ప్రపంచంలో అత్యంత రద్దీ నగరం --బెంగళూరు
ప్రపంచంలో ఎక్కువ ఏ నగరంలో రద్దీ ఉందనే అంశంపై 'టామ్ టామ్' అనే వాహనాల నావిగేషన్ సంస్థ సర్వే చేసి,వార్షిక రద్దీ సూచికను విడుదల చేసింది.
*ప్రపంచంలోనే అత్యంత ట్రాఫిక్ కలిగిన నగరంగా బెంగళూరు నిలిచింది.
*ఆరు ఖండాలు, 57 దేశాల్లోని 416 నగరాల్లో 'టామ్ టామ్' వివరాలు సేకరించింది.
*ఆన్యువల్ ట్రాఫిక్ ఇండెక్స్‌ను కంపెనీ ప్రకటించడం ఇది తొమ్మిదోసారి.
*నివేదికలోని అంశాలు ---
1.రియల్ టైమ్, హిస్టరికల్ డేటా ఆధారంగా పట్టణ ప్రాంతాలకు ర్యాంకులు కేటాయించింది.
2.బెంగళూరు -బెంగళూరుకు 'టామ్ టామ్' 71 శాతం రద్దీ ఉందని రిపోర్ట్ చేసింది.
3.బెంగళూరు తర్వాత ఫిలిప్పీన్స్‌కు చెందిన మనీలాలో కూడా 71 శాతం, కొలంబియాకు చెందిన బొగొటాలో 68 శాతంతో రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.
4.భారతదేశానికి చెందిన ముంబై, పుణే.. నాలుగు, ఐదో స్థానాల్లో 65, 59 స్థానాలతో ఉన్నాయి.
5.రష్యాలోని మాస్కో 59 శాతంతో ఆరో స్థానంలో, పెరూలోని లిమా 57 శాతంతో ఏడో స్థానంలో, 56 శాతంతో ట్రాఫిక్ రద్దీతో ఢిల్లీ 8వ స్థానంలో ఉంది.
6.టర్కీకి చెందిన ఇస్తాంబుల్ 55 శాతం, ఇండినేషియాకు చెందిన జకార్తా 10వ స్థానంలో నిలిచాయి.
7. ఈ రిపోర్ట్ ప్రకారం చాలా వరకు ప్రజలు ట్రాఫిక్‌లోనే ఎక్కువ సమయం ఖర్చు చేశారు.
జాతీయం
జాతీయం
ఎన్‌జిఒల లైసెన్స్ రద్దు
*పలు స్వచ్ఛంద సంస్థల (ఎన్‌జిఒ) లైసెన్స్‌లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది.
*వాటికి అందే విదేశీ విరాళాలపై కూడా చర్యలకు దిగింది.
*ఎన్‌జిఒలను బహిష్కరించడంతో పాటు వేలాది సంస్థల లైసెన్సులను రద్దు చేసింది.
*విదేశాల నుండి అందే విరాళాలకు నిబంధనలను కఠినతరం చేయడంతో పాటు నిధులను కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి తీసుకుంది.
*ఎన్జీవోలు --విరాళాల వివరాలు
- 1998-99 నుండి 2017-18 వరకు విదేశీ సహాయ నియంత్రణ చట్టం (ఎఫ్‌సిఆర్‌ఎ) కింద మొత్తం రూ. 2.88 లక్షల కోట్లు విరాళాలుగా ఎన్‌జిఒలు స్వీకరించాయి.
- 1998-99లో విదేశీ విరాళాలు రూ.3,925 కోట్లు కాగా, 2017-18లో రూ.16,902 కోట్లు అంటే నాలుగు రెట్లు పెరిగాయి.
- ఒకే ఏడాదిలో రూ.18 వేలకోట్లకు పైగా విదేశీ నిధులు వచ్చాయి.
- విదేశీ వనరుల నుండి వచ్చిన విరాళాలలో కూడా పెరుగుదల కనిపించింది. 2014-15లో విదేశీ విరాళాలు రూ.15,297 కాగా, మరుసటి ఏడాదిలో రూ. 17,765కు పెరిగాయి.
- 2016-17లో గరిష్టంగా రూ. 18వేల కోట్ల రూపాయలను దాటి నిధులు రూ.18,109 కోట్లు అందాయి.
- విదేశీ విరాళాలు 1999-2000లోరూ. 4,535 కోట్లు కాగా, మరుసటి ఏడాది రూ. 4,871 కోట్లు.
- 2001-02లో రూ. 5.047 కోట్లు కాగా, 2002-03లో రూ. 5, 105 కోట్లు వచ్చాయి. ఈ సంఖ్య 2003-04లో రూ.6,257 కోట్ల రూపాయలకు పెరిగింది.
- మరుసటి ఏడాది రూ. 7,877 కోట్లకు పెరిగింది. అలాగే 2005-06లో రూ.11 వేల కోట్ల రూపాయలను దాటి 2005-06లో రూ. 11,007 కోట్లకు చేరుకుంది. అయితే 2006-07లో రూ. 9,663కి పడిపోయింది.
- 2007-08లో రూ. పది కోట్లను దాటి రూ. 10,802 కోట్లకు, మరుసటి ఏడాది రూ. 10,338 కోట్లకు చేరుకోగా, ఆ తర్వాతి సంవత్సరంలో రూ.10,334 కోట్లు.
- విదేశీ విరాళాలు 2012-13లో మొదటిసారి రూ. 12వేల కోట్లను దాటి రూ. 12, 614 కోట్లకు చేరుకున్నాయి.
- మరుసటి ఏడాదిలో మరింత పెరిగి రూ. 14,853 కోట్లకు చేరుకున్నాయి.

గౌరీ లంకేష్ పురస్కారం పొందిన కాశ్మీరీ రిపోర్టర్
*గౌరీ లంకేష్ స్మారక పురస్కారం--
ఎవరికి లభించింది?--2017లో హత్యకు గురైన జర్నలిస్ట్ గౌరీ లంకేష్ స్మారక పురస్కారాన్ని ఈ ఏడాది కాశ్మీరీ రిపోర్టర్ యూసఫ్ జమీల్ అందుకున్నారు.
*అవార్డును అందించింది ?ఈ అవార్డును భారతీయ రచయితల కేంద్రం 'పెన్' అందించింది.
*ఈ అవార్డును స్థాపించినది --2018 సంవత్సరంలో
* తొలిసారి ఈ అవార్డు పొందినది -- 2018లో తొలిసారిగా కార్టూనిస్ట్ పి మహ్మద్ ఈ అవార్డు పొందారు.
*యూసఫ్ జమీల్--
*1980 తొలినాళ్లలో శ్రీనగర్‌కు చెందిన ఉర్దూ దినపత్రిక అఫ్తాబ్‌లో జమీల్ తన కెరీర్‌ను ప్రారంభించారు.
వృత్తిపరమైన సమగ్రతకు ఆదర్శప్రాయమైన నిబద్ధత, ప్రజాస్వామ్య ఆదర్శాలను కనబర్చినందుకు 2019-20కిగానూ జమీల్‌కు ఈ అవార్డు అందింది.
*టెలిగ్రాఫ్, బిబిసి, రాయిటర్స్, టైమ్, వాయిస్ ఆఫ్ అమెరికా, ద ఏషియన్ ఏజ్ వంటి పలు మీడియా సంస్థల్లో ఆయన విధులు నిర్వహించారు. కాశ్మీర్‌లో క్లిష్టమైన పరిస్థితుల్లో రిపోర్టుగా సేవలు అందించారు.
*నిర్భయమైన జర్నలిజానికి మార్గదర్శకులని ప్రశంసా పత్రంలో పేర్కొన్నారు.
*అవార్డ్ కింద నగదు - లక్ష రూపాయల నగదు బహుమతి అందజేస్తారు.

ముందస్తు బెయిలు పై సుప్రీం కోర్ట్
*సుప్రీం కోర్టు అరెస్టు ముప్పు పొంచి ఉందని భావిస్తున్న వ్యక్తులకు ముందస్తు బెయిలు మంజూరుకు కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది.
*ధర్మాసనం --ముందస్తు బెయిలుపై జస్టిస్ అరుణ్ మిశ్ర నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించింది.
*తీర్పు లోని అంశాలు --
-
హక్కులు ప్రాథమిక మైనవి, ఆంక్షలు వాటంతటి ప్రధానమైనవి కావు.
-
ముందస్తు బెయిలు కోసం ఒక వ్యక్తికి నేర శిక్షా స్మృతిలోని 438 సెక్షన్ కింద కల్పిస్తున్న ఉపశమనానికి నిర్దిష్ట కాలావధి లేదు.
-
విచారణ ముగిసే వరకూ బెయిలు వర్తిస్తుంది.
-
పౌరుల హక్కులు ప్రాథమికమైనవి. ఇతర ఆంక్షల కన్నా అవి సర్వోత్కృష్టమైనవి.
-
అర్థవంతమైన దర్యాప్తు కోసం కాకుండా శక్తిమంతమైన వ్యక్తుల ప్రయోజనాల కోసం పౌరులపై వివాదాస్పద, దురుసు అరెస్టులకు దిగుతున్న నేపథ్యంలో 438 సెక్షన్‌ను తీసుకువచ్చారు.
* ధర్మాసనంలోని జస్టిస్ ఎస్.రవీంద్ర భట్.. మిగతా న్యాయమూర్తుల వాదనతో ఏకీభవిస్తూనే విడిగా 73 పేజీల తీర్పును వెలువరించారు.
హక్కులు ప్రాథమిక మైనవి, ఆంక్షలు వాటంతటి ప్రధానమైనవి కావు.
ముందస్తు బెయిలు కోసం ఒక వ్యక్తికి నేర శిక్షా స్మృతిలోని 438 సెక్షన్ కింద కల్పిస్తున్న ఉపశమనానికి నిర్దిష్ట కాలావధి లేదు.
విచారణ ముగిసే వరకూ బెయిలు వర్తిస్తుంది.
పౌరుల హక్కులు ప్రాథమికమైనవి. ఇతర ఆంక్షల కన్నా అవి సర్వోత్కృష్టమైనవి.
అర్థవంతమైన దర్యాప్తు కోసం కాకుండా శక్తిమంతమైన వ్యక్తుల ప్రయోజనాల కోసం పౌరులపై వివాదాస్పద, దురుసు అరెస్టులకు దిగుతున్న నేపథ్యంలో 438 సెక్షన్‌ను తీసుకువచ్చారు.
మసీదులో ప్రార్థనలకు మహిళలకు అవకాశం
*సుప్రీంకోర్టులో అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డ్(ఏఐఎంపీఎల్‌బీ) అఫిడవిట్ --
1.మసీదుల్లోకి వచ్చి ముస్లిం మహిళలు ప్రార్థనలు చేయడం ఇస్లాంలో ఆమోదనీయమే అని ప్రకటించింది.
2.ముస్లిం పురుషుల మాదిరిగానే ముస్లిం మహిళలు కూడా నమాజ్ చేసేందుకు మసీదుకు రావొచ్చు తెలిపింది.
3.మత గ్రంథాలు, సిద్ధాంతాలు, ఇస్లాంను అనుసరిస్తున్న వారి మత విశ్వాసాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత.. మసీదు లోపల నమాజ్ చేసుకునేందుకు ముస్లిం మహిళలకు ప్రవేశం ఉంది అని తెలిపింది.
4.ముస్లిం మహిళ మసీదులోకి వెళ్లి ప్రార్థనలు చేసుకోవచ్చు. ఈ హక్కును వినియోగించుకోవడం ఆమె ఇష్టంపైనే ఆధారపడి ఉంటుంది అని తెలిపింది.
5.సామూహిక ప్రార్థనలు లేదా శుక్రవారం నమాజ్‌లో పురుషుల మాదిరిగా మహిళలు విధిగా పాల్గొనాలని ఇస్లాంలో నిబంధన లేదు.
6.ఇస్లాంలో మహిళకు ప్రత్యేక స్థానం కల్పించారని, ఆమె తన అభీష్టంమేరకు మసీదులో ప్రార్థనలు చేసినా లేదా ఇంటిలో ప్రార్థనలు చేసినా ఒకేవిధమైన ప్రతిఫలం దక్కుతుందని ఏఐఎంపీఎల్‌బీ తెలిపింది.
7.మతపరమైన ఆచారాల్లో న్యాయస్థానం జోక్యం చేసుకోవడం సరైనది కాదని కూడా ఈ బోర్డు తెలిపింది.
8.మత ఆచారాలపై నిర్ణయాధికారం మతసంస్థలకు మాత్రమే ఉండదా? దీనిపై కోర్టులు జోక్యం చేసుకోవచ్చా? అనేది పరిశీలించాలని కోరింది.
*నేపథ్యం --మసీదుల్లోకి ముస్లిం మహిళలను అనుమతించేందుకు న్యాయస్థానం జోక్యం చేసుకోవాలని కోరుతూ యాస్మిన్ జుబెర్ అహ్మద్ పీర్జాదే అనే వ్యక్తి ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు మసీదుల్లోకి వచ్చి ముస్లిం మహిళలు ప్రార్థనలు చేయవచ్చని అఫిడవిట్ దాఖలుచేసింది.
* ధర్మాసనం -- సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే నేతృత్వంలోని తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం దీన్ని పరిశీలించనుంది.
*కేరళలోని శబరిమల ఆలయంతోపాటు వివిధ మతాలు, మతపరమైన ప్రదేశాల్లో మహిళలపై వివక్షకు సంబంధించి న్యాయ, రాజ్యాంగపరమైన అంశాలపై ఈ ధర్మాసనం విచారణ చేపడుతున్నది.
పాత ఉపగ్రహాల స్థానంలో కొత్తగా ప్రవేశపెట్టనున్నఇస్రో
* భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రకటన-
* భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రకటన-
* భూస్థిర కక్ష్యలో దశాబ్దాలుగా తిరుగుతూ సమాచారాన్ని అందించే పాతకాలం ఉపగ్రహాలను త్వరలో ప్రక్షాళన చేయనున్నారు.
* గత 15 ఏళ్లలో వేగంగా అభివృద్ధి చెందిన సాంకేతికతకు అనుగుణంగా పాత ఉపగ్రహాల స్థానంలో కొత్త వాటిని ఉపయోగించనున్నారు.
* కనీసం 12 నుంచి 15 ఏళ్ల కాలపరిమితి ఉన్న ఉపగ్రహాలను మార్చనున్నారు.
*ఇందులో భాగంగానే ఇన్‌శాట్ 4-ఏ స్థానంలో జీశాట్-30ని ప్రయోగించారు.
* కొత్త సమాచార ఉపగ్రహాలు సెకనుకు 300 గిగాబైట్స్ సామర్థ్యం ఉన్న హైస్పీడ్ ఇంటర్నెట్ వ్యవస్థలతో తయారుకానున్నాయి.
*కొత్త రకం సమాచార సేవలకు అనువుగా లేని ఉపగ్రహాల సేవలను సమీక్షిస్తున్న ఇస్రో వాటి స్థానంలో భూ సమీక్షలు, నావిగేషన్, సుదూర ప్రాంతాల నుంచి సిగ్నల్స్ అందుకునే తరహా ఉపగ్రహాలను పంపనుంది.
*. భూమికి 36వేల కిలోమీటర్లలోని భూస్థిర కక్ష్యలో ఉన్న ఇస్రో సమాచార ఉపగ్రహాలన్నీ 12 నుంచి 15 ఏళ్ల కాల పరిమితి కలిగి ఉన్నాయి.
* వాటి సమర్థత బట్టి ఉపగ్రహాల మార్పిడి ప్రక్రియ చేపట్టనున్నారు.

కేరళ లో మొదటి కరోనా కేసు
*కేరళకు చెందిన ఓ విద్యార్థికి కరోనా వైరస్ సోకినట్టుగా వైద్యులు గుర్తించారు.
*ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా ధ్రువీకరించింది.
*ఆ విద్యార్థి చైనాలోని వుహాన్ యూనివర్సిటీలో మెడిసిన్ చదువుతున్నారు.
*చైనాలో చదువుకుంటున్న 23వేలకు పైగా భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి విదేశాంగ శాఖ ప్రయత్నాలు చేస్తోంది.
* అలాగే చైనా నుంచి వచ్చే ప్రయాణికులను పరీక్షించటానికి ఎయిర్‌పోర్ట్‌లలో ప్రత్యేకంగా థర్మల్ స్కానింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు.
*చైనాలోని ఊహన్ నగరంలో మొదట కరుణ వైరస్ గుర్తించగా ప్రస్తుతం చైనా దేశవ్యాప్తంగా ఈ వైరస్ వ్యాప్తి చెందింది.
భారత్ కు ఆఫ్రికా చిరుతలు
*ఆఫ్రికాకు చెందిన చిరుతలను భారత దేశంలోని అడవుల్లో ప్రవేశపెట్టేందుకు సుప్రీం కోర్టు అనుమతినిచ్చింది.
*మధ్యప్రదేశ్ లోని నౌరదేహీ అభయారణ్యంలోకి చిరుతలను ప్రవేశపెట్టబోతున్నారు.
*విదేశీ జంతువును మన అడవుల్లో ప్రవేశపెడితే ఎలాంటి పరిణామాలుంటాయో అన్న సందేహంలో 2013 లో సుప్రీం కోర్టు అనుమతిని నిరాకరించింది.
* దాదాపు ఏడేళ్ల వేడుకోళ్ల తరువాత సుప్రీం కోర్టు షరతులతో కూడిన అనుమతిని ఇచ్చింది. ప్రయోగాత్మకంగా కునో పాల్పుర్ అభయారణ్యంలోకి ప్రవేశపెట్టాల్సింది గా సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చింది.
*అధికారిక లెక్కల ప్రకారం,చివరిసారిగా భారత జాతి చిరుతపులి చివరిసారిగా 1947లో కనిపించింది.
* చిట్ట చివరి చిరుతను 1947 లో వేటగాళ్లు హతమార్చారు.1952 నుంచి ఈ జాతి చిరుత పులులను అంతరించిపోతున్న జంతువుల జాబితాలో చేర్చడం జరిగింది.
*కేసు నేపథ్యం--భారతదేశంలో చిరుత పులులు అంతరించిపోతున్న నేపథ్యంలో జాతీయ పులుల సంరక్షణా సంస్థ (NTCA) ఆందోళన వ్యక్తం చేసింది.
* నమీబియా నుంచి ఆఫ్రికన్ చిరుత పులులను భారత్‌కు తీసుకొచ్చేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కేంద్రప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలంటూ సర్వోన్నత న్యాయస్థానంను ఆశ్రయించింది. NTCA పిటిషన్ మేరకు సుప్రీం కోర్టు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని వేసింది.
*ఇందులో వైల్డ్ లైఫ్ ఆఫ్ ఇండియా మాజీ డైరెక్టర్ రంజిత్ సింగ్, వైల్డ్ లైఫ్ ఆఫ్ ఇండియా డీజీ ధనంజయ్ మోహన్, కేంద్రపర్యావరణ మరియు అటవీ మంత్రిత్వ శాఖలో డీఐజీని సభ్యులుగా నియమించింది. NTCAకు సూచనలు ఇవ్వాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది.
*కేసును విచారణ చేసిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్‌లు ఈ ప్రాజెక్టును స్వయంగా పర్యవేక్షించారు.
*ఆఫ్రికన్ జాతి చిరుతపులులు ఉండేందుకు ఏ అటవీ ప్రాంతం అయితే అనుకూలిస్తుందో దానిపై పూర్తిగా సర్వే చేయాల్సిన బాధ్యతను త్రిసభ్య కమిటీకి సుప్రీంకోర్టు అప్పగించింది.
*మధ్యప్రదేశ్‌లోని నౌరదేహీ వన్యప్రాణుల సంరక్షణా కేంద్రంలో ఆఫ్రికన్ జాతి చిరుత పులులను ఉంచేలా ఆదేశాలు ఇవ్వాలని త్రిసభ్య కమిటీ నివేదికలో పొందుపర్చింది.

ఫిక్కీ వృద్ధిరేటు అంచనా 5%
*వ్యాపార, పారిశ్రామిక సంఘం ఫిక్కీ --
*ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20)లో దేశ జీడీపీ 5 శాతంగానే ఉండొచ్చని వ్యాపార, పారిశ్రామిక సంఘం ఫిక్కీ అంచనా వేసింది.
*సర్వేలో జాతీయ గణాంక కార్యాలయం (ఎన్‌ఎస్‌వో) అంచనాలకు తగ్గట్లుగా వృద్ధిరేటు అంచనాల్ని వెల్లడించింది.
* ఫిక్కీ అంచనాలు --
-
వ్యవసాయ, దాని అనుబంధ రంగాల్లో వృద్ధిరేటు 2.6 శాతం
-
పరిశ్రమరంగాల్లో 3.5 శాతం
-
సేవా రంగాల్లో 7.2 శాతంగా
-
ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో దేశ వృద్ధిరేటు 4.7 శాతంగా
-
వచ్చే ఆర్థిక సంవత్సరం (2020-21)లో దేశ జీడీపీ 5.5 శాతంగా అంచనా వేసింది.ఈసారితో పోల్చితే 0.5 శాతం పెరుగడానికి అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది.
-
ఎగుమతులు మరింత తగ్గవచ్చు.ఈ ఆర్థిక సంవత్సరం గతంతో పోల్చితే 2.1 శాతం తగ్గవచ్చు.
-
దిగుమతులు సైతం 5.5 శాతం తగ్గవచ్చు.
-
కరెంట్ ఖాతా లోటు (క్యాడ్) జీడీపీలో 1.4 శాతానికి పెరిగే అవకాశం ఉంది.
*అంతకుముందు త్రైమాసికంలో 4.5 శాతంగానే వృద్ధి రేటు ఉంది. తొలి త్రైమాసికంలో 5 శాతంగా ఉంది.
వ్యవసాయ, దాని అనుబంధ రంగాల్లో వృద్ధిరేటు 2.6 శాతం
పరిశ్రమరంగాల్లో 3.5 శాతం
సేవా రంగాల్లో 7.2 శాతంగా
ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో దేశ వృద్ధిరేటు 4.7 శాతంగా
వచ్చే ఆర్థిక సంవత్సరం (2020-21)లో దేశ జీడీపీ 5.5 శాతంగా అంచనా వేసింది.ఈసారితో పోల్చితే 0.5 శాతం పెరుగడానికి అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది.
ఎగుమతులు మరింత తగ్గవచ్చు.ఈ ఆర్థిక సంవత్సరం గతంతో పోల్చితే 2.1 శాతం తగ్గవచ్చు.
దిగుమతులు సైతం 5.5 శాతం తగ్గవచ్చు.
కరెంట్ ఖాతా లోటు (క్యాడ్) జీడీపీలో 1.4 శాతానికి పెరిగే అవకాశం ఉంది.
6 సరికొత్త రైల్వే కారిడార్ల గుర్తింపు
*దేశవ్యాప్తంగా వేగవంతమైన పలు రైల్వే కారిడార్లను రైల్వేబోర్డు గుర్తించింది.
*హైదరాద్-పూణే-ముంబాయి (711 కెఎం), ముంబయి-నాసిక్-నాగపూర్ (753), చెన్నై-బెంగళూరు-మైసూరు (435), ఢిల్లీ-చండీగడ్-లుధియానా-జలంధర్-అమృత్‌సర్ (459), ఢిల్లీ-నోయిడా-ఆగ్రా-లక్నో-వారణాసి (865), ఢిల్లీ-జైపూర్-ఉదయ్‌పూర్-అహ్మదాబాద్(886) రూట్లలో హై స్పీకర్ రైళ్లను నడిపించేందుకు సంబంధించిన డి.పి.ఆర్ (డిటేల్డ్ ప్రాజెక్టు రిపోర్టు) ఒక సంవత్సరంలో పూర్తి చేయనున్నారు.
* ఆరు హై స్పీడ్ రైల్వే కారిడార్లను ముంబాయి-అహ్మదాబాద్ మధ్య నిర్మిస్తున్న హై స్పీడ్ బుల్లెట్ ట్రేన్ రూట్‌తో అనుసంధానం చేస్తారు.
* హైస్పీడ్ రైల్వే కారిడార్లలో రైళ్లు గంటకు మూడు వందల కిలో మీటర్ల వేగంతో నడుస్తాయి.సెమీ హై స్పీడ్ కారిడార్లలో రైళ్లు గంటకు 160 లేదా అంతకంటే ఎక్కువ వేగంతో నడుస్తాయి.
*భూమి లభ్యత, అమరిక, ప్రయాణికుల రద్దీ అంచనాలను అధ్యయనం చేసిన అనంతరం ఈ మార్గాల్లో హై స్పీడ్ రైళ్లను నడిపించడం అనే అంశంపై నిర్ణయం తీసుకుంటారు.
*ముంబయి-అహమదామాద్ మధ్య నిర్మిస్తున్న హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ పనులు 2023 డిసెంబర్ నాటికి పూర్తి చేయనున్నారు.
రాష్ట్రీయం
నెల్లూరులో గ్రీన్‌ల్యామ్ ఇండస్ట్రీస్ కంపెనీ
*ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు సమీపంలో ఉన్న నాయుడుపేటలో గ్రీన్‌ల్యామ్ ఇండస్ట్రీస్ అనుబంధ కంపెనీ గ్రీన్‌ల్యామ్ సౌత్ (జిఎస్ఎల్) ల్యామినేట్ షీట్లు, అనుబంధ ఉత్పత్తుల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది.
*యూనిట్ వ్యయం -- రూ.175 కోట్లతో యూనిట్ ను ఏర్పాటు చేయనున్నారు
*ఎన్నిఎకరాలలో --ఈ యూనిట్‌కు ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కార్పొరేషన్ (ఏపీఐఐసీ) దాదాపు 65 ఎకరాల స్థలాన్ని కేటాయించింది.
*యూనిట్ సామర్థ్యం --ఏడాదికి 15 లక్షల ల్యామినేట్ షీట్లు/బోర్డుల తయారీ సామర్థ్యంతో ఈ యూనిట్‌ను ఏర్పాటు చేస్తారు.
*దాదాపు రెండేళ్లలో పూర్తి సామర్థ్యంతో యూనిట్ పని చేస్తుంది.
*దేశ, విదేశీ మార్కెట్లలో పెరుగుతున్న గిరాకీకి అనుగుణంగా ఉత్పత్తిని పెంచే ఉద్దేశంతో కొత్త యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నారు. కొత్త యూనిట్ ఏర్పాటుకు అవసరమైన నిధులను రుణం, మాతృ సంస్థ ద్వారా సమకూర్చుకుంటుంది.
*ప్రస్తుతం గ్రీన్‌ల్యామ్‌కు ఏడాదికి 1.56 కోట్ల ల్యామినేట్ షీట్లు/బోర్డులను తయారు చేసే సామర్థ్యం ఉంది.
* 2019, డిసెంబరుతో ముగిసిన తొమ్మిది నెలల్లో 96 శాతం ఉత్పత్తి సామర్థ్యాన్ని వినియోగించుకుంది.