Current Affairs in Telugu 4th January

అంతర్జాతీయం 


అమెరికా- ఇరాన్ సంక్షోభం
*అమెరికా-ఇరాన్‌ మధ్య నెలకొన్న తాజా ఉద్రిక్తతలు భారత్‌పై ప్రభావం చూపుతాయన్న ఆందోళన మొదలైంది. ఈ సంక్షోభం తో ప్రధానంగా ఇంధన ధరలు పెరిగే ప్రమాదం ఉంది. 
*భారత్‌లో పెట్రో ఉత్పత్తుల ధరలు మూడు శాతానికిపైగా పెరిగాయి.
* దేశ అవసరాల్లో 80 శాతం ఇంధనాన్ని గల్ఫ్‌ దేశాల నుంచి దిగుమతి అవుతున్నాయి. ఇప్పటికే దేశంలో ఆర్థిక మాంద్యం నెలకొంది.
*గల్ఫ్‌ ప్రాంతంలో సుమారు 80 లక్షల భారతీయులు నివసిస్తున్నారు. వారు అక్కడ సంపాదించిన దానిలో కొంత భారత్‌లోని తమ వారికి పంపిస్తుంటారు.దేశంలోకి వచ్చే 70 బిలియన్ డాలర్ల చెల్లింపుల్లో దాదాపు 40 బిలియన్ డాలర్లు గల్ఫ్ నుంచి వస్తుంటాయి. 
*ఇది పరోక్షంగా విదేశీ మారక నిల్వలను పెంచుతున్నది. ఒకవేళ గల్ఫ్‌లో యుద్ధం తలెత్తితే భారతీయుల్లో చాలా మంది వెనక్కి రావొచ్చు. 
*అమెరికాలోనూ సంక్షోభం తలెత్తితే అక్కడి ఎన్నారైలు భారత్‌కుతిరిగి వచ్చే అవకాశం ఉంది.ఫలితంగా దేశంలో నిరుద్యోగ శాతం మరింత పెరుగుతుంది. విదేశీ మారక నిల్వలు భారీగా తగ్గిపోతాయి.
*ఇరాక్‌లో అమెరికా చేపట్టిన డ్రోన్‌ దాడిలో ఇరాన్‌ జనరల్‌ ఖాసిం సులేమానీ చనిపోయారు. దీనికి తీవ్ర ప్రతీకారం తప్పదని ఇరాన్‌ హెచ్చరించింది.విదేశాల్లోని తమ సిబ్బందిని రక్షించడానికే ఈ చర్యను చేపట్టామని అమెరికా ప్రకటించింది.
*జనరల్‌ ఖాసీంను అమెరికా చంపేయడంతో ప్రతీకారేచ్ఛతో రగిలిపోతోంది ఇరాన్‌. 
*1990-91 జరిగిన గల్ఫ్ వార్‌ వల్ల పది వేల మంది భారతీయులను కువైట్, ఇతర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారిని ఖాళీ చేశారు.



రష్యాలో తేలియాడే అను విద్యుత్ కేంద్రం
*రష్యా ఓ సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. అకడెమిక్ లోమోనోసవ్ అణువిద్యుత్ కేంద్రంను ప్రారంభించింది.
*ఈ అణువిద్యుత్ కేంద్రంను ఆర్కిటిక్ మహాసముద్రంపై నిర్మించింది. అంటే ఇది నీటిపై తేలియాడే అణువిద్యుత్ కేంద్రం. 
*2019 డిసెంబర్ ఆఖరు వారంలో అణువిద్యుత్ కేంద్రం నుంచి ఉత్పత్తి అయిన విద్యుత్ ద్వారా క్రిస్మస్ చెట్టును ముందుగా వెలిగించడం జరిగింది.
*తేలియాడే ఈ అణువిద్యుత్ కేంద్రం నుంచి ఆర్క్‌టిక్ సిటీ అయిన పెవెక్‌కు విద్యుత్ సరఫరా చేయడం జరుగుతుంది. 
*పెవెక్ నగరంలో జనాభా 5వేల మంది. 
*పెవెక్ నగరంలో ఉష్ణోగ్రతలు మైనస్ 11 ఫారెన్‌హీట్‌తో ఉంటాయి. 
* బొగ్గు ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌కు చెక్ పెట్టాలన్న ఆలోచనతోనే అకడెమిక్ లోమోనోసవ్ విద్యుత్ కేంద్రం ప్రారంభించడం జరిగింది. బొగ్గుతో అయితే కాలుష్యం కూడా పెరుగుతుందని రష్యా ప్రభుత్వం భావించి ఈ న్యూక్లియర్ ప్లాంట్‌ను తీసుకొచ్చింది.
* కొన్నేళ్ల కిందట ఏర్పాటైన బిలిబినో అణువిద్యుత్ కేంద్రంకు కొత్తగా వచ్చిన అకడెమిక్ లోమోనోసవ్ విద్యుత్ కేంద్రం రీప్లేస్ చేయనుంది.
*బిలిబినో ప్లాంట్ లైసెన్స్‌ను మరో ఐదేళ్ల పాటు పొడిగించడం జరిగింది. 
*బిలిబినో అణువిద్యుత్ కేంద్రాన్ని 1974లో నిర్మించడం జరిగింది. దీని సామర్థ్యం 48 మెగావాట్లు. 
*ఇక కొత్త అణువిద్యుత్ కేంద్రం రావడంతో బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రంతో పాటు బిలిబినో అణువిద్యుత్ కేంద్రంను కూడా మూసివేయాలని రష్యా ప్రభుత్వం భావిస్తోంది.


జాతీయం

100 మార్గాల్లో ప్రైవేట్ రైళ్లు
*ముంబయి-దిల్లీ సహ 100 మార్గాల్లో 150 రైళ్లను ప్రైవేటు ఆపరేటర్ల ఆధ్యర్యంలో నడిపేందుకు నీతీ ఆయోగ్‌, భారతీయ రైల్వే సంస్థలు ఒక చర్చా పత్రాన్ని వెలువరించాయి. 
*ఈ రైలు మార్గాల ప్రైవేటీకరణ ద్వారా సుమారు రూ.22,500 కోట్లు పెట్టుబడులు రానున్నాయి.
*దిల్లీ-పట్నా, ఇండోర్‌-ఓక్లా, లఖ్‌నవూ- జమ్మూ-తావీ, చెన్నై-ఓక్లా తదితర 100మార్గాల్లో ప్రైవేటు రైళ్లను నడపాలని ఈ పత్రంలో ప్రతిపాదించారు.
*ఈ మొత్తం 100 మార్గాలను పది క్లస్టర్ల పరిధిలోకి తెచ్చారు.



ఢిల్లీలో తొలి స్మాగ్‌ టవర్‌
*దక్షిణ ఢిల్లీలో అత్యంత రద్దీగా ఉండే ప్రఖ్యాత లజ్‌పత్‌ నగర్‌ సెంట్రల్‌ మార్కెట్‌లో స్మాగ్‌ టవర్‌ (గాలి శుద్ధీకరణ టవర్‌)ను నిర్మించారు. 
* ఈ మార్కెట్‌లో రోజూ 15 వేల మందికి పైగా ప్రజలు కొనుగోళ్లు జరుపుతారు. 
*దీంతో అక్కడి ఇరుకు ప్రాంతంలో కాలుష్యం స్థాయిలు క్రమంగా పెరుగుతున్నాయి. 
*ఈ నేపథ్యంలో తూర్పు ఢిల్లీ ఎంపీ, బీజేపీ నేత, మాజీ క్రికెటర్‌ గౌతం గంభీర్‌ సహకారంతో స్థానిక ట్రేడర్స్‌ అసోసియేషన్‌ లజ్‌పత్‌ నగర్‌ (టీఏఎల్‌ఎన్‌) ప్రతినిధులు ఈ మార్కెట్‌లో స్మాగ్‌ టవర్‌ నిర్మాణాన్ని చేపట్టారు.
*ఢిల్లీలో నిర్మించిన తొలి స్మాగ్‌ టవర్‌ ఇదే.
1.ఎత్తు--ఈ టవర్‌ ఎత్తు 20 అడుగులు. ఈ టవర్‌ను నాలుగు అడుగుల వేదిక మీద నిర్మించారు. 
*దీంతో రోడ్డు ఉపరితలం నుంచి చూస్తే టవర్‌ ఎత్తు 24 అడుగులుగా ఉంటుంది. 
* గత ఏడాది చైనా 328 అడుగుల ఎత్తున్న అతిపెద్ద స్మాగ్‌ టవర్‌ను షాంఘైలో నిర్మించింది. 
2.వ్యయం--టవర్‌ నిర్మాణానికి రూ. ఏడు లక్షలు ఖర్చయింది. గౌతవ్‌ు గంభీర్‌ ఫౌండేషన్‌ ఈ వ్యయాన్ని భరించగా.. నిర్వహణకు అయ్యే రూ.30 వేల వ్యయాన్ని లజ్‌పత్‌ నగర్‌ ట్రేడర్స్‌ అసోసియేషన్‌ ఖర్చు చేయనున్నది.
3.రూపకల్పన--- సిలిండర్‌ ఆకృతిలో ఈ టవర్‌ నిర్మాణం ఉంటుంది. స్తంభంపై ఓ పెద్ద ఇన్‌లెట్‌(కలుషిత గాలి పీల్చుకునే ఏర్పాటు)తో పాటు మరో నాలుగు అవుట్‌లెట్‌(శుద్ధమైన గాలిని బయటకు పంపించడానికి) యూనిట్లు ఉన్నాయి. 
*ఇన్‌లెట్‌ యూనిట్‌లో ఉన్న ఫ్యాన్లు కలుషిత గాలిని లోపలికి తీసుకుంటాయి. విద్యుత్‌తో ఈ టవర్‌ పని చేస్తుంది.
4.పరిధి : టవర్‌ నిర్మించిన స్థానం నుంచి చుట్టుపక్కల 500 మీటర్ల నుంచి 750 మీటర్ల పరిధి మేర ఉన్న గాలిని ఈ స్మాగ్‌ టవర్‌ శుద్ధి చేస్తుంది. 
*రోజుకు 2,50,000 నుంచి 6,00,000 క్యూబిక్‌ మీటర్ల గాలిని శుద్ధి చేసి స్వచ్ఛమైన గాలిని విడుదల చేస్తుంది.
*గాలిలోని పీఎం(పార్టిక్యులేట్‌ మ్యాటర్‌) 2.5 నుంచి పీఎం 10 స్థాయి వరకున్న కాలుష్య కారకాల్ని దాదాపు 80 శాతం శుద్ధి చేసేలా టవర్‌ లోపల ఓ మెషిన్‌ను ఏర్పాటు చేశారు. 
*నాలుగు అవుట్‌లెట్‌ యూనిట్ల నుంచి స్వచ్ఛమైన గాలిని ఈ టవర్‌ విడుదల చేస్తుంది.


దేశంలో 5 ప్రయోగశాల ప్రారంభం
*దేశ భవిష్యత్ రక్షణ అవసరాలపై అధునాతన పరిశోధనలు చేయడానికి రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో) యువ శాస్త్రవేత్తలతో హైదరాబాద్‌లో కొత్తగా ఒక ప్రయోగశాలను ఏర్పాటు చేసింది. 
*దేశంలోని ఐదు నగరాల్లో కూడా ఇలాంటి కొత్త ప్రయోగశాలలు ఏర్పాటయ్యాయి.
*హైదరాబాద్ నగర శివారు బాలాపూర్‌లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్(ఆర్‌సీఐ) మార్గంలో ఉన్న దేవతల గుట్టలో స్థాపించారు.
*డిఫెన్స్ మెటలర్జికల్ రీసెర్చ్ ల్యాబోరేటరీ(డీఎంఆర్ఎల్)కి చెందిన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్(ఏటీసీ) కూడా ఇక్కేడే ఉండేది.
*అయితే, దీని స్థానంలో ప్రధాని మోడీ సర్కారు ప్రతిష్టాత్మక యువ శాస్త్రవేత్తల ప్రయోగశాలలను ఏర్పాటు చేశారు.
*హైదరాబాద్ తోపాటు బెంగళూరు, ముంబై, చెన్నై, కోల్‌కతాలలో ఈ నూతన ప్రయోగశాలలను ఏర్పాటు చేశారు. 
*స్మార్ట్ మెటీరియల్స్ పై ఇక్కడ పరిశోధనలు చేయనున్నారు.
* రక్షణ వ్యవస్థలో ఆధునాతన మెటీరియల్స్ కీలంగా ఉంటాయి.
తక్కువ వ్యయంలో రూపొందడంతోపాటు పనితీరు స్మార్ట్ గా, బహుముఖంగా ఉంటుంది. 
*శత్రువుల రాడార్లు పసిగట్టడం లాంటి స్మార్ట్ మెటీరియల్స్ పై కూడా ఇక్కడ పరిశోధనలు జరుగుతాయి.
*హైదరాబాద్ తోపాటు కోల్‌కతాలోని యువ శాస్త్రవేత్తల ల్యాబ్ లకు డైరెక్టర్లుగా హైదరాబాద్ లోని డీఎంఆర్ఎల్ ఆర్సీఐ ప్రయోగశాల నుంచే ఇద్దరు శాస్త్రవేత్తలు ఎంపికయ్యారు.
*ఆర్సీఐకి చెందిన శాస్త్రవేత్త పర్వతనేని శివప్రసాద్.. కోల్‌కతాలో ఏర్పాటు చేసిన యువ శాస్త్రవేత్తల ప్రయోగశాలకు డైరెక్టర్ గా నియమితులయ్యారు. 
*ఈయన ప్రస్తుతం ఆర్సీఐలో యాంటి ట్యాంక్ గైడెడ్ క్షిపణుల కోసం ఇమేజింగ్ ఇన్‌ఫ్రారెడ్ సీకర్స్ టెక్నాలజీ డిజైన్, అభివృద్ధిపై శోధనలు చేస్తున్నారు.
*డీఎంఆర్ఎల్ లో శాస్త్రవేత్తగా పనిచేస్తున్న మరో శాస్త్రవేత్త రామకృష్ణన్ రాఘవన్ హైదరాబాద్ ప్రయోగశాలకు డైరెక్టర్‌గా నియమితులయ్యారు. 
*కొత్తగా ఏర్పాటు చేసిన ప్రయోగశాలలకు నియమించిన శాస్త్రవేత్తల వయస్సు 35ఏళ్లలోపు వారే.
*అత్యాధునిక సాంకేతిక పరిశోధనల కోసం డీఆర్డీవో నిర్మించిన యువ శాస్త్రవేత్తల ప్రయోగశాలను ప్రధాని నరేంద్ర మోడీ బెంగళూరులో డిసెంబర్ 2వ తేదీన  ప్రారంభించి.. వాటిని జాతికి అంకితం చేశారు.


.సైన్స్ కాంగ్రెస్ లో ప్రధాని
ప్రసంగంలోని అంశాలు --
1.దేశంలోని యువశాస్త్రవేత్తలంతా 'ఇన్నోవేట్‌ (ఆవిష్కరణ), పేటెంట్‌ (మేధో హక్కులు), ప్రొడ్యూస్‌ (ఉత్పత్తి), ప్రాస్పర్‌ (వర్ధిల్లు)' నినాదాన్ని పాటించాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు.
2.దేశం వేగంగా అభివృద్ధి చెందడంలో ఈ నాలుగు మెట్లు ఉపయోగపడతాయి. 
3.దేశంలోని శాస్త్ర, సాంకేతిక రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు రావాల్సిన అవసరం ఉంది అని పేర్కొన్నారు.
4.కర్ణాటకలోని బెంగళూరులో 107వ భారత సైన్స్‌ కాంగ్రెస్‌ సమావేశాలను ప్రధాని మోదీ ప్రారంభించారు. 
5.ఇన్నోవేట్‌, పేటెంట్‌, ప్రొడ్యూస్‌, ప్రాస్పర్‌ (ఐపీ3) అనే నినాదాన్ని ఇచ్చారు.
6.ప్రపంచ ఆవిష్కరణల సూచీలో భారత్‌ 52వ ర్యాంకులో ఉంది.
7.యువశాస్త్రవేత్తలు ప్లాస్టిక్‌కు సమర్థవంతమైన, చవకైన ప్రత్యామ్నాయం కనుగొనాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.
8.2022నాటికి శిలాజ ఇంధనాల దిగుమతులను పది శాతం మేర తగ్గించుకోవాలని కేంద్రం ప్రయత్నిస్తుంది.


రెండు కంపెనీల ఆస్తులను వేలం వేయనున్న సెబీ
*రాయల్‌ ట్వింకిల్‌ స్టార్‌ క్లబ్‌ లిమిటెడ్, సిట్రస్‌ చెక్‌ ఇన్స్‌ లిమిటెడ్‌ సంస్థల ఆస్తులను ఈ నెల 23న సెబీ వేలం వేయనుంది.
*మోసపూరిత ప్రకటనలతో ఇన్వెస్టర్ల నిధులను ఈ సంస్థలు కొల్లగొట్టడంతో, వాటి వసూలుకు సెబీ ఈ చర్య చేపడుతోంది. 
*సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆస్తులను వేలం వేస్తుంది.
* వేలానికి ఉంచే ఈ రెండు సంస్థల ఆస్తులు ముంబై, బెంగళూరు, కేరళలో ఉన్నాయి. 
*ముంబైలోని లోయర్‌పారెల్‌లో ఉన్న ప్రాపర్టీ రిజర్వ్‌ ధర రూ.25.6 కోట్లు కాగా, లోనవాలాలో ఉన్న ప్రాపర్టీ రిజర్వ్‌ ధర రూ.35.25 కోట్లు, బెంగళూరులో ప్రాపర్టీ రిజర్వ్‌ ధర రూ.32 కోట్లు, కేరళలోని అలప్పుజలో ప్రాపర్టీ రిజర్వ్‌ ధర 15.3 కోట్లుగా ఉంది.
* టైమ్‌ షేర్‌ హాలిడే ప్లాన్ల పేరుతో అక్రమంగా రూ.2,656 కోట్లను సమీకరించడంతో రాయల్‌ ట్వింకిల్‌పై, ఆ సంస్థ నలుగురు డైరెక్టర్లపై నాలుగేళ్లపాటు సెబీ నిషేధం విధిస్తూ 2015 ఆగస్ట్‌లోనే ఆదేశాలు జారీ చేసింది.
* నిబంధనలు ఉల్లంఘించడంతో సిట్రస్‌ చెక్‌ ఇన్స్‌పై రూ.50 లక్షల జరిమానా విధించడంతోపాటు.. ప్రజల నుంచి నిధులు సమీకరించకూడదని గతంలో ఆదేశించింది.   


గరిష్టస్థాయికి విదేశీ మారక నిల్వలు


*దేశ విదేశీ మారక నిల్వలు మరో రికార్డు గరిష్ఠాన్ని చేరాయి. డిసెంబరు 27తో ముగిసిన వారంలో 2.520 బిలియన్‌ డాలర్లు పెరిగి 457.468 బిలియన్‌ డాలర్లకు చేరాయి. 
* అంతకుముందు వారంలోనూ విదేశీ మారక నిల్వలు 456 మిలియన్‌ డాలర్లు అధికమై 454.948 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి.
*విదేశీ మారక నిల్వలు జీవన కాల గరిష్ఠానికి చేరడంలో విదేశీ కరెన్సీ ఆస్తులు ముఖ్య పాత్ర పోషించాయి. 
*సమీక్షా వారంలో విదేశీ కరెన్సీ ఆస్తులు.. 2.203 బిలియన్‌ డాలర్లు పెరిగి 424.936 బిలియన్‌ డాలర్లకు పెరిగాయి.
* పసిడి నిల్వలు కూడా 260 మిలియన్‌ డాలర్లు పెరిగి 27.392 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. 
*అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) వద్ద స్పెషల్‌ డ్రాయింగ్‌ రైట్స్‌ 2 మిలియన్‌ డాలర్లు తగ్గి 1.441 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి. 

*ఐఎంఎఫ్‌ వద్ద దేశ నిల్వల స్థితి 58 మిలియన్‌ డాలర్లు పెరిగి 3.7 బిలియన్‌ డాలర్లకు చేరింది.

రాష్ట్రీయం 

.కృష్ణపట్నం పోర్ట్ లో అదానీ వాటా
* దేశంలో అతిపెద్ద మల్టీపోర్ట్‌ ఆపరేటర్‌ అయిన అదానీ గ్రూప్‌ కంపెనీ అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌ కృష్ణపట్నం పోర్ట్‌ కంపెనీలో (కేపీసీఎల్‌) 75 శాతం వాటాను కొనుగోలు చేయనుంది.
*కేపీసీఎల్‌ను ప్రమోట్‌ చేస్తున్న సీవీఆర్‌ గ్రూప్‌ నుంచి ఈ వాటాను దక్కించుకుంటోంది. 
*కేపీసీఎల్‌ను రూ.13,572 కోట్లుగా విలువ కట్టారు. డీల్‌ అనంతరం మిగిలిన 25 శాతం వాటా కేపీసీఎల్‌ చేతిలోనే ఉంటుంది.
*మల్టీ కార్గో ఫెసిలిటీ కలిగిన ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణపట్నం పోర్టు ద్వారా 2018-19లో 5.4 కోట్ల మెట్రిక్‌ టన్నుల సరుకు రవాణా జరిగింది.
*దీనిని ఏడేళ్లలో 10 కోట్ల మెట్రిక్‌ టన్నుల స్థాయికి తీసుకు వెళ్లాలని అదానీ పోర్ట్స్‌ భావిస్తోంది.
*కృష్ణపట్నం పోర్టు గత ఆర్థిక సంవత్సరంలో రూ.2,394 కోట్ల టర్నోవర్‌ సాధించింది. 
*తూర్పు తీరంలో అదానీకి ఇది అయిదవది కాగా, ఆంధ్రప్రదేశ్‌లో మొదటిది.
*2025 నాటికి 40 కోట్ల మెట్రిక్‌ టన్నుల సరుకు రవాణా స్థాయికి చేరాలన్న అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌ లక్ష్యానికి ఈ కొనుగోలు దోహదం చేయనుంది. 
*120 రోజుల్లో ఈ లావాదేవీని పూర్తి చేస్తారు.


ఆంధ్రప్రదేశ్ రాజధాని పై బోస్టన్ కమిటీ నివేదిక
*రాజధాని నిర్మాణం కోసం వనరులు మౌలిక వసతుల పై అధ్యయనం చేయడం కోసం జిఎన్ రావు కమిటీని గతంలో నియమించారు.
*జిఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదిక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన 3 రాజధానిల ప్రకటనను సమర్థిస్తూ ఉంది.
* రాష్ట్రంలో రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై సాంకేతికంగా విశ్లేషణ చేసేందుకు బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ ను ప్రభుత్వం నియమించింది.
*రాజధానిలోని అన్ని జిల్లాలలో అధ్యయనం చేసిన బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించింది.
*బోస్టన్ కమిటీ నివేదికలోని అంశాలు--
1.ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను బట్టి అమరావతి అభివృద్ధి సంక్లిష్టమైనది బోస్టన్ కమిటీ వెల్లడించింది. అమరావతిలో కొత్తగా టేక్ అప్ చేసి సిటీలకు నాలుగు నుంచి 4.5 బిలియన్ డాలర్లు ఖర్చవుతుందని ఈ నివేదికలో తెలిపింది.
2.32 గ్రీన్ఫీల్డ్ సిటీ లను పరిగణనలోకి తీసుకొని అధ్యయనం చేసినట్టు బోస్టన్ కమిటీ నివేదికలో వెల్లడించింది.
3.అమరావతి భూముల అమ్మకం ద్వారా వచ్చే నిధులు సరిపోవు,అమరావతి నిర్మాణానికి రుణం తెస్తే ప్రతి సంవత్సరం 10వేల కోట్ల రూపాయల వడ్డీ కట్టాలి.
4. అమరావతికి గతంలో వరదలు వచ్చిన నేపథ్యంలో అక్కడ నిర్మాణాలు ప్రమాదకరం.
5.విశాఖలో మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉన్నాయి.15 లక్షల మంది జనాభా అక్కడ ఉన్నారు.విజయవాడలాంటి చోట్ల మౌలిక సదుపాయాలు తక్కువగా ఉన్నాయి.బీసీజీ విశాఖ, విజయవాడ, కర్నూలును ప్రధానంగా భావించి దృష్టి సారించాలి. విశాఖలో సీఎం క్యాంప్ ఆఫీస్ సహా ఏడు కీలక విభాగాలు ఉండవచ్చు.
6.అత్యవసర సమావేశాల కోసం అసెంబ్లీ, హైకోర్టు బెంచ్ విశాఖలో ఉండవచ్చు. అప్పిలేట్ అథారిటీలు, హైకోర్టు కర్నూలులో ఉండాలి. 
7.ఎడ్యుకేషన్ విషయంలో విజయవాడకు, టూరిజం విషయంలో విశాఖకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి.  40 సంవత్సరాలలో ఒక నగరంపై లక్ష కోట్ల రూపాయలు పెడితే అభివృద్ధి చెందే అవకాశం ఉందని కానీ ప్రస్తుతం లక్ష కోట్ల రూపాయలు పెట్టే పరిస్థితిలో ఏపీ లేదు.
8.13 జిల్లాలను ఆరు ప్రాంతాలుగా విభజించి ఆరు ప్రాంతాలలో వనరులను, అభివృద్ధికి ఆటంకాలను, సమస్యలకు పరిష్కారాలను కమిటీ పరిశీలించింది.
9.వాటర్ గ్రిడ్, రోడ్ గ్రిడ్, బ్యాక్ వాటర్ టూరిజంతో పాటు పోలవరం, ప్లాస్టిక్ మరియు గ్యాస్ రంగాల్లో పరిశ్రమలు గోదావరి డెల్టాలో అభివృద్ధి చేయవచ్చు.  మైపాడు, మచిలీపట్నం బీచ్ లను అభివృద్ధి చేయాలి.
10. టమాటా పంటకు కోల్డ్ స్టోరేజీలు చిత్తూరు జిల్లాలో ఏర్పాటు చేయాలని ఎలక్ట్రానిక్ పరిశ్రమలు తిరుపతిలో ప్రోత్సహించాలి.
11.ఆటోమొబైల్ లాజిస్టిక్ హబ్ కు కర్నూలు - అనంతపురం ప్రాంతంలో ఉండవచ్చు. రాష్ట్రానికి ప్రకృతి సంపద ఉన్నప్పటికీ సరిగా వినియోగించుకోవటం లేదు. 8 జిల్లాల్లో పారిశ్రామిక వృద్ధి చాలా తక్కువగా ఉంది.






No comments:

Post a Comment