అంతర్జాతీయం
ఇరాక్ లోని అమెరికా సైనిక స్థావరాలపై దాడి
*అగ్రశ్రేణి సైనిక జనరల్ ఖాసిం సులేమానీ హత్యకు ప్రతీకారంగా అమెరికాపై ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది.
*పక్కనే ఉన్న ఇరాక్‌లోని అమెరికా, దాని నాటో మిత్రదేశాల సైనిక స్థావరాలపై బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసింది.
*బగ్దాద్‌కు పశ్చిమాన ఉన్న ఇర్బిల్, అల్ అసద్ స్థావరాల మీద 22 బాలిస్టిక్ క్షిపణులు వచ్చి పేలినట్లు, దాదాపు 80 మంది 'అమెరికా ఉగ్రవాదులు' మరణించినట్లు, మరో 200 మంది గాయపడ్డట్లు ఇరాన్ ప్రకటించింది.
*1979లో టెహరాన్‌లోని అమెరికా రాయబార కార్యాలయాన్ని స్వాధీనపరుచుకున్నాక అగ్రరాజ్యంపై ఇరాన్ చేసిన అతి పెద్ద దాడి ఇదే.
*ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడుల నేపథ్యంలో ఒక్క అమెరికన్‌కు కూడా హాని కలగలేదని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.
*ఇరాన్ కు అణ్వాయుధాలు లభించకుండా చర్యలు చేపడుతున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు.
చరిత్రలో రెండవ వేడి సంవత్సరంగా
*చరిత్రలోనే అత్యంత ఉష్ణోగ్రతలు నమోదైన రెండో సంవత్సరంగా 2019 నిలిచింది.
*ఈ వివరాలను యూరోపియన్ యూనియన్ (ఈయూ) భూతాప పర్యవేక్షణ సంస్థ 'కోపర్నికస్ క్లైమెట్ చేంజ్ సర్వీస్ (సీ3ఎస్) జనవరి 8వ తేదీన వెల్లడించింది.
*ఇప్పటివరకూ ఉన్న చరిత్రలో అత్యంత వేడి సంవత్సరంగా 2016 రికార్డు సృష్టించింది.
*ఎల్‌నినో కారణంగా ఆ ఏడాది ఉష్ణోగ్రతలు ఏకంగా 0.12 డిగ్రీల సెల్సియస్ పెరిగాయి.
*2019లో దానికన్నా 0.04 డిగ్రీల సెల్సియస్ తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
*1981-2010 వ్యవధికి సంబంధించిన సగటుతో పోల్చుకుంటే ఇది 0.6 డిగ్రీల సెల్సియస్ అధికం. *పారిశ్రామీకరణకు ముందున్న కాలంతో పోలిస్తే గత ఐదేండ్లలో ఉష్ణోగ్రతలు 1.1-1.2 డిగ్రీల సెల్సియస్ పెరిగాయి.
* మరోవైపు, యూరప్‌లో గతేడాది అత్యంత వేడి సంవత్సరంగా నిలిచింది.
*వాతావరణంలోకి కర్బన ఉద్గారాల విడుదల పెరుగడం వల్లే 2019 మరో అసాధారణ వేడి సంవత్సరంగా నిలిచింది.
*2030 నాటికి ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 సెల్సియస్ డిగ్రీలకు కట్టడి చేయాలంటే ప్రతియేటా కర్బన ఉద్గారాల విడుదలను 7.6 శాతం మేర ఐక్యరాజ్యసమితి నిర్ణయించింది.
*ఆస్ట్రేలియా అడవుల్లో కార్చిచ్చు, ఇండోనేషియాలో పదుల సంఖ్యలో ప్రజల మృతికి కారణమైన వరదల వంటి ప్రకృతి విపత్తులకు భూతాపమే కారణమని సీ3ఎస్ పేర్కొంది.
మలేషియా మాస్టర్ బ్యాడ్మింటన్ టోర్నీలో సింధు, నెహ్వాల్
*భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-500 మలేషియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో తొలి రౌండ్లో విజయాలు సాధించారు.
*జనవరి 8వ తేదీన జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ చాంపియన్, ఆరోసీడ్ సింధు 21-15, 21-13తో రష్యాకు చెందిన ఎవ్‌గెని కొసెత్సకయాను 35 నిమిషాల్లోనే ఓడించారు.
*మరో మ్యాచ్‌లో అన్‌సీడెడ్ సైనా 21-15, 21-17తో లియానె టాన్ (బెల్జియం)పై విజయం సాధించింది. రెండో రౌండ్లో అయా ఒహొరితో సింధు.. ఎనిమిదో సీడ్ అన్‌సే యంగ్ (కొరియా)తో సైనా తలపడనున్నారు.
*పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్, పారుపల్లి కశ్యప్, సాయి ప్రణీత్ నిరాశ పరిచారు.
*హెచ్‌ఎస్ ప్రణయ్, సమీర్ వర్మ మాత్రం తొలిరౌండ్‌ను అధిగమించారు. ప్రపంచ మాజీ నంబర్‌వన్ శ్రీకాంత్ రెండో సీడ్ చౌ టెన్ చెన్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయారు.
* సింగిల్స్‌లో సాయి ప్రణీత్, రాస్మస్ గెమ్కె (డెన్మార్క్) చేతిలో ఓడి టోర్నీ నుంచి వైదొలిగాడు. కశ్యప్, మొమోటా చేతిలో ఓటమిపాలయ్యాడు.
భారత వృద్ధి రేటు 5 శాతం- ప్రపంచ బ్యాంకు
*2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను భారత వృద్ధి రేటును 5 శాతంగా ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది.
*అయితే మరుసటి ఏడాది మాత్రం (2020-21) 5.8 శాతానికి పెరిగే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.
* వివిధ రేటింగ్ ఏజెన్సీలు భారత వృద్ధి రేటు తగ్గిస్తూ వస్తుండగా ప్రపంచ బ్యాంకు కూడా 5 శాతానికి పరిమితం చేసింది.
*గతంలో భారత వృద్ధి రేటును ప్రపంచబ్యాంకు ఆరు శాతంగా అంచనా వేసింది.
*కారణాలు -
-
రుణాల జారీ మందగించడం
-
ప్రయివేటు వినిమయం పడిపోవడం
-
ప్రాంతీయ సమస్యలు
*బంగ్లాదేశ్‌లో వృద్ధిరేటు 7 శాతానికి పైగా ఉంటుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది.
*పాకిస్తాన్‌లో వృద్ధిరేటు 3 శాతానికి పరిమితమయ్యే అవకాశం ఉంది.
*ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు 2.5 శాతంగా అంచనా వేసింది.
*అమెరికా వృద్ధి రేటు 1.8 శాతం తగ్గే అవకాశం ఉందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది.ముఖ్యమైన కారణాలు టారిఫ్ రెట్లు, అస్థిరత.
జాతీయం
రుణాల జారీ మందగించడం
ప్రయివేటు వినిమయం పడిపోవడం
ప్రాంతీయ సమస్యలు
No comments:
Post a Comment