Current Affairs in Telugu 8th January

అంతర్జాతీయం


న్యూయార్క్ లో న్యాయమూర్తులుగా భారత సంతతి మహిళలు
New York
*ఇద్దరు భారత సంతతి మహిళలు అమెరికాలో న్యూయార్క్ నగరంలోని క్రిమినల్ మరియు సివిల్ కోర్టులకు న్యాయమూర్తులుగా నియమితులయ్యారు. 
*న్యూయార్క్‌లో క్రిమినల్‌ కోర్టు జడ్జిగా అర్చనా రావు, సివిల్‌ కోర్టు న్యాయమూర్తిగా దీపా అంబేకర్‌(43)లను నగర మేయర్‌ బిల్‌ డీ బ్లాసియో నియమించారు. 
*అర్చనారావు న్యూయార్క్ కౌంటీ జిల్లా అటార్నీ కార్యాలయంలో 17 సంవత్సరాలు విధులు నిర్వహించారు.2019 జనవరిలో మొదట సివిల్ కోర్టుకు మద్యంతర న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 
*దీపా అంబేకర్‌ 2018 మే నెలలో సివిల్‌కోర్టు తాత్కాలిక న్యాయమూర్తిగా పనిచేశారు.దీనికి ముందు ఆమె న్యూయార్క్ నగర సీనియర్ లెజిస్లేటివ్ కౌన్సిల్ లో అటార్నీ గా ,ప్రజా భద్రతా విభాగం కమిటీలో సభ్యురాలిగా పనిచేశారు. క్రిమినల్ డిఫెన్స్ విభాగంలోనూ విధులు నిర్వహించారు. 
*మేయర్ బ్లెస్స్ యూ మొత్తం 28 కోర్టులకు న్యాయమూర్తులను ప్రకటించగా ఇద్దరు భారత సంతతికి చెందిన వారు ఉన్నారు.



'వూల్ఫ్ మూన్ ఎక్లిప్స్'


 *ఈ కొత్త దశాబ్దం లోనే మొదటగా దర్శనం ఇచ్చే చంద్ర గ్రహణం గురించి నాసా శాస్త్రవేత్తలు సమాచారం విడుదల చేశారు.
*2020 మొదటి చంద్ర గ్రహణం జనవరి 10న ఏర్పడనుంది. ఈ ఖగోళ సంఘటన ను అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా 'వూల్ఫ్ మూన్ ఎక్లిప్స్' అని పేరు పెట్టింది. 
*ఇది ఈసారి భారతదేశంలో కనిపిస్తుంది. ఆసియా, ఆఫ్రికా, యూరప్‌లోని దేశాలు కూడా చంద్ర గ్రహణాన్ని చూడగలుగుతాయి.
*మొత్తం గ్రహణం వ్యవధి 4 గంటల 5 నిమిషాలు
* ఈ సంవత్సరం సంభవించబోయే నాలుగు చంద్ర గ్రహణాలలో ఇది మొదటిది.
*ఈ చంద్ర గ్రహణం అమెరికాలో కనిపించదు. భూమి మీద ఈ ప్రాంతంలో ఆ సమయం పగలుగా ఉంటుంది.
*ఈ యేడాది జూన్ 5, జూలై 5, నవంబర్ 30 తేదీలలో మిగిలిన మూడు చంద్ర గ్రహణాలు ఏర్పడతాయి.



జాతీయం

ప్రముఖ కళాకారుడు అక్బర్ పదమ్‌సీ మృతి


*దేశంలోని అత్యంత ప్రసిద్ధ కళాకారుల్లో ఒకరు, ప్రగతిశీల-ఆధునికతావాద ఉద్యమకారుడు అక్బర్ పదమ్‌సీ కన్నుమూశారు. 
*91ఏళ్ల పదమ్‌సీ సోమవారం రాత్రి ఇక్కడ ఈషా యోగా కేంద్రంలో కాలం చేశారు.
*గత కొన్ని సంవత్సరాలుగా పదమ్‌సీ, అతని భార్య భాను ఈషా యోగా కేంద్రంలో నివసిస్తూ వచ్చారు. కొన్నిసార్లు ఈషా యోగా కేంద్రాన్ని సందర్శించిన ఆ దంపతులు తరువాత అక్కడే నివసించాలని నిర్ణయించుకున్నారు.
*ఈయన గతంలో పద్మభూషణ్ అవార్డు స్వీకరించారు.



మోదీ జీవితం గురించి 'కర్మయోధ గ్రంథ్'
* ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తిగత, రాజకీయ జీవిత సమాహారంగా రూపొందిన 'కర్మయోధ గ్రంథ్'ను జనవరి 7వ తేదీన అమిత్ షా ఆవిష్కరించారు.
*అమిత్ షా పేర్కొన్న అంశాలు --ఆదర్శనీయ జీవనంతోపాటు ప్రజల కోసం పరితపిస్తూ రాజనీతిజ్ఞుడిగా, వ్యవహార దక్షుడిగా నిలబడే వ్యక్తే కర్మయోధుడు 
* ఓ సిద్ధాంతానికి తన జీవితాన్ని అంకితం చేయడంతోపాటు ఆదర్శాల కోసం రాజకీయాల్లోకి ప్రవేశించడం, అంతిమంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను పరిరక్షించడానికి మోదీ అంకితమయ్యారు.
* నిస్వార్థంగా ఏళ్లతరబడి అవిశ్రాంతంగా దక్షత, సమర్థతతో చేసిన కృషి ఫలితంగానే నరేంద్ర మోదీ ఇపుడు అంతర్జాతీయ నాయకుడు అయ్యాడు.
* ఓ జాతికి నిస్వార్థంగా సేవ చేయడమంటే ఏమిటో మోదీ జీవితాన్ని లోతుగా పరిశీలిస్తే అర్థం అవుతోంది.
*తీవ్ర పేదరికం, సామాజిక నిర్లక్ష్యం మధ్య బాల్యాన్ని గడిపిన మోదీ తన సొంత కృషి, పట్టుదలతో ప్రజల సంక్షేమానికి జీవితాన్ని అంకితం చేసే మహా నాయకుడు.
* 2014లో కేంద్రంలో మోదీ అధికారంలో చేపట్టే సమయానికి 12 లక్షల కోట్ల రూపాయలు అప్పులే ఉన్నాయి. అలాంటి స్థితిలో పాలనా పగ్గాలు చేపట్టి, అవినీతిరహితమైన రీతిలో ప్రభుత్వాన్ని ఆదర్శనీయంగా నడుపుతూ వచ్చారు.
*  ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తిగత, రాజకీయ జీవితాలను సమగ్ర దృష్టిలో పరిశీలించి రాసిన 'కర్మయోధ గ్రంథ్'ను కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాశారు.

అంతర్ రాష్ట్రీయ యోగ దివాస్ మీడియా సమ్మాన్
*అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగాకు ప్రాచుర్యం కల్పించినందుకు కేంద్ర సమాచార, ప్రసార శాఖ 'అంతర్జాతీయ యోగా దివస్‌ మీడియా సమ్మాన్‌'పురస్కారాలను 30 మీడియా సంస్థలకు ప్రకటించింది. 
*కేంద్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా అంతర్ రాష్ట్రీయ యోగా దివస్ మీడియా సమ్మాన్ పురస్కారాలను మీడియా సంస్థలకు ప్రకటించింది.
*2020 జనవరి 7వ తేదీన ఈ పురస్కారాలను అందజేశారు.
* ఉద్దేశ్యం-- యోగా గురించి సరైన సమాచారాన్ని ప్రజలకు అందజేయడానికి మీడియా కృషి చేసేలా చేయడం మరియు ప్రపంచవ్యాప్తంగా యోగాకు ప్రాముఖ్యత కల్పించడం
*2019 జూన్ నెలలో ఈ పురస్కారాన్ని ప్రారంభించారు. 
*రేడియో, టీవీ, ప్రింట్‌ మీడియా కేటగిరీల వారీగా మొత్తం 30 అవార్డులు అందజేశారు. 
*రేడియో విభాగంలో ఆకాశవాణి హైదరాబాద్‌ కేంద్రానికి ఈ అవార్డు దక్కింది. 
*ఆకాశవాణి హైదరాబాద్‌ స్టేషన్‌ డైరెక్టర్‌ మల్లాది శైలజా సుమన్‌ ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
*ప్రింట్‌ మీడియా విభాగంలో విశాఖపట్నం కేంద్రంగా నడుస్తున్న 'సంచలన వార్త పత్రిక లీడర్‌'అనే తెలుగు వార్తా పత్రికకు ఈ అవార్డు లభించింది. 
* ఈ పత్రిక వ్యవస్థాపక సంపాదకుడు వి.వి.రమణమూర్తి.'యోగా దివస్‌'కు సంబంధించిన వార్తా కథనాలు 15 రోజులపాటు ప్రచురించడం వల్ల ఈ ఘనత దక్కింది.
* వివిధ క్యాటగిరీలు- 
  1. the Best Media Coverage category of Yoga Day in Newspapers. 
  2. “Best Media Coverage of Yoga on Television.
  3.  “Best Media Coverage of Yoga in Radio. 
ప్రపంచ అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21 

త్వరలో లిటిగేషన్‌ సెటిల్మెంట్‌ స్కీమ్‌

*మరో మూడు వారాల్లో పార్లమెంటుకు ప్రతిపాదించనున్న 2020-21 సంవత్సర బడ్జెట్‌లో లిటిగేషన్‌ సెటిల్మెంట్‌ స్కీమ్‌ ప్రకటించే అవకాశం ఉంది.
*ఆ స్కీమ్‌ కింద పన్ను వివాదాల్లో ఉన్న కంపెనీలు రెవిన్యూ శాఖ కోరుతున్న సొమ్ములో కొంత మొత్తాన్ని చెల్లించి ఆ వివాదాలకు తెరదించుకునే అవకాశం ఉంది.
*కంపెనీలకు, ప్రభుత్వానికి కూడా ఇది ఉభయతారకంగా ఉంటుంది. కంపెనీలు పన్ను వివాదాల నుంచి బయటపడే అవకాశం లభించడంతో పాటు ప్రభుత్వం విత్త లోటును తగ్గించుకునే ఆస్కారం కలుగుతుంది.
*దేశంలో సుమారు 5 లక్షల పన్ను వివాద కేసులు వివిధ స్థాయిల్లో కోర్టుల ముందు నలుగుతున్నాయి. 
*ఇలాంటి వివాదాల్లో చిక్కుకున్న మొత్తం కూడా 7 నుంచి 8 లక్షల కోట్ల మేరకు ఉన్నట్టు తెలుస్తుంది.
*కేసులు పరిష్కారమై వివాదంలో ఉన్న సొమ్ము వసూలు కావాలంటే దీర్ఘకాలమే పడుతుంది.
*ఇలాంటి స్కీమ్‌ ఒకటి ప్రకటించినట్టయితే వివాదాలు కోర్టుల వెలుపలే సత్వరం పరిష్కారమై ఆ మొత్తంలో అధిక భాగం వసూలయ్యే ఆస్కారం ఉంటుందని ప్రభుత్వం గత జూలైలో ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్‌ సిఫారసు చేసింది.
* అలాగే సీబీడీటీ కూడా పన్ను వివాదాల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనానికి ఏర్పాటు చేసిన ప్యానెల్‌ కూడా ఇదే తరహా అభిప్రాయం ప్రకటించింది. 
*. ఈ పథకం ద్వారా సర్వీస్‌ట్యాక్స్‌, సెంట్రల్‌ ఎక్సైస్‌ కేసులతో పాటు వివిధ పరోక్ష పన్నులకు సంబంధించిన వివాదాలను వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ చేసుకొనే అవకాశం కల్పించనున్నారు.
*కేంద్ర ప్రభుత్వం తాజాగా రూపొందిస్తున్న పన్ను వివాదాల పరిష్కార పథకం ద్వారా దేశంలోని కార్పొరేట్‌ సంస్థలకు దాదాపు రూ.ఏడు లక్షల కోట్ల మేర లబ్ధి చేకూరుతుంది.
* కొత్తగా తీసుకురానున్న ఈ పథకం ద్వారా కార్పొరేట్‌ సంస్థలు అతి తక్కువ సొమ్ము కట్టి పన్ను వివాదాల నుంచి బయటపడేలా నిబంధనల రూపకల్పన జరుగుతుంది. 
* కొత్త పథకంలో భాగంగా మొత్తం పన్ను బకాయిలో కేవలం 10 నుంచి 20 శాతం సొమ్ము చెల్లిస్తే చాలనే విధంగా నిబంధనల రూపాకల్పన జరుగుతుంది.
* దీనికి అదనంగా వడ్డీ సొమ్మును ఇతర అపరాధ రుసుములను కూడా చెల్లించాలనే నిబంధనలను తీసుకురానున్నారు.
* లేదంటే వివాదాస్పద కేసుకు సంబంధించిన మొత్తం చెల్లింపులో 40-50 శాతం సొమ్మును తక్షణ చెల్లింపులు జరుపుకొని కేసును మూయించేసుకొనేలా మరో వెసులుబాటును కల్పించనున్నారు.



దివాలా స్మృతి కి సవరణలు

*దివాలా పరిష్కార ప్రక్రియ సమర్పించకుండా నిషేధానికి గురైన వ్యక్తులకు, లిక్విడేషన్‌ ప్రక్రియలో ఉన్న కంపెనీ ఆస్తులను రుణదాత విక్రయించకుండా నిబంధనలను ఇన్‌సాల్వెన్సీ అండ్‌ బ్యాంక్‌రప్టసీ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (ఐబీబీఐ) సవరించింది.
*లిక్విడేషన్‌ను ప్రకటించిన 90 రోజుల్లోగా రుణదాత సైతం దివాలా ప్రక్రియ, లిక్విడేషన్‌ ప్రక్రియ ఖర్చుల్లో తన వాటా ఇవ్వాల్సి ఉంటుంది.
* దివాలా స్మృతి(ఐబీసీ) అనేది వ్యాపారం చేయలేక ఒత్తిడిలో పడ్డ కంపెనీలకు ఒక నిర్దిష్ట సమయానికి లోబడి పరిష్కార ప్రణాళికను అందజేస్తుంది. 
* ఒక వేళ ఆ పరిష్కార ప్రక్రియ కార్యరూపం దాల్చలేని పక్షంలో కంపెనీలు లిక్విడేషన్‌ ప్రక్రియకు వెళ్లవచ్చు. ఈ నిబంధనల మార్పులు జనవరి 6 నుండి అమల్లోకి వచ్చాయి.


ఫార్మా ఎగుమతులు రెండంకెల వృద్ధి

*ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చాలా రంగాలు వెనుకబడి నప్పటికీ ఫార్మా మాత్రం రెండంకెల వృద్ధితో ఆశాజనకంగా ఉంది.
* భారత్‌ నుంచి ఔషధ ఎగుమతులు 2019 నవంబరులో రూ.12,530 కోట్లు నమోదు చేశాయి. 
* అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 20.60 శాతం అధికం. 
*జూన్‌ తర్వాత అత్యధిక ఎగుమతులు నమోదు చేసింది నవంబరులోనే. జూన్‌లో రూ.12,810 కోట్ల విలువైన ఎక్స్‌పోర్ట్స్‌ జరిగాయి.
*2019-20 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-నవంబరులో భారత్‌ నుంచి విదేశాలకు సరఫరా అయిన ఔషధాలు రూ.95,848 కోట్లుగా ఉన్నాయి.
*2018-19 ఏప్రిల్‌-నవంబర్‌తో పోలిస్తే ఇది 11.46 శాతం ఎక్కువ.
*2019-20లో భారత ఫార్మా ఎగుమతులు 14.5 శాతం అధికమై రూ.1,54,000 కోట్లు నమోదయ్యే అవకాశం ఉంది.
*ఫార్మాస్యూటికల్స్‌ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఫార్మెక్సిల్‌) డైరెక్టర్‌ జనరల్‌ రవి ఉదయ్‌ భాస్కర్‌


అమర్త్యసేన్ చేతులమీదుగా ఇన్ఫోసిస్ పురస్కారం

*హైదరాబాద్‌కు చెందిన మహిళా శాస్త్రవేత్తతోపాటు మరో ఐదుగురు ప్రొఫెసర్లు 2019 ఏడాదికిగానూ ప్రతిష్ఠాత్మక ఇన్ఫోసిస్‌ ప్రైజ్‌ అందుకున్నారు. 
*శాస్త్ర, పరిశోధన రంగాల్లో విశేష కృషి చేసే వారికి ప్రతిఏటా ఇన్ఫోసిస్‌ ఈ అవార్డులు అందిస్తుంది. 
*ఐఐటీ బాంబే నుంచి సునీత సరవాగి (ఇంజనీరింగ్‌ అండ్‌ కంప్యూటర్‌ సైన్స్‌), ఐఐటీ మండి అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ మను వి దేవదేవన్‌ (హ్యుమానిటీస్‌), హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ) చీఫ్‌ సైంటిస్ట్‌ మంజులా రెడ్డి (లైఫ్‌ సైన్సెస్‌), స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్‌లో పనిచేస్తున్న ఈటీహెచ్‌ ప్రొఫెసర్‌ సిద్ధార్థ మిశ్రా (మాథమెటికల్‌ సైన్స్‌), ఐఐటీ బెంగళూరు ప్రొఫెసర్‌ ముగేశ్‌ (భౌతికశాస్త్రం), అమెరికాలోని జాన్స్‌ హాప్కిన్స్‌ వర్సిటీ ప్రొఫెసర్‌ ఆనంద్‌ పాండియన్‌ (సోషల్‌ సైన్సెస్‌) ఈ అవార్డులు దక్కించుకున్నారు.
*బెంగళూరులో జనవరి 7వ తేదీన నిర్వహించిన కార్యక్రమంలో వారికి బంగారు పతకం, ప్రశంసాపత్రంతోపాటు రూ.71.86 లక్షల నగదు బహుమతిని నోబెల్‌ బహుమతి గ్రహీత ప్రొఫెసర్‌ అమర్త్యసేన్‌ చేతులమీదుగా అందజేశారు.
*ఈ పురస్కారాన్ని సంవత్సరానికి ఒకసారి అందిస్తారు.
* 6 వివిధ రంగాల్లో కృషి చేసిన వారికి ఈ పురస్కారం అందిస్తారు.
*గత ఐదు నుండి పది సంవత్సరాలలో చేపట్టిన పరిశోధనలను గుర్తించి విశిష్టమైన వాటికి ఈ పురస్కారం అందిస్తారు.


దేశ వృద్ధి రేటు 5 శాతమే

ls-img

*ఈ ఆర్థిక సంవత్సరంలో(2019-20)లో వృద్ధి రేటు 5 శాతానికి పరిమితమైందని నేషనల్ స్టాటిస్టికల్ ఆఫిస్ విడుదల చేసిన తొలి ముసాయిదా నివేదికలో వెల్లడైంది.
*గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 1.8 శాతం తక్కువగా ఉంది.
*ఇది గడిచిన 11 ఏండ్లలో అత్యంత కనిష్ఠ స్థాయి .
*అంతర్జాతీయ ఆర్థిక మాంద్యం నేపథ్యంలో 2008-09 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ 3.1 శాతానికి పరిమితమైంది. మళ్లీ ఆ తర్వాత ఈసారి వృద్ధిరేటు అంచనాలే అత్యంత బలహీనంగా కనిపిస్తున్నాయి. 
*కీలకమైన తయారీ రంగంలో వృద్ధిరేటు గణనీయంగా పడిపోవచ్చని జాతీయ గణాంక కార్యాలయం (ఎన్‌ఎస్‌వో) పేర్కొన్నది. 
*గత ఆర్థిక సంవత్సరంలో 6.2 శాతంగా ఉన్న తయారీ రంగం పనితీరు.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2 శాతానికి పడిపోవచ్చని జాతీయ ఆదాయపు తొలి ముందస్తు అంచనాల్లో తెలిపింది. 
*వ్యవసాయ, నిర్మాణ, విద్యుత్‌, గ్యాస్‌, నీటి సరఫరా తదితర రంగాల్లో వృద్ధి మందగించనున్నట్లు వెల్లడించింది. గతంతో పోల్చితే నిర్మాణ రంగంలో వృద్ధిరేటు 8.7 శాతం నుంచి 3.2 శాతానికి, వ్యవసాయ రంగంలో 2.9 శాతం నుంచి 2.8 శాతానికి దిగజా రావచ్చు .
*గనులు, ప్రభుత్వ పరిపాలన, రక్షణ రంగాల తీరు స్వల్పంగా మెరుగైయ్యే వీలున్నది. 
*ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్‌)లో జీడీపీ గణాంకాలు ఆరేండ్ల కనిష్ఠాన్ని తాకుతూ 4.5 శాతానికి పతనం అయింది.
*2013 తర్వాత ఇదే కనిష్ఠం. అంతకుముందు త్రైమాసికం (ఏప్రిల్‌-జూన్‌)లో 5 శాతంగా ఉన్నది.
*గత నెల డిసెంబర్‌లో దేశంలోని నిరుద్యోగం 7.7 శాతానికి పెరిగింది. 2018 డిసెంబర్‌లో ఇది 7 శాతంగానే ఉన్నట్లు ముంబైకి చెందిన సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ గణాంకాలు చెబుతున్నాయి.
*అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం, అమెరికా-ఇరాన్‌ ఉద్రిక్తతలు భారతీయ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావాన్నే చూపుతున్నాయి.
* పెరుగుతున్న ముడి చమురు ధరలు సైతం దేశీయ మార్కెట్లను కుదిపేస్తున్నాయి. ద్రవ్యోల్బణం పెరుగుదలకూ దారి తీస్తున్నాయని పలు రేటింగ్‌ ఏజెన్సీలు ప్రస్తుత పరిస్థితులను విశ్లేషిస్తున్నాయి.
 








1 comment:

  1. Very useful material. Visit https://www.achieversnext.com for best online classes

    ReplyDelete