళ్లే డీపీఆర్‌కు ఆమోదం లభిస్తే, నిధుల కేటాయింపు జరుగుతుంది. 
*ఈ ప్రాజెక్టు 2023 నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. 
*బుల్లెట్ రైళ్ల వేగం- 320 km/h

ఇస్రో శాస్త్రవేత్తకు నష్టపరిహారం
*చట్టవిరుద్దమైన అరెస్టు, పోలీసు కస్టడీలో వేధింపులకు గురైన ఇస్రో మాజీ శాస్త్రవేత్త ఎస్.నంబి నారాయణన్‌కు రూ.1.3 కోట్లు నష్టపరిహారం ఇచ్చేందుకు కేరళ సూత్రప్రాయంగా ఆమోదించింది. 
*1990 కేరళలో నంబి నారాయణన్ ఐస్రో గూఢచర్యానికి పాల్పడ్డారన్న అభియోగాలు ఎదుర్కొన్నారు. 
*ఈ కేసులో ఆయన క్లీన్ చిట్ పొందటంతో..తనకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ తిరువనంతపురంలోని కోర్టులో ఇటీవల పిటిషన్ వేశారు. 
*కేసు నేపథ్యం -1994 నవంబర్ నాటి కేసు ఇది. గూఢచర్యానికి పాల్పడి, ఇస్రోకు చెందిన కీలక రహస్యాలను పాకిస్థాన్‌కు అమ్ముకున్నారంటూ ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. 
*ఆ తర్వాత సీబీఐ కోర్టు, 1998లో సుప్రీంకోర్టు ఆయనను నిర్దోషిగా తెల్చినప్పటికీ అప్పటికే ఆయన తన సహచర శాస్త్రవేత్తలైన డి.శివకుమార్, మరో నలుగురితో కలిసి 50 రోజుల పాటు జైలులో ఉన్నారు. 
*నంబి నారాయణన్‌ అనవసరంగా అరెస్టు చేశారని, వేధింపులకు గురి చేశారని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొనడంతో పాటు ఆయనపై ఉన్న ఆరోపణలను కొట్టివేసింది. 
*ఈ ఏడాది నంబి నారాయణన్‌కు పద్మభూషణ్ అవార్డును భారత ప్రభుత్వం ప్రకటించగా, ఆ అవార్డును ఆయన స్వీకరించారు. 
*తనకు నష్ట పరిహారం చెల్లించాల్సిందిగా కోరుతూ ఆయన స్థానిక కోర్టును ఆశ్రయిచడం, కోర్టు సైతం ఆయనకు నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించడంతో కేరళ కేబినెట్ ఎట్టకేలకు రూ.1.3 కోట్లు చెల్లించేందుకు ఆమోదించింది.

ఇళయరాజాకు 'హరివరాసనం' పురస్కారం
* ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా కు మరో అరుదైన గౌరవ దక్కింది. కేరళ ప్రభుత్వం ప్రతిష్టాత్మక 'హరివరాసనం' పురస్కారాన్ని ఆయనకు ప్రకటించింది. 
*వచ్చే నెల 15వ తేదీన శబరిమలైలో ఇళయరాజాకు పురస్కారాన్ని ప్రదానం చేయనుంది. 
*ఇప్పటికే ఎన్నో పురస్కారాలు, సత్కారాలు పొందారు. భారత ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మక పద్మవిభూషణ్‌ పురస్కారాన్ని అందుకున్నారు. 
*అయితే, శబరిమల కొండపై నెలకొన్న అయ్యప్పను మేలుకొలిపే 'హరివరాసనం' పాటను ఎంతో భక్తితన్వయత్వంపై ఇళయరాజా పాడటం.. విశేషమైన ప్రాచుర్యం పొందింది.

భారత బాక్సర్ సుమిత్ ఫై ఏడాది నిషేధం
*భారత బాక్సర్‌ సుమీత్‌ సాంగ్వాన్‌పై జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ (నాడా) ఏడాది పాటు నిషేధాన్ని విధించింది. 
*ఈ ఏడాది అక్టోబర్‌ నెలలో అతడి నమూనాలను సేకరించి పరీక్షించగా.. ప్రపంచ డోపింగ్‌ నిరోధక సంస్థ (వాడా) నిషేధిత జాబితాలో ఉన్న ''ఎసిటజోలమైడ్‌'' ఉన్నట్లు తేలింది. 
* ''ఎలైట్‌ మెన్‌ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొంటున్నప్పుడు అక్టోబర్‌ 10న అతడి నమూనాలను సేకరించి, పరీక్షించగా డోప్‌ పరీక్షలో 'ఎసిటజోలమైడ్‌' అనే ఉత్ప్రేకం ఉందని తేలింది. 
*దీంతో ఆర్టికల్‌ 10.5.1 ప్రకారం అతడిపై ఏడాది పాటు నిషేధం విధించారు. 
* దీంతో 91 కేజీల విభాగంలో ఒలింపిక్స్‌ అర్హత పోటీలకు నిర్వహించే ట్రయల్స్‌కు సుమీత్‌ దూరమయ్యాడు. 2017 ఆసియా ఛాంపియన్‌షిప్‌లో అతడు రజతం సాధించాడు. 
*'నాడా' డైరెక్టర్‌ జనరల్‌ నవీన్‌ అగర్వాల్‌. 
*బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి జాతీయ డోపింగ్‌ నిరోధక వ్యవస్థ (నాడా) ప్రచారకర్తగా నియమించబడ్డాడు.

ఆర్థిక మందగమనం వల్ల 2.8లక్షల కోట్ల నష్టం
*భారత ఆర్థిక వ్యవస్థ నెమ్మదించడం వల్ల దేశానికి 2.8లక్షల కోట్ల నష్టం వాటిల్లనున్నట్లు ఓ అంచనా తెలిపింది. 
*ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ యొక్క తాజా అంచనా ప్రకారం... భారతదేశం యొక్క పొటెన్షియల్ జీడీపీ ఏడు శాతానికి చేరుకుంటుంది. 
*అయితే అనేక ఏజెన్సీల అంచనాలు 5% వృద్ధిని చూపుతున్నాయి. 
*ఆర్థిక వ్యవస్థ పూర్తి సామర్థ్యంతో లేదా ఏడు శాతంతో పనిచేస్తుంటే, 2020 జీడీపీ సంపూర్ణ సంఖ్యలో రూ .150.63 లక్షల కోట్లు ఉండాలి. 
*అయితే ఐదుశాతం వృద్ధి అంచనా ప్రకారం జీడీపీ సంపూర్ణ సంఖ్యలో రూ.147.81 లక్షల కోట్ల రూపాయల దగ్గర ఉండనుంది. 
*ఇది అదనపు ఆర్థిక కార్యకలాపాల్లో రూ .2.8 లక్షల కోట్ల నష్టానికి దారితీస్తుంది. 2019 ఆర్థికసంవత్సరంలో వాస్తవ జీడీపీ రూ. 140.78 లక్షల కోట్లు. 
*2019-20 రెండవ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 4.5 శాతానికి మందగించింది. వినియోగ వస్తువుల ఉత్పత్తి వృద్ధి వాస్తవంగా ఆగిపోయింది. 
*పెట్టుబడి వస్తువుల ఉత్పత్తి పడిపోతోంది. 
*ఎగుమతులు, దిగుమతులు, ప్రభుత్వ ఆదాయాల సూచికలు ప్రతికూల పరిస్థితులకు దగ్గరగా ఉన్నాయి.

రాష్ట్రీయం 
విశాఖలో కంటైనర్ నౌకలు
*విశాఖపట్నం నుంచి యూరోపియన్‌ దేశాలకు నౌకా వాణిజ్యం క్రమంగా పెరుగుతోంది. 
*భారత్‌లోని తూర్పు తీర రాష్ట్రాల నుంచి ఆయా దేశాలకు ఎగుమతులు జరుగుతున్నా.. సంబంధిత ప్రక్రియ నేరుగా ఉండేది కాదు. 
*తొలుత కంటైనర్లను సింగపూర్‌, శ్రీలంక దేశాల్లోని నౌకాశ్రయాలకు తరలించి.. అక్కడి నుంచి వేరే నౌకల ద్వారా రవాణా చేయాల్సి వచ్చేది. 
*ఇందుకు పది రోజుల సమయం పట్టడంతో పాటు ఇతర నౌకాశ్రయాల్లో సేవల వినియోగానికి అదనపు ఖర్చులుండేవి. 
*సరకు నాణ్యతపైనా ప్రభావం చూపుతుండేది. 
*ఈ ఇబ్బందులను అధిగమించేందుకు తక్కువ రవాణా వ్యయంతో ఆయా దేశాలకు సరకు ఎగుమతి చేసేలా నౌకాశ్రయ ఉన్నతాధికారులు ప్రణాళికలు రచించారు. 
*దీనిలో భాగంగా పలు నౌకాయాన సంస్థలతో మాట్లాడి రుసుములను తగ్గించారు. 
*విశాఖ నుంచి యూరోపియన్‌ దేశాలకు ఫెర్రోఎల్లాయ్‌, జీడిపప్పు, రొయ్యలు, సముద్ర, వ్యవసాయ ఉత్పత్తులు, అల్యూమినియం, ఉక్కు తదితరాలు ఎగుమతి అవుతుంటాయి. 
*విదేశాల్లో ఇటీవల కాలంలో ఫెర్రోఎల్లాయ్‌ ఉత్పత్తుల వాడకం బాగా పెరిగింది. సముద్ర ఉత్పత్తుల ఎగుమతులూ 22 శాతం పెరిగాయి. 
*ఈ నేపథ్యంలో ఎగుమతుల కోసం ప్రస్తుతం వారానికి 400 కంటైనర్ల వరకు అవసరమవుతున్నాయి. హపెగ్‌లాయిడ్‌, ఒ.ఒ.సి.ఎల్‌., ఎ1 తదితర సంస్థలు సైతం సరకు రవాణా ప్రారంభించాయి. 
* విశాఖ కంటైనర్‌ టెర్మినల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (వీసీటీపీఎల్‌) నుంచి ఇప్పటికే మూడు నౌకలు ఆయా దేశాలకు సరకును తీసుకెళ్లాయి. 
*సరకు రవాణాకు అనుకూలమైన పరిస్థితులు కల్పించేందుకు రాయితీలు ఇస్తున్నారు.

ఆంధ్ర ప్రదేశ్ క్యాబినెట్ నిర్ణయాలు
*ఆంధ్ర ప్రదేశ్ క్యాబినెట్ నిర్ణయాలు- డిసెంబర్ 27 కేబినెట్ కీలక నిర్ణయాలు:
 1) అమరావతిలో భూదందాపై న్యాయ నిపుణులతో చర్చ 
2) ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై సీబీఐ విచారణకు కేబినెట్ ఆమోదం
 3) సీఆర్‌డీఏలో జరుగుతోన్న అక్రమాలపై చర్యలు
 4) పంచాయితీరాజ్ ఎన్నికల నిర్వహణకు కేబినెట్ ఆమోదం
 5) పంచాయితీరాజ్ ఎలక్షన్స్‌కు రిజర్వేషన్లు ఖరారు
 6) ఎస్టీలకు 6.77 శాతం, ఎస్సీలకు 19.08 శాతం, బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు
 7) 108 ఆంబెలెన్స్ సర్వీసుల్లో ఎన్నో సమస్యల పునరుద్ధరణ 
8) 412 కొత్త 108 వాహనాలు, 656 కొత్త 104 వాహనాల కొనుగోలుకు కేబినెట్ ఆమోదం
 9) 341 శాశ్వత పంట కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయం 
10) ప్రతీ ఏడాది పసుపు, మిర్చి, ఉల్లి, చిరుధాన్యాల పంటలకు మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని నిర్ణయం
 11) మచిలీపట్నం పోర్టును ప్రభుత్వమే నిర్మించేందుకు ఎస్‌పీవీ ఏర్పాటు. రూ.11,900 కోట్లతో ఆరు దశల్లో మచిలీపట్నం పోర్టు అభివృద్ధి. విభజన చట్టంలో భాగంగా రూ.10,900 కోట్లతో రామయపట్నం పోర్టు 
12) రాజధానిపై హైలెవల్ కమిటీ ఏర్పాటు
 13) జీఎన్ రావు, బీసీజీ నివేదికల పరిశీలనకు కమిటీ
 14) హైపవర్ కమిటీ నివేదిక వచ్చిన తర్వాతే రాజధానిపై నిర్ణయం


No comments:

Post a Comment