అంతర్జాతీయం
అంతరిక్షంలోని వ్యోమగామికి టెలీ మెడిసిన్ చికిత్స
* ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా అంతరిక్షంలోని వ్యోమగామికి భూమి మీదనున్న వైద్యుడు చికిత్స అందించారు.
*ఐఎస్‌ఎస్‌లోని ఈ వ్యోమగాములకు వారి శరీరంలో తల వెనుకభాగం నుండి గుండెకు రక్తాన్ని సరఫరా చేసే జుగులర్ రక్తనాళాలలలో టిష్యూ, ఇతర ద్రవపదార్ధాల అవశేషాలు కన్పించటంతో వారి రక్తసరఫరాలో అంతరాయం కలిగి రక్తం కట్టింది.
* ఈ అవశేషాలను తొలగించి రక్తసరఫరాను పునరుద్ధరించేందుకు అవసరమైన సర్క్యులేటరీ ఫిజియాలజీతో కేవలం భూమిపై రోగులకు మాత్రమే కాక, వ్యోమగాముల ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా వుంటుందని, ముఖ్యంగా చంద్ర, అరుణగ్రహ యాత్రల్లో పాల్గొనేవారికి ఈ పరిజ్ఞానం ఉపయోగపడుతుందని ఎల్‌ఎస్‌యు శాస్త్రవేత్తలు తమ అధ్యయనంలో వెల్లడించారు.
*గురుత్వాకర్షణ శూన్యమైన అంతరిక్షంలో ఈ విధమైన సమస్య తలెత్తటం ఇదే మొదటి సారి.
*ప్రొఫెసర్ స్టీఫెన్ మోల్ భూమిపై నుండి చికిత్స ప్రారంభించారు.
* ఈ చికిత్స 90 రోజుల పాటు సాగింది. దీనిలో భాగంగా అ వ్యోమగామి తనకు తానే అల్ట్రాసౌండ్ పరీక్షలను చేసుకున్నాడు.
*భూమినుంచి మోల్ ఆ వ్యోమగామికి ఇ-మెయిల్, ఫోన్ కాల్స్ ద్వారా సలహాలు, సూచనలు అందించారు.
అణు ఒప్పందం నుండి ఇరాన్ బయటకు
*అమెరికాతో తీవ్ర విభేదాలు నెలకొన్న నేపథ్యంలో ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది.
*2015లో వివిధ దేశాల మధ్య కుదిరిన అణు ఒప్పందంలోని కీలక నిబంధన నుంచి విరమించుకుంటున్నట్లు ప్రకటించింది.
*ఈ ఒప్పందం నుంచి 2018లో అమెరికా బయటకు వచ్చింది.
* దీంతో నాటి నుంచి ఇరాన్ సైతం ఒక్కో నిబంధనను అతిక్రమిస్తూ వస్తోంది.
*ఈ క్రమంలో యురేనియం నిల్వలు, వాటి శుద్ధి స్థాయిని ఇరాన్ పెంచుకుంటూ వస్తోంది. చివరగా యురేనియం శుద్ధిలో కీలక పాత్ర పోషించే సెంట్రిఫ్యూజ్‌ల సంఖ్యపై ఉన్న పరిమితిని సైతం ఇరాన్ పక్కన పెట్టింది.
* తాజా నిర్ణయంతో అణు ఒప్పందం నుంచి ఇరాన్ పూర్తిగా బయటకు వచ్చినట్లైంది.
* ఈ చర్య వల్ల యురేనియం శుద్ధి, శుద్ధి స్థాయి, ఎంత మొత్తంలో శుద్ధి చేయాలి, అణు పరిశోధన వంటి అంశాల్లో ఇరాన్‌పై ఇక ఎలాంటి పరిమితులు ఉండబోవు.
*అయితే ప్రస్తుతానికి విద్యుత్తు ఉత్పత్తి వంటి దేశ సాంకేతిక అవసరాల మేరకే తమ అణు కార్యక్రమం కొనసాగుతోంది.
* అలాగే 'అంతర్జాతీయ అణుశక్తి సంఘం'(ఐఏఈఏ)తోనూ ఇరాన్ సహకారం కొనసాగుతోంది.
*ఇరాన్ నిర్ణయాన్ని ఒప్పందంలోని ఇతర భాగస్వామ్య దేశాలైన బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, చైనా సానుకూలంగా స్పందించలేదు.
* అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల తగ్గింపునకు ఈ దేశాలు ప్రయత్నించనున్నాయి.
*అణ్వస్త్ర పాటవాన్ని ఇరాన్ సముపార్జించకుండా నిలువరించే సంయుక్త సమగ్ర కార్యాచరణ ప్రణాళిక (జేసీపీవోఏ)ను ఐక్యరాజ్య సమితి భద్రతామండలి శాశ్వత సభ్య దేశాలు అయిదింటితో పాటు జర్మనీ, అంతర్జాతీయ అణు శక్తి సంస్థ ప్రతినిధులు, టెహ్రాన్ నేతలు కలిసికట్టుగా 2015లో రూపొందించారు.
*ఈ ఒప్పందం ప్రకారం అణు పదార్థ శుద్ధి, శుద్ధి స్థాయి తదితరల అంశాలపై పరిమితులు ఉంటాయి. కానీ, ఈ ఒడంబడిక ఇరాన్‌కు అనుకూలంగా.. అమెరికాకు ఇబ్బందికంగా ఉందని ఆరోపిస్తూ ట్రంప్ 2018లోనే దీన్నుంచి వైదొలిగారు.
*ఇరాన్‌పై కఠిన ఆర్థిక-వాణిజ్య ఆంక్షలు విధిస్తూ వస్తున్నారు.
*ఇక ఆధునిక చరిత్రలో తొలిసారిగా ఇరాన్‌లోని జంకారా మసీద్ డోమ్‌పై ఎర్ర జెండాను ఎగరేశారు. సాధారణంగా ఎర్ర జెండాను విప్లవానికి, చైతన్యానికి స్ఫూర్తిగా భావిస్తారు.
*షియా ముస్లింల ఆచారం ప్రకారం.. అన్యాయంగా రక్తం చిందిందనడానికి, ప్రతీకారం తీర్చుకోవాలనడానికి ఎర్ర జెండాలను సూచికలుగా భావిస్తారు. షియా సంప్రదాయం ప్రకారం పగ తీర్చుకున్నాకే ఆ జెండాను కిందకు దించుతారు. దీంతో ఇప్పటికీ ఆ జెండాను అవనతం చేయలేదు.
*మరోపక్క ఖాసిం సులేమానీ హత్యపై ఇరాక్ కూడా తీవ్ర స్థాయిలో స్పందిస్తోంది. అమెరికా బలగాలను దేశం నుంచి బహిష్కరించాలని నిర్ణయించింది. ఈ మేరకు తీర్మానాన్ని ఆమోదించింది.
లేబర్ పార్టీ అధ్యక్షురాలిగా భారత సంతతి మహిళ
*లేబర్ పార్టీ నాయకత్వ రేసులో తాను దిగుతున్నట్లు భారత సంతతికి చెందిన బ్రిటన్ మహిళా ఎంపి ప్రకటించారు.
*ఇంగ్లండ్‌లోని విఆన్ స్థానం నుండి గెలుపొందిన 40 ఏళ్ల లీసా నంది అక్కడ లేబర్ పార్టీకున్న పట్టును మరోసారి రుజువు చేశారు.
*ప్రస్తుత పార్టీ నేత జెరిమీ కార్బిన్ త్వరలో పదవి నుండి వైదొలగనున్నట్లు ప్రకటించటంతో ఆయన స్థానాన్ని భర్తీ చేసేందుకు ఈమె ప్రయత్నిస్తుంది.
* గత నెల ఎన్నికల్లో పార్టీ ఓటమి నేపథ్యంలో కార్బిన్ లేబర్‌పార్టీ నాయకత్వ బాధ్యతల నుండి తప్పుకుంటానని ప్రకటించారు.దీంతో ఈమె లేబర్ పార్టీ నాయకత్వానికి పోటీపడుతున్నారు.
*లేబర్ పార్టీ నాయకత్వ రేసులోకి దిగుతున్న ఎంపిలలో లీసా నంది నాల్గవ వారు.
*ప్రధాని బోరిస్ జాన్సన్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీని దీటుగా ఎదుర్కోవడంతో పాటు చేజారిన స్థానాలను దక్కించుకోవటానికి దీర్ఘకాలిక కసరత్తు అవసరం అని లీసా నంది పేర్కొన్నారు.
నర్సుల సంవత్సరంగా 2020
అందజేయడంలో నర్సులు, మిడ్‌వైవ్స్ పాత్ర చాలా ముఖ్యమైనదని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.
*ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం, ప్రపంచ వ్యాప్తంగా అదనంగా 9 కోట్ల మంది నర్సుల సేవలు అవసరం.
*2020వ సంవత్సరాన్ని అంతర్జాతీయ నర్సులు, మిడ్‌వైవ్స్ సంవత్సరంగా ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీ ప్రకటించింది.
*ప్రపంచ ఆరోగ్య సంస్థ, దాని భాగస్వామ్య సంస్థలైన ఇంటర్నేషనల్ కాన్ఫడరేషన్ ఆఫ్ మిడ్‌వైవ్స్, ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ నర్సెస్, నర్సింగ్ నౌ, యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ ఏడాదిపాటు నర్సులు, మిడ్‌వైవ్స్ సేవలను ప్రశంసిస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తాయి.
* వీరు తరచూ ఎదుర్కొనే సవాళ్లను ఈ కార్యక్రమాల్లో తెలియజేస్తాయి.
జాతీయం
చెత్త నుండి నాలుగు కోట్ల ఆదాయం
*దేశంలోనే అత్యంత శుభ్రమైన నగరంగా వరుసగా మూడుసార్లు టాప్‌లో నిలిచిన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ కార్పొరేషన్ మరో ఘనత సాధించింది.
* సేకరిస్తున్న చెత్త నుంచి ఏటా రూ.4 కోట్ల మేర ఆదాయం సంపాదించింది.
*వ్యర్థాలను వేరు చేయడంలో కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్), రోబోటిక్ సాంకేతికను వినియోగిస్తున్నది.
*సుమారు 35 లక్షల జనాభా ఉన్న ఇండోర్‌లో ప్రతి రోజు 1200 టన్నుల వ్యర్థాలను సేకరిస్తారు. ఇందులో 550 టన్నులు తడి చెత్త కాగా, 650 టన్నులు పొడి చెత్త.
* ఈ చెత్త నుంచి ఆదాయం సమకూర్చుకోవాలన్న ఉద్దేశంతో పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం కింద రూ.30 కోట్ల వ్యయంతో నాలుగు ఎకరాల్లో ఓ కంపెనీ ఏర్పాటైంది.
*కృత్రిమ మేధతోపాటు రోబోటిక్ సాంకేతికతతో ప్రతి రోజు 300 టన్నుల పొడి చెత్త నుంచి ప్లాస్టిక్, గాజు, ఇనుము వంటి లోహాలను వేరు చేస్తారు.
*వాటిని రీసైకిల్ పరిశ్రమలకు తరలిస్తారు. ఒప్పందం మేరకు ఇలా లభించిన లాభం నుంచి ప్రతి ఏటా రూ.1.51 కోట్లను మున్సిపల్ కార్పొరేషన్‌కు ఆ సంస్థ చెల్లిస్తోంది.
*అలాగే తడి చెత్త నుంచి కంపోస్టు ఎరువు, బయో-సీఎన్‌జీ గ్యాస్ ఉత్పత్తి, నిర్మాణ వ్యర్థాలను ఇటుకలు, టైల్స్ వంటి తయారీకి వినియోగించడం వంటి చర్యల ద్వారా ఏటా రూ.2.5 కోట్ల ఆదాయం లభిస్తుంది.
*ఈ విధులను సమర్ధవంతంగా నిర్వహించేందుకు చెత్త సేకరించే పనిని మూడు స్వచ్చంధ సంస్థలకు అప్పగించారు.
*తొలి దశలో భాగంగా ఈ సంస్థలు కేజీకి రూ.2.5 చొప్పున చెల్లించి సుమారు 22 వేల ఇండ్ల నుంచి పొడి చెత్తను సేకరిస్తున్నాయి. రోబో టెక్నాలజీతో చెత్తను వేర్వేరుగా విభజిస్తారు.
* వ్యర్థాలను ప్లాంట్‌కు తరలించి వాటి నుంచి ప్లాస్టిక్, గాజు, లోహాలు వంటివి వేరు చేసి ఆదాయం గడిస్తూ వచ్చిన లాభాన్ని కార్పొరేషన్‌తో పంచుకుంటున్నాయి.
*ఇలా చెత్తను ఆదాయ వనరుగా వినియోగించుకుంటున్న ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్, ఇటీవల నిర్వహించిన 2020 క్లీన్ సిటీ సర్వేలోనూ ముందంజలో ఉన్నది..
*స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం 'క్లీన్లీనెస్ సర్వే 2019' పేరిట డిసెంబర్ 31 వ తేదీన జాబితాను విడుదల చేసింది.
*ఇండోర్ 'స్వచ్ఛ నగరం'గా తొలి స్థానంలో నిలిచింది. మొదటి త్రైమాసికంలో స్వచ్ఛ నగరం జాబితాలో మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ ద్వితీయ స్థానం దక్కించుకోగా, తృతీయ స్థానాన్ని గుజరాత్‌లోని సూరత్ పట్టణం కైవసం చేసుకున్నది.
*రెండో త్రైమాసికంలో గుజరాత్‌లోని రాజ్‌కోట్ పట్టణం స్వచ్ఛత ర్యాంకుల్లో ద్వితీయ స్థానంలో నిలవగా, మూడో స్థానంలో నవీ ముంబై ఉన్నది. 10 లక్షల కంటే ఎక్కువ జనాభా కలిగిన నగరాల్లో ఇవి ఉన్నాయి.
*మరోవైపు, 10 లక్షల కంటే తక్కువ జనాభా కలిగిన పట్టణాల జాబితాలో జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్, గ్రామీణ స్వచ్ఛత విభాగంలో పంజాబ్‌లోని మోగా పట్టణం తొలి స్థానాల్లో నిలిచాయి.
సామాజిక ప్రభావ కంపెనీ'ల ఏర్పాటు చట్టం
*నూతనంగా 'సామాజిక ప్రభావ కంపెనీ'లను ఏర్పాటు చేస్తూ కొత్త చట్టం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
*సామాజిక ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేసే ఈ కంపెనీల్లోకి మరిన్ని ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించేలా చూడాలని కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ భావిస్తోంది.
*బ్రిటన్ వంటి దేశాల్లో ఇలాంటి కంపెనీలు ఉన్నా, భారత్‌లో ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయి. సమీప ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ఇవి కృషి చేస్తాయి.
*ప్రస్తుతం ఎలాంటి లాభాపేక్ష లేకుండా పనిచేసే కంపెనీలను 'సెక్షన్-8 కంపెనీ'లుగా వ్యవహరిస్తుంటారు.
*వీటికి వచ్చే లాభాలను వాటాదార్లకు పంపిణీ చేయరు.
* కేవలం సామాజిక కార్యక్రమాలకే ఉపయోగిస్తారు. నూతనంగా ఏర్పాటు చేయనున్న 'సామాజిక ప్రభావ కంపెనీ'ల లాభాల్లో కొంత మొత్తాన్ని వాటాదార్లకు ఇవ్వడానికి వీలుకలిగించేలా ప్రభుత్వం నిబంధనలు రూపొందించనుంది.
* సెక్షన్-8 కంపెనీల పరిధిని మరింత విస్తరించి 'సామాజిక ప్రభావ కంపెనీ'లకు రూపకల్పన చేస్తారు.
దేశ నిరుద్యోగత 7.7%
*భారత్‌లో నిరుద్యోగత రేట్ దారుణంగా పడిపోయింది.
*గత నెల డిసెంబర్‌కు ఇది 7.7 శాతానికి పడిపోయింది. అదే నవంబర్ నెలకు నిరుద్యోగత రేటు 7.48శాతంగా ఉంది.
*ఈ విషయాన్ని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ వెల్లడించింది.
*గత మూడేళ్లతో పోలిస్తే నవంబర్ నెలలో నిరుద్యోగత రేటు 1శాతం పడిపోయి 7.48 శాతంకు చేరింది.
*నిరుద్యోగ రేటు పడిపోవడానికి ప్రధాన కారణం ఆటో ఇండస్ట్రీ.
*ప్రస్తుత పరిస్థితులు ఇలానే కొనసాగితే రానున్ననాలుగేళ్లలో వేల సంఖ్యలో ఉద్యోగస్తులను తొలగించాల్సి ఉంటుందని ప్రపంచపు అతిపెద్ద ఆటో పార్ట్స్ సప్లయర్ బోష్ లిమిటెడ్ ప్రకటించింది.
* బోష్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సౌమిత్ర భట్టాచార్య ప్రకారం- 3,700 మంది ఉద్యోగస్తులను తొలగించాల్సి ఉంటుంది.
*మరోవైపు పట్టణప్రాంతాల్లో నిరుద్యోగ రేటు కూడా దారుణంగా పడిపోయింది.
* గతేడాది జనవరి నుంచి మార్చి వరకు పరిశీలిస్తే దేశంలో నిరుద్యోగత రేటు 9.3శాతానికి పడిపోయింది.
*నాలుగు త్రైమాసికాలకు గాను ఇంత దారుణంగా పడిపోవడం అదే తొలిసారి.
*కేంద్రంలోని గణాంకాల శాఖ వద్ద నమోదైన సంఖ్య వేరుగా ఉంది. 15 ఏళ్ల నుంచి 29 ఏళ్ల వయసున్న నిరుద్యోగులు మూడింట ఒకవంతు ఉన్నట్లు నివేదిక వెల్లడించింది.
*ఫిబ్రవరిలో విడుదలైన అనధికారిక గణాంకాల ప్రకారం జూలై 2017 నుంచి జూన్ 2018 వరకు దేశంలో గత 45 ఏళ్లలో ఎప్పుడూ లేనంత నిరుద్యోగత ప్రస్తుతం నెలకొని ఉంది.
అస్సాం రెన్యూవల్ ప్రాజెక్టును పూర్తి చేసిన ఎంఇఐఎల్
*ఎంఇఐఎల్ మరో కీలక ప్రాజెక్ట్‌ను సకాలంలో పూర్తి చేసింది. చమురు రంగంలో వచ్చే మూడు దశాబ్దాల కాలానికి తగిన సామర్ధ్యంతో కూడిన నిర్వహణ వ్యవస్థను రూపొందించేందుకు ఉద్దేశించిన కార్యక్రమం అసోం రెన్యూవల్ ప్రాజెక్టు.
*ఈ ప్రాజెక్టు ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్‌కు అత్యంత ప్రతిష్టాత్మకమైనది.
*ఈపీసీ విధానంలో ప్రాజెక్టు కాంట్రాక్టు దక్కించుకున్న మేఘా ఇంజినీరింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఇఐఎల్) అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి అధునాతన పద్ధతిలో ఈ ప్రాజెక్టును పునర్ నిర్మించింది. *భారత్‌లో ముడి చమురు, ఉత్పత్తి రవాణా వ్యవస్థల్లో ఓఎన్‌జీసీకి ఈ చెందిన ఆన్‌షోర్ వ్యవస్థ అతి భారీది.
*మూడు దశాబ్దాల క్రితం నిర్మించిన వ్యవస్థ ప్రస్తుత అవసరాలకు సరిపోకపోవడం, మరో వైపు వచ్చే 30 ఏళ్ల అవసరాలు దృష్టిలో పెట్టుకొని అసోం ప్రాజెక్టు పునర్ నిర్మాణాన్ని ఓఎన్‌జీసీ చేపట్టింది.
*రూ.2400 కోట్ల అంచనా వ్యయంతో కూడిన ఈ ప్రతిష్టాత్మకమైన కాంట్రాక్టును ఈపీసీ పద్ధతిలో ఎంఇఐఎల్ దక్కించుకుంది.
*ప్రాజెక్టులో భాగంగా అసోంలోని నిర్మించిన లఖ్వా గ్రూప్ గ్యాదరింగ్ స్టేషన్ (జీజీఎస్) ఇప్పటికే జాతికి అంకితమివ్వడం జరిగింది.
* తాజాగా ప్రాజెక్టు పనులన్నీ పూర్తికావడంతో డిసెంబర్ 26, 2019న ప్రయోగాత్మక పరిశీలన నిర్వహించడం ద్వారా దీన్ని వాణిజ్యపరంగా వినియోగంలోకి తీసుకువచ్చారు.
*అసోం రెన్యూవల్ ప్రాజెక్టు ఆధునీకరణ ద్వారా ఓఎన్‌జీసీ ముడి చమురు, ఇంధన ప్రాసెసింగ్ సామర్ధ్యం భారీగా పెరుగుతుంది.
*రెన్యూవల్‌కు ముందు ఈ ప్రాజెక్టు ఉత్పత్తి సామర్ధ్యం ఏటా 1.4 ఎంటీపీఎ (మిలియన్ టన్స్ ఫర్ ఇయర్) అంటే 1.03 కోట్ల బ్యారెల్స్ (ఒక బ్యారెల్ అంటే ఇంచుమించు 159 లీటర్లు).
*పునర్‌నిర్మాణం తర్వాత ఈ సామర్ధ్యం 1.83 కోట్ల బ్యారెల్స్‌కు పెరుగుతుంది. అంటే దాదాపు రెట్టింపు. ఆధునీకరణలో భాగంగా అత్యంత నూతన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా గతంలో ఉన్న 800 కిలోమీటర్ల పైప్‌లైన్‌ను 560 కిలోమీటర్లకు ఎంఇఐఎల్ తగ్గించింది.
*గతంలోని విధానంలో 21 నిర్మాణాలు ఉండగా ప్రస్తుతం అవి 9కి తగ్గాయి. వాటిని కూడా ఆధునిక ఇంటిగ్రేటెడ్ కేంద్రాలుగా మార్చి వ్యవస్థలోని సంక్లిష్టతలను తగ్గించి సరళతరం చేసింది ఎంఇఐఎల్.
*ఒప్పందంలో భాగంగా రెన్యూవల్ ప్రాజెక్టులో కీలకమైన 5 గ్యాస్ సేకరణ కేంద్రాలను ఎంఇఐఎల్ నిర్మించింది. *ఈ ఆధునిక వ్యవస్థ నిర్వహణకు తగినట్టుగా 2 నీటి శుద్ధికేంద్రాలు, 2 వాటర్ ఇంజెక్షన్ ప్లాంట్లు నిర్మించింది. సేకరించిన గ్యాసును కంప్రెస్ చేసే నిల్వ చేసేందుకు రెండు ప్లాంట్లు కూడా ఇందులో ఉన్నాయి.
*ఈ నవీకరణ ప్రాజెక్టులో భాగంగా ముడి చమురు నుంచి ఉత్పత్తయ్యే అన్నింటిని నిల్వ చేయడం, ప్రాసెస్ చేయడం, రవాణా వ్యవస్థ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది.
*ఈ వ్యవస్థలో అత్యంత కీలకమైన గ్యాస్ కండిషనింగ్ కోసం గ్యాస్ డీహ్రైడేషన్ యూనిట్ నిర్మాణం కూడా జరిగింది.
*ఎకో ఫ్రెండ్లీగా వ్యవస్థను తీర్చిదిద్దేందుకు ఇక్కడ ఉత్పత్తయ్యే వ్యర్థాలన్నింటినీ నిర్మూలించేందుకు ప్రత్యేక వ్యవస్థ కూడా అందుబాటులో ఉంది.
ఎన్‌సీఎల్‌టీ తాత్కాలిక అధ్యక్షుడిగా
*ఢిల్లీలోని జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) ప్రిన్సిపల్ బెంచ్ తాత్కాలిక అధ్యక్షుడిగా బీఎస్ వీ ప్రకాశ్ కుమార్ నియమితులయ్యారు.
*ప్రస్తుతం ఈయన ట్రిబ్యునల్‌లో సీనియర్ జుడిషియల్ సభ్యులుగా ఉన్నారు. ప్రకాశ్‌ను తాత్కాలిక ప్రెసిడెంట్‌గా నియమిస్తూ ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
*మూడు నెలలు లేదా పూర్తి స్థాయి అధ్యక్షుడిని నియమించేంత వరకు లేదా తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు ఈ పదవిలో కొనసాగుతారు.
* ట్రిబ్యునల్ ప్రిన్సిపల్ బెంచ్ ప్రెసిడెంట్‌గా ఉన్న జస్టిస్ ఎంఎం కుమార్ ఇటీవల పదవీ విరమణ చేశారు.
* ప్రకాశ్ కుమార్ ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వారు.
రాష్ట్రీయం
కాలుష్యం వల్ల ఎముకల వ్యాధి
*హైదరాబాద్, దాని శివారుల్లో నివసించే ప్రజలు బోలు ఎముకల(ఆస్టియోపోరోసిస్) వ్యాధి బారినపడటానికి వాయు కాలుష్యమూ కారణమని స్పెయిన్‌కు చెందిన బార్సిలోనా ఇన్‌స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ శాస్త్రవేత్త ఒటావియో రంజానీ పరిశోధనలలో తేలింది.
*యన నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం అధ్యయనంలో భాగంగా హైదరాబాద్ శివార్లలోని 28 గ్రామాలకు చెందిన 3,700 మంది ఎముకల సాంద్రతను తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఇందుకోసం వారికి ‘డ్యూయల్ ఎనర్జీ ఎక్స్‌రే అబ్జార్‌ప్షమెట్రీ’ అనే రేడియోగ్రఫీ పరీక్ష నిర్వహించారు.
*అంతేకాదు వారు ఇళ్లలో వంటలు వండటానికి జీవ ఇంధనాలు, శిలాజ ఇంధనాల్లో(కట్టెల పొయ్యి, బొగ్గుల పొయ్యి) వేటిని వాడుతున్నారనే వివరాలను కూడా ఓ ప్రశ్నావళి ద్వారా సేకరించారు.
* ఈ ప్రాంతాల్లోని గాలిలో క్యూబిక్ మీటరుకు 32.8 మైక్రోగ్రాముల పర్టిక్యులేట్ మేటర్-2.5 ఉన్నట్లు గుర్తించారు.
*ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ప్రమాణాల ప్రకారం.. గాలిలో క్యూబిక్ మీటరుకు గరిష్ఠంగా 10 మైక్రోగ్రాముల పర్టిక్యులేట్ మేటర్-2.5 ఉండటాన్ని ప్రమాదకర స్థితిగా పరిగణించాల్సి ఉంటుంది.
*భారీ మోతాదులోని కాలుష్య కారకాలు శ్వాసక్రియ ద్వారా శరీరంలోకి ప్రవేశించి ఫ్రీ రాడికల్స్, యాంటీ ఆక్సిడెంట్ల సమతుల్యతను దెబ్బతీస్తున్నాయి.
*దీంతో జీవక్రియలు ప్రతికూలంగా ప్రభావితమై, దీర్ఘకాలంలో ఎముకలు గుల్లబారి ప్రజలు ఆస్టియోపోరోసిస్ వస్తుంది.
* ఈ అధ్యయన నివేదిక ‘జామా నెట్‌వర్క్ ఓపెన్’ జర్నల్‌లో ప్రచురితమైంది.
No comments:
Post a Comment