అంతర్జాతీయం
కాలాపాని వివాదం
కాలాపాని వివాదం
*నేపాల్‌తో సరిహద్దు వివాదం ఇంకా కొనసాగుతోంది.
*జమ్మూ కశ్మీర్‌ను కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించిన తర్వాత కేంద్ర హొంశాఖ కొత్తగా తీసుకువచ్చిన మ్యాప్ పై నేపాల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
* భారత్ కొత్తగా డిజైన్ చేసిన మ్యాప్‌లో సరిహద్దులోని కాలాపాని ప్రాంతాన్ని భారత్‌లో కలిపేయడం సరికాదని నేపాల్ అభ్యంతరం తెలిపింది. కాలాపాని ప్రాంతం నేపాల్‌కు చెందుతుందని దీన్ని భారత్ సరిచేసుకోవాలని కోరింది.
*విదేశీ వ్యవహారాల కార్యదర్శి రవీష్ కుమార్ భారత్ వాదనను వినిపించారు. కొత్తగా రూపొందించిన మ్యాప్‌లో అన్నీసరిగ్గానే ఉన్నాయి.సరిహద్దు ప్రాంతాల పరిధిని కూడా దాటలేదు.
*అయితే సరిహద్దు రేఖలను డిజైన్ చేసే ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని స్పష్టం చేశారు.
* భారత్ భూభాగం ఏమేరకు ఉందో మ్యాప్‌లో కూడా అంత వరకే ప్రస్తావించినట్టు రవీష్ కుమార్ తెలిపారు.
*అంతేకాదు పరిధి మించి మరో దేశ బౌండరీలను భారత్ మ్యాప్‌లో కలపలేదని వివరణ ఇచ్చారు.
*నేపాల్‌తో సరిహద్దుల విషయంలో ఎలాంటి పరిధులు
* పాత మ్యాప్‌లో ఎలా అయితే ఉన్నిందో కొత్త మ్యాప్‌లో కూడా సరిహద్దులు అలానే ఉన్నాయని చెప్పారు.
*ఇదిలా ఉంటే 1816లో భారత్-నేపాల్ మధ్య జరిగిన సుగౌలి ఒప్పందం సందర్భంగా నాడు ఇరు దేశాలు మార్చుకున్న ఒరిజినల్ మ్యాప్‌ను 15 రోజుల్లోగా సబ్మిట్ చేయాలని నేపాల్ సుప్రీంకోర్టు ఆ దేశ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
*నేపాల్ భూభాగంను పరిరక్షించాలంటూ ఆ దేశ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో కేసును విచారణ చేసిన న్యాయస్థానం పై విధంగా ఆదేశాలు జారీ చేసింది.
ఐఎస్ కొత్త చీఫ్‌గా అబు ఇబ్రహీం
*ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్రవాద సంస్థ తమ కొత్త చీఫ్‌గా అబు ఇబ్రహీం అల్ హష్మి అల్ ఖురేషీ పేరును ప్రకటించింది.
*అబు ఇబ్రహీంను నూతన 'ఖలీఫా'గా ఇస్లామిక్ స్టేట్ పేర్కొంది.
*ఖురైష్ గిరిజన తెగకు చెందిన అబు ఇబ్రహీంను జిహాద్‌లో కీలక వ్యక్తిగా ఐఎస్ పేర్కొంది.
జాతీయం
అయోధ్య తీర్పు పై ప్రత్యేక విభాగం
*అయోధ్య భూవివాదం, దానిపై సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు సంబంధిత అంశాలన్నింటినీ చూడడానికి అదనపు కార్యదర్శి జ్ఞానేశ్ కుమార్ నేతృత్వంలో ముగ్గురితో ఒక ప్రత్యేక విభాగాన్ని కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసింది.
*వివాదాస్పద భూమి రాముడికే చెందుతుందని, అయోధ్యలోనే ఐదెకరాల స్థలాన్ని మసీదు కోసం యూపీ సున్నీ వక్ఫ్‌బోర్డుకు కేటాయించాలని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు ఇచ్చింది.
* అయోధ్యపై సుప్రీంకోర్టు తీర్పులు, ఇతర విషయాలను ఈ విభాగం పరిశీలిస్తుంది.
*ఈ విభాగాధిపతి జ్ఞానేశ్‌కుమార్ ప్రస్తుతం కేంద్రం హోంశాఖ తరఫున జమ్మూకశ్మీర్, లద్దాఖ్ వ్యవహరాలను పర్యవేక్షిస్తున్నారు.
నేషనల్ మెడికల్ కమిషన్ చీఫ్ నియామకం
*వైద్య విద్య నియంత్రణ సంస్థ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) స్థానంలో కేంద్రం తీసుకువచ్చిన నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ)కు తొలి చీఫ్‌ను కేంద్రం ఎంపిక చేసింది.
* ఢిల్లీ ఎయిమ్స్(ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్)లో చెవి, ముక్కు, గొంతు(ఈఎన్‌టీ) విభాగంలో ప్రొఫెసర్‌గా ఉన్న డాక్టర్ సురేశ్ చంద్ర శర్మను ఎన్‌ఎంసీ చైర్మన్‌గా నియమించింది.
*నియామకాల కేబినెట్ కమిటీ శర్మ నియామకానికి ఆమోదం తెలపడంతో కేంద్ర సిబ్బంది శాఖ ఈ మేరకు ఉత్తర్వులను విడుదల చేసింది.
* శర్మ మూడేళ్ల పాటు కానీ లేదా తనకు 70 ఏళ్ల వయసు వచ్చేవరకు కానీ ఆ పదవిలో ఉంటారు.
*అవినీతి ఆరోపణలు రావడంతో 2018లో ఎంసీఐని రద్దు చేశారు.
*సంబంధిత విధి నిర్వహణ కోసం ప్రత్యామ్నాయంగా బోర్డ్ ఆఫ్ గవర్నర్స్‌ను తాత్కాలిక ప్రాతిపదికన నియమించారు.
*ఎన్‌ఎంసీకి ఒక చైర్ పర్సన్, 10 మంది ఎక్స్ అఫిషియొ సభ్యులు ఉంటారు.
సైన్స్ కాంగ్రెస్ ను ప్రారంభించిన ప్రధాని
*బెంగళూరులో 107వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.
*భారత సైన్స్ కాంగ్రెస్ చరిత్రలో తొలిసారిగా రైతు సైన్స్ కాంగ్రెస్ జరుగుతుంది.
* దేశం నలుమూలల నుంచి శాస్త్రవేత్తలు, పరిశోధకులు, విద్యావేత్తలతో వివిధ దేశాలకు చెందిన సైన్స్ ప్రముఖులతో ఏటా నిర్వహించే 'భారత సైన్స్ కాంగ్రెస్' బెంగళూరులో ప్రారంభమైంది.
* బెంగళూరులోని వ్యవసాయ శాస్త్రాల విశ్వవిద్యాలయం(యూఏఎస్‌బీ) వేదికగా ఈ నెల ఏడో తేదీ వరకు ఐదు రోజులపాటు సాగే ఈ 107వ సైన్స్ కాంగ్రెస్ జరుగుతుంది.
*రసాయనశాస్త్రంలో ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారం పొందిన జర్మనీ శాస్త్రవేత్త ప్రొఫెసర్ స్టెఫాన్ హెల్(2014), ఇజ్రాయెల్ శాస్త్రవేత్త అడా ఇ.యోనథ్ (2009) సదస్సులో పాల్గొంటున్నారు.
*ఆహార భద్రతకు పర్యావరణ అనుకూల వ్యవసాయం, ఆహార, పోషక భద్రత కోసం పంటలను మెరుగుపరచడం, క్యాన్సర్ ఔషధ ఆవిష్కరణల్లో సవాళ్లు, అవకాశాలు, కృత్రిమ మేధ(ఏఐ), గ్రామీణ జనాభాలో వ్యాధుల వ్యాప్తి, శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానంతో గ్రామీణాభివృద్ధి, ఇతర అంశాలపై ఈ వైజ్ఞానిక సదస్సులో చర్చలు ఉంటాయి.
*రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం కోసం సమీకృత వ్యవసాయం, వ్యవస్థాపకత(ఎంట్రిప్రెన్యూయర్‌షిప్)లో రైతుల వినూత్న విధానాలు, వాతావరణ మార్పులు, జీవవైవిధ్యం, ప్రకృతి పరిరక్షణ, రైతు సాధికారత, వ్యవసాయ రంగ సమస్యలు, విధానపరమైన అంశాలు సహా అనేక విషయాలపై ఈ నెల 6న జరిగే రైతు సైన్స్ కాంగ్రెస్ చర్చించనుంది.
*ఇక్రిశాట్‌లలో ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ కె.పూర్ణచంద్రరావు-
1.రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తామని చాన్నాళ్లుగా చెబుతున్నారు. అది సాకారమయ్యే పరిస్థితులు కనిపించడం లేదని, ఈ దిశగా చర్యలే లేవు.
2.రైతుల ఆదాయంలో వార్షిక పెరుగుదల రెండు శాతం కూడా లేదని, ఈ నామమాత్రపు పెరుగుదలతో రైతు ఆదాయం రెండింతలు కావాలంటే 35 ఏళ్లు పడుతుందని ఆయన తెలిపారు.
3.రైతుల ఆదాయం గణనీయంగా పెరగాలంటే వ్యవసాయ ఖర్చులు తగ్గాలని, ఉత్పాదకత పెరగాలని, గిట్టుబాటు ధరలు ఉండాలని, ఇందుకు ప్రభుత్వం నిర్దిష్టమైన చర్యలు చేపట్టాలి.
4.కనీస మద్దతుధరలను పేరుకు ప్రకటిస్తున్నా పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదని, ఫలితంగా పప్పు ధాన్యాలు లాంటి పంటలు పండించే రైతులకు ప్రయోజనం దక్కడం లేదు.
5.ప్రభుత్వ విధానాల్లో వ్యవసాయానికి ప్రాధాన్యం ఇవ్వడం లేదు, వ్యవసాయమంటే చిన్నచూపు ఉంది.దేశంలో ఆహార ధాన్యాల కొరత లేనంత కాలం వ్యవసాయ సంక్షోభం గురించి పాలకులు పట్టించుకోవడం లేదు.
6.వ్యవసాయ స్థూల దేశీయోత్పత్తి(వ్యవసాయ జీడీపీ)లో కనీసం రెండు శాతం ఈ రంగంలో పరిశోధనల కోసం వెచ్చించాలి.
7.ఆచరణకు వచ్చేసరికి కేటాయింపులు 0.6 శాతం దాటడం లేదు.
8.దేశ జీడీపీలో కనీసం రెండు శాతం నిధులను అన్ని రంగాల్లో పరిశోధనలు-అభివృద్ధి(ఆర్ అండ్ డీ)కి కేటాయించాలని ప్రభుత్వం చెబుతున్న, కానీ కేటాయింపులు ఒక్క శాతంలోపే ఉన్నాయి.
ఐరోపాలోని అభివృద్ధి చెందిన దేశాల్లో పరిశోధనలకు జీడీపీలో రెండు నుంచి ఐదు శాతం వరకు నిధులను కేటాయిస్తున్నారు.
సైన్స్ కాంగ్రెస్‌లో భాగంగా మహిళా సైన్స్ కాంగ్రెస్, బాలల సైన్స్ కాంగ్రెస్ కూడా జరుగనున్నాయి.
*శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగంలో వేర్వేరు విభాగాల్లో పనిచేస్తున్న మహిళలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి, వారి విజయాలను, అనుభవాలను పంచుకొనేందుకు అవకాశం కల్పించడం మహిళా సైన్స్ కాంగ్రెస్ ఉద్దేశం.
*ఈ రంగంలో మహిళల పాత్రను పెంచడానికి, వారి ప్రతిభాసామర్థ్యాలను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవడానికి చేపట్టాల్సిన చర్యలను, విధానాలను సిఫార్సు చేస్తూ ఈ సదస్సు ఒక దార్శనిక పత్రాన్ని రూపొందించనుంది. ఈ నెల 5, 6 తేదీల్లో ఈ సదస్సు జరుగనుంది.
*పిల్లల సైన్స్ కాంగ్రెస్ ఈ నెల 4, 5, 6 తేదీల్లో జరుగనుంది. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు ప్రముఖ శాస్త్రవేత్తలు, నోబెల్ పురస్కార గ్రహీతలతో మాట్లాడే అవకాశం లభించనుంది.
ఆర్బిఐ లిక్విడిటీ చర్యలు
*తగిన ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) చర్యల ద్వారా ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ పెంపునకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది.
* ఓపెన్‌మార్కెట్ ఆపరేషన్స్ (ఓఎంఓ) ద్వారా జనవరి 6న ప్రభుత్వ బాండ్ల కొనుగోలు, అమ్మకం చర్యలను చేపట్టనుంది.
*ఆర్‌బీఐ రూ.10,000 కోట్ల చొప్పున బాండ్ల కొనుగోలు, అమ్మకానికి చర్యలు
*బాండ్ల కొనుగోలు ద్వారా బ్యాంకింగ్‌సహా ఫైనాన్స్ సంస్థల్లోకి మరింత నిధులు పంప్ చేయడానికి వీలు కలుగుతుంది.
*అలాగే బాండ్ల విక్రయ చర్య వ్యయాలకు సంబంధించి కేంద్రానికి మరిన్ని నిధులు సమకూరడానికి దోహదపడుతుంది.
*ఇప్పటికే ఈ తరహా ఓఎంఓ చర్యలను రెండుసార్లు ఆర్‌బీఐ చేపట్టింది.
*ఇప్పటికే ఈ తరహా ఓఎంఓ చర్యలను రెండుసార్లు ఆర్‌బీఐ చేపట్టింది.
తగ్గిన బంగారం దిగుమతి
*ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-నవంబరులో దేశంలోకి 20.57 బిలియన్ డాలర్ల (సుమారు రూ.1.45 లక్షల కోట్ల) విలువైన బంగారం దిగుమతి అయ్యింది.
*2018-19 ఇదే కాలం నాటి 22.16 బి.డా. (సుమారు రూ.1.57 లక్షల కోట్ల) దిగుమతులతో పోలిస్తే, ఈసారి 7 శాతం తగ్గింది.
*ఇందువల్ల దేశ కరెంటు ఖాతా లోటు 133.74 బిలియన్ డాలర్ల నుంచి 106.84 బి.డా.కు దిగి వచ్చింది. 2019 జులై-ఆగస్టు-సెప్టెంబరులలో పసిడి దిగుమతులు ఏడాది క్రితంతో పోలిస్తే తగ్గాయి.
* అక్టోబరులో 5 శాతం పెరిగి 1.84 బి.డా.కు, నవంబరులో 6.6 శాతం అధికంగా 2.94 బి.డా.కు చేరాయి.
*ఆభరణాల తయారీ కోసం అధికంగా పసిడిని మనదేశం దిగుమతి చేసుకుంటోంది. ఏడాదికి 800-900 టన్నుల బంగారం దేశంలోకి దిగుమతి అవుతోంది.
*ఏప్రిల్-నవంబర్ మధ్యకాలంలో ఆభరణాల ఎగుమతులు 1.5 శాతం తగ్గి 20.5 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి.
*2018-19లోనూ పసిడి దిగుమతులు ఏడాది ప్రాతిపదికన 3 శాతం తగ్గి 32.8 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
*2018-19లోనూ పసిడి దిగుమతులు ఏడాది ప్రాతిపదికన 3 శాతం తగ్గి 32.8 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
No comments:
Post a Comment