Current Affairs in Telugu 31 December 2019

అంతర్జాతీయం


బంగారు నిల్వలు పెంచుకుంటున్న కేంద్ర బ్యాంకులు
*రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సహా 14 దేశాల సెంట్రల్‌ బ్యాంకులు తమ బంగారం నిల్వలను 2019లో పెంచుకున్నాయి. 
*ఈ మేరకు వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ లెక్కలు వెల్లడిస్తున్నాయి. 
*వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఇండియా) సోమసుందరం--2019లో ఆర్బీఐ పసిడి కొనుగోళ్లు పెద్ద ఎత్తున పెరిగాయి. 
* ఆర్బీఐ దగ్గర పసిడి నిల్వలు ఈ ఏడాది 60 టన్నులు దాటాయి. 
* ఈ ఏడాదే ఒక టన్నుకు పైగా నిల్వలు పెంచుకున్నారు. 
*రష్యా, చైనా దేశాల వద్ద పెద్ద ఎత్తున బంగారం కొనుగోళ్లలో ఈ రెండు దేశాలే ముందున్నాయి. 
* ఇండియా, టర్కీ, పోలాండ్‌, కజకిస్తాన్‌ దేశాలు కూడా పసిడిని పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తాయి. 
*ఎక్కువ బంగారం నిల్వలు కలిగి ఉన్న దేశాల్లో అమెరికా, జర్మనీ, ఐఎంఎఫ్‌, ఇటలీ, ఫ్రాన్స్‌, రష్యన్‌ ఫేడరేషన్‌, చైనా, స్విట్జర్లాండ్‌, జపాన్‌, ఇండియా ఉన్నాయి.

2019 -వివిధ అంతర్జాతీయ అంశాలు
1.
*అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అభిశంసన వ్యవహారం అంతర్జాతీయ ప్రధాన ఘట్టాల్లో ఒకటి. 
*వచ్చే ఏడాది నవంబరులో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేయనున్న ట్రంప్‌ సరికొత్త వివాదంలో చిక్కుకున్నారు. 
*ఎలాగైనా తనకు పోటీ లేకుండా చూసుకునేందుకు, తనకు ప్రత్యర్థిగా బరిలో నిలుస్తున్న డెమోక్రాటిక్‌ పార్టీ అభ్యర్థి జో బిడెన్‌ ను ఓడించేందుకు ఇప్పటి నుంచే ఆయన వ్యూహాలు రూపొందించడం ప్రారంభించారు. 
*అందులో భాగంగా జో బిడెన్‌, ఆయన కుమారుని అవినీతిపై విచారణ జరిపించాలంటూ ఉక్రెయిన్‌ అధ్యక్షుడికి ఆయన దొంగచాటుగా ఫోన్‌ చేయడం వివాదాస్పదమైంది. 
*ఓ అజ్ఞాత వ్యక్తి ఈ వ్యవహారాన్ని డెమోక్రాట్లకు చేరవేయడంతో ట్రంప్‌ అభిశంసనకు పునాది పడింది. 
*ప్రతినిధుల సభలో స్పీకర్‌ పెలోసీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ట్రంప్‌ అభిశంసకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ అంశంపై విచారణకు రెండు అత్యున్నత కమిటీ లను కూడా ఏర్పాటు చేశారు. 
*విచారణ దశలవారీగా కొనసాగుతూ వచ్చింది. సభలో ఇటీవలే దీనిపై ఓటింగ్‌ జరగ్గా అభిశంసనకు అనుకూలంగా రెండువందలకు పైగా ఓట్లు పడ్డాయి. 
*ప్రతికూలంగా సుమారు 180 ఓట్లు పడినప్పటికీ.. ట్రంప్‌ బెదరలేదు. రిపబ్లికన్లు అధిక సంఖ్యలో ఉన్న సెనేట్‌ లో తనకు న్యాయం జరుగుతుందని, అభిశంసన తీర్మానం వీగిపోతుందన్న నమ్మకంతో ఉన్నారు. 
*జనవరిలో సెనేట్‌ లో దీనిపై ఓటింగ్‌ జరగనుంది. 2.అంతర్జాతీయ స్థాయిలో శ్రీలంకలో రాజపక్సె మళ్లీ అధికారం చేపట్టడం కీలక ఘట్టం. 
* ఈ ప్రాంతంలో తన ఆధిపత్యానికి ఎదురు తిరుగుతున్న చైనాను నిలువరించేందుకు భారత ఉపఖండం లోని అన్ని దేశాల పైనా అమెరికా ఒత్తిడి పెంచింది. 
*దానిలో భాగంగానే శ్రీలంక కొత్త ప్రభుత్వానికి అమెరికా ప్రభుత్వం ఒకవైపు అభినందన సందేశాలు పంపుతూనే మరోవైపు పరోక్షంగా హెచ్చరికలు చేయడం కూడా మొదలు పెట్టింది. 
*శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో అందరూ ఊహించినట్టుగానే శ్రీలంక ప్రజా ఫ్రంట్‌ (ఎస్‌ఎల్‌పిపి) అభ్యర్థి గొటాబయ రాజపక్సె ఎన్నికయ్యారు. 
*హిందూ మహాసముద్రంలో కీలకమైన నౌకా మార్గాలకు శ్రీలంక దగ్గరగా ఉన్నందున నేటి భౌగోళిక రాజకీయ వ్యూహాల్లో దీని ప్రాధాన్యత పెరిగింది. 
*అందువల్ల ఈ ఎన్నికల ఫలితాలు అంతర్జాతీయంగా అగ్రరాజ్యాల దృష్టిలో ప్రాధాన్యత సంతరించు కున్నాయి. 
*ఒకవైపు అమెరికా తన యుద్ధ వ్యూహంలో శ్రీలంకను జూనియర్‌ భాగస్వామిగా చేసు కోడానికి ప్రయత్నిస్తుండగా, మరో వైపు అమెరికా వ్యూహాలకు చెక్‌ పెట్టడంలో భాగంగా చైనా ఈ ద్వీపదేశం వైపు చూస్తోంది. 
*35 మంది అభ్యర్థులు పోటీపడ్డ ఎన్నికల్లో ప్రధాన పోటీ గొటాబయ రాజపక్సెకూ, అమెరికా అనుకూల యునైటెడ్‌ నేషనల్‌ పార్టీ (యుఎన్‌పి) అభ్యర్థి సజిత్‌ ప్రేమదాసకూ మధ్య జరిగింది. 
*సుమారు 16 కోట్ల మంది ఓటర్లలో 82 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. గొటాబయకు 52 శాతం ఓట్లు రాగా, సజిత్‌ ప్రేమదాసకు 42 శాతం ఓట్లు పోలయ్యాయి. 
*అవినీతి, నిరంకుశ, ప్రజా వ్యతిరేక విధానాల వల్ల 2015 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన రాజపక్సె కుటుంబం మెజారిటీ బౌద్ధ మతతత్వాన్నీ, సింహళ జాతీయ వాదాన్ని ఉపయోగించుకుని మితవాద అజెండాతో ఈ ఎన్నికల్లో గెలుపొంది తిరిగి అధికారంలోకి వచ్చింది. 3. 
*జపాన్‌, ఫిలిప్పీన్స్‌, జర్మనీ దేశాలపై విపత్తు ప్రమాదాల ప్రభావం అధికంగా ఉన్నది. ఈ విషయాన్ని జర్మన్‌ వాచ్‌ వెల్లడించింది. 
*వాతావరణ మార్పులు, ప్రభావాలపై పరిశోధనలు చేపట్టినట్టు తెలిపింది. మడగాస్కర్‌, భారత్‌పై కూడా అధిక ప్రభావం కనిపించినట్టు వెల్లడించింది. 
*2018లో జపాన్‌లో సంభవించిన తీవ్ర వడగాడ్పులు, తుఫానులు కారణంగా వందలాది మంది మృతిచెందారు. వేలాది మంది నిరాశ్రయు లయ్యారు. 
*ఆర్థిక వ్యవస్థకు 35 బిలియన్‌ డాలర్ల నష్టం వాటిల్లింది. ప్రమాదకరమైన 5వ కేటగిరీ తుఫాను మంగూత్‌ ఫిలిప్పీన్స్‌ను కుది పేసింది. 
*కొండచరియలు విరిగిపడటంతో 2.5 లక్షల మంది నిరాశ్రయు లయ్యారు. వాతావరణ మార్పులు జర్మనీలో తీవ్ర ప్రభావాన్ని కనబర్చాయి. 
*వడగాడ్పులు, కరువుతో పాటు సాధారణం కంటే 3 డిగ్రీ సెల్సి యస్‌ అధిక ఉష్ణోగ్రతల కారణంగా 1,250 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం పడింది. 
*వ్యవసాయ రంగం దివాళాతీసింది. 5 బిలియన్‌ డాలర్ల మేర నష్టం వాటిల్లింది. గతే డాదిలో భారత్‌ సైతం అత్యంత ప్రభావవంతమైన ప్రకృతి విపత్తులను ఎదుర్కొన్నట్టు నివేదికలో ప్రస్తావించింది. 4. 
*ఈ ఏడాది ఆఖర్లో జరిగిన బ్రిటన్‌ సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ అత్యధిక మెజారిటీతో గెలిచారు. దాదాపు 80కి పైగా సీట్లతో ఆయన ఆధ్వర్యంలోని కన్సర్వేటివ్‌ పార్టీ మళ్ళీ అధికారాన్ని చేజిక్కించుకుంది. 
* పైగా కీలకమైన బ్రెగ్జిట్‌ డీల్‌ విషయంలో జాన్సన్‌ పరిణామాలను తనకు అనుకూలంగా మలచుకోగలిగారు . దీంతో జనవరి 31లోగా బ్రిటన్‌ ఈయూ నుంచి వైదొలగనుంది. 
*అలాగే ఈ ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో ప్రవాస భారతీయులు విజయం సాధించడం విశేషం. వీరిలో చాలామంది బోరిస్‌ మంత్రివర్గంలో పదవులు పొందనున్నారు. వచ్ఛే ఫిబ్రవరిలో జాన్సన్‌ తన భారీ కేబినెట్‌ను ఏర్పాటు చేయనున్నారు. 5. 
*అమెరికా-చైనా మధ్య ట్రేడ్‌ వార్‌ ఇంకా కొనసాగుతోంది. 
* చైనా చర్యకు నిరసనగా ఆ దేశానికి ఆర్థికంగా నష్టం కలిగించేందుకు దాదాపు ఎనభై కోట్ల డాలర్లకు పైగా విలువైన ' ఆంక్షలను విధించారు. 
* దీనివల్ల అమెరికాలో చైనా సరుకులకు డిమాండ్‌ తగ్గిపోయింది. అయితే చైనా అధ్యక్షుడు జీ జిన్‌ పింగ్‌ మాత్రం వెనక్కి తగ్గలేదు. 
*అమెరికా మీద తమ ట్రేడ్‌ వార్‌ కొనసాగుతుందని హెచ్చరించారు. అవసరమైతే యూఎస్‌తో శాశ్వతంగా తమ వాణిజ్య లావాదేవీలను నిలిపివేస్తామని కూడా పేర్కొన్నాడు. 6. 
*ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం 2018లో ప్రపంచవ్యాప్తంగా మొత్తం 22.8 కోట్ల మలేరియా కేసులు నమోదు కాగా, దీనివల్ల 4.05 లక్షల మందికి పైగా మృతి చెందారు. 
* 2020లో మరో తొమ్మిది దేశాలు ఈ వ్యాధిని సమూలంగా నిర్మూలించే అవకాశాలున్నాయి. 
* వీటిలో చైనా, ఇరాన్‌, భూటాన్‌, తూర్పు తిమోర్‌, మలేషియా, బెలీజ్‌, ఎల్‌సాల్వడార్‌, సురినామ్‌, కాబో వెర్డే దేశాలు ఉన్నాయి. 
*91 'రిస్క్‌ జోన్ల'లో 38 దేశాలు ఇప్పటికే మలేరియాను నిర్మూలించాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. 7. 
*స్పెయిన్‌ రాజధాని మాడ్రిడ్‌ నగరంలో నిర్వహించిన వాతావరణ పరిరక్షణ సదస్సులో సుదీర్ఘంగా సాగిన చర్చలు చివరకు రాజీ ఒప్పందంతో ముగిశాయి. 
*కర్బన ఉద్గారాలను తగ్గించడంలో ప్రపంచ దేశాల స్పందనను మెరుగుపరచడమే కీలక అంశం మీద సదస్సులోని ప్రతినిధులు ఎట్టకేలకు ఒక ఒప్పందానికి వచ్చారు. 
* వచ్చే ఏడాది గ్లాస్గోలో జరుగనున్న తదుపరి ప్రధాన సదస్సులో అన్ని దేశాలూ వాతావరణ పరిరక్షణ కోసం తాము తీసుకున్న కొత్త తీర్మానాలను సమర్పించాల్సి ఉంటుంది. 
*కర్బన మార్కెట్లు సహా ఇతర సమస్యల మీద విభేదాలు తదుపరి సమావేశం వరకూ వాయిదా పడ్డాయి. ఈ వాతావరణ చర్చలు నిర్ణీత సమయం కన్నా మరో రెండు రోజులు అదనంగా కొనసాగాయి. 
* చర్చల్లో పాల్గొన్న ప్రతినిధులు చివరికి, వచ్చే ఏడాది గ్లాస్గో సదస్సు సమయంకల్లా కర్బన ఉద్గారాలను తగ్గించటానికి సంబంధించి, సరికొత్త, మెరుగైన ప్రణాళికలను సిద్ధం చేయాలనే ఒప్పందానికి వచ్చారు. 
*ప్రమాదకరమైన వాతావరణ మార్పును నిరోధించటానికి అవసరమైన చర్యలు అంటూ సైన్స్‌ చెప్తున్న దానికి.. ప్రస్తుత పరిస్థితికి మధ్య ఉన్న అగాధాన్ని అన్ని పక్షాలూ పరిష్కరించాల్సి ఉంటుంది. 
*అధిక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలంటూ ఈయూ, చిన్న దీవి దేశాల మద్దతుతో ముందుకు తెచ్చిన ప్రతిపాదనను అమెరికా, బ్రెజిల్‌, ఇండియా, చైనా సహా పలు దేశాలు వ్యతిరేకించాయి. 
* 2020కి ముందు సంవత్సరాల్లో వాతావరణ మార్పు మీద తమ హామీలను నిలబెట్టుకున్నామని సంపన్న దేశాలు నివేదికలు ఇవ్వాలన్న షరతుతో ఈ రాజీ ఒప్పందం కుదిరింది.


జన్యు ఎడిటింగ్ చేసిన శాస్త్రవేత్తలకు జైలు శిక్ష
*జన్యు ఎడిటింగ్‌ విధానంలో శిశువులను సృష్టించినట్లు ప్రకటించిన ముగ్గురు చైనా పరిశోధకులకు జైలు శిక్ష పడింది. 
*చట్ట వ్యతిరేక వైద్య కార్యకలాపాలు'' కొనసాగించినట్టు రుజువు కావడంతో దక్షిణ చైనాలోని షెన్‌జెన్ ట్రయల్ కోర్టు ఇవాళ ఈ మేరకు తీర్పు వెలువరించింది. 
*కారాగార శిక్షతోపాటు జరిమానాలూ విధించింది. 
*జన్యు ఎడిటింగ్‌ సాంకేతికత సహాయంతో ప్రపంచంలోనే తొలిసారిగా శిశువులను పుట్టించినట్లు హె జియాంక్వి, ఝంగ్‌ రెన్లి, కిన్‌ జింగ్‌ఝౌ 2018 నవంబరులో ప్రకటించారు. 
*హెచ్‌ఐవీ వైరస్‌ సోకకుండా శిశువుల డీఎన్‌ఏలో మార్పులు చేసినట్లు తెలిపారు.వారి సృష్టి నైతిక విలువలకు విరుద్ధంగా ఉందని ఆందోళనలు వ్యక్తమయ్యాయి. 
*వారి పరిశోధన అత్యంత వివాదాస్పదం కావడంతో చైనా అధికారులు దర్యాప్తు చేపట్టారు. 
* గతేడాది హాంకాంగ్ వేదికగా మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఈ 35 ఏళ్ల శాస్త్రవేత్త... తాను ప్రపంచంలోనే తొలిసారి జన్యు మార్పులు చేసిన కవలలను సృష్టించినట్టు ప్రకటించారు. 
*అయితే హే జియాన్‌కుయ్‌ సృష్టించిన కవలల సంరక్షణపై చైనా ఇంజనీరింగ్‌ అకాడమీ ఆందోళన వ్యక్తం చేసింది. జన్యు సవరణతో ఆ కవలలకు కలిగిన ఆరోగ్యపరమైన నష్టాన్ని భర్తీ చేసే దిశగా చర్యలు చేపట్టాలని అకాడమీ నిపుణులు ప్రభుత్వానికి సూచించారు. 
*దీంతో నైతిక విలువలకు విరుద్ధంగా జన్యు సవరణ ప్రయోగాలు జరిపినందుకు చైనా చట్టపరమైన చర్యలు తీసుకుంది. 
*జియాంక్వికి మూడేళ్ల జైలు శిక్ష, 4.3 లక్షల డాలర్ల జరిమానా విధించింది. రెన్లికి రెండేళ్లు, జింగ్‌ఝౌ ఏడాదిన్నరపాటు కారాగార వాసం విధించింది. రెండేళ్ల తర్వాత శిక్ష అనుభవించేలా రెన్లి, జింగ్‌ఝౌలకు వెసులుబాటు కల్పించింది. 
*హెచ్‌ఐవీ నిరోధకతతో కూడిన శిశువులను సృష్టించడమే లక్ష్యంగా ఈ శాస్త్రవేత్తలు 8 జంటలను ఎంచుకున్నారు. 
* ప్రతి జంటలో పురుషుడు హెచ్‌ఐవీ బాధితుడై ఉండేలా చూసుకున్నారు. జన్యు ఎడిటింగ్‌ చేసిన పిండాలను మహిళల్లో ప్రవేశపెట్టారు. ఈ విధానంలో ముగ్గురు శిశువులు జన్మించారు.


2019 -సైన్స్
1.కంప్యూటర్‌ రంగంలో సరికొత్త అధ్యాయం లిఖితమయింది. క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ రంగంలో గూగుల్‌ సంస్థ సరికొత్త చరిత్రకు నాంది పలికింది. 
*సూపర్‌ కంప్యూ టర్లను మించిన వేగంతో పని చేసే అత్యాధునిక 'సికమోర్‌' చిప్‌ను గూగుల్‌ అభివృద్ధి చేసింది.
* ప్రపంచంలో అత్యంత వేగవంతమైన సూపర్‌ కంప్యూటర్‌ 10 వేల ఏండ్లలో పూర్తి చేసే గణనను ఈ క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ చిప్‌ కేవలం 200 సెకన్లలో పూర్తిచేసినట్టు గూగుల్‌ ప్రకటించింది. 
*తాజా ఆవిష్కరణను ''క్వాంటమ్‌ సుప్రిమసీ''గా అభివర్ణించింది. 2. 
*శాస్త్రవేత్తలు తొలిసారిగా ఓ కృష్ణ బిలాన్ని(బ్లాక్‌ హొల్‌ని) ఫొటో తీశారు. భూమికి 5.5 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఎమ్‌87 గెలాక్సీలో ఈ కృష్ణ బిలం ఉంది. 
*ఈ బిలం సుమారు 4,000 కోట్ల కిలోమీటర్ల వెడల్పు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. 
*అంటే ఇది భూమి కన్నా సుమారు 30 లక్షల రెట్ల పెద్ద సైజులో ఉంటుంది. శాస్త్రవేత్తలు ఈ కృష్ణ బిలాన్ని రాకాసిగా పిలుస్తున్నారు. 
*ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న ఉన్న 8 భారీ టెలిస్కోప్‌ల నెట్‌వర్క్‌కు ఈ బ్లాక్‌ హోల్‌ ఫొటో చిక్కింది. 3. 'చంద్రుడిపై మానవుడు తొలిసారిగా పాదం మోపినరోజు'కు యాభై వసంతాలు ఈ ఏడాదే నిండాయి. 
*నాలుగు లక్షల మంది శ్రమ.. కోట్లాది మంది ప్రజల ఆశలు, ఆకాంక్షలతో అపోలో-11 మిషన్‌ ద్వారా అంతరిక్ష పరిశోధనలను కొత్త పుంతలు తొక్కించిన 1969 జూలై 20రోజును యావత్‌ ప్రపంచం గుర్తు చేసుకున్నది. 
*'అపోలో 11' లో ప్రయాణించిన ముగ్గురు వ్యోమగాములు నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌, మైకేల్‌ కొలిన్స్‌, బజ్‌ ఆల్డ్రిన్‌. 4.అమెరికాలోని యేల్‌ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుల ఙఔదం ఒకటి.. నాలుగు గంటల క్రితం చనిపోయిన 32 పందుల మెదళ్లలో పాక్షికంగా కదలికలు తేగలిగింది. 
* బ్రెయిన్‌-ఎక్స్‌ టెక్నాలజీతో ఆయా పందుల మెదళ్లను బయటకు తీసి ప్రయోగాలు నిర్వహించే చాంబర్‌లో ఉంచారు. 
*నాలుగు గంటల తర్వాత, ఆ మెదళ్లలోని కీలక రక్తనాళాలను ఒక పరికరానికి అనుసంధానించారు. 
*యిన్‌-ఎక్స్‌ టెక్నాలజీలో భాగంగా ప్రత్యేక ద్రవాన్ని ఆ మెదళ్లలోకి పంప్‌ చేయడంతో కొద్దిసేపటికి ఆ మెదళ్లలోని టిష్యు, కణ నిర్మాణాలు క్షయం అయ్యే వేగం మందగించడంతో పాటు పందుల మెదళ్లలో కదలికలు వచ్చాయి. 
*విష్యత్తులో మెదడు వ్యాధుల చికిత్సలో ఈ పరిశోధన కీలకం కానున్నట్టు వాళ్లు తెలిపారు. 5.భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రతిష్టాత్మ కంగా ప్రయోగించిన చంద్రయాన్‌-2లోని విక్రమ్‌ ల్యాండర్‌ చంద్రుడి ఉపరి తలంపై దిగుతుండగా చివరి క్షణాల్లో కుప్పకూలిపోయింది. 
*కాగా, విక్రమ్‌ ల్యాండర్‌ జాడ కోసం అంతరిక్ష శాస్త్రవేత్తలు, సంస్థలు శోధనలు జరిపినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. 
*అయితే, నాసా ఎల్‌ఆర్‌వో పంపిన ఫోటోల ఆధారంగా చెన్నైకి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ షణ్ముగం సుబ్రమణ్యం జాబిల్లిపై దాని శకలాలను గుర్తించాడు. 6.చంద్రుడిపై భూమికి దూరంగా, అవతలివైపు ఉండే చీకటి ప్రాంతాలను అన్వేషించేందుకు చాంగే-4 ల్యూనార్‌ ప్రోబ్‌ మిషన్‌ను చైనా గత ఏడాది ప్రయోగిం చింది. 
* భూమికి కనిపించని చంద్రుడి అర్ధగోళం ప్రాంతంలో చాంగే రోవర్‌ ఈ జనవరిలో విజయవంతంగా ల్యాండ్‌ అయింది. 
*అలాగే అక్కడి నుంచి ఫొటోలను కూడా ఆ ప్రోబ్‌ భూమికి పంపింది. ఈ తరహా ప్రయోగం చేపట్టడం ప్రపంచంలో ఇదే తొలిసారి. 
*భూమికి కనిపించని చంద్రుడి వెనుక భాగంపైకి ఇప్పటివరకు ఏ దేశం కూడా వ్యోమనౌకలు పంపలేదు. ఆ ఘనతను చైనా సాధించింది.

జాతీయం 

సుస్థిరాభివృద్ధి సూచి -మొదటి స్థానంలో కేరళ
*భారత సుస్థిరాభివృద్ధిలో కేరళ దేశంలోనే టాప్‌ స్థానంలో మరొకసారి నిలిచింది. 
*ముందు ఏడాది కూడా కేరళ దేశ స్థిరాభివృద్ధి విభాగంలో తొలి స్థానాన్ని సొంతం చేసుకుంది. 
*కేంద్ర ప్రభుత్వ థింక్‌ట్యాంక్‌ నిటి ఆయోగ్‌ డిసెంబర్ 30వ తేదీన ఎస్‌డీజీ(సస్టేనెబుల్‌ డెవలప్‌మెంట్‌ గోల్స్‌)ని విడుదల చేసింది. 
*ఈ నివేదికని సంబంధిత రాష్ట్రాలు పంపించిన వివరాల ఆధారంగా నిటి ఆయోగ్‌ రూపొందించి ప్రతి ఏడాది చివరాంకంలో విడుదల చేస్తుంది. 
*అయితే, ఈ నివేదిక ప్రకారం దేశంలోనే దక్షిణాది రాష్ట్రాలు అగ్రభాగాన నిలిచాయి. 
*తొలి ర్యాంకు కేరళ సొంతం చేసుకోగా రెండో స్థానంలో హిమాచల్‌ ప్రదేశ్‌ సాధించింది. 
* మూడో ర్యాంకులో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలు నిలిచాయి. మొత్తం 16 అంశాల్లో రాష్ట్రాల నుంచి నిటి ఆయోగ్‌ సమాచారం సేకరించింది. 
*పరిశుద్ధమైన నీరు, పరిశుభ్రత వ్యవహారంలో అగ్రభాగాన ఉన్న ఆంధ్రప్రదేశ్‌, ఆర్థికాభివృద్ధిలో తెలంగాణ తొలి స్థానం దక్కించుకుందని నిటి ఆయోగ్‌ నివేదిక తెలిపింది. 
*పేదరిక నిర్మూలనలో 72 స్కోర్‌తో తమిళనాడు నంబర్‌వన్‌గా నిలవగా, 52 స్కోరుతో తెలంగాణ 11వ స్థానంలో నిలిచింది. 
* ఇక రాష్ట్రంలో 66.40% మంది ఏదో ఒక వైద్య బీమా పథకంలో సభ్యులుగా ఉన్నారు. రాష్ట్రంలో 84.40% మంది కి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కింద పని లభిస్తోంది. అర్హులైన వారిలో 12.2% మహిళలకు ప్రసూ తి ప్రయోజనాలు లభిస్తున్నాయి. 1.5% రాష్ట్ర జనాభా కచ్చా గృహా ల్లో నివాసముంటోంది. 
*ఆకలి తీర్చే అంశంలో తెలంగాణ 36 స్కోరుతో 16వ స్థానంలో నిలిచింది. గోవా (76), మిజోరం (75), కేరళ (74) తొలి 3 స్థానా ల్లో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 5 ఏళ్ల లోపు వయసు గల చిన్నారుల్లో 29.3% మంది పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. 
*తెలంగాణలో గర్భిణు ల్లో 49.8%మంది రక్తహీనత సమస్యను ఎదుర్కొంటున్నారు. 6-59 నెలల వయసు గల చిన్నారుల్లో 37.8% మంది రక్తహీనత తో, 4 ఏళ్ల లోపు బాలల్లో 30.8 % బరువులోపంతో బాధపడుతున్నారు. 
*ఐక్యరాజ్య సమితి రూపొందించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు-2030 అమలు దిశగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పురోగతి ఆధారంగా ఈ నివేదిక రూ పొందించింది. 
*తొలిసారిగా 2018లో ఈ సూచీని రూపొందించిన నీతిఆయోగ్‌.. ఈ సూచీ రాష్ట్రాల మధ్య పోటీతత్వాన్ని పెంచాలని ఆకాంక్షించింది. 2018లో 9వ స్థానంలో ఉన్న తెలంగాణ 2019లో 67 స్కోరుతో మూడో స్థానానికి ఎగబాకింది. ఇక దేశ సగటు స్కోరు 60గా ఉంది. 
*లింగ సమానత్వంలో హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రథమ స్థానంలో సంపాదించగా... రెండు తెలుగు రాష్ట్రాలు 11, 18 స్థానాలు పొందాయి. 
*సమానతలు, అంతరాల నివారణలో తెలంగాణ తొలి స్థానంలో ఉండగా ఆంధ్రప్రదేశ్‌ 12వ స్థానంలో నిలించింది. 
* సుస్థిరాభివృద్ధి నగరాల్లో గోవా తొలి స్థానంలో ఉండగా ఐదవ స్థానంలో తెలంగాణ, 22వ స్థానంలో ఆంధ్రప్రదేశ్‌ నిలిచాయి. 
*ఇక సుస్థిర ఉత్పత్తి, వినియోగంలో ఈశాన్య రాష్ట్రం నాగాలాండ్‌ ప్రధమ స్థానం పొందగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు 13, 16 స్థానాల్లో ఉన్నాయి. 
*పర్యావరణ పరిరక్షణ విభాగంలో కర్నాటక ఫస్ట్‌ ప్లేస్‌ సొంతం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌ రెండో స్థానం, తెలంగాణ 4వ స్థానం సాధించాయి. 
*మత్స్య సంపద సృష్టి విభాగంలో 9 రాష్ట్రాల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం కర్నాటక తొలి స్థానంలో ఉండగా.. ఆంధ్రప్రదేశ్‌ రెండో స్థానంలో నిలిచింది. 
*శాంతి, న్యాయం, పటిష్టమైన వ్యవస్థల విభాగంలో ఆంధ్రప్రదేశ్‌ అగ్రభాగాన ఉండగా.. తెలంగాణ తొమ్మిదోవ స్థానంలో నిలిచింది. 
*మంచి ఆరోగ్యం, ప్రజాశ్రేయస్సులో 82 స్కోరుతో కేరళ అగ్రస్థానంలో ఉండగా, తెలంగాణ 66 స్కోరుతో 7వ స్థానంలో నిలిచింది. 
*తెలంగాణ రాష్ట్రంలో మాతృత్వ మరణాల రేటు (ఎంఎంఆర్‌) ప్రతి లక్ష మందికి 76గా నమోదైంది. 
*ఆస్పత్రుల్లో ప్రసవాలు 71.8 శాతం జరుగుతున్నాయి. ఐదేళ్లలోపు బాలల మరణాల రేటు ప్రతి 1,000 మందికి 32గా ఉంది. 
* 0-5 ఏళ్ల పిల్లలో టీకాలన్నీ వేయించుకున్న వారు 70.1%ఉన్నారు. ప్రతి లక్ష మందిలో క్షయవ్యాధిగ్రస్తులు 142 మంది ఉన్నారు. 
* ప్రతి 1000 మందిలో కొత్తగా హెచ్‌ఐవీ సోకినవారు 0.26 మంది ఉన్నారు. ప్రతి 10 వేల జనాభాకు 44.5 మంది వైద్యులు, నర్సులుండాల్సి ఉండగా, తెలంగాణలో 11 మంది మాత్రమే ఉన్నారు. 
*నాణ్యమైన విద్యలో హిమాచల్‌ప్రదేశ్, కేరళ తొలి 2 స్థానాల్లో ఉండగా.. తెలంగాణ 9వ ర్యాంకు సాధించింది. 
*2011 జనగణనను, నాలుగైదేళ్ల క్రితం నుంచి 2019 వరకు గల గణాంకాలను ఆధారంగా దాదాపు 62 అంశాలను పరిగణనలోకి తీసుకుని 16 లక్ష్యాలకు స్కోరు కేటాయించారు. 
*కేంద్ర గణాంకాలు, పథక అమలు శాఖ, గ్లోబల్‌ గ్రీన్‌ గ్రోత్‌ ఇన్‌స్టిట్యూట్, ఐక్యరాజ్యసమితి సహకారంతో నీతిఆయోగ్‌ ఈ సూచిని రూపొందిం చింది. 
* వివిధ స్కోర్ల ఆధారంగా 4 కేటగిరీ లుగా రాష్ట్రాలను విభజించింది. 0 నుంచి 49 స్కోరు సాధించిన రాష్ట్రాలను ఆశావహులు(ఆస్పిరెంట్‌), 50 నుంచి 64 స్కోరు సాధించిన రాష్ట్రాలను క్రియాశీలురు (పర్‌ఫార్మర్‌), 65 నుంచి 99 స్కోరు సాధించిన రాష్ట్రాలను ముందు వరస (ఫ్రంట్‌ రన్నర్‌)గా, 100 స్కోరు సాధించిన రాష్ట్రాలను సాధకులు (అచీవర్‌)గా విభజించింది. 
* 2018లో కేరళ, హిమాచల్‌ప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలు మాత్రమే ఫ్రంట్‌రన్నర్‌లో నిలిచాయి. ఈసారి 8 రాష్ట్రాలు ఫ్రంట్‌ రన్నర్‌ కేటగిరీలో చోటు సాధించాయి. 
*వీటిలో తెలంగాణతో పాటు కర్ణాటక, సిక్కిం, గోవా కూడా ఉన్నాయి. కేరళ (70) మొదటిస్థానంలో, హిమాచల్‌ ప్రదేశ్‌ (60) రెండోస్థానంలో నిలిచింది.


జమ్మూకశ్మీర్‌లో ఉద్యోగాలకు దేశవ్యాప్తంగా అభ్యర్థులకు అవకాశం
*కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ-కశ్మీర్‌లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలకు తొలిసారిగా దేశవ్యాప్తంగా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించారు. 
* జమ్మూ-కశ్మీర్‌ హైకోర్టులో 33 ఖాళీల భర్తీకిగాను ఈ మేరకు నోటిఫికేషన్‌ విడుదలైంది. అర్హులైన స్వదేశీ పౌరులెవరైనాసరే దరఖాస్తు చేసుకోవచ్చని అందులో పేర్కొన్నారు. 
*దీనిపై జమ్మూ-కశ్మీర్‌ నేషనల్‌ పాంథర్స్‌ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. 
*జమ్మూ-కశ్మీర్‌లో 148 రోజులుగా నిర్బంధంలో ఉన్న నేతలు జబ్బార్‌, గులామ్‌ నబీ భట్‌ (నేషనల్‌ కాన్ఫరెన్స్‌), బషీర్‌ మీర్‌, జహూర్‌ మీర్‌, యాసిర్‌ రేషి (పీడీపీ) విడుదలయ్యారు.

కర్ణాటకలో 107 వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్

*కర్ణాటక రాష్ట్రంలో ప్రధాని నరేంద్రమోదీ రెండు రోజులు పర్యటించనున్నారు. 
*. జనవరి 2న తుమకూరులో రైతు సదస్సును ఉద్దేశించి ప్రసంగించనుండగా 3న ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ను ప్రారంభించనున్నారు. 
* తుమకూరులో జనవరి 2న జనవరి 2వ తేదీన నిర్వహిస్తున్న రైతు సదస్సుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరుకానున్నారు. 
*రైతు సదస్సులో కనీసం 2లక్షలమంది రైతులు పాల్గొనే అవకాశం ఉంది. 
*'ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌' సదస్సు జనవరి 3నుంచి ఐదు రోజులపాటు గాంధీ కృషి విజ్ఞాన కేంద్రం (జికెవికె)లో జరగనుంది. 
*. సాంకేతికంపై 14 విభాగాలలో సాగుతున్న పరిశోధనలు, ఆవిష్కరణలపై చర్చాగోష్టులు జరగనున్నాయి. 
*ఉమెన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌, చిల్డ్రన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌, శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తల చర్చాగోష్టులు ప్రస్తుత సైన్స్‌ కాంగ్రెస్‌లో ముఖ్యమైనవి. 
*107వ సైన్స్‌ కాంగ్రెస్‌కు సంబంధించి ప్రత్యేక మొబైల్‌ యాప్‌ 'ఐసిఎస్‌2020 UASB'ను అందుబాటులోకి తీసుకువచ్చారు. 
*భారత జాతీయ కాంగ్రెస్ సంస్థ (Indian Science Congress Association) భారతదేశానికి చెందిన శాస్త్రీయ సంస్థ. 1914లో కలకత్తా ప్రధానకేంద్రంగా ఏర్పడింది. దేశంలోని శాస్త్ర, విజ్ఞాన, సాంకేతిక రంగాల్లోని పరిశోధనలను ప్రోత్సహించాలనేది ఈ సంస్థ ఉద్దేశం. 
*ఇది ప్రతియేటా జనవరి మొదటి వారంలో దేశం లోని ఏదేని ఒక పట్టణంలో సమావేశ మౌతుంది. 
*లక్ష్యాలు-- దేశంలో శాస్త్ర పురోగతికి, విస్తృతికి కృషిచేయడం, ప్రతి సంవత్సరం దేశంలోని ఏదో ఒక ప్రాంతంలో సమావేశాలు నిర్వహించడం, శాస్త్రాన్ని అందరికీ అందుబాటులోకి తేవడం, సమావేశ కార్యక్రమాన్ని, చిరు పుస్తకాలను, కార్యకలాపాలను ప్రచురించడం. 
*20 వ శతాబ్దపు ప్రారంభంలో బ్రిటీష్ పాలన కాలంలో రసాయన శాస్త్రవేత్తలైన జె.ఎల్.సిమన్‌సన్ మరియు పి.ఎస్.మెక్‌మోహన్ అనే ఇద్దరు బ్రిటీషర్ల చొరవ ఫలితంగా భారత జాతీయ సైన్స్ కాంగ్రెస్ రూపుదిద్దుకొంది. 
*బ్రిటీష్ అసోసియేషన్ ఫర్ అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ సైన్స్ తరహాలో భారతదేశంలోనూ ఒక సంస్థను ఏర్పాటు చేయాలనే సంకల్పం వారిరువురినీ పురికొల్పింది. థీమ్ -సైన్స్ అండ్ టెక్నాలజీ - రూరల్ డెవలప్మెంట్


మహాదళాధిపతిగా బిపిన్ రావత్
*భారత తొలి మహాదళాధిపతి (చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ డిఫెన్స్‌ స్టాఫ్‌-సీడీఎస్‌)గా ప్రస్తుత ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ నియమితులయ్యారు. 
*ఈ మేరకు కేంద్ర రక్షణశాఖ దీనిని అధికారికంగా ప్రకటించింది. 
*2017 జనవరి 1 నుంచి ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన రావత్‌ పదవీకాలం డిసెంబర్ 31 2019 తో ముగిసింది. 
* ఇప్పటికే ఈయన స్థానంలో లెఫ్టినెంట్‌ జనరల్‌ మనోజ్‌ ముకుంద్‌ నవరానే నియమితులయ్యారు. 
*. మూడు దళాల మధ్య సమన్వయాన్ని సాధించే లక్ష్యంతో మొట్టమొదటి సారిగా ఈ మహాదళపతి పదవి (సీడీఎస్)ను కేంద్రం ఏర్పాటు చేసింది. 
*బిపిన్ రావత్ పదవీ విరమణ చెందిన వెంటనే అతన్ని సీడీఎస్‌గా నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. 
* నరేంద్ర మోదీ నాయకత్వంలో ఈనెల 24 తేదీ జరిగిన కేంద్ర మంత్రి వర్గం భద్రతా వ్యవహారాల మంత్రివర్గ ఉప సంఘం చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్ట్ఫా పదవిని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 
* నాలుగు నక్షత్రాల జనరల్‌గా వ్యవహరించే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్ట్ఫా రక్షణ శాఖ మంత్రికి ఏకబిందు సైనిక సలహాదారుగా వ్యవహరించటంతోపాటు కొత్తగా ఏర్పాటు చేసిన సైనిక వ్యవహారాల శాఖకు నాయకత్వం వహిస్తారు. 
*సైనిక వ్యవహారాల శాఖ త్రివిధ దళాల సైనికులు, అధికారుల సంయుక్త శిక్షణ, లాజిస్టిక్, త్రివిధ దళాలకు అవసరమైన ఆయుధాల సేకరణ బాధ్యతలు నిర్వహిస్తారు. 
*దీనితోపాటు త్రివిధ దళాలను నిర్వహిస్తారు. అయితే సైనిక, వాయు, విమాన దళం కమాండర్లుగా మాత్రం త్రివిధ దళాల అధ్యక్షులు వ్యవహరిస్తారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్ట్ఫా సైబర్, అంతరిక్ష విభాగాలకు అధిపతిగా వ్యవహరించటంతోపాటు త్రివిధ దళాల సమీకృత కార్యాలయం నిర్వహణా బాధ్యతలు కూడా నిర్వహిస్తారు.

నూతన సైన్యాధ్యక్షునిగా మనోజ్ ముకుంద్ నరావణే
దేశ నూతన సైన్యాధ్యక్షునిగా జనరల్ మనోజ్ ముకుంద్ నరావణే డిసెంబర్ 31వ తేదీన బాధ్యతలను స్వీకరించారు. 
*దేశ రాజధానిలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ కార్యాలయంలో ఆయన బాధ్యతలను చేసట్టారు. 
*ఇప్పటిదాకా ఈ హోదాలో కొనసాగిన బిపిన్ రావత్ కు కేంద్ర ప్రభుత్వం ప్రమోషన్ కల్పించింది. 
*ఆయన వైదొలగడం వల్ల ఖాళీ అయిన ఆర్మీ చీఫ్ స్థానాన్ని మనోజ్ ముకుంద్ భర్తీ చేశారు. 
*దేశ సరిహద్దు వివాదాలను పరిష్కరించడంలో సిద్ధహస్తుడిగా మనోజ్ ముకుంద్ కు పేరు ఉంది. ఇదివరకు చైనా, మయన్మార్ దేశాలతో తలెత్తిన సరిహద్దు వివాదాల్లో ఆయన చురుకుగా వ్యవహరించారు. చైనాతో సిక్కిం సరిహద్దుల్లోని డోక్లాం కూడలి వివాద సమయంలో చాకచక్యంగా వ్యవహరించారు. 
*ఈ వివాదాన్ని సద్దుమణిగేలా చేశారు. అరుణాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్ లోని లడక్ వద్ద చైనాతో తలెత్తిన అక్సాయ్ చిన్ వివాదానికి అడ్డుకట్ట వేయడంలో మనోజ్ ముకుంద్ తనదైన శైలిలో పావులు కదిపారు. 
*బిపిన్ రావత్ తర్వాత ఆర్మీలో అత్యంత సీనియర్ ఆయనే. జమ్మూకశ్మీర్‌లోని రాష్ట్రీయ రైఫిల్స్‌ బెటాలియన్‌కు నాయకత్వం వహించారు.అంతకు ముందు.. చైనాతో 4000కి.మీ. సరిహద్దు గల ప్రాంతాన్ని రక్షించే ఈస్టెర్న్ కమాండ్ అధిపతిగా ఆయన పని చేశారు. 
*అంతకు ముందు.. చైనాతో 4000కి.మీ. సరిహద్దు గల ప్రాంతాన్ని రక్షించే ఈస్టెర్న్ కమాండ్ అధిపతిగా ఆయన పని చేశారు. 
*శ్రీలంకలో ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్‌లో పనిచేశారు. 
*నేషనల్ డిఫెన్స్ అకాడమీ, ఇండియన్ మిలిటరీ అకాడమీకి నారావణే పూర్వ విద్యార్థిగా ఉన్నారు. 
* జూన్ 1980లో సిక్కు లైట్ ఇన్ఫ్యాంట్రీ రెజిమెంట్ 7వ బెటాలియన్‌లో ఆయన తొలి నియామకం జరిగింది. జమ్ముకశ్మీర్‌లో బెటాలియన్‌ను సమర్థవంతంగా నిర్వహించినందుకు గానూ ఆయనకు సేన మెడల్ లభించింది. 
*మయన్మార్‌లో మూడేళ్లపాటు భారత రాయబార కార్యాలయంతో కలిసి పనిచేశారు. 
*నాగాలాండ్‌లో ఇన్‌స్పెక్టర్ జనరల్ అస్సాం రైఫిల్స్(నార్త్)గా అందించిన సేవలకు గానూ విశిష్ట్ సేవా మెడల్ అందుకున్నారు. స్ట్రైక్‌ కార్ప్స్‌ సేవలకు గానూ 'అతి విశిష్ట సేవా పతకం' అందుకున్నారు. 
*1947లో స్వాతంత్ర్యం వచ్చినపుడు అప్పటివరకు ఉన్న బ్రిటీష్ ఇండియన్ ఆర్మీని భారత్, పాకిస్తాన్‌ల కోసం రెండు భాగాలు చేసారు. అప్పుడే భారత సైన్యానికి "ఇండియన్ ఆర్మీ" అని పేరు పెట్టబడింది.

No comments:

Post a Comment